second phase election
-
Gujarat Assembly Election 2022: ఎవరి దశ తిరుగుతుంది?
గుజరాత్ మొదటి దశ పోలింగ్ ముగిసింది. రెండో దశలో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. గుజరాత్ మోడల్ పాలనతో సెంట్రల్ గుజరాత్ అభివృద్ధిలో దూసుకుపోయింది. అధికార పార్టీకి అడ్డాగా మారింది. ఉత్తర గుజరాత్ పలు రకాల సమస్యలతో బీజేపీకి సవాళ్లు విసురుతోంది. మధ్య గుజరాత్లో కాంగ్రెస్ హవా తగ్గిపోతే, ఉత్తరాన ఆప్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ రెండు పార్టీల మధ్యే పోరు నెలకొంది. ఈ దశలో ఏ పార్టీ పట్టు బిగిస్తుంది ? గుజరాత్ రెండో దశ పోలింగ్ ఈ నెల 5న మొత్తం 93 స్థానాలకు జరగనుంది. మధ్య గుజరాత్లో 61 అసెంబ్లీ స్థానాలకు, ఉత్తర గుజరాత్లో 32 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. మధ్య గుజరాత్లో ఆదివాసీలు, నగరీకరణ జరిగిన ప్రాంతాలతో నిండి ఉంది. మొత్తం ఎనిమిది జిల్లాల్లో అహ్మదాబాద్, వడోదరా, ఖేదాలో కొన్ని ప్రాంతాలు, ఎస్టీల ప్రాబల్యం కగిలిన పంచ్‌మహల్ జిల్లాల్లో బీజేపికి పట్టు ఉంటే, మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఎస్టీ ప్రాంతాల్లో ఎదురొడ్డుతున్న కాంగ్రెస్ గిరిజన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది.ఈ సారి ఎన్నికలకి కాస్త ముందు కాంగ్రెస్‌లో ప్రముఖ ఎస్టీ నాయకుడు, ఛోటా ఉదేపూర్ నియోజకవర్గం నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సిన్హ్ రథ్వా బీజేపీలో చేరడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా మారింది. మోహన్ సిన్హాకున్న మంచిపేరు వల్ల మహిసాగర్, దాహోద్ జిల్లాల్లో ఓటర్లు బీజేపీకి మద్దతుగా ఉండే అవకాశాలున్నాయని బరోడా యూనివర్సిటీ ప్రొఫెసర్ అమిత్ ధోలకియా అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం (ఖామ్) సామాజిక వర్గం ఓట్లు కూడా ఈ సారి గంపగుత్తగా ఆ పార్టీకి వచ్చే అవకాశాల్లేవని, ఆ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది వ్యాఖ్యానించారు.ఈ ప్రాంతంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ వైపే ఓటర్లు చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్ మోడల్ పాలనతో బాగా లబ్ధి పొందిన పట్టణాలు, నగరాల్లో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలి బీజేపీ లాభపడే అవకాశాలైతే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్ కంటే ఆప్ పట్టు పెంచుకుంది. మొత్తమ్మీద మధ్య గుజరాత్ మరోసారి బీజేపీకే జై కొట్టే అవకాశాలున్నాయి. ఉత్తరాన బీజేపీకి సవాళ్లు ఈ ప్రాంతంలో చిన్ని చిన్న పట్టణాలు ఎక్కువగా ఉన్నాయి. చిరు వ్యాపారులు కరోనాతో భారీగా నష్టపోవడంతో పాటు నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. అధిక ధరలతో సామాన్యులకు బతుకు భారంగా మారింది. ఇవన్నీ బీజేపీకి సవాళ్లుగా మారాయి. ఈ ప్రాంతంలో సామాజిక సమీకరణలు కూడా బీజేపీకి అంతగా అనుకూలంగా లేవు. ఠాకూర్ల ప్రాబల్యం అధికం. వీరంతా మొదట్నుంచి కాంగ్రెస్‌కే మద్దతుగా ఉన్నారు. పటేళ్లు, ఠాకూర్లు చెరో పార్టీకి మద్దతునివ్వడం ఆనవాయితీగా మారిపోయింది. దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు మొదట్నుంచి బీజేపీ వెంట లేకపోవడం పార్టీకి ఆందోళన కలిగించే అంశమే. ఈ ప్రాంతం ఉద్యమాల ఖిల్లాగా కూడా పేరు పడింది. హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటీదార్ ఆందోళన, అల్పేశ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఠాకూర్ల ఆందోళన, జిగ్నేష్ మేవానీ నేతృత్వంలో దళితుల ఆందోళనలు ఇక్కడ ఉధృతంగా జరిగాయి. అధికార పార్టీపై ఆ ఉద్యమాల ప్రభావం ఇంకా ఉండడం కమలనాథుల్ని కలవరపెడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెండో విడత ‘ప్రాదేశిక’ పోరు
ప్రాదేశిక పోరులో భాగంగా మలి విడత ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఈ దఫాలో జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, వెల్దుర్తి, శివ్వంపేట, కౌడిపల్లి, చిలిప్‌చెడ్, కొల్చారం మండలాల పరిధిలో శుక్రవారం పోలింగ్ జరగనుంది. చివరి రోజు ఆయా పార్టీల అభ్యర్థులు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తించారు. ఎన్నికలకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో రాత్రి వేళ గ్రామాల్లో ప్రలోభాల పర్వం తారస్థాయికి చేరింది. పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మరోపక్క అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. సాక్షి, మెదక్ : రెండో విడత ప్రాదేశిక పోరులో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 22 మంది పోటీలో ఉన్నారు. నర్సాపూర్ జెడ్పీటీసీ పదవికి ముగ్గురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ), వెల్దుర్తిలో నలుగురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం), శివ్వంపేటలో ఐదుగురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, స్వతంత్ర), కౌడిపల్లిలో ముగ్గురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ), చిలిప్‌చెడ్‌లో ముగ్గురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ), కొల్చారంలో నలుగురు (టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ) పోటీ పడుతున్నారు. అదేవిధంగా, 60 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. శివంపేట మండలంలోని చండి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. దీంతో మిగిలిన 59 ఎంపీటీసీ స్థానాలకు 209 మంది పోటీలో ఉన్నారు. ఈ లెక్కన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు తీవ్ర పోటీ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా చివరి రోజు పోటాపోటీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీంతోపాటు మద్యం, ఇతర తాయిలాలతో ఓటర్లను ప్రభావితం చేసేలా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి రోజు నేతల జోరు టీఆర్ఎస్లో అభ్యర్థులకు మద్దతుగా చివరి రోజు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కొల్చారం మండల కేంద్రంతో పాటు ఎనగళ్ల, పైకర, రంగంపేట, సంగాయిపేట, చిన్నఘనపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి శివ్వంపేట మండలం పొద్దగొట్టిముక్కుల గ్రామంలో ప్రచారం చేపట్టి టీఆర్ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సంపేట మండలం కాజీపేట ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ ప్రచారం నిర్వహించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఆయన పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తమ అభ్యర్థులకు మద్దతుగా కొల్చారం మండలంలోని సంగాయిపేట్, చిన్నఘనపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మద్యం.. డబ్బులు.. పోలింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు బుధవారం సాయంత్రం నేతలతో మంతనాల్లో మునిగినట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ నెలకొనడంతో ఎక్కడెక్కడ.. ఏయే పంచాయతీలు.. ఏయే వార్డులు తమకు అనుకూలంగా ఉన్నాయి.. ఏవి అనుకూలంగా లేవు.. ఏం చేయాలి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రలోభ పర్వానికి తెరలేచినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఇంటింటికీ మద్యం బాటిళ్లతోపాటు డబ్బులు పంపిణీ చేసేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం పలువురిని కేటాయించినట్లు తెలిసింది. -
రెండో విడతకు రెడీ
మెదక్ రూరల్: మూడు విడతల ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో ఈనెల 26 (శుక్రవారం) నుంచి రెండో విడుత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కానుంది. రెండో విడతలో మొత్తం ఆరు మండలాలకు గాను 6 జెడ్పీటీసీ, 60 ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరగనుంది. ఈనెల 26న రెండో విడుత నామినేషన్ల స్వీకరణ, మే 10న పోలింగ్ జరగనుంది. మే 27న ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ ప్రకటించింది. రెండో విడతలో నర్సాపూర్ డివిజన్ కేంద్రం నుంచి నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్ డివిజన్ నుంచి వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆయా మండలాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు గతంలో జిల్లా కేంద్రంలోనే నామపత్రాలను స్వీకరించగా, ప్రస్తుతం మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఆయా మండల కేంద్రాల వద్ద బారికేడ్స్, కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రం వద్ద ముగ్గురు రిటర్నింగ్ అధికారులు, ముగ్గురు సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. కాగా మొదటి విడత ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
నేడు పరిషత్ రెండో విడత నోటిఫికేషన్
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల సందడి మరికొన్ని మండలాలకు పాకనుంది. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా ఆదిలాబాద్‌అర్బన్ మండలం మినహాయించి మిగతా 17 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 13 పాత మండలాలు ఉండగా, నాలుగు కొత్త మండలాలు ఉన్నాయి. మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లో జరగనుండగా రెండో విడత ఎన్నికలు ఐదు మండలాల్లో జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రసవత్తరం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబం ధించి మొదటి విడతలో ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్, బేల, తాంసి, భీంపూర్ మండలాల్లో బుధవారంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. గురువారం నామినేషన్ల పరిశీలన కొనసాగింది. ఆదివారం ఉపసంహరణ ఘట్టం తర్వాత ఆయా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎంతమంది, ఎవరు బరిలో ఉంటారనేది తేలనుంది. ప్రధాన పార్టీల నుంచి అన్నిచోట్ల పోటీలో ఉన్నారు. ఇక మొదటి విడతలోని ఆరు మండలాల్లో ప్రచార పర్వం జోరందుకోనుంది. మొదటి విడతలో మే 6న పోలింగ్ జరగనుండగా అంతకు ముందు మే 4 సాయంత్రం వరకు ప్రచారం సాగనుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆశావహుల సందడి.. రెండో విడతలో పలు జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఇక్కడ పోటీ వాతావరణం కనిపిస్తోంది. రిజర్వేషన్ల ప్ర కటనతోనే పలువురు ఆశావహులు ఆయా మండలాల్లో పోటీ – చేయాలని ముందుగానే నిశ్చయించుకొని ఉన్నారు. మరోపక్క ఈ ఐదు మండలాల్లో గతంలో టీఆర్ఎస్ గెలుపొందింది. బోథ్ నియోజకవర్గంలోని మండలాలైన వీటిలో టీఆర్ఎస్ కేడర్ బలంగా ఉన్నా ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ ఎస్టీ(జనరల్) రిజర్వ్ కాగా, ఇప్పుడు ఎస్టీ రిజర్వ్ అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లోనూ చైర్మన్ పదవి ఆశావహులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పలు జనరల్ స్థానాల్లో అభ్యర్థులు ఎవరెవరు రంగంలోకి దిగుతారనే దానిపై ఆయా మండలాల్లో ఆసక్తి నెలకొంది. నేరడిగొండ ఆసక్తికరం.. నేరడిగొండ ఎస్టీ(జనరల్) రిజర్వ్ కావడంతో అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్‌జాదవ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి 28వేల ఓట్లు సాధించారు. లోక్‌సభ ఎన్నికల ముందు అతను టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన జెడ్పీచైర్మన్ పదవి ఆశిస్తూ రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అయితే బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఇప్పుడు జెడ్పీచైర్మన్ అయ్యే వ్యక్తి ఐదేళ్ల తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు నేరడిగొండ జెడ్పీటీసీ అభ్యర్థి విషయంలో ఎలాంటి ఎత్తుగడ అవలంబిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. -
పోరు.. జోరు
అడ్డాకుల (దేవరకద్ర): గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం చివరి దశకు వచ్చేసింది. మూడో విడత ఎన్నికలు ఈనెల 30వ తేదీన జరగనుండగా ప్రచారానికి నేటి సాయంత్రం వరకు గడువు ఉంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్, వార్డుసభ్యులుగా బరిలో ఉన్న అభ్యర్థులే కాకుండా వారి తరుఫున బడా నేతలు, కుటుంబసభ్యులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండే దూరపు బంధువులు కూడా ప్రచారానికి రంగంలో దించేశారు. తెలిసిన వారిని కలిసి తమ అభ్యర్థికి ఓట్లేయాలని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల పిల్లల్లో చాలా మంది ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. వారంతా ఊర్లకు వచ్చి ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. కొందరు అభ్యర్థులు పేరు మోసిన బంధువులను ప్రత్యేకంగా పిలిపించుకుని మంతనాలు చేస్తున్నారు. పల్లెల్లో సందడి ఎన్నికల సందర్భంగా పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో దూరపు ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు యువత అంతా తమ బంధువుల ప్రచారంలో నిమగ్నమై కనిపించారు. ఇంటర్, డిగ్రీ చదువుకునే పిల్లలు సైతం ప్రచారంలో తమ మార్కును చూయించే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహితుల తల్లిదండ్రులు, బంధువులతో తమ స్నేహితుడి బంధువుకు ఓట్లేయాలని ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సేవలు అందించిన వారిని ఎక్కువగా వాడుకుంటున్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉండే వారు ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తున్నారు. ఆదివారం మండలాల్లో జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు తరఫున ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం సాగించారు. 8 మండలాలు.. 227 పంచాయతీలు జిల్లాలో 721 గ్రామపంచాయతీలు ఉండగా, రెండింటి పాలకవర్గాలకు ఇంకా సమయం ఉండడంతో 719 జీపీల్లో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు మొదటి విడతలో 249 పంచాయతీలు, రెండో విగడతలో 243 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మూడో విడతగా 227 జీపీల్లో ఈనెల 30వ తేదీన బుధవారం పోలింగ్ జరగనుంది. అయితే, తొలి విడతలో 46 జీపీలు, రెండో విడతలో 56 జీపీల పాలకవర్గాలు ఏకగ్రీవం కాగా.. మూడో విడతకు సంబంధించి మాత్రం కేవలం 24 గ్రామపంచాయతీల్లో మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఈ విడత పంచాయతీల్లో పోరు హోరాహోరీగా కొనసాగనుందని చెప్పాలి. ఇక మూడో విడతలో ఎనిమిది మండలాల్లోని గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. అత్యధికంగా మద్దూరు మండలంలో 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే, భూత్పూర్ మండలంలో ఒక్క జీపీ కూడా ఏకగ్రీవం కాలేదు. అలాగే, సర్పంచ్ పదవి ప్రతీ పంచాయతీలో ఇద్దరు, ముగ్గురుపైనే అభ్యర్థులు పోటీలో ఉండడం గమనార్హం. గండీడ్ మండలంలోనైతే 49 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవం కాగా, మిగిలిన 45 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఏకంగా 125 మంది పోటీ పడుతున్నారు. పెరిగిన ఎన్నికల వే‘ఢీ’ సర్పంచ్ ఎన్నికలంటేనే రసవత్తర పోరుకు నిదర్శనం. ఎందుకంటే ఒక్క ఓటు కూడా అభ్యర్థి ఫలితాన్ని తారుమారు చేస్తుంది. బుధవారమే పోలింగ్ జరుగనుండటంతో గ్రామాల్లో వేడి రా జుకుంది. ఓవైపు రెండు రోజులుగా ముసురు వ ర్షాలు కురుస్తుంటే మరోవైపు అభ్యర్థుల్లో రోజురోజుకు వేడి పెరుగుతోంది. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రచారం సాగుతోంది. మద్ద తుదారులు, అనుయాయులను ఇంటికే పిలిపించుకుని మంతనాలు చేస్తున్నారు. తమ వర్గం ఓట్లు పక్కకు జారకుండా చూసుకుంటున్నారు. సర్వత్రా ఉత్కంఠ సర్పంచ్, ఉప సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఓట్ల లెక్కలు వేస్తున్నారు. ‘మనకు ఓట్లేసే వారెవరు...మనకు చేయిచ్చే వారెవరు’ అంటూ ముఖ్య నాయకులతో లెక్క కడుతుతున్నారు. ఓటర్లు కూడా చైతన్యమై ఎవరు వచ్చి ఓట్లడిగినా మీకే వేస్తామంటూ భరోసాగా చెబుతుండటంతో అభ్యర్థులు తికమకపడుతున్నారు. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మవద్దో తెలియని సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. లెక్కకు అందని విధంగా ఖర్చు చేయాల్సి రావడంతో తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. నేటితో ప్రచారానికి ‘తెర’ పోలింగ్‌కు 44 గంటల ముందే ప్రచార పర్వా న్ని ముగించాలన్న నిబంధనతో నేటి సాయం త్రం ప్రచారం ముగియనుంది. ప్రచారానికి తెరపడిన వెంటనే ప్రలోభాల పర్వం మొదలు కానుంది. మద్యం, డబ్బులతో ఓటర్లకు ఎర వేయడానికి అంతా సిద్దం చేసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు ప్రలోభాల పర్వం సాగనుంది. ఇందుకోసం అభ్యర్థులు చివరి అస్త్రాలన్నింటినీ ప్రయోగించేందుకు సిద్దమయ్యారు. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి దేనికైనా...ఎంతకైనా వెనుకాడడం లేదు. ఇదిలా ఉండగా వలస ఓటర్లు గ్రామాల బాటపట్టారు. దూరప్రాంతాల్లో ఉండే ఓటర్లు గ్రామాలకు చేరుతున్నారు. రెండు రోజుల్లో ఊర్లో గడిపి ఓట్లేసి పోవచ్చని ముందే వస్తున్నారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం : ఆల దేవరకద్ర రూరల్: గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమానికి ప్ర భుత్వం అహర్నిషలు పాటుపడుతుందన్నారు. మండలంలోని జీన్గరాల, గుడిబండ, డోకూర్ గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే ఆల పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సాగునీరు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. అన్నదాతలను అ న్ని విధాలుగా ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో వినూత్నరీతిలో తీసుకొచ్చిన పథకాలన్నీ అమలవుతున్నాయని, రాబోయే రో జుల్లో చేయాల్సిన పనులను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. -
ఉపాధ్యాయులకు కొత్త చిక్కు
పాపన్నపేట(మెదక్): ‘‘ఆమె పాపన్నపేట మండలంలోని మారుమూల గ్రామంలో ఒక టీచర్. ఈ నెల 21న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేగోడ్ మండలంలో విధులు నిర్వహించారు. ఎన్నికల తంతు ముగించుకొని ఇంటికి వెళ్లే సరికి రాత్రి ఒంటి గంట అయింది. తెల్లవారి 22న తిరిగి పాఠశాల విధులకు వెళ్లారు.’ ఇక్కడ కాస్త ఆలస్యమైనా పెద్ద ఇబ్బంది లేదు. కానీ రెండో విడత పంచాయతీ ఎన్నికల పరిస్థితి వేరు. 25న పంచాయతీ రెండో విడత ఎన్నికలు.. తెల్లవారితే పాఠశాలలో గణతంత్ర వేడుకలు. ఇక్కడ కాస్తా అటు ఇటుగా వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏడాదిలాగే గ్రామంలో నిర్ణయించిన ఎజెండా కనుగుణంగా జెండాలు ఎగురుతుంటాయి. కాస్తా ఆలస్యమైతే అందరి విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే టీచర్లంతా టెన్షన్‌తో సతమతమవుతున్నారు. 25న జిల్లాలోని నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన టీచర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇందులో కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుండగా, మిగతావి రెండు అంత కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు. ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరికీ ఎన్నికల విధులు పడకపోయినా, ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రం 90 శాతం మందికి ఎన్నికల విధులు పడినట్లు తెలుస్తోంది. 25న జరిగే ఎన్నికల కోసం 24వ తేదీనే ఉపాధ్యాయులంతా, సంబంధిత మండలాలకు వెళ్లాల్సి ఉంటుంది. 25న ఎన్నికల విధులు ముగించుకొని తమ తమ ఇళ్లకు వచ్చే సరికి, వారి వారి దూరాన్ని బట్టి రాత్రి 1 నుంచి 2 అయ్యే అవకాశం ఉంది. తెల్లవారి ఉదయం 7 నుంచి 8 లోపు గణతంత్ర వేడుకలకు సంబంధించి జెండాలు ఎగురవేయాలి. జాతీయ పండగ కావడంతో గ్రామాల్లో ప్రభాత్ భేరిలు నిర్వహిస్తూ, వరస క్రమంలో జెండాలు ఎగురవేస్తుంటారు. ఈ క్రమంలో పాఠశాల సమయానికనుగుణంగా జెండా ఎగురవేయాలి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు జరిగిన చోట కొత్త సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు. అందుకే టీచర్లు ఎన్నికలు విధులు ముగించుకొని సమయానికి గణతంత్ర వేడుకలకు హాజరవుతామా? లేదా? అని ఆందోళనకు లోనవుతున్నారు. ఒకవేళ తాము పనిచేసే పాఠశాలలు మారుమూల గ్రామాలైతే..బస్సు సౌకర్యాలు లేకపోతే వారి పరిస్థితి దయనీయం. అలాగే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించడం, స్వీట్లు పంపిణీ చేయడం, చివరకు సమావేశాలు నిర్వహించడానికి సమయం సరిపోక ఆగమవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్ళిన చోట ఎన్నికల నిర్వాహణలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడినా. సమస్యలు తలెత్తినా రాత్రి వరకు తేలని పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక ఎన్నికలకు వెళ్లిన మండలం నుంచి సకాలంలో బస్సులు వేసి గమ్యం చేర్చాలని అధికారులను కోరుతున్నారు. -
ముగిసిన మలివిడత ప్రచారం
మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. ఈ నెల 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. నాటినుంచి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 276 సర్పంచ్‌లకు 2,376 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నామినేషన్ల ఉప సంహరణ ముగిసిన అనంతరం 52 గ్రామ పంచాయతీలు, 585 వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 5 వార్డులకు నామినేషన్లు రాకపోవడం వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈ నెల 25వ తేదీన నిర్వహించే పోలింగ్‌లో 224 సర్పంచ్‌లకు, 1,786 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం డివిజన్ వ్యాప్తంగా 678 మంది సర్పంచ్ అభ్యర్థులు, 4125 మంది వార్డు సభ్యులకు పోటీలో ఉన్నారు. ప్రలోభాలకు సిద్ధమైన అభ్యర్థులు వారం రోజులపాటు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం ముగియడంతో ఒక్క రోజులో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు సిద్దమయ్యారు. మద్యం, డబ్బు పంపిణీకి సిద్ధం పోటా పోటీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధమయ్యారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ వేసిన నాటినుంచి కూడా మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో బెల్ట్‌షాపులు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాలలో సర్పంచ్‌కు ఓటు ఎటు వేసుకున్నా వార్డు సభ్యుడిగా మాత్రం నాకు ఓటెయ్యాలనే ప్రచారం కూడా సాగుతోంది. వార్డు, సభ్యులు సర్పంచ్‌లు కూడా వేర్వేరుగా ప్రచారం నిర్వహిస్తున్న గ్రామాలు సైతం ఉన్నాయి. -
‘రెండో విడత’కు సిద్ధం
ఆదిలాబాద్‌అర్బన్: రెండోవిడత పంచాయతీకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయగా, బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా గెలుపుకోసం యత్నిస్తున్నారు. రెండోవిడత పోరుకు ఇంకా 24 గంటలే ఉంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన బూత్‌లో పోలింగ్ జరగనుంది. ఇందుకు జిల్లా యంత్రాంగం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుతోపాటు పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని, అందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు పోలింగ్ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 400 ఓటర్లు దాటిన పోలింగ్‌కేంద్రంలో ముగ్గురు సిబ్బంది చొప్పున విధులు నిర్వర్తించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండోవిడత పంచాయతీ ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియడంతో అభ్యర్థులు గెలుపోటములపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. రెండో విడతకు అంతారెడీ రెండోవిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఐదు మండలాల్లోని 83 పంచాయతీలకు, 362 వార్డులకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారి చొప్పున మొత్తం 1372 మంది సిబ్బందిని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. ఇందులో రిజర్వులో ఉండే వారిని కలుపుకొని 580 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించగా, 792 మందిని ఇతర ప్రిసైడింగ్ అధికారులుగా నియమించారు. ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే రిజర్వులోని సిబ్బంది విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటారు. వీరితోపాటు 20 మంది జోనల్, 22 మంది రూట్ అధికారులను నియమించారు. స్టేజ్–1, స్టేజ్–2 అధికారులు కలిపి మొత్తం 219 మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. ఎన్నికలకు 1208 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉండగా, 1506 ఇంక్ బాటిళ్లు ఉన్నాయి. మొత్తం సర్పంచ్ 1,11,200 ఉండగా, 85,550 వార్డు బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. సర్పంచ్‌కి 306, వార్డులకు 886 మంది.. రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోథ్, తలమడుగు, గుడిహత్నూర్, బజార్హత్నూర్, నేరడిగొండ మండలాల్లోని మొత్తం 149 పంచాయతీలకుగాను 65 జీపీలు ఏకగ్రీవం కాగా, 83 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ బరిలో 306 మంది అభ్యర్థులు ఉన్నారు. ఐదు మండలాల్లో మొత్తం 1208 వార్డులకుగాను 839 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 362 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వార్డుల బరిలో 886 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే జిల్లాలోని బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, తలమడుగు మండలాల పరిధిలో 1,18,825 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ ఓటర్లు 36,462 మంది ఉండగా, ఎస్సీలు 26,202 మంది, బీసీలు 48,076 మంది, ఇతరులు 8085 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా మొత్తం 149 పంచాయతీలు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 65 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అంటే 83 పంచాయతీలకే ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవ పంచాయతీల పరిధిలోని ఓటర్లు మినహా సుమారు 83,650 మందికిపైగా ఓటర్లు ఓటింగ్ పాల్గొనే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. పది పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్.. రెండోవిడతలో 83 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, పది పంచాయతీల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సీన్‌ను లైవ్‌లో పరిశీలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగే అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి పకడ్బందీగా ఓట్లు లెక్కించనున్నారు. కాగా ఒక పంచాయతీ సమస్యాత్మకంగా గుర్తించగా, ఐదు పంచాయతీలు అత్యంత సమస్యాత్మక జీపీలుగా గుర్తించారు. మరో 14 జీపీలు క్రిటికల్‌గా ఉన్నాయి. మిగతా 63 పంచాయతీలు సాధారణంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముగిసిన పంచాయతీ ప్రచారం.. జిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. పదిరోజులుగా ఎన్నికల ప్రచారంతో సందడిగా మారిన పలు గ్రామాలు ప్రచారం ముగియడంతో స్తబ్దుగా మారాయి. ఆయా పదవులకు పోటీపడుతున్న అభ్యర్థులు ప్రచారంతో నిత్యం సందడి కనిపించగా, ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సౌండ్ బాక్సులు, లౌడ్ స్పీకర్లు, మైకుల సౌండ్‌తో గ్రామాలు హోరేత్తాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ పడుతున్న వారిలో టెన్షన్ మొదలైంది. అయితే రెండోవిడత పంచాయతీ తీర్పు ఎలా ఉంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఓటేద్దాం రండి!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) స్థానాలకు శుక్రవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. మూడు రెవెన్యూ డివిజన్లు ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ పరిధిలోని 31 మండలాల్లో ఎన్నికలు ఉన్నాయి. 31 జెడ్పీటీసీ, 373 ఎంపీటీసీ స్థానాలకు 8,77,696 మంది ఓటు వేయనున్నారు. ఆదిలాబాద్ డివిజన్లోని 10 జెడ్పీటీసీ స్థానాలకు 56 మంది, నిర్మల్ డివిజన్లో 13 జెడ్పీటీసీ స్థానాలకు 64 మంది, ఉట్నూర్ డివిజన్లోని 8 జెడ్పీటీసీ స్థానాలకు 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ డివిజన్లోని 123 ఎంపీటీసీ స్థానాలకు 486 మంది, నిర్మల్ డివిజన్లోని 163 స్థానాలకు 688 మంది, ఉట్నూర్ డివిజన్లోని 87 ఎంపీటీసీ స్థానాలకు 360 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా 31 జెడ్పీటీసీ స్థానాలకు 159 మంది, 373 ఎంపీటీసీ స్థానాలకు 1,534 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా రెండో విడతలో 8,77,696 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు డివిజన్లలో 1,246 మంది ప్రిసైడింగ్, 1,246 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులను, 3,738 మంది ఇతర పోలింగ్ అధికారులు మొత్తం 6,230 మంది సిబ్బందిని నియమించారు. ఇందుకు మూడు డివిజన్లలోని 31 మండలాల్లో 1,131 పోలింగ్ కేంద్రాలు(పీఎస్)లు ఏర్పాటు చేశారు. 316 సమస్యాత్మక, 226 అత్యంత సమస్యాత్మక, 59 ప్రభావిత పోలింగ్ కేం ద్రాలుగా, 47 పోలింగ్ కేంద్రాలు అల జడి సృష్టించేవిగా, 483 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 102 సమస్యాత్మక, 104 అత్యంత సమస్యాత్మక, 66 సాధారణ పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 272 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్‌ను ప ర్యవేక్షించేందుకు 361 మంది సూక్ష్మ పరిశీల కులను, 67 మంది వీడియో గ్రాఫర్లను నియమించారు. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సమయం వరకు భద్రంగా ఉంచేందుకు 3 స్ట్రాంగ్ రూంలను గుర్తించారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సుమారు 5 వేల మంది పోలీసులతోపాటు ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల మరో 350 మంది యూనిఫాం సిబ్బందిని వినియోగిస్తున్నారు. 12 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. పోలింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేసినట్లు కలెక్టర్ అహ్మద్ బాబు, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ తెలిపారు. రెం డో విడతగా జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం పెంచెందు కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేం ద్రాల్లో టెంట్లు, తాగునీరు, ర్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌కు కష్టమయ్యే ప్రాంతాల్లో వాహనాలను ఏర్పా టు చేసి ఓటర్లను తరలిస్తాం.