Satyam ramalinga raju
-
సత్యం రామలింగరాజు తల్లికి ఊరట
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ చైర్మన్ రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఆమెకున్న అకౌంట్లను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. సీబీఐ ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అప్పలనర్సమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున వినోద్‌కుమార్ దేశ్‌పాండే, సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.నాగేందర్ వాదనలు వినిపించారు. అప్పలనర్సమ్మ కుమారులపై కేసు నమోదు చేసినప్పుడు బంధువులతో పాటు ఆమె బ్యాంక్ ఖాతాలనూ ఫ్రీజ్ చేశారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అయితే సీబీఐ చార్జీషీట్లో ఆమె పేరు ఎక్కడా లేదని, నిందితులకు ఆర్థిక నేరాల కింద శిక్ష కూడా విధించారని చెప్పారు. పిటిషనర్ 85 ఏళ్ల వృద్ధురాలని, రోజు వారీ అవసరాలకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అనంతరం నాగేందర్ వాదనలు వినిపిస్తూ.. రామలింగరాజు ఆర్థిక నేరాలతో పిటిషనర్ కూడా లబ్ధి పొందారన్నారు. 1999 నుంచి 2001 వరకు ఆమె పేరుపై 3,92,500 షేర్లు ఉన్నాయన్నారు. నేరాలు మోపబడిన కంపెనీలో ఆమె డైరెక్టర్‌గానీ, ప్రమోటర్‌గానీ కాకపోవడంతో చార్జీషీట్లో పేరు చేర్చలేదని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగిందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్ పిటిషన్‌ను అనుమతిస్తూ.. బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని ఆదేశించారు. వారెవ్వా (క్లిక్: హైదరాబాద్.. 31 వేల రిజిస్ట్రేషన్లు.. రూ.15 వేల కోట్లు) -
'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Natyam Movie Heroine Sandhya Raju Family Background Details: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఉపాసన,ఎన్టీఆర్, రామ్‌చరణ్, వెంకటేశ్, చిరంజీవి లాంటి ప్రముఖులు నాట్యం చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో ఈ సినిమాకు తొలి నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.చదవండి : కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి అయితే క్షణం తీరిక లేకుండా గడిపే బిగ్ స్టార్స్ ఇంత ప్రత్యేకంగా ఈ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అసలు ఎవరీ సంధ్యారాజు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇంతకీ ఈమె ఎవరంటే... వేల కోట్లకు అధిపతి, రాంకో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామరాజు పెద్ద కుమార్తెనే సంధ్యారాజు. అంతేకాకుండా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు చిన్నకోడలు. సంధ్యారాజు స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి. పేరు, ప్రఖ్యాతలున్న కుటుంబంలో పుట్టినా ఆమె స్వయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటివరకు దేశ విదేశాల్లో కలిపి వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె రాజు రామ్ కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. చదవండి : Natyam Movie Review: ‘నాట్యం’మూవీ రివ్యూ డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్ -
సత్యం కంప్యూటర్స్ స్కాంలో మరో మలుపు
-
సత్యం స్కాం.. రూ. 1800 కోట్ల జరిమానా
దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్న సత్యం కంప్యూటర్స్ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు చెందిన పది సంస్థలు అక్రమంగా పోగేసుకున్న రూ. 1800 కోట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని సెబి ఆదేశించింది. 2009 జనవరి ఏడో తేదీ నుంచి జరిమానా విధించాల్సి ఉన్నందున.. ఆ మొత్తం మీద వడ్డీగా మరో రూ. 1500 కోట్లు కూడా చెల్లించాలని తెలిపింది. ఈ పది సంస్థలు రామలింగరాజు సమీప బంధువులవే. వాళ్లలో ఆయన తల్లి, సోదరుడు, కుమారుడు.. కూడా ఉన్నారు. తన కుటుంబ సభ్యుల పేర్లతో అకౌంట్లు తెరిచి, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు గాను ఈ జరిమానాలు విధించారు. రామలింగరాజుతో పాటు మరో నలుగురిని 14 ఏళ్ల పాటు మార్కెట్ల నుంచి సెబి బహిష్కరించిన విషయం తెలిసిందే. అక్రమ పద్ధతుల ద్వారా ఆర్జించిన రూ. 1849 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని గత సంవత్సరం జూలైలోనే సెబి ఆదేశించింది. రామలింగరాజు, ఆయన సోదరుడు (నాటి సత్యం ఎండీ) రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ (మాజీ సీఎఫ్ఓ), జి.రామకృష్ణ (నాటి వైస్ ప్రెసిడెంట్), వీఎస్ ప్రభాకర గుప్తా (అంతర్గత ఆడిట్ విభాగం మాజీ అధిపతి)లపై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో.. రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులు, ఇతర వ్యక్తులు, కంపెనీలను కూడా సెబి ఈ కేసులో పెట్టింది. ఈ కంపెనీలలో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఇంతకుముందు మేటాస్ ఇన్ఫ్రా) ఉన్నాయి. రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మ, ఆమె ఇద్దరు కుమారులు తేజరాజు, రామరాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఆయన భార్య ఝాన్సీ రాణి, చింతలపాటి శ్రీనివాస్ (నాటి డైరెక్టర్), ఆయన తండ్రి దివంగత అంజిరాజు తదితరులు కూడా ఉన్నారు. -
సత్యం కేసులో దోషుల పై వాదనలు పూర్తి
-
సత్యం కేసులో తుది తీర్పు రేపే!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కేసులో తుది తీర్పు గురువారం వెలువడనుంది. మార్చి 9వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ''ఏప్రిల్ 9న తీర్పు వెలువరిస్తాం. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. ఏప్రిల్ 9 తీర్పునకు చిట్టచివరి తేదీ అవుతుంది. ఇక వాయిదాల ప్రసక్తి లేదు. కోర్టు వేచి చూడదు'' అని ఆయన అప్పట్లో అన్నారు. 2009 జనవరి 7వ తేదీన సత్యం స్కాం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఖాతాలను తప్పుగా చూపించి లేని లాభాలను లెక్కల్లో చెప్పినట్లు స్వయంగా కంపెనీ వ్యవస్థాపకుడు, నాటి ఛైర్మన్ బైర్రాజు రామలింగరాజు ప్రకటించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, ఇతరులను సీఐడీ విభాగం అధికారులు రెండు రోజుల తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు బెయిల్‌పై బయటే ఉన్నారు. ఆరేళ్ల పాటు విచారణ సాగింది. -
ఈడీ కోర్టుకు హాజరైన ‘సత్యం’ రాజు
సాక్షి, హైదరాబాద్: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు శుక్రవారం ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులైన ఆయన భార్య నందిని, సోదరుడు రామరాజు, ఇతర కుటుంబసభ్యులు సహా 47 మంది కోర్టు ముందు హాజరయ్యారు. వీరినుంచి రూ.10 వేల చొప్పున పూచీకత్తు బాండ్లను తీసుకున్న కోర్టు.. వీరందరికీ చార్జిషీట్, అనుబంధ పత్రాలను అందజేసింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. చార్జిషీట్‌ను ఇప్పటికే కోర్టు విచారణకు స్వీకరించి.. నిందితులకు వాటి ప్రతులను కూడా అందజేసిన నేపథ్యంలో త్వరలో తుది విచారణ(ట్రయల్) ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో విచారణ(ట్రయల్) తుది దశలో ఉంది. మరో రెండు నెలల్లో ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశముంది. నాలుగున్నరేళ్ల తర్వాత చార్జిషీటు.. కేసు నమోదు చేసిన నాలుగున్నరేళ్ల తర్వాత ఈడీ అధికారులు ఈ చార్జిషీట్ దాఖలు చేశారు. సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్‌ను నిందితుల జాబితాలో మొదటిదిగా పేర్కొనగా, రామలింగరాజు, ఆయన కుటుంబసభ్యులుసహా 47 మంది వ్యక్తులతోపాటు 166 కంపెనీలను ఈ జాబితాలో చేర్చారు. మొత్తం 213 మందిని నిందితులుగా చూపారు. 76 మందిని సాక్షులుగా పేర్కొనగా...1,186 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా చూపారు. దాదాపు 500 పేజీల చార్జిషీట్‌తోపాటు 20 వేల పేజీల అనుబంధ డాక్యుమెంట్లను సమర్పించారు. -
‘సత్యం’ రామలింగరాజుకు ప్రత్యేక కోర్టు సమన్లు
4న కోర్టులో హాజరుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ అభియోగాలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ చార్జిషీట్లో నిందితులుగా ఉన్న రామలింగరాజు, ఆయన భార్య నందిని, సోదరులు, వారి భార్యల సహా డెరైక్టర్లుగా ఉన్న 47 మందితో పాటు 166 కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 4న వారంతా స్వయంగా కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి చక్రవర్తి ఆదేశించారు. చార్జిషీట్లో 76 మందిని సాక్షులుగా పేర్కొన్న ఈడీ... 1,186 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా చూపింది. దాదాపు 500 పేజీలున్న ఈ చార్జిషీట్‌తో పాటు 20 వేల పేజీల అనుబంధ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 కింద అభియోగాలను మోపింది. ‘సత్యం’ మాజీ చైర్మన్ రామలింగరాజు కంపెనీ సీఈవో తదితరులతో కుమ్మక్కై సంస్థ లాభాలు ఉన్నట్లుగా చూపుతూ బ్యాలెన్స్ షీట్లను రూపొందించారని ఈడీ తన చార్జిషీట్లో ఆరోపించింది. ఏప్రిల్ 4 నుంచి ఈ కేసు తుది విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కోర్టు విచారణ (ట్రయల్) తుది దశలో ఉంది. ఈడీ చార్జిషీట్‌పై విచారణ ప్రారంభమైతే సీబీఐ కేసులో తీర్పు ఆలస్యం కావచ్చు. -
సత్యం రామలింగరాజు భార్యకు జైలు శిక్ష
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థల ఆదాయనుపన్ను ఎగవేత కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 19 సత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థలకు చెందిన 84 మంది డైరెక్టర్లకు జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన వారిలో సత్యం రామలింగరాజు భార్య నందిని, కుమారులు రామరాజు, తేజరాజు సోదరుడి భార్య రాధ ఉన్నారు. మహిళా నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించింది. పురుషులకు ఏడాది జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా వేసింది. -
'రామలింగరాజుకు లోకేష్ పెంపుడు కొడుకు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌పై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సత్యం రామలింగరాజు పెంపుడు కొడుకు లోకేష్ అని.... ఆయన డబ్బులతోనే చిన్నబాబు విదేశాల్లో చదివాడని ఆపార్టీ ఆరోపించింది. లోకేష్...'ట్విట్టర్‌కి ఎక్కువ...రాజకీయాలకు తక్కువ' అంటూ టీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. కాగా ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమని తమ పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరినా టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్‌లో పడుకునే ఉన్నారని లోకేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏ రోజైనా కేసీఆర్ బయ్యారం గనులపై మాట్లాడారా అంటూ ప్రశ్నించటమే కాకుండా, ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా కూడా కేసీఆర్ ఏనాడూ పోరాడలేదని లోకేష్ విమర్శలు చేశారు.