shikhar dhawan century
-
ఆస్ట్రేలియా చిత్తు భారత్ ఘనవిజయం
-
ధావన్ సె(న్సే)షన్...
బెంగళూరు: స్పిన్ అస్త్రాలు, ఐపీఎల్లో తమ బౌలర్ల మెరుపులు... అంటూ ఎంతో హుషారుగా బెంగళూరుకు విచ్చేసిన అఫ్గానిస్తాన్‌కు క్రికెట్లో అసలు ‘టెస్టు’ ఎదురైంది. ఒక పూటలో 20 ఓవర్ల ఆటతో ఆకట్టుకున్నంత ఈజీ కాదని భారత బ్యాట్స్‌మెన్ శతక్కొట్టుడుతో చెప్పేశారు. మూడు సెషన్లు... మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిని ఒక్కరోజులోనే బోధపడేలా బాదేశారు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (96 బంతుల్లో 107; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), మురళీ విజయ్ (153 బంతుల్లో 105; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదంతొక్కారు. గురువారం తొలిరోజు ఆటలో భారత్ భారీస్కోరు చేసింది. నిర్ణీత ఓవర్ల కోటా (90 ఓవర్లు) పూర్తికాకపోయినా... 78 ఓవర్లలోనే 6 వికెట్లకు 347 పరుగులు చేసింది. రెండు సెషన్లపాటు నీరుగారిన అఫ్గాన్ బౌలర్లు మూడో సెషన్‌తో ఊపిరి పీల్చుకున్నారు. ఐదు వికెట్లు తీసి హమ్మయ్య అనుకున్నారు. యమిన్ అహ్మద్‌జాయ్‌కి 2 వికెట్లు దక్కాయి. మూడో సెషన్‌కు ముందు వర్షంతో ఆటకు గంటసేపు అంతరాయం ఏర్పడింది. పొద్దుపోయేవరకూ ఆటను కొనసాగించినా పూర్తి ఓవర్లు సాధ్యపడలేదు. భారీస్కోరు దిశగా... టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ధావన్, విజయ్ చిన్నస్వామి స్టేడియంలో చెలరేగారు. తొలి టెస్టు ఆడుతున్న అఫ్గాన్ బౌలింగ్ దళంలో ఎవ్వరిని విడిచిపెట్టకుండా బాదేశారు. వన్డేను తలపించినట్లుగా 11వ ఓవర్లోనే జట్టు స్కోరు 50 చేరింది. 20 ఓవర్లోనే వంద దాటింది. విజయ్ నింపాదిగా ఆడుతుంటే ధావన్ దంచేశాడు. భారత్ 27 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 158 పరుగులు చేసి సెషన్‌ను ముగించింది. రెండో సెషన్లో ధావన్ నిష్క్రమించడంతో తొలి వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినప్పటికీ భారత జోరు మాత్రం కొనసాగింది. విజయ్ (80 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, 36.3 ఓవర్లలోనే స్కోరు 200 పరుగులు దాటింది. మరోవైపు లోకేశ్ రాహుల్ (54; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. ఇద్దరు కలిసి మరో భారీ భాగస్వామ్యానికి తెరతీశారు. 46 ఓవర్లో 248/1 వర్షం కురవడంతో టి విరామానికి వెళ్లారు. అనంతరం రాహుల్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 4 పరుగుల వ్యవధిలో విజయ్, రాహుల్ నిష్క్రమించడంతో చివరి సెషన్లో అఫ్గాన్‌కు పట్టుచిక్కింది. జట్టు స్కోరు 300 దాటాక రషీద్ బౌలింగ్‌లో రహానే, ముజీబ్ బౌలింగ్‌లో పుజారా (35) వెనుదిరిగారు. దినేశ్ కార్తీక్ రనౌట్ కావడంతో మూడో సెషన్లో అఫ్గాన్ చేతికి 5 వికెట్లు చిక్కాయి. అయ్యో పాపం... అఫ్గాన్, రషీద్... ఆడుతోంది తొలిటెస్టు కాబట్టి అఫ్గానిస్తాన్ ఆరంభంలో అడుగడుగునా కష్టపడింది. ఫీల్గింగ్ మోహరింపు, బౌలర్ల వినియోగం ఏదీ తెలియక విలవిలలాడింది. మరోవైపు రషీద్ ఖాన్‌కు టెస్టు క్రికెట్ విలువెంటో తెలిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. కట్టుదిట్టంగా 4 ఓవర్లు వేసినంత ఈజీగా 40 ఓవర్లు సాధ్యం కాదని ఒక్కరోజులోనే తెలిసొచ్చింది. ముఖ్యంగా ధావన్ అతని బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. తొలిరోజు అందరికంటే ఎక్కువగా 26 ఓవర్లు వేసిన అతను కేవలం రెండే మెయిడిన్లు వేసి ఏకంగా 120 పరుగులిచ్చుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యూ (బి) వఫాదార్ 105; ధావన్ (సి) నబి (బి) యమిన్ అహ్మద్‌జై 107; రాహుల్ (బి) యమిన్ అహ్మద్‌జై 54; పుజారా (సి) నబి (బి) ముజీబ్ 35; రహానే ఎల్బీడబ్ల్యూ (బి) రషీద్ ఖాన్ 10; కార్తీక్ రనౌట్ 4; హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ 10; అశ్విన్ బ్యాటింగ్ 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (78 ఓవర్లలో 6 వికెట్లకు) 347. వికెట్ల పతనం: 1–168, 2–280, 3–284, 4–318, 5–328, 6–334. బౌలింగ్: యమిన్ అహ్మద్‌జై 13–6–32–2, వఫాదార్ 15–4–53–1, నబి 8–0–45–0, రషీద్ ఖాన్ 26–2–120–1, ముజీబ్ 14–1–69–1, అస్గర్ స్తానిక్‌జై 2–0–16–0. శిఖర్ మెరుపులు చారిత్రక టెస్టులో ధావన్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మ్యాచ్ మొదలైన మొదటి సెషన్లోనే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. 2006లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 99 పరుగులు చేశాడు. 14వ ఓవర్లోనే అఫ్గాన్ తమ తురుపుముక్క రషీద్ ఖాన్‌ను రంగంలోకి దించగా... ధావన్ మరింత రెచ్చిపోయా డు. మూడు బౌండరీలు బాది 47 బంతుల్లోనే (10 ఫోర్లు, 1 సిక్సర్) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 2 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 15 పరుగులు సాధించాడు. 26వ ఓవర్లో బౌండరీతో ధావన్ కేవలం 87 బంతుల్లోనే 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధావన్‌కంటే ముందు ట్రంపర్ (103 నాటౌట్, ఆసీస్), మెకార్ట్నీ (112 నాటౌట్, ఆసీస్), బ్రాడ్‌మన్ (105 నాటౌట్), మజీద్ ఖాన్ (108 నాటౌట్, పాకిస్తాన్), వార్నర్ (100 నాటౌట్, ఆసీస్)లు లంచ్‌లోపే ఈ ఫీట్ సాధించాడు. -
‘టాప్’ లేచింది.. ‘మిడిల్’ కూలింది
సాక్షి, బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న చారిత్రక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు విజయ్, ధావన్‌లు సెంచరీలతో చెలరేగగా, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీతో మెరిశారు. అయితే మిడిల్ ఆర్డర్ విఫలం అవ్వడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 78 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. తొలి రెండు సెషన్లలలో ప్రభావం చూపని ఆఫ్గాన్ బౌలర్లు చివరి సెషన్లో వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి... తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (107; 96 బంతుల్లో 19 ఫోర్లు, 3సిక్సర్లు) అహ్మద్జాయ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అనూహ్యంగా పుజారాకు బదులు బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కూడా ఎదురుదాడికి దిగడంతో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. మరో ఎండ్‌లో మురళీ విజయ్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో వరుస ఓవర్లలో మురళీ విజయ్ (105; 153 బంతుల్లో 15 ఫోర్లు, 1సిక్సర్), కేఎల్ రాహుల్(54; 64 బంతుల్లో 8 ఫోర్లు) వెనుదిరగటంతో స్కోర్ నెమ్మదించింది. మూడో సెషన్లో... కెప్టెన్ రహానేతో కలిసి పుజారా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా అఫ్గాన్ బౌలర్ల అటాకింగ్‌తో మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇన్నింగ్స్ మొదట్లో ఏ మాత్రం ప్రభావం చూపని రషీద్ ఖాన్ మూడో సెషన్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. వరుసగా వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు పెవిలియన్‌కు చేరారు. పుజారా(35), రహానే(10), దినేశ్ కార్తీక్(4) పూర్తిగా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్ల దాటికి చివరి సెషన్లలో ఐదు వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసింది. ఆట ముగిసే సమయానికి హార్థిక్ పాండ్యా(10), అశ్విన్(7) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ బౌలర్లలో అహ్మద్ జాయ్ రెండు వికెట్లు తీయగా, రషీద్, ముజీబ్, వఫ్దార్ తలో వికెట్ సాధించారు. -
పరుగుల వేటలో పల్టీ
తొలి టెస్టులో భారత్ ఓటమి శిఖర్ ధావన్ సెంచరీ వృథా వాగ్నేర్కు నాలుగు వికెట్లు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో భారత్ పరుగుల వేటలో బోల్తా కొట్టింది. ధావన్, కోహ్లి మినహా మిగతా వారు నిరాశపర్చడంతో తొలి టెస్టులో ఓ అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. కీలక సమయంలో బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ చక్కని గెలుపుతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆక్లాండ్: భారీ లక్ష్యం కళ్ల ముందు కదలాడుతున్నా.... కుర్రాళ్ల పోరాటం చూసి గెలుపు మనదే అనుకున్నాం. శిఖర్ ధావన్ (211 బంతుల్లో 115; 12 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడు... విరాట్ కోహ్లి (102 బంతుల్లో 67; 12 ఫోర్లు) నిలకడను చూశాక విజయంపై ఆశలు రెట్టింపు అయ్యాయి. కానీ రెండో సెషన్లో కొత్త బంతిని తీసుకున్న కివీస్... నిలకడగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్‌ను నిట్ట నిలువునా ముంచింది. ఫలితంగా రికార్డు లక్ష్య ఛేదన దిశగా సాగిపోతున్న టీమిండియాను ఒక్కసారిగా కుప్పకూల్చింది. దీంతో చిరస్మరణీయ విజయాన్ని సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న ధోని సేన తొలి టెస్టులో 40 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు... 87/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 96.3 ఓవర్లలో 366 పరుగులకు ఆలౌటైంది. చివర్లో ధోని (41 బంతుల్లో 39; 6 ఫోర్లు), జడేజా (21 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్సర్) కాసేపు పోరాడారు. మెకల్లమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 14 నుంచి వెల్లింగ్టన్లో జరుగుతుంది. సెషన్-1 ఓవర్లు: 29; పరుగులు: 93; వికెట్లు: 1 కోహ్లి నిలకడ ప్రత్యర్థులు పదేపదే ఎల్బీడబ్ల్యు అప్పీల్ చేసినా ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ధావన్‌పై ప్రభావం చూపలేదు. దూకుడుగా ఆడుతూ తొలి ఓవర్లోనే అర్ధసెంచరీ (75 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో ఎండ్‌లో పుజారా (23) ఆకట్టుకోలేకపోయాడు. సౌతీ వేసిన ఓ చక్కటి అవుట్ స్వింగర్‌కు వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి, ధావన్‌తో కలిసి ఓపికగా బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్లు ఒత్తిడి పెంచినా తడబాటు లేకుండా ఆడాడు. వాగ్నేర్, సోధి బౌలింగ్‌లో వరుస బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. లంచ్‌కు ముందు ఓవర్లో బౌండరీ సాధించిన కోహ్లి 80 బంతుల్లో అర్ధ శతకాన్ని అందుకున్నాడు. ధావన్ కూడా నిలకడగా ఆడటంతో మరో వికెట్ పోకుండా భారత్ 180/2 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. సెషన్-2 ఓవర్లు: 27; పరుగులు: 90; వికెట్లు: 3 వాగ్నేర్ విజృంభణ లంచ్ తర్వాత ధావన్ వేగం పెంచాడు. సోధి వేసిన ఇన్నింగ్స్ 59వ ఓవర్లో ఓ సిక్సర్, రెండు ఫోర్లు కొట్టి కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. కానీ వాగ్నేర్ కట్టుదిట్టమైన బంతులతో కోహ్లిని కట్టడి చేశాడు. ఓ షార్ట్ బంతిని అనవసరంగా ఆడి వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించింది. ధావన్‌కు జత కలిసిన రహానే (18) కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. దీంతో స్కోరు మందగించడంతో ధావన్ ఒత్తిడికి లోనయ్యాడు. వాగ్నేర్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్‌ను తప్పించుకునే యత్నంలో అవుటయ్యాడు. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకోవడం భారత్‌ను దెబ్బ తీసింది. తొలి బంతికే రహానే కూడా వెనుదిరిగాడు. ఈ సెషన్లో బౌలింగ్ హవా నడవడంతో భారత్ 268 పరుగులకే సగం భారత జట్టు పెవిలియన్ చేరింది. సెషన్-3 ఓవర్లు: 15.3; పరుగులు: 96; వికెట్లు: 5 17 బంతుల్లో 3 వికెట్లు టీ తర్వాత తొలి బంతికే రోహిత్ అవుట్ కావడంతో జట్టును ఆదుకునే భారం ధోని, జడేజాలపై పడింది. బౌల్ట్ బౌలింగ్‌లో ధోని నాలుగు, సౌతీ బౌలింగ్‌లో జడేజా రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచారు. 5.4 ఓవర్లలోనే 54 పరుగులు జతచేసి విజయంపై ఆశలు పెంచారు. ఈ దశలో కివీస్ బౌలర్ బౌల్ట్ కొత్త బంతితో నిప్పులు చెరిగాడు. తన బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన జడేజాను మరో షాట్‌కు ఉసిగొల్పాడు. దీంతో రెచ్చిపోయిన జడేజా బంతిని మిడాన్‌లోకి లేపడంతో సోధి చక్కటి క్యాచ్ అందుకున్నాడు. అనవసరపు షాట్‌తో జడేజా అవుట్ కావడంతో భారత్ ఆశలు మరింత సన్నగిల్లాయి. చివర్లో 17 బంతుల వ్యవధిలో జహీర్ (17), ధోని, ఇషాంత్ (4)లు అవుట్ కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. వాగ్నేర్ 4, బౌల్ట్, సౌతీ చెరో మూడు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 503 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 105 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 13; ధావన్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 115; పుజారా (సి) వాట్లింగ్ (బి) సౌతీ 23; కోహ్లి (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 67; రోహిత్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 19; రహానే ఎల్బీడబ్ల్యు (బి) బౌల్ట్ 18; ధోని (బి) వాగ్నేర్ 39; జడేజా (సి) సోధి (బి) బౌల్ట్ 26; జహీర్ (సి) టేలర్ (బి) వాగ్నేర్ 17; ఇషాంత్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 4; షమీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: (96.3 ఓవర్లలో ఆలౌట్) 366. వికెట్ల పతనం: 1-36; 2-96; 3-222; 4-248; 5-268; 6-270; 7-324; 8-349; 9-362; 10-366 బౌలింగ్: బౌల్ట్ 23.3-2-86-3; సౌతీ 23-4-81-3; వాగ్నేర్ 25-8-62-4; అండర్సన్ 7-1-22-0; సోధి 15-2-78-0; విలియమ్సన్ 3-0-18-0. 1 2002 తర్వాత భారత్‌పై న్యూజిలాండ్ టెస్టు నెగ్గడం ఇదే మొదటిసారి. మొత్తంగా కివీస్‌కు ఇది పదో విజయం. 4 మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నాలుగో భారత ఓపెనర్ ధావన్. ముస్తాక్ అలీ, గవాస్కర్, వసీమ్ జాఫర్ ముందున్నారు. 1979 (గవాస్కర్) తర్వాత విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన ఆటగాడు ధావన్. 11 విదేశీ గడ్డపై అత్యధిక టెస్టులు (11) ఓడిన భారత కెప్టెన్ ధోని. 10 విదేశాల్లో గత 11 టెస్టుల్లో భారత్ పదింటిలో ఓడింది. తొలి టెస్టును కివీస్ నెగ్గడంలో ఆ జట్టు పేస్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. భారత్ కోల్పోయిన 20 వికెట్లు ఆ జట్టు పేసర్లే పడగొట్టారు. కివీస్ టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇది 12వ సారి. గత మూడు టెస్టుల్లో (విండీస్‌తో కలిపి) న్యూజిలాండ్ తీసిన 60 వికెట్లలో 59 పేస్ బౌలర్లే పడగొట్టారు. 100... కాదు కాదు 99! ముందుగా హెల్మెట్ తీయడం... శరీరానికి దూరంగా రెండు చేతులను వెడల్పుగా చాస్తూ ఆకాశం వైపు చూడటం... దాదాపు ఏడాది కాలంగా సెంచరీ పూర్తి చేయగానే అందరికీ గుర్తొచ్చే శిఖర్ ధావన్ ‘సిగ్నేచర్ స్టైల్’ ఇదే. అంతర్జాతీయ కెరీర్లో ఆరు శతకాలు చేసిన సందర్భాల్లోనూ ధావన్ ఇదే పోజిచ్చాడు. ఆదివారం కూడా అతను సరిగ్గా అదే చేశాడు. అయితే కాస్త తొందర పడ్డాడు. సోధి బౌలింగ్‌లో ముందుకొచ్చి వైడ్ లాంగాన్ దిశగా శిఖర్ సిక్సర్ బాదాడు. ఆ వెంటనే సెంచరీగా భావించి తనకు అలవాటైన తరహాలో నిలబడ్డాడు. అయితే అప్పటికి అతని స్కోరు 99 మాత్రమే! బాబూ...ఇంకా పని కాలేదు అన్నట్లుగా కోహ్లి నవ్వుతూ సైగ చేశాడు. మ్యాచ్ సీరియస్‌గా సాగుతున్న వేళ ఈ ఘటన మైదానమంతా వినోదాన్ని పంచింది. అయితే తర్వాతి బంతికే ఫోర్‌తో శతకం అందుకున్న ధావన్ మరోసారి తనదైన శైలిలో అదే పోజుతో ‘రీప్లే’ ఇవ్వడం విశేషం. ఇంకా నేర్చుకోవాలి ఈ టెస్టు గురించి నాలో మిశ్రమ స్పందనలున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో మేం సరిగా బౌలింగ్ వేయలేకపోయాం. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఈ లోపాన్ని అధిగమించాం. అటు బ్యాటింగ్‌లోనూ 85 ఓవర్ల వరకు మేం పటిష్టంగానే ఉన్నాం. ఆ తర్వాత కొద్ది వ్యవధిలోనే పలు వికెట్లను కోల్పోయాం. దీనికి తోడు రహానే వికెట్‌పై మాకు కఠిన నిర్ణయం ఎదురైంది. అప్పటికే 30-35 పరుగులు వెనుకబడి ఉన్నాం. ఇదే చివర్లో దెబ్బతీసింది. రెండో కొత్త బంతితో ఇబ్బంది ఎదుర్కొన్నాం. అక్కడ మా వికెట్లను కాపాడుకున్నట్టయితే మిగతా పరుగులు సాధించేవాళ్లం. అంపైర్ తప్పుడు నిర్ణయాలు కూడా దెబ్బతీశాయి. ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో మూడు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల అనుభవం లభిస్తుంది. సెషన్ల వారీగా లక్ష్యాన్ని ఛేదించే విధానం నేర్చుకోవాల్సి ఉంది. నాణ్యమైన ఆటగాళ్లు ఇప్పటికే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. వన్డే సిరీస్‌తో పాటు ఈ మ్యాచ్‌లోనూ మేం మంచి స్థానంలోనే ఉన్నాం. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. మేం ఇంకా నేర్చుకోవాలేమో. రెండో టెస్టులోనూ ఇవే పరిస్థితులు ఎదురైతే సత్తా చూపుతాం. - ఎంఎస్ ధోని (భారత కెప్టెన్) ఆ నిర్ణయంపై విచారం లేదు మేం భారీ స్కోరు చేశామని తెలుసు. ఒకవేళ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తే మంచి ఆధిక్యం లభిస్తుందని అనుకున్నాం. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ శక్తిసామర్థ్యాల గురించి పూర్తి అవగాహన ఉంది. 220 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఓ దశలో భారత్ అత్యంత పటిష్టంగా ఉంది. ఈ సమయంలో మా బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానమేమిటో మాకు తెలుసు కాబట్టి ఈ విజయం అత్యంత చిరస్మరణీయం. ఫాలోఆన్ ఆడించకుండా తీసుకున్న నిర్ణయంపై నాకెలాంటి పశ్చాత్తాపం లేదు. 400కు పైగా టార్గెట్ చిన్న మొత్తం కాదు. ప్రపంచ క్రికెట్లో కేవలం మూడు జట్లు మాత్రమే ఈ లక్ష్యాన్ని ఛేదించాయి. అయినా చివరి రోజు 150-200 పరుగుల లక్ష్యం కోసం మేం బరిలోకి దిగడం నాకు నచ్చదు. - బ్రెండన్ మెకల్లమ్ (కివీస్ కెప్టెన్) -
తొలి టెస్టు కివీస్ వశం
భారత జట్టుతో జరిగిన తొలిటెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. అందినట్టే అందిన మ్యాచ్ కాస్తా చేజారడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఒక దశలో ఎలాగైనా భారత జట్టు గెలుస్తుందనే భావించినా, వరుసగా మిడిలార్డర్ విఫలం కావడంతో మ్యాచ్ కివీస్ వశమైంది. విజయం సాధించాలంటే రెండో ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేయాల్సి ఉండగా, 366 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ ధోనీ 39 పరుగులకే ఔటవ్వడం టీమిండియా వెన్ను విరిచింది. రవీంద్ర జడేజా బ్యాట్ తో కూడా మెరుపులు మెరిపించినా, 21 బంతుల్లో 26 పరుగులే చేసి పెవిలియన్ దారి పట్టాడు. జడేజా, ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్ తప్పకుండా భారత వశం అవుతున్నట్లే అనిపించింది. వీళ్లిద్దరూ ఔట్వవగానే ఇక టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. 40 పరుగుల తేడాతో న్యూజిలాండ్ తొలి టెస్టును వశం చేసుకుని సిరీస్ లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. అంతకుముందు నాలుగో రోజు ఆటలో టీ విరామం తర్వాత భారత జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 290 పరుగులు చేసింది. 211 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సు సాయంతో 115 పరుగులు చేసిన శిఖర్ ధావన్, వాగ్నర్ బౌలింగ్‌లో వాట్లింగ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. చిట్ట చివరి వన్డేలో తప్ప ఏ మ్యాచ్‌లోనూ తగిన స్కోరు చేయలేక, విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులకే వెనుదిరిగినా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 102 బంతులను ఎదుర్కొని 12 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. అచ్చం శిఖర్ ధావన్ లాగే, వాగ్నర్ బౌలింగ్‌లో వాట్లింగ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. వీళ్లిద్దరి పుణ్యమాని భారత్ కాస్త నిలదొక్కుకుంది. టీ విరామం తర్వాత రోహిత్ శర్మ ఔటవ్వడంతో రవీంద్ర జడేజా బరిలోకి దిగాడు. వేగంగా పరుగులు తీస్తూ కెప్టెన్ ధోనికి సహకారం అందించాడు. కానీ, చివరకు ధోనీ 39 పరుగుల వద్ద, జడేజా 26 పరుగుల వద్ద ఔటయ్యారు. దీంతో మ్యాచ్ చేజారిపోయింది. స్కోరు వివరాలు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 503; భారత్ తొలి ఇన్నింగ్స్ 202; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 105, భారత్ రెండో ఇన్నింగ్స్: 366