simultaneous polls
-
జమిలి ఎన్నికలకు మోదీ సిద్ధమేనా!
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో (జమిలి) ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి ప్రజల ముందుకు ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా బుధవారం నాడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వద్ద చేసే ప్రసంగంలో ప్రధానంగా ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎంతో ఖర్చు కలసి వస్తుందని, ఎన్నికల ప్రచారం, బడానాయకుల ప్రచారం కారణంగా కలిగే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని, ఎన్నికల కోడ్ కూడా దేశమంతా ఒకేసారి మొదలైన ఒకేసారి ముగుస్తుంది కనుక ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు అంతరాయం ఉండదని, మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా అనుకుంటారు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో జమిలి ఎన్నికలు లాభమా, నష్టమా అన్న అంశాన్ని పక్కన పెడితే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు కనుక, వచ్చే మే నెలలో జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలను ఫిబ్రవరికి, ఈ ఏడాది డిసెంబర్, వచ్చే జనవరిలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరికి లాక్కెల్తే పార్లమెంట్‌తోపాటు 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించవచ్చు. అలా జరగాలంటే రాష్ట్రాల ప్రభుత్వాలకు నచ్చచెప్పి ముందుగానే అసెంబ్లీలను రద్దు చేయడం లేదా గవర్నర్ పాలన విధించడం ద్వారా పార్లమెంట్ ఎన్నికలతో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించవచ్చు. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ‘సీ ఓటర్’ సర్వే స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకే సిద్ధమవుతోంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మిగతా రాష్ట్రాలపై, పార్లమెంట్ ఎన్నికలపై పడకూడదన్నదే వ్యూహం అవుతుంది. లా కమిషన్ కూడా జమిలి ఎన్నికలకే ఓటేసింది. కానీ ఈ ఎన్నికల వల్ల డెమోక్రసీకి సంబంధించి పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాలేదంటే ఆయా పార్టీల ప్రభుత్వాలు ప్రజలకు ఇష్టం లేదన్న మాట. అయితే ఎన్నికల్లో ఓ అసెంబ్లీలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. జమిలీ ఎన్నికల్లో అలా కుదరదు కనుక, బేర సారాల ద్వారా ఏదో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రభుత్వం మధ్యలో పడిపోతే మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు గవర్నర్ పాలన విధించాల్సి ఉంటుంది. మధ్యంతర ఎన్నికలను అనుమతిస్తే అప్పుడు ఎన్నికయ్యే ప్రభుత్వం పార్లమెంట్ కాలం వరకే మనుగడలో ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలకు విరుద్ధమే! -
జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ మద్ధతు
-
జమిలి ఎన్నికలపై టీడీపీ ద్వంద్వ వైఖరి
-
జమిలి ఎన్నికలపై టీడీపీ ద్వంద్వ వైఖరి
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల విషయమై టీడీపీ ఎంపీలు తోట నరసింహం, కనకమేడల రవీంద్రకుమార్ ఆదివారం లా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై టీడీపీ ప్రతినిధులు ద్వంద్వ వాదనలు వినిపించారు. జమీలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కావని వారు పేర్కొన్నారు. అదే సమయంలో 2019లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటే అందుకు సిద్ధమే కానీ.. జమిలి ఎన్నికల పేరిట ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామంటే వ్యతిరేకిస్తామని తెలిపారు. లోక్‌సభను ముందస్తుగా రద్దుచేసి ఎన్నికలు నిర్వహించినా.. తాము మాత్రం రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయబోమని, అసెంబ్లీ ఐదేళ్లకాలం కొనసాగుతుందని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.. వారు ఏమన్నారంటే.. జమిలి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయ కమిషన్‌కు స్పష్టం చేశాం. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చునని, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకోవచ్చునని లా కమిషన్ పేర్కొంది. ఈ విషయంపై మా అభిప్రాయాలను కోరింది. అయితే, జమిలి ఎన్నికల ద్వారా ఈ లక్ష్యాలు నెరవేరవు. పైగా రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని మేం స్పష్టం చేశాం. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావాలని కేంద్రం భావిస్తే.. ఎన్నికలు ఎదుర్కొనేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉంది. కానీ శాసనసభ ఎన్నికలకు మేం సిద్ధంగా లేము. ప్రజలు మాకు ఐదేళ్ల కాలానికి అధికారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతమున్న ఇబ్బందికర పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మేం వ్యతిరేకం. జమిలి ఎన్నికల అంశం ఇప్పుడు చర్చకు తీసుకురావడం ద్వారా కేంద్రం రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోంది. ఒకసారి ఎన్నికలు జరిగిన తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ జరిపే మధ్యంతర ఎన్నికలు కేవలం పరిమిత కాలానికే నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ విధానం ద్వారా ప్రాంతీయ పార్టీలను మరింత ఇబ్బందిపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం కూడా కేంద్రం ఉద్దేశమని టీడీపీ భావిస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే టాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుందని కూడా లా కమిషన్‌కు వివరించాం. ఎన్నికల్లో వినియోగించే అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్ యంత్రాలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కూడా వారికి సూచించాం. -
జమిలి ఎన్నికలు వృధా ప్రయాసే..
సాక్షి, చెన్నై : జమిలి ఎన్నికల ప్రతిపాదనను డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదన పూర్తిగా దుస్సాహసమని ఆయన అభివర్ణించారు. గతంలో ఎన్డీఏ హయాంలోనే జమిలి ఎన్నికల ప్రతిపాదనను పక్కనపెట్టినందున మళ్లీ దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించడం వృధా ప్రయాస అన్నారు. ఏకకాల ఎన్నికలు పాత సూచనేనని, దీన్ని గతంలో పూర్తిగా తిరస్కరించారని చెప్పుకొచ్చారు. ఏకకాల ఎన్నికలతో సమయం, డబ్బు ఆదా అవుతాయని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురుకాబోవని నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చ చేపడుతున్న విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలు ఏమాత్రం మేలు చేయబోవని స్పష్టం చేస్తూ స్టాలిన్ తమ పార్టీ తరపున లా కమిషన్‌కు లేఖ రాశారు. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు లా కమిషన్ లేఖ రాసింది. లా కమిషన్ ప్రచురించిన వర్కింగ్ పేపర్లో కొన్ని అంశాలు రాజ్యాంగం నిర్ధేశించిన సమాఖ్య స్ఫూర్తికి భంగకరంగా ఉన్నాయని ఈ సందర్భంగా స్టాలిన్ లా కమిషన్‌కు రాసిన లేఖలో నివేదించారు. ఈ క్రమంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టడం సంక్లిష్టమవుతుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. -
జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ సై
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాజకీయంగా ఇటీవల వినిపిస్తున్న అంశం జమిలి ఎన్నికలు. ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఈ నెల 7, 8వ తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావల్సిందిగా దేశంలో ముఖ్య రాజకీయ పార్టీలను లా కమిషన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ లా కమిషన్‌కు లేఖ రాశారు. లా కమిషన్ ఎదుట ఇదే అభిప్రాయాన్ని చెబుతామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ వెల్లడించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా చేయవచ్చునని, అయితే ఇది ముందస్తు ఎన్నికలకు సంకేతం మాత్రం కాదని వివరించారు. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని ఇటీవల ప్రకటించారు. బీజేపీ పాలిత మహారాష్ట్ర, హర్యానా శాసనసభల పదవీ కాలం 2019 చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు విడతలుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసి సవరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం లా కమిషన్ సభ్యులతో సమావేశమే టీఆర్ఎస్ ఏకకాల ఎన్నికలకు (అసెంబ్లీ, లోక్‌సభ) సిద్ధమని ప్రకటించనున్నారు. ‘లోక్‌సభకు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ సమయమంతా జిల్లా రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉంటుంది. లోక్ సభ, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల విలువైన సమయం వృథా. సుదీర్ఘమైన ఎన్నికల నియమావళితో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రాజకీయ పార్టీలు, అభ్యర్థులు భారీగా ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. జమిలి ఎన్నికలకు మా పార్టీ మద్దతు ఇస్తుందని’ లా కమిషన్‌కు కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటిది కాదు : వినోద్ దేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలపై మా అధినేత, సిఎం కేసీఆర్ లేఖ ను లా కమిషన్ కు అందించా. ఒకేసారి ఎన్నికలకు మేం మద్దతు తెలుపుతున్నాం. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటిది కాదు. తొలిసారి 1983లోనే దేశ వ్యాప్తంగా ఎన్నికలపై చర్చ మొదలైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వమో, లేక బీజేపీనో ఈ చర్చను ప్రారంభించలేదు. రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధినే లక్ష్యంగా మా అధినేత దేశ వ్యాప్తంగా ఎన్నికలకు మద్దతు తెలుపుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపైనే దృష్టి ఉంటుంది. మోదీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. దీంతో చాలా ధనం, సమయం వృధా అవుతుంది. 2019 లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలతో నష్టం ఉండదు. అయినా మిగతా రాష్ట్రాల కు జరుగుతున్న నష్టాన్ని దృష్టి లో పెట్టుకొని మా అభిప్రాయాలను తెలిపాం. ముందుస్తు ఎన్నికలపై చర్చ అని కొందరు అర్థం లేని వాదనకు తెరలేపారు. కేవలం ఒకేసారి దేశ వ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతుందని ఎంపీ వినోద్ వివరించారు. -
జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాలు
-
జమిలి ఎన్నికలు.. వివిధ పార్టీల అభిప్రాయం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రంలోని లోక్‌సభకు, రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రాతిపదనపై లా కమిషన్ శనివారం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మెజారిటీ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యపడబోవని అభిప్రాయపడ్డాయి. లా కమిషన్‌తో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, గోవా ఫార్వర్డ్ పార్టీల నేతలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి విఘాతమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు సాధ్యం కావు అని, రాజ్యాంగపరంగా ఇది వీలు కాదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బేనర్జీ అభిప్రాయపడ్డారు. జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఇక, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే జమిలి ఎన్నికలపై ఒకింత భిన్నంగా స్పందించింది. జమిలి ఎన్నికలు 2019లో సాధ్యం కావని, అదే 2024లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. అందుకు తాము సిద్ధమని పేర్కొంది. -
‘జమిలి’పై చర్చకు కాంగ్రెస్‌కు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏకకాలంలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై దేశంలో ముఖ్య పార్టీ నేతలతో చర్చించేందుకు పలు పార్టీలకు లా కమిషన్ ఆహ్వానం పంపింది. జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఈ నెల 7,8 తేదీల్లో ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరుకావల్సిందిగా దేశంలో ముఖ్య రాజకీయ పార్టీలను లా కమిషన్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని పలు రాజకీయ పార్టీ ఆహ్వానించగా, కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సమావేశానికి హాజరుకావల్సిందిగా లా కమిషన్ కోరిందని, తమ పార్టీ నుంచి ఎవ్వరు హాజరు కావట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తమ మద్దతు ఉంటుందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 2019లో అసెంబ్లీ, లోక్‌సభ ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ పాలిత మహారాష్ట్ర, హర్యానా శాసనసభల పదవీ కాలం 2019 చివరిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు విడతలుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ముందస్తుగా రద్దు చేయుటకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది. -
‘ఏకకాలంలో ఎన్నికలు సరైనవే’
భువనేశ్వర్ : పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై గత కొంత కాలంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య చర్చలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీజూ జనతాదళ్ అధినేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తన మద్దతు తెలిపారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ మంచి నిర్ణయమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి తప్పనిసరని, ప్రజలకు సేవ చేయడానికే తాము ఎన్నికయ్యామని పేర్కొన్నారు. ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధికి ఆటకం కలుగుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై చర్చించేందుకు జాలై ఏడున ఢిల్లీ రావాల్సిందిగా సీఎం నవీన్ పట్నాయక్‌ను లా కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్ ఆహ్వానించారు. ఒడిషాలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు 2019లో ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. లా కమిషన్ ఆహ్వానం మేరకు బీజేడీ ఎంపీ పింకీ మిశ్రా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు బీజేడీ వర్గాలు వెల్లడించాయి. -
జమిలి ఎన్నికలపై సర్వేలో సానుకూలం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రతిపాదనకు లా కమిషన్ గ్రీన్‌సిగ్నల్ లభించిన నేపథ్యంలో జమిలి ఎన్నికలపై నిర్వహించిన సర్వేలో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైంది. లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 84 శాతం మంది జమిలి ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జమిలి ఎన్నికలపై ఈ సందర్భంగా పలు సందేహాలను వారు వ్యక్తపరచడం గమనార్హం. జమిలి ఎన్నికలను సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 13 శాతం మంది వ్యతిరేకించారని లోకల్‌సర్కిల్స్ పేర్కొంది. జమిలి ఎన్నికలతో సమయం, ఖర్చు ఆదా అవడంతో పాటు అభివృద్ధి, పాలనపై ప్రభుత్వాలు దృష్టిసారించేందుకు వెసులుబాటు ఉంటుందని సర్వేలో పాల్గొన్నవారిలో 93 శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. అయితే పటిష్ట ప్రచార నైపుణ్యాలు కలిగిన పార్టీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అధికార కేంద్రీకరణకు దారితీయడంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాన్ని కుదించివేస్తుందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కాగా, 2019 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించవచ్చని లా కమిషన్ సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లా కమిషన్ వెల్లడించిన కార్యనిర్వాహక పత్రం ప్రకారం మలివిడత జమిలి ఎన్నికలు 2024లో నిర్వహించవచ్చని పేర్కొంది. అయితే దీనికి అనుగుణంగా రాజ్యాంగంలో కనీసం రెండు నిబంధనలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. -
జమిలి ఎన్నికలకు రెడీ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువైన వాతావరణం ఏర్పాటుకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ పక్షాలను కోరారు. భాగస్వామ్య పక్షాల నేతలతో సమావేశమైన సందర్భంగా ప్రధాని ఈ మేరకు నేతలను కోరారని ఎన్డీఏ వర్గాలు పేర్కొన్నాయి. భేటీ సందర్భంగా దావోస్ వేదికపై ప్రధాని మోదీ స్ఫూర్తివంతంగా ప్రసంగించారని కొనియాడుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇక జమిలి ఎన్నికలపై చర్చలు చేపడుతూ ఇందుకు అనువైన వాతావరణాన్ని తీసుకురావాలని ప్రధాని కోరినట్టు ఈ సమావేశానికి హాజరైన ఓ నేత వెల్లడించారు. తరచూ ఎన్నికలు ఎదురవుతుండటంతో అభివృద్ధికి ఆటంకమే కాకుండా భారీ వ్యయం వెచ్చించాల్సి వస్తోందని ఏకకాల ఎన్నికలే దీనికి పరిష్కారమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారని ఆయన వివరించారు. పార్లమెంట్ సమావేశాలతో పాటు ఆయా పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు సభ్యులు విధిగా హాజరుకావాలని ప్రధాని కోరారని చెప్పారు. -
2024 నుంచి జమిలి ఎన్నికలు
- కార్యాచరణ నివేదికలో నీతిఆయోగ్ సూచన న్యూఢిల్లీః లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే వాదన మరింత బలపడుతోంది. 2024 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో రెండు దశలుగా నిర్వహించాలని నీతిఆయోగ్ సూచించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలన్నీ స్వేచ్ఛగా, సజావుగా సాగాలని,మితిమీరిన వ్యయానికి అడ్డుకట్ట వేయాలని నీతిఆయోగ్ తన మూడేళ్ల కార్యాచరణ అజెండాపై రూపొందించిన నివేదికలో పేర్కొంది. ‘2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో మనం ఏకకాల ఎన్నికల దిశగా అడుగులు వేయాలి...ఈ క్రమంలో కొన్నిరాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్ని రాష్టాల అసెంబ్లీల గడువును కుదించడమో జరగాల’ని నీతిఆయోగ్ సూచించింది. ఈ కసరత్తును ముందుకు తీసుకువెళ్లేందుకు రాజ్యాంగ నిపుణులు, మేథావులు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన వేదిక ఏర్పాటు కావాలని పిలుపు ఇచ్చింది. ఏకకాల ఎన్నికల కోసం రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరమైనందున దీనిపై అంగీకారం కుదిరేలా చొరవ చూపాలని స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల కసరత్తుకు ఎన్నికల కమిషన్ నోడల్ ఏజెన్సీగా ఉండాలని, 2018, మార్చి నాటికి కార్యాచరణను సిద్దం చేసుకోవాలని నీతిఆయోగ్ సూచించింది. దేశంలో నిత్యం ఎన్నికలు జరుగుతుండటంతో అనవసర వ్యయంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం విదితమే. ఏకకాల ఎన్నికలకు ప్రధాని, రాష్ట్రపతి మొగ్గుచూపిన క్రమంలో నీతిఆయోగ్ తాజా సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.