కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) స్థానాలకు శుక్రవారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్నాయి. మూడు రెవెన్యూ డివిజన్లు ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ పరిధిలోని 31 మండలాల్లో ఎన్నికలు ఉన్నాయి.
31 జెడ్పీటీసీ, 373 ఎంపీటీసీ స్థానాలకు 8,77,696 మంది ఓటు వేయనున్నారు. ఆదిలాబాద్ డివిజన్‌లోని 10 జెడ్పీటీసీ స్థానాలకు 56 మంది, నిర్మల్ డివిజన్‌లో 13 జెడ్పీటీసీ స్థానాలకు 64 మంది, ఉట్నూర్ డివిజన్‌లోని 8 జెడ్పీటీసీ స్థానాలకు 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ డివిజన్‌లోని 123 ఎంపీటీసీ స్థానాలకు 486 మంది, నిర్మల్ డివిజన్‌లోని 163 స్థానాలకు 688 మంది, ఉట్నూర్ డివిజన్‌లోని 87 ఎంపీటీసీ స్థానాలకు 360 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా 31 జెడ్పీటీసీ స్థానాలకు 159 మంది, 373 ఎంపీటీసీ స్థానాలకు 1,534 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా
రెండో విడతలో 8,77,696 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు డివిజన్లలో 1,246 మంది ప్రిసైడింగ్, 1,246 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులను, 3,738 మంది ఇతర పోలింగ్ అధికారులు మొత్తం 6,230 మంది సిబ్బందిని నియమించారు. ఇందుకు మూడు డివిజన్లలోని 31 మండలాల్లో 1,131 పోలింగ్ కేంద్రాలు(పీఎస్)లు ఏర్పాటు చేశారు. 316 సమస్యాత్మక, 226 అత్యంత సమస్యాత్మక, 59 ప్రభావిత పోలింగ్ కేం ద్రాలుగా, 47 పోలింగ్ కేంద్రాలు అల జడి సృష్టించేవిగా, 483 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 102 సమస్యాత్మక, 104 అత్యంత సమస్యాత్మక, 66 సాధారణ పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 272 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు.
పోలింగ్‌ను ప ర్యవేక్షించేందుకు 361 మంది సూక్ష్మ పరిశీల కులను, 67 మంది వీడియో గ్రాఫర్లను నియమించారు. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సమయం వరకు భద్రంగా ఉంచేందుకు 3 స్ట్రాంగ్ రూంలను గుర్తించారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సుమారు 5 వేల మంది పోలీసులతోపాటు ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల మరో 350 మంది యూనిఫాం సిబ్బందిని వినియోగిస్తున్నారు. 12 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు.
పోలింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేసినట్లు కలెక్టర్ అహ్మద్ బాబు, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్ తెలిపారు. రెం డో విడతగా జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం పెంచెందు కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేం ద్రాల్లో టెంట్లు, తాగునీరు, ర్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌కు కష్టమయ్యే ప్రాంతాల్లో వాహనాలను ఏర్పా టు చేసి ఓటర్లను తరలిస్తాం.
ఓటేద్దాం రండి!
Published Fri, Apr 11 2014 3:00 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement