shocking facts
-
తిండి లేదు, నీళ్లు లేవు.. సంచలన నిజాలు బయట పెట్టిన తిరుపతి భక్తులు
-
డెడ్ బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసులకే ఈ కేసు పెను సవాలుగా మారింది. ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి..పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డెడ్‌బాడీ పార్సిల్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అనుమానితుడు శ్రీధర్‌వర్మను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ జరుగుతున్నకొద్దీ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. సాగి తులసి ఇంటికే డెడ్‌బాడీని శ్రీధర్‌వర్మ ఎందుకు పార్శిల్ చేశాడన్నదానిపై క్లారిటీ వస్తోంది.తన వదిన ఆస్తిని కాజేసేందుకే ఈ స్కెచ్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. జులై నుంచే ఈ కుట్రకు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. తులసికి శవాలంటే భయమన్న విషయం తెలుసుకున్న శ్రీధర్‌వర్మ.. ఆమెను భయటపెట్టేందుకు డెడ్‌బాడీని పంపించినట్టు సమాచారం. వదిన తులసిని భయపెట్టాలంటే.. డెడ్‌బాడీ కావాలి. మృతదేహమంటే.. అదేదో అంగట్లో దొరికే వస్తువు కాదు. అందుకే అమాయకుడైన బర్రె పర్లయ్యను టార్గెట్ చేశాడు శ్రీధర్‌వర్మ. ఈ నెల 17న హత్య చేసి ఉంటే 19 వరకు మృతదేహాన్ని ఎక్కడ దాచారు? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీధర్ వర్మకు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీధర్ వర్మకు మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర్ వర్మ రెండో భార్య అక్క అయిన సాగి తులసితో ఆస్తి గొడవలు నడుస్తున్నాయని.. ఈ క్రమంలో ఆమెను బెదరించడానికి పక్కా స్కెచ్‌తో పర్లయ్యను హత్య చేసి డెడ్‌బాడీని పార్శిల్లో పంపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.పర్లయ్యను హత్య విషయంలోనూ శ్రీధర్‌వర్మ ముందుగానే పెద్ద ప్లానే వేసుకున్నాడు. ఇందులో భాగంగా రెండు శవపేటికలను తయారు చేయించాడు. రోజు వారీ కూలీలైన పర్లయ్య, రాజు ఇద్దరికి పని ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఇద్దరిలో ఒకరిని చంపి పార్శిల్ చేయాలని భావించాడు. అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉన్నందును అతడిని చంపితే గొడవలు అవుతాయని భావించిన శ్రీధర్ వర్మ.. పర్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. పర్లయ్యకు కుటుంబసభ్యుల ఉన్నా వారు పట్టించుకోరని భావించిన శ్రీధర్.. అనుకున్న ప్రకారం పర్లయ్యను హతమార్చాడు.బర్రె పర్లయ్య హత్య అంతా శ్రీధర్‌వర్మ మూడో భార్య ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. పర్లయ్యను హత్య చేసి ఆపై అప్పటికే తాను ముందే సిద్ధం చేసిపెట్టుకున్న శవపేటికలో మృతదేహాన్ని ఉంచాడు. అయితే ఈ మొత్తం వ్యహారంలో శ్రీధర్ వర్మ మూడో భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నెల 17న బర్రె వర్లయ్యను హత్య చేసేందుకు శ్రీధర్ వర్మ పక్కా ప్రణాళికతో చెక్క పెట్టెను సిద్ధం చేసుకున్నాడు. మద్యం తాగించి అనంతరం ఉండి మండలం వాండ్రం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని చెక్కపెట్టెలో పార్శిల్ చేయడానికి గాంధీనగర్ తీసుకువెళుతుండగా వర్షం కురవడంతో, కారు ముందుకు వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో శవాన్ని కారులోనే ఉంచి, మరొక పెట్టెను కైకలూరు నుంచికొని తెచ్చాడు. అనంతరం మృత దేహాన్ని గణపవరం మండలం సాగిపాడు వద్దకు పెట్టెలో తీసుకువెళ్లి మూడో భార్య సుష్మ సాయంతో ఆటోడ్రైవర్‌కు అప్పగించి తులసికి డోర్ డెలివరీ చేశారు.ఇప్పటి వరకు అనుమానాస్పద కేసుగా విచారణ చేసిన పోలీసులు దీనిని హత్య కేసుగా మార్పు చేశారు. తులసికి చెందిన ఆస్తిని కాజేయడం కోసమే శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య రేవతి పన్నాగం పన్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి భీమవరంలోని పలు నగల దుకాణాల్లో బంగారం తాకట్టు పెట్టి, మరికొంత విక్రయించినట్లు తెలియడంతో మూడు బంగారం దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్‌లో మొదటి భార్య ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు, పుస్తకాలు పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా మల్లంపూడిలో శ్రీధర్ వర్మ తల్లిదండ్రులను, ఆయన ముగ్గురు భార్యలు, పిల్లలు, యండగండికి చెందిన ముదునూరి రంగరాజు, అతడి భార్య హైమావతి, సాగి తులసిలను పోలీసులు వేర్వేరుగా పలు ప్రదేశాల్లో విచారిస్తున్నారు. ఒకట్రెండ్రోజుల్లో వివరాలు పూర్తిగా వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ నయీం అస్మి అంటున్నారు.ఇదీ చదవండి: కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?మరోవైపు అమాయకుడైన బర్రె పర్లయ్యను.. శ్రీధర్‌వర్మ హతమార్చడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. వివాదరహితుడిగా ఉన్న పర్లయ్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మూడో భార్య ఇంట్లో మరో శవపేటికను కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఇంకో శవపేటికను శ్రీధర్ వర్మ ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే శ్రీధర్‌వర్మ ఇంట్లో పోలీసులు సెర్చ్ చేయగా చేతబడి చేసే సామాగ్రి కూడా లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అసలు శ్రీధర్ వర్మ వృత్తి ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా తులసిని ఆస్తి కోసం బెదిరించడానికి ఎలాంటి సంబంధం లేని పర్లయ్యను ఎందుకు హత్య చేశాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు శ్రీధర్ వర్మ సహకరించడం లేదని.. పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు శ్రీధర్ వర్మ సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. మొత్తానికి డెడ్ బాడీ పార్శిల్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇందులో ఎవరెవరు ఉన్నారనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. -
ఇంటూరి రవికిరణ్ భార్య షాకింగ్ నిజాలు
-
KSR Live Show: షర్మిల జగమొండి.. ఎవరికి తెలియని పచ్చి నిజాలు బయటపెట్టిన అనలిస్ట్ కృష్ణం రాజు
-
అంతా బోగస్.. సంచలన నిజాలు బయటపెట్టిన టీటీడీ ఈవో..
-
కాదంబరీ జత్వానీ తల్లి గురించి షాకింగ్ నిజాలు
-
అచ్యుతాపురం ఘటనపై బాధితులు వెల్లడించిన సంచలన నిజాలు..
-
టీడీపీ నేతలే హంతకులు
-
విశాఖలో శిశు విక్రయాల కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు
-
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
-
ముద్రగడ కూతురు వీడియోపై సంచలన నిజాలు బయటపెట్టిన అడ్వకేట్ రామానుజం
-
ఆర్థికంగా పతనం అంచున మార్గదర్శి చిట్ ఫండ్స్
-
వివేకా హత్య కేసులో నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు :ఎంవీ కృష్ణారెడ్డి
-
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
వివేకా హత్యకేసులో బయటపడుతున్నవాస్తవాలు
-
సర్వే నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించిన కొమ్మినేని శ్రీనివాసరావు
-
15 మంది బాయ్‌ఫ్రెండ్స్.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
బనశంకరి(కర్ణాటక): యలహంకలో నేత కార్మికుని దారుణ హత్య కేసులో భార్య శ్వేత లీలలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసినప్పటికీ పట్టించుకోకుండా అడుగులేసింది. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. ఈ నెల 22వ తేదీన యలహంక కొండప్పలేఔట్‌లో మేడపై హత్యకు గురైన సత్యసాయి జిల్లా హిందూపురం వాసి చంద్రశేఖర్ (35) కేసులో భార్య శ్వేత, ఆమె ప్రియుడు సురేశ్‌లను పోలీసులు బుధవారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సురేశ్‌ను పిలిపించి హత్య చేయించినట్లు విచారణలో తెలిపింది. కాలేజీలో ఇష్టానుసారం స్నేహాలు బెంగళూరులో ఎంఎస్సీ చదివిన శ్వేత కాలేజీలో పలువురు స్నేహితులతో డేటింగ్ చేసింది. టీవీలు, సినిమాలు చూసి అదే లోకం అనుకుంది. ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండడం గొప్ప అనుకుని అలాగే చేసేది. కనీసం 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని, కొన్నిరోజులు షికార్లు చేసిన తరువాత వారిని బ్లాక్ లిస్టులో పెట్టేదని తెలిసింది. ఇంటి యజమాని కుమారునితోనూ చనువుగా మెలిగింది. అతనితో బైక్‌పై కాలేజీకి వెళ్లేది. ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. ఇవి భర్త చంద్రశేఖర్‌కు తెలియడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇక ప్రియుడు సురేశ్‌తో మాట్లాడానికి కొత్త సిమ్‌కార్డును కొని అందులో హత్య కుట్ర గురించి మాట్లాడింది. భర్తను పైకి పంపింది ఇలా ఈ నెల 22 తేదీన సురేశ్‌ను ఇంటికి పిలిపించింది. భర్త చంద్రశేఖర్ పని నుంచి ఇంటికి రాగానే నీరు రావడం లేదు, పైకి ట్యాంకు వద్దకు వెళ్లి చూడాలని శ్వేత చెప్పింది. అతడు వెళ్లగానే అక్కడ దాగి ఉన్న సురేశ్ రాడ్‌తో తలపై కొట్టి, మర్మాంగం కత్తిరించి హత్య చేసి ఉడాయించాడు. తరువాత తనకేమి తెలియనట్లు శ్వేత నాటకమాడింది. భర్త శవంపై పడి వెక్కివెక్కి విలపించింది. ఆమెపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విషయమంతా వివరించింది. చదవండి: భర్త కంటే 16 ఏళ్లు చిన్న.. వివాహేతర సంబంధం మోజుతో -
‘సూది’ మర్డర్ వెనుక అసలు కథ ఇదే.. షాకింగ్ నిజాలు వెలుగులోకి..
సాక్షి, ఖమ్మం జిల్లా: ముదిగొండ మండలం వల్లభి గ్రామ శివారులో జరిగిన సూదిమందు హత్య కేసులో భార్యనే విలన్‌గా తేల్చారు పోలీసులు. హత్యలో ప్రమేయం ఉన్న ఆరుగురిని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ బస్వారెడ్డి వెల్లడించారు. ఏ1 గోదా మోహన్‌రావు, ఏ2 బండి వెంకన్న, ఏ3 నర్సింశెట్టి వెంకటేష్, ఏ4 షేక్ ఇమాంబీ, ఏ5 బందెల యశ్వంత్, ఏ6 పోరళ్ల సాంబశివరావును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్ చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గోదా మోహన్‌రావుతో జమాల్ సాహెబ్ భార్య ఇమాంబీతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడని.. ఈ విషయం జమాల్ సాహెబ్‌కు తెలియడంతో భార్యను మందలించాడన్నారు. దీంతో తన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న జమాల్ బీ.. ప్రియుడు మోహన్‌రావుతో కలిసి పథకం వేసిందని ఏసీపీ చెప్పారు. నామవరంలో ఆర్ఎంపీగా పని చేస్తున్న బండి వెంకన్నకు తమ వివాహేతర సంబంధం గురించి చెప్పి అతని ద్వారా హత్యకు ఉపయోగించే ఇంజెక్షన్లు కావాలని కోరాడని ఏసీపీ తెలిపారు. దీంతో వెంకన్న తన స్నేహితులైన యశ్వంత్, సాంబశివరావు ద్వారా ఇంజెక్షన్లు తెప్పించి వాటిని వెంకటేష్ ద్వారా జమాల్‌కి ఇప్పించాలని పథకం అమలు చేసారని చెప్పారు. జమాల్ తన కూతురు గండ్రాయిలో ఉండటంతో అక్కడికి వెళ్తున్న సమయంలో వల్లబి శివారులో బైక్ లిఫ్ట్ అడిగిన బండి వెంకన్న అతను ఎక్కించుకున్న అనంతరం అతనికి ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే దిగి తన స్నేహితుడు వెంకటేష్ తీసుకొచ్చిన బైక్ ఎక్కి పారిపోయాడని తెలిపారు. ఇంజెక్షన్ ప్రభావంతో జమాల్ సృహ కోల్పోయి స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడని ఏసీపీ చెప్పారు. నిందితుల వద్ద నుంచి రెండు బైక్‌లు,ఆరు సెల్ ఫోన్లు, ఇంజెక్షన్, సిరంజీ, స్టరైల్ వాటర్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ బస్వారెడ్డి చెప్పారు. -
కోవిడ్ వ్యథా చిత్రం.. బతుకు భారమై.. చదువుకు దూరమై..!
కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత ఎంబీఏ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ల అమ్మకు 2020లో కోవిడ్ వచ్చింది. చికిత్స ఖర్చులతో ఆ కుటుంబం అప్పుల పాలైంది. దీనితో పై చదువుల ఆశలు వదిలేసి.. ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో నెలకు రూ. 25వేల వేతనంతో ఉద్యోగం చేస్తున్నాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్ ప్రకాశ్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లూ చేసుకుంటూ వచ్చాడు. కానీ నవీన్ తండ్రిని కోవిడ్ బలితీసుకుంది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు నవీన్ కిరాణా దుకాణం నడిపిస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కొట్టిన దెబ్బకు వేలు, లక్షల మంది యువత పైచదువులను, భవిష్యత్తు ఆశలను వదిలేసుకుని ఉద్యోగం, ఉపాధి వేటలో పడుతోంది. కోవిడ్ తర్వాత తిరిగి ఉపాధి అవకాశాలు పెరిగాయని.. యువత ఉద్యోగాల వైపు పరుగులు పెడుతోందని ప్రభుత్వాలు, సామాజిక సర్వేలు చెప్తున్నాయి. కానీ దీని వెనుక విషాద గాధలు ఎన్నో ఉన్నాయి. కోవిడ్‌తో చితికిపోయిన పేద, మధ్యతరగతి కుటుంబాల దయనీయ కథలున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ చేసిన సర్వే నివేదికలో ఈ విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఏమిటీ సర్వే? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 2000వ సంవత్సరంలో ‘యంగ్‌లైవ్స్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. మన రాష్ట్రంలో ఆ సర్వే బాధ్యతను సెస్ తీసుకుంది. మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లోని కొన్ని మండలాలను ఎంచుకుని.. 6–18 నెలల పిల్లలు 2 వేల మంది (యంగర్ గ్రూప్)ని, 7–8 ఏళ్ల పిల్లలు వెయ్యి మంది (ఓల్డర్ గ్రూప్)ని సర్వే కోసం ఎంపిక చేసింది. వారి జీవితంలో విద్య, పౌష్టికాహారం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం, మానసిక పరివర్తన వంటి అంశాలను ప్రతీ నాలుగేళ్లకోసారి అధ్యయనం చేస్తూ వస్తోంది. తెలంగాణలో 2002లో మొదటి విడత సర్వే చేశారు. తర్వాత 2009, 2013, 2016లో, తాజాగా 2020లో సర్వే చేపట్టారు. సర్వేకు ఎంపికచేసిన వారిలో యంగర్ గ్రూప్ వారు ప్రస్తుతం 22–23 ఏళ్లు, ఓల్డర్ గ్రూప్ వారు 29–30 ఏళ్ల మధ్య ఉన్నారు. పేద, మధ్య తరగతి, ఉన్నత కుటుంబాలు.. అన్ని ఆర్థికస్థాయిలవారూ ఉన్నారు. కోవిడ్ కారణంగా సెస్ ప్రతినిధులు వారందరినీ ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి.. తాజాగా నివేదికను విడుదల చేశారు. కోవిడ్‌తో చితికిన బతుకులు పేద, మధ్యతరగతి వర్గాల బతుకులను కోవిడ్ మహమ్మారి చిదిమేసిందని సెస్ ‘యంగ్ లైవ్స్’ అధ్యయనంలో తేలింది. సర్వే నివేదిక ప్రకారం.. అనియత రంగంలో (రోజువారీ కూలీలు, భవన నిర్మాణ రంగం వంటివి) పనిచేస్తున్న, స్వయం ఉపాధి పొందుతున్న వారి కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. వీరిలో 72 శాతం కుటుంబాల్లో ఇంటికి ఒక్కరైనా ఉద్యోగం కోల్పోయారు. స్వయం ఉపాధి పొందేవారిలో 62 శాతం మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. మొత్తంగా 63 శాతం కుటుంబాల్లో 20–23 ఏళ్ల మధ్య యువత విద్యకు దూరమయ్యారు. 27 శాతం మందికి చదువుపై ఆసక్తి ఉన్నా విధిలేక ఉపాధి/ఉద్యోగం కోసం వెళ్లాల్సి వచ్చింది. భారీగా ఉద్యోగాల్లోకి.. వాస్తవానికి లాక్డౌన్ తర్వాత యంగర్ గ్రూప్ (20–23 ఏళ్ల మధ్యవారు) ఉద్యోగాల్లోకి ఎక్కువగా వచ్చారు. కానీ ఇవేవీ వారి చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలు కాదని సర్వే పేర్కొంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి ఓ చిన్న కంపెనీలో క్లర్క్‌గా కూడా పనిచేస్తున్నాడని తెలిపింది. స్కిల్డ్ పోస్టులు వెతుక్కునే అవకాశం కూడా లేకుండా పోయిందని వెల్లడించింది. సామాజిక అసమానతల దిశగా.. కోవిడ్ కాలంలో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఎవరో ఒకరు ఉద్యోగం పోగొట్టుకోవడమో, ఉపాధి తగ్గడమో, కోవిడ్ వల్ల అప్పుల పాలవడమో, ఎక్కడికీ వెళ్లలేక ఉన్నదంతా అమ్మేసి లేదా పిల్లల చదువులకు దాచిపెట్టింది వాడేసి ఆర్థికంగా చితికిపోవడమో జరిగింది. కోవిడ్ తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చినా.. పేద, మధ్య తరగతి వర్గాలు ఏదో ఒక ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు. దీనివల్ల ఆ కుటుంబాల వారు ఉన్నత చదువులకు దూరమయ్యారు. ఇది సామాజిక అసమానతలకు దారి తీస్తోందని యంగ్ లైవ్స్ సర్వే వెల్లడించింది. 20–23 ఏళ్ల మగ పిల్లలు కుటుంబ పోషణ కోసం చదువు మానేసి ఉద్యోగాల కోసం వెళితే.. ఆడపిల్లలు ఉద్యోగాలు మానేసి, ఇంటిపట్టునే ఉండి అందుబాటులో ఉన్న చదువులను ఆశ్రయిస్తున్నారని సర్వే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే 73 శాతం యువకులు ఉపాధిలో ఉంటే, మహిళలు మాత్రం 36 శాతమే ఉన్నట్టు తెలిపింది. షెడ్యూల్డ్ కులాలపై కోవిడ్ ప్రభావం మరింత ఎక్కువగా కన్పిస్తోందని సర్వే పేర్కొంది. లాక్‌డౌన్‌కు ముందు 46 శాతం మంది ఉపాధి/ఉద్యోగంలో ఉండగా.. అది ఇప్పుడు 62 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇదేస్థాయిలో యువత చదువులకు దూరమైందని పేర్కొంది. తక్షణం మేల్కొనాలి కోవిడ్ ప్రమాద ఘంటికలు పేద, మధ్య తరగతి వర్గాలపై స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయనే సంకేతాలు కన్పిస్తున్నా, వాళ్లంతా ఉన్నత చదువులకు దూరమయ్యారనే వాస్తవాలు గమనించాలి. కోవిడ్ దెబ్బకు చదువుకునే అవకాశాలు సన్నగిల్లి, ఆర్థిక భారంతోనే కుటుంబ పోషణకు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి యువతను వెంటాడుతోంది. ఇది రానురాను ఆర్థిక అసమానతలకు దారి తీస్తుంది. ఈ వర్గాలను ప్రోత్సహించి, ఉన్నత చదువుల వైపు మళ్లించాలి. వారికి ఆర్థిక చేయూతనిచ్చే దిశగా ప్రభుత్వ పథకాలు ఉండాలి. – ప్రొఫెసర్ ఈ.రేవతి, సెస్ డైరెక్టర్ సర్వేలో గుర్తించిన పలు కీలక అంశాలివీ.. 2021 నాటికి పేదరికం స్థాయి గణనీయంగా పెరిగింది. కష్టాల్లో ఉన్న కుటుంబాలు, పేద లేదా నిరాశ్రయులైన కుటుంబాలు కోవిడ్‌కు ముందు 36 శాతంగా ఉంటే.. 2020 ఆగస్టు–అక్టోబర్ నాటికి 52 శాతానికి పెరిగాయి. కోవిడ్ తగ్గినా 2021 డిసెంబర్ నాటికి కూడా 46శాతం కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోనూ నిరుపేదల శాతం పెరిగింది. కోవిడ్ సమయంలో డిజిటల్ విద్యా అందడంలోనూ తారతమ్యాలు కనిపించాయి. ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యంలేని యంగర్ గ్రూప్ యువతలో ప్రతి ఐదుగురిలో ఒకరు అక్టోబర్ 2021 నాటికి చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. స్త్రీపురుష ఉపాధి అంతరం గణనీయంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు 16 శాతంగా ఉన్న వివక్ష.. 2021 డిసెంబర్ నాటికి 36 శాతానికి పెరిగింది. కోవిడ్ సమయంలో వివిధ ఆందోళనలతో యువత మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. 2021 డిసెంబర్ నాటికి 11 శాతం మంది డిప్రెషన్ లక్షణాలతో కనిపించారు. -
తన హత్య కేసును తనే రీ ఓపెన్ చేయించుకున్న ఆత్మ?! ఆ తర్వాత
‘మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?’ సమాధానం దొరకని ప్రశ్న! అయితే ‘ఆత్మ అమరం’ అని నమ్మేవారు అశరీరవాణికి పెద్దపీట వేస్తారు. దెయ్యాలు, పిశాచాలు, సైతాన్లు.. ఇలా కంటికి కనిపించని అతీంద్రియ శక్తులను బలంగా నమ్ముతారు. అలాంటివారి నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ గ్రీన్ బ్రియర్ ఘోస్ట్ మిస్టరీ. ఓ ఆత్మ తన కథను తనే తిరగరాసుకుంది. తన మర్డర్ కేసుని తనే రీ–ఓపెన్ చేయించుకుని.. తనని చంపినవాడికి శిక్షపడేలా చేసింది. నమ్మబుద్ధి కావట్లేదు కదూ! కానీ 18వ శతాబ్దం చివర్లో అమెరికాని వణికించిన ఉదంతం ఇది. 1897.. జనవరి 23.. మిట్ట మధ్యాహ్నం.. వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఓ బాలుడు.. గావుకేకలు పెడుతూ తన తల్లి దగ్గరకు పరుగుతీశాడు. ‘ఎల్వా ఆంటీ.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉందమ్మా’ అని చెప్పాడు రొప్పుతూ. ‘ఏమైందీ’ అంటూ కంగారు పడింది ఆ బాలుడి తల్లి. ‘ఎల్వా ఆంటి భర్త ఎడ్వర్డ్ అంకుల్ లేడూ.. తను మార్కెట్‌కు పోతూ పోతూ.. ఎల్వా ఆంటీకి ఏమైనా కావాలేమో కనుక్కుని రా అంటూ నన్ను వాళ్ల ఇంటికి పంపించాడు. నేను వెళ్లేసరికి ఆమె మాట లేకుండా పడి ఉందమ్మా..’ అంటూ వణుకుతూ వివరించాడు తనకు తెలిసిందీ.. తను చూసిందీ! అది విన్న వెంటనే కొడుకును తీసుకుని డాక్టర్ నాప్ దగ్గరకు పరుగుపెట్టింది ఆ బాలుడి తల్లి. 1896 అక్టోబర్‌లో ఎల్వా జోనా హిస్టర్కీ, ఎరాస్మన్ (ఎడ్వర్డ్) షూతో పెళ్లైంది. ఎడ్వర్డ్ స్థానికంగా కమ్మరి పనిచేసేవాడు. ఇంటికి వెళ్లిన పిల్లాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఎడ్వర్డ్.. కంగారుగా ఇంటికి బయలుదేరాడు. తను ఇంటికి చేరేలోపే అక్కడ డాక్టర్‌తో పాటు చుట్టుపక్కలవాళ్లు గుమిగూడి ఉన్నారు. వారి మధ్యలో అచేతనంగా పడున్న ఎల్వాని చూసి.. నిశ్చేష్టుడైపోయాడు ఎడ్వర్డ్. ఓ పక్క డాక్టర్ ఆమెని చెక్ చేస్తున్నాసరే.. భార్య ముఖాన్ని పట్టుకుని వదిలిపెట్టలేదు ఎడ్వర్డ్. ఏడుస్తూనే ఉన్నాడు. భార్యకు ఎంతో ఇష్టమైన స్కార్ఫ్ అంటూ ఓ స్కార్ఫ్ తెచ్చి ఎల్వా మెడకు చుట్టాడు. నా భార్య విశ్రాంతి తీసుకుంటుందని తల కింద దిళ్లు పెట్టి జోకొట్టాడు. అతని స్థితి చూసిన వాళ్లంతా ‘అయ్యో పాపం’ అంటూ కంటతడిపెట్టారు. ఎల్వా తల దగ్గర భర్త ఎడ్వర్డ్ పడి ఏడుస్తుంటే, డాక్టర్ నాప్.. ఎల్వాను చెక్ చేసి.. ఆమె ప్రాణాలతో లేదని నిర్ధారించాడు. పైగా ఎల్వా గత కొన్ని రోజులుగా తన దగ్గర గైనిక్ సమస్యకు చికిత్స తీసుకుంటుండడంతో .. ఆ సమస్యే తీవ్రమై ఆమె చనిపోయుంటుందని భావించాడతను. అదే విషయాన్ని అందరికీ చెప్పాడు. ఎల్వా తల్లి మేరీ జేన్ హిస్టర్ కూడా అక్కడికి చేరుకుని, కూతురి శవాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. రావాల్సిన వాళ్లు, చూడాల్సిన వాళ్లు ఎవ్వరూ లేరని తేలిన తర్వాత.. మరునాడు జనవరి 24న ఎల్వా మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. అప్పుడే మొదలైంది అసలు కథ.. నెల రోజులు గడవక ముందే ఎల్వా తల్లి మేరీకి వరుసగా నాలుగు రోజుల పాటు ఎల్వా కలలోకి వచ్చింది. తనది సహజమరణం కాదని.. తన భర్త ఎడ్వర్డే తనని బలవంతంగా చంపేశాడంటూ మొరపెట్టుకుంది. మేరీ ఆశ్చర్యపోయింది. ‘సాక్ష్యం లేనిదే కోర్టులో ఎలా నిరూపించగలను?’ అనుకుంటూనే స్థానిక ప్రాసిక్యూటర్ జాన్ ఆల్ఫ్రెడ్‌ని కలిసింది. తన కూతురు కలలోకి వచ్చిందని, కేసును రీ–ఓపెన్ చెయ్యాలని ప్రాధేయపడింది. ఆమె వాదనని మొదట్లో కొట్టిపారేసిన జాన్ .. అనుమానం వచ్చి ఎడ్వర్డ్ ఎలాంటివాడని స్థానికంగా ఆరా తీశాడు. ఎల్వాను నిరంతరం ఎడ్వర్డ్ కొట్టేవాడని, అతడే చంపేసుంటాడనే అనుమానాలు వెలువడ్డాయి. వెంటనే డాక్టర్ నాప్‌ని ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ జాన్ . ‘ఎడ్వర్డ్ ఏడుస్తూ ఉండటంతో.. ఎల్వా డెడ్ బాడీని సరిగా పరీక్షించలేకపోయాను’ అని నాప్ తెలిపాడు. దాంతో.. కేసు రీ–ఓపెన్ అయ్యింది. 1897 ఫిబ్రవరి 22న ఎల్వా బాడీని సమాధి నుంచి బయటికి తీసి.. ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. 1897 మార్చి 9కి రిపోర్టుల్లో ఎల్వాది హత్యేనని తేలింది. మెడ విరిచి చంపినట్లు ఎడ్వర్డ్ వేలిముద్రలు కూడా దొరికాయి. విరిగిన మెడ వాలిపోకుండా ఉండటానికే ఆ రోజు శవం మెడకు స్కార్ఫ్ చుట్టాడని, తల కింద దిండ్లు పెట్టాడని అందరికీ అర్థమైంది. దాంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో ఎడ్వర్డ్ గురించి మరిన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఎడ్వర్డ్‌కి ఎల్వా మొదటి భార్య కాదని.. మూడో భార్యని తెలిసింది. మొదటి భార్య.. ‘ఇలాంటి క్రూరుడితో బతకడం నా వల్ల కాదు’ అని విడాకులు ఇచ్చి వెళ్లిపోగా.. రెండో భార్య అనుమానాస్పద రీతిలో చనిపోయింది. అంటే ఆమెని కూడా ఎడ్వర్డే చంపి ఉంటాడనే ఆరోపణలు బలపడ్డాయి. పైగా ఎడ్వర్డ్.. ఏడు పెళ్లిళ్లు చేసుకోవాలనేది తన కోరికని, అందుకే ఎల్వాను చంపానని, సరైన ఆధారాలు లేవు కాబట్టి.. త్వరలోనే విడుదల అవుతానని తోటి ఖైదీలతో గర్వంగా చెప్పుకునేవాడట. 1897 జూన్ 22న కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎల్వా ఆత్మకి సంబంధించి చర్చ వచ్చినప్పుడు.. ‘కోర్టు ముందు ఆత్మల ప్రస్తావన వద్దని.. రిపోర్టులు, ఆధారాలతోనే ముందుకు వెళ్దామని’ జడ్జ్ అడ్డుపడటంతో కేసులో ఆత్మ ప్రస్తావన లేకుండాపోయింది. మొత్తానికీ ఎల్వాని ఉద్దేశపూర్వకంగానే ఎడ్వర్డ్ హత్య చేసినట్లు జూలై 11న తీర్పు రావడంతో ఎడ్వర్డ్‌కి జీవిత ఖైదు పడింది. ఓ అమాయకురాల్ని పొట్టనపెట్టుకున్నాడని, అతడ్ని తామే చంపుతామని చాలామంది ఎల్వా సానుభూతిపరులు.. జైలుపై దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎడ్వర్డ్ తప్పించుకున్నాడు. కానీ తర్వాత మూడేళ్లకే అంటే 1900 మార్చి 13న వెస్ట్ వర్జీనియా, మౌండ్స్ విల్లేలోని స్టేట్ పెనిటెన్షియరీలో ఎడ్వర్డ్ చనిపోయాడు. అయితే అది సహజ మరణం కాదు. తెలియని ఏదో వ్యాధి సోకి, చిత్రవధ అనుభవిస్తూ చనిపోయాడు. ఎల్వా ఆత్మే అతడిని చంపిందని అంతా అనుకున్నారు. ఆ వ్యాధి ఎవరికీ సోకే ప్రమాదం లేకుండా.. స్థానిక శ్మశాన వాటికలో అతనిని ఖననం చేశారు. ఎల్వా సమాధి దగ్గర.. వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ఓ చారిత్రక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసింది. దానిపై ఇలా ఉంటుంది.. ‘ఎల్వా ఆత్మ.. తన తల్లి కలలోకి వచ్చి.. తనది సహజ మరణం కాదని చెప్పింది. ఆమె భర్తే ఆమెని హత్య చేసినట్లు తేలింది. ఒక ఆత్మ సాయంతో ఓ హత్య కేసు పరిష్కరించడం ఇదే మొదటిసారి’ అని. మొత్తానికీ ఈ కథ చరిత్రలో ఓ ఊహించని మిస్టరీగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
Russia Ghost Ship: నిజమే.. ఇది ఓడ కాదు ప్రాణాలు తీసే దెయ్యం! భయంలేని కెప్టెన్ కూడా..
అది సముద్రంపై సాగే సుదూరప్రయాణం. అలల ఉధృతిలో మొదలైన అంతుపట్టని రహస్యం. వింత ఆకారాలు, పిచ్చి చేష్టలతో అనుక్షణం భయానకం. రోజుకో ఆత్మహత్యతో మోగిన మరణమృదంగం.. ఇదే ‘ఇవాన్ వాసిలీ షిప్’ వణుకుపుట్టించే చరిత్ర. ఇది ఓడ కాదు ప్రాణాలు తీసే దెయ్యం. నిజమే, హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఘోస్ట్ షిప్ గురించి చరిత్ర కథలు కథలుగా చెబుతోంది. అందంగా, ఆకర్షణీయంగా 1897లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో.. తయారుచేసిన ఇవాన్ వాసిలీ అనే నౌక.. చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. ఇది బాల్టిక్ సముద్రం నుంచి ఫిన్లాండ్ గల్ఫ్ వరకూ సరుకులను మోసుకెళ్లేది. గంటకు 8 నాటికల్ మైళ్ల వేగంతో నడిచే ఈ నౌక.. బొగ్గు సాయంతో 4వేల కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించేది. జోరుగా కదిలే సముద్ర కెరటాల ధాటికి తట్టుకుని ఆరేళ్ల పాటు సరుకులు రవాణా చేస్తూ ఏ సమస్య లేకుండా నడిచింది. 1903లో రష్యా–జపాన్ యుద్ధం మొదలైంది. దాంతో అత్యవసర పరిస్థితుల్లో రాత్రికి రాత్రి.. వాసిలీలో సాధారణ సరుకుల్ని తొలగించి.. యుద్ధ సామగ్రిని నింపారు అధికారులు. వ్లాదివోస్తోక్లో ఉన్న రష్యా యుద్ధ నౌకలకు యుద్ధ సామగ్రిని అందించేందుకు వాసిలీని రంగంలోకి దింపారు. నాటి నుంచే మొదలైంది అసలైన సమస్య. రాత్రివేళల్లో ఓడలోని సిబ్బందిని ఏవేవో పీడకలలు భయపెట్టేవి. నౌక బంకర్లలో బొగ్గు అయిపోయిందని యుద్ధ ఆదేశాల ప్రకారం వాసిలీ.. నార్త్ సీ నుంచి అట్లాంటిక్‌కు, ఆఫ్రికాలోని వెస్ట్ కోస్ట్‌కు.. అటు నుంచి కేప్‌టౌన్‌కు.. అక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలో ఉన్న జాంజిబార్కు వెళ్లింది. అప్పటికి నౌక బంకర్లలో బొగ్గు అయిపోయిందని గమనించిన సిబ్బంది వెంటనే బొగ్గు నింపారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం వైపు కదిలింది నౌక. అయితే ఉన్నట్టుండి అందులో ప్రయాణిస్తున్న వారికి ఓ అనుమానం వచ్చింది. ఆ నౌక బొగ్గుతో కాకుండా ఏదో అసాధారణ శక్తితో నడుస్తోందని. ఆ అనుమానం వాళ్లను కుదురుగా ఉండనివ్వలేదు. వారికి వింత అనుభవాలు చీకటిపడితే చాలు.. నౌకలోని వారంతా ఎవరో తమని గమనిస్తున్నట్లు భయపడేవారు. కళ్లకు కనిపించని శక్తి ఏదో వేగంగా తమ దగ్గరకు వచ్చినట్లు.. ఆ సమయంలో మంచు కొండ పక్కనే ఉన్నట్లుగా చలిపెడుతున్నట్లు ఫీలయ్యేవారు. ఇలా కొన్ని రోజులు నౌకలోని వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు నౌక డెక్ దగ్గర్లో ఉన్న వారికి ఏదో వింత ఆకారం కనిపించింది. అది చూడటానికి మనిషిలాగే ఉంది కానీ ధగధగా మెరిసిపోతుంది. క్షణాల్లో అది డెక్ అంతటా తిరిగి లైఫ్ బోట్ వెనక్కి వెళ్లి కనిపించకుండా మాయమైపోయింది. దాంతో వారి భయం రెట్టింపు అయ్యింది. ఇంతలో నౌక చైనాలోని పోర్ట్ అర్థర్ మిలిటరీ బేస్ చేరింది. అక్కడ నౌకలో సామాగ్రి ఎక్కించుకుని, ప్రయాణం కొనసాగించారు. నాటి నుంచే మొదలైంది మరణమృదంగం. ఆ రాత్రి ఓడలోని వాళ్లంతా ఉన్నట్టుండి, పిచ్చి పట్టినట్లు ఒకరిని ఒకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొంతసేపు కొట్టుకున్నాక.. వాళ్లలో ఒకడైన అలెక్ గోవిన్స్కీ అనే వ్యక్తి.. తనకు తానుగా సముద్రంలో దూకి చనిపోయాడు. నౌకను వదిలి పరుగుతీశారు అది చూసిన మిగిలినవారంతా కళ్లు తిరిగి పడిపోయారు. లేచి చూసేసరికి వ్లాదివోస్తోక్ వైపు ప్రశాంతంగా ప్రయణిస్తోంది ఆ నౌక. రెండురోజుల తర్వాత వారంతా మళ్లీ అరవడం, కొట్టుకోవడం, వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కాసేపటికి అంతా కళ్లు తిరిగి పడిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత లేచి చూస్తే వారిలో మరో వ్యక్తి మిస్సయ్యాడు. అదే రోజు నౌక వ్లాదివోస్తోక్ చేరింది. అప్పటి దాకా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్న నౌకలోని సిబ్బంది నౌకను వదిలి పరుగుతీశారు. కానీ ఆ పోర్టులో సెక్యూరిటీ రూల్స్ పేరుతో వాళ్లను బయటికి పోనీలేదు. వణుకుతున్న ప్రతి వ్యక్తికి స్వాగతం పలికింది వాసిలీ. అందరినీ తీసుకుని హాంకాంగ్ వైపు కదిలింది. ఆ రాత్రి మళ్లీ పీడకలలు మొదలయ్యాయి. అరవడం, కొట్టుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం.. ఒకరు మిస్ అవ్వడం.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఏం జరుగుతుందోనన్న భయంతో ఒక సిబ్బంది గుండె ఆగిపోయింది. నౌక హాంకాంగ్ చేరుకునే సరికి కెప్టెన్ స్వెన్ ఆండ్రిస్ట్ సముద్రంలో దూకి చనిపోయాడు. చివరికి ఓ రాత్రి హాన్సెన్ కూడా దాంతో దెయ్యాలంటే భయం లేని క్రైస్ట్ హాన్సెన్ అనే సెకండ్ ఆఫీసర్ని కెప్టెన్‌గా నియమించారు పైఅధికారులు. పారిపోయిన వారిని పారిపోనిచ్చి.. కొత్త సిబ్బందితో కెప్టెన్ హాన్సెన్ ప్రయాణం సాగించారు. చివరికి ఓ రాత్రి హాన్సెన్ తన రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. నౌక సిడ్నీ చేరగానే కొత్త సిబ్బంది కూడా పారిపోయారు. ఆ బోట్లో మొదటి నుంచి ఉన్న మరో ధైర్యవంతుడు బోట్స్ వాయన్ హారీ నెల్సన్ మాత్రం పారిపోలేదు. మరో కెప్టెన్‌ను వెతికే పనిలో పడ్డాడు. కెప్టెన్ దొరక్క 4 నెలల వరకూ నౌక సిడ్నీలోనే ఉండిపోయింది. నాలుగు నెలలకి కొత్త కెప్టెన్ సారథ్యంలో నౌక సిడ్నీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరింది. మళ్లీ మరణమృదంగం మోగింది. ఇదేదో తేడాగా ఉందనుకున్న నెల్సన్.. నౌక ప్రయాణాన్ని మధ్యలో ఆపేసి తిరిగి రష్యాలోని వ్లాదివోస్తోక్కి నౌకను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నౌక ఆ నగరాన్ని చేరగానే నెల్సన్ సహా అంతా ఆ నౌక నుంచి బయటపడ్డారు. మళ్లీ దాన్లోకి ఎవ్వరూ ఎక్కలేదు. కొన్నినెలల పాటు అది అక్కడే ఉండిపోయింది. ఆ నౌక అలా ఉండటం ఎప్పటికైనా ప్రమాదకరమని భావించిన కొందరు ఔత్సాహికులు 1907లో దానికి నిప్పు అంటించారు. కాలి బూడిదై సముద్రంలో మునిగిపోయింది. అయితే మునిగే సమయంలో ఓ భయంకరమైన ఏడుపును విన్నామని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ నౌకలో ఇలా ఎందుకు జరిగింది? నిజంగానే ఇదంతా జరిగిందా? అనేదానికి పూర్తి ఆధారాలు లేవు. ఆ మిస్టరీ ఏంటో నేటికీ తేలలేదు. -సంహిత నిమ్మన -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో సంచలన విషయాలు..!
-
కథువా కేసు.. విస్మయపరిచే కోణం
శ్రీనగర్: సంచలనం సృష్టించిన కథువా హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాంజి రామ్ ఎట్టకేలకు నోరు మెదిపాడు. విచారణలో పోలీసులకు అతను దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడించాడు. కుమారుడిని రక్షించుకునేందుకు ఆ బాలికను చంపినట్లు సాంజి రామ్ తెలిపాడు. హిందూ ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతం నుంచి నోమాదిక్ గుజ్జర్, బకర్వాల్ తెగలను తరిమికొట్టాలన్న ఉద్దేశంతోనే తాము ఈ ఘటనకు పాల్పడినట్లు సాంజి రామ్ వివరించాడు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... జనవరి 7వ తేదీ నుంచే బాలిక కిడ్నాప్ కోసం సాంజి రామ్ ప్రణాళిక అమలు చేశాడు. జనవరి 10న మత్తుమందు ఇచ్చి బాలికను అపహరించి ఆలయానికి తరలించారు. అదే రోజు సాంజిరామ్ మేనల్లుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే లైంగిక దాడి జరిగిన విషయం 13వ తేదీన తనకు తెలిసిందని సాంజిరామ్ వివరించాడు. తన కుమారుడితోపాటు అల్లుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని.. వారిని రక్షించుకునేందుకే ఆ బాలికను చంపేసినట్లు సాంజి రామ్ దర్యాప్తు బృందానికి చెప్పారు. జనవరి 13 అర్ధరాత్రి విశాల్(సాంజిరామ్ కొడుకు), అతని స్నేహితుడు పర్వేశ్ కుమార్(మన్ను).. ఆలయం నుంచి బాలికను బయటకు తీసుకొచ్చారు. చంపేముందు మరోసారి అత్యాచారం చేస్తానని పోలీసాధికారి దీపక్ ఖజూరియా నిందితులతో చెప్పాడు. కానీ, పరిస్థితులు సహకరించకపోవటంతో బాలికను తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు అంటే.. జనవరి 14న బాలికను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత బాలిక మృతదేహాన్ని హీరానగర్ కాలువ వద్ద పడేయాలని పథకం రచించారు. విశాల్, ఖజూరియా, పర్వేశ్ కుమార్, మైనర్ బాలుడు అంతా కలిసి బాలిక మృతదేహాన్ని ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. రామ్ బయట కాపలాకాశాడు. చివరకు కారు దొరక్కపోవటంతో జనవరి 15వ తేదీ మధ్యాహ్నం విశాల్, సాంజిరామ్ మేనల్లుడు కలిసి సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృత దేహాన్ని పడేసి వచ్చారు. అయితే సాంజిరామ్ స్టేట్మెంట్పై స్పందించేందుకు అతని తరపు న్యాయవాది నిరాకరించారు. ఛార్జీ షీట్ వివరాలు... మైనర్ బాలుడితోపాటు, సాంజిరామ్, అతని తనయుడు విశాల్, సాంజిరామ్ అల్లుడు, పోలీస్ అధికారులు ఖజూరియా, సురేందర్ వర్మ, పర్వేశ్ కుమార్ పేర్లతో ఛార్జీషీట్ దాఖలు చేశారు. సాంజిరామ్‌పై హత్య, అపహరణ, ఆధారాలను మాయం చేయటం.. పర్వేశ్ కుమార్(మన్ను)పై అపహరణ కింద కేసు నమోదు చేశారు. సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు తీసుకుని ఆధారాలు మాయం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తాల పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. జనవరి 17న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు జనవరి 23న కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయగా.. సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ 8 మందిని అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు జోక్యంతో ఏప్రిల్ 16న కేసులో విచారణ ప్రారంభం.. తదుపరి విచారణ ఏప్రిల్ 28కి వాయిదా. ఈ కేసు విచారణ జమ్ము కశ్మీర్ కోర్టులో చేయవద్దని.. ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని దిగువ న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. -
‘షాకింగ్’ డెత్స్!
లక్ష్మమ్మ బాట వెంట నడుస్తూ వెళుతోంది.. రాజయ్య ట్రాన్స్ఫార్మర్ ఎక్కి తీగలు సరిచేస్తున్నాడు.. నరేశ్ ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్నాడు.. వెంకన్న కరెంటు తీగలకు కొండీలు వేస్తున్నాడు.. అంతా మామూలే. కానీ.. తెగిపడిన కరెంటు తీగ లక్ష్మమ్మ కాలికి తగిలింది.. రాజయ్య ఎక్కిన ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా అయింది.. నరేశ్ సెల్‌ఫోన్ చార్జర్ పేలింది.. వెంకన్న వేసిన కొండీలు తగిలి షార్ట్ సర్క్యూట్ అయింది.. అంతా విషాదమే. ...రాష్ట్రంలో ఇలా రోజుకు ఇద్దరు కరెంటు కాటుకు బలవుతున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం, వైఫల్యాలకు తోడు గ్రామీణ ప్రజల అజాగ్రత్త, అవగాహనా లోపం కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదికేడాది పెరిగిపోతూనే ఉన్నాయి. గత మూడేళ్లలో ఏటా ఐదారు వందల మంది విద్యుదాఘాతాలకు బలైపోయారు. 2016–17లో అత్యధికంగా 678 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) తొలి ఆరునెలల్లో 303 మంది మరణించారు. 2016–17లో మరణించినవారి సంఖ్య 678 11 కేవీ ఏబీ స్విచ్‌ల కారణంగా బలైనవారి సంఖ్య 43 విద్యుత్ శాఖ వైఫల్యాలతోనే మరణించినవారు 45 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా విద్యుత్ మరణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే ఎన్పీడీసీఎల్ పరిధిలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోపాటు వినియోగదారుల అవగాహనా రాహిత్యం, అజాగ్రత్తల కారణంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. డిస్కంలు ఇటీవల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికల్లో విద్యుత్ ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన గణాంకాలను పొందుపరిచాయి. రాష్ట్రంలో దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) ఉండగా.. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో మాత్రం మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మెదక్ జిల్లా పరిధిలో అత్యధికంగా 101 మంది మృత్యువాత పడగా, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా సగటున రోజుకు ఇద్దరు విద్యుత్ షాక్ కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. శాఖాపర లోపాలు.. ప్రజలకు శాపాలు విద్యుత్ ప్రమాద మరణాల్లో దాదాపు సగానికిపైగా ఆ శాఖాపరమైన లోపాల కారణంగానే సంభవిస్తున్నాయి. విద్యుత్ సరఫరా పరికరాలు విఫలం కావడం, తగిన నిర్వహణ లేకపోవడం, విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుండటం, తెగిపడటం, ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకపోవడం, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు చెట్ల కొమ్మలు తగలడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ‘కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ)’జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం... డిస్కంలు ఏటా విద్యుత్ మరణాలకు కారణాలపై విశ్లేషణ జరిపి ఈఆర్సీకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఎన్పీడీసీఎల్ మాత్రమే 2016–17కి సంబంధించిన మరణాలపై విశ్లేషణ జరిపి నివేదికలో నమోదు చేసింది. దాని ప్రకారం ఆ ఏడాది సంస్థ పరిధిలో 276 మంది విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. అందులో 124 మంది (45 శాతం) శాఖాపర కారణాలతో, మరో 152 మంది (55 శాతం) వినియోగదారుల అజాగ్రత్తతో మృతి చెందారు. యమపాశం ఏబీ స్విచ్! ట్రాన్స్ఫార్మర్ల వద్ద విద్యుత్ సరఫరాను నిలిపేయడానికి, తిరిగి సరఫరా ప్రారంభించడానికి 11 కేవీ ఎయిర్ బ్రేక్ (ఏబీ) స్విచ్ కేబుల్ ఇన్సులేటర్ పరికరాన్ని వినియోగిస్తారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో గతేడాది ఈ ఏబీ స్విచ్ విఫలం కావడం వల్లే ఏకంగా 43 మంది బలయ్యారు. ఇక హెచ్‌టీ, ఎల్టీ విద్యుత్ తీగలు తెగిపడటం కారణంగా మరో 36 మంది మరణించారు. 11 కేవీ, 6.6 కేవీ (సింగిల్ ఫేజ్) జంపర్లు విఫలమవడంతో 12 మంది మృతి చెందారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ గండం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా విద్యుత్ ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.ఎస్పీడీసీఎల్ పరిధిలో 2016–17లో 320 మంది కరెంట్‌షాక్‌తో మృత్యువాత పడగా.. అందులో 28 మంది ఔట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులు, ఒకరు రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగి ఉండడం గమనార్హం. తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. ⇒ఎన్పీడీసీఎల్ గణాంకాల ప్రకారం.. వినియోగదారుల పొరపాట్లు, అజాగ్రత్తల కారణంగా జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 276 మంది మరణించారు. ⇒విద్యుత్ సర్వీసు వైరుకు ఆధారంగా వినియోగించే గాల్వనైజ్డ్ ఐరన్ (జీఐ) తీగల కారణంగా అత్యధికంగా 37 మంది మృతి చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరైన అవగాహన లేక జీఐ తీగల మీద బట్టలు ఆరేస్తున్నారని, దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ⇒పొలాల్లో బోర్లు/మోటార్ల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 35 మంది బలయ్యారు. ⇒విద్యుత్ సరఫరా చేసే సర్వీస్ వైర్ల చుట్టూ ఉండే ఇన్సులేషన్ (ప్లాస్టిక్ కవచం) దెబ్బతినడంతో జరిగిన ప్రమాదాల్లో 31 మంది మరణించారు. ⇒ఇళ్లలో విద్యుత్ పరికరాల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మరో 28 మరణించారు. ఇందులో పలువురు సెల్‌ఫోన్ చార్జర్లు పేలడం కారణంగా మృతి చెందారు. ⇒అనధికారికంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడం వంటివాటి కారణంగా 17 మంది మృత్యువాత పడ్డారు. వినియోగదారుల నిర్లక్ష్యంతోనే.. వినియోగదారుల నిర్లక్ష్యం, అజాగ్రత్తతోనే అధిక విద్యుత్ ప్రమాదాలు, మరణాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలనే తొందరపాటుతో కొంతమంది స్థానికులు ట్రాన్స్ఫార్మర్ల వద్ద స్వయంగా మరమ్మతులు చేస్తున్నారు. కానీ విద్యుత్ సరఫరాను నిలిపేసేందుకు ఏబీ స్విచ్‌లను సరిగా ఆపరేట్ చేయలేక ప్రమాదాల బారినపడుతున్నారు. విద్యుత్ సిబ్బంది వచ్చే వరకు ఆగకుండా స్వయంగా మరమ్మతులు చేస్తుండటంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో కూడా కొన్నిచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే కొందరు నేరుగా విద్యుత్ తీగలకు కొండీలు వేసి.. దొంగతనంగా విద్యుత్ వాడుకుంటున్నారు. అలా వేసిన కొండీల వద్ద మిరుగులు (స్పార్క్స్) వచ్చి విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. – ఎ.గోపాల్‌రావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ షాకింగ్ డెత్స్..