speach
-
బౌద్ధవాణి : మాకు పిచ్చుకలతో పోలికా..!?
"వసంతకాలం వచ్చేసింది. చివురులు తొడిగిన చెట్లన్నీ పుష్పించాయి. పూత పిందెలుగా మారుతోంది. ప్రకృతి పూల పరిమళాలతో పరవశించి పోతోంది. ఆ మామిడితోటలో చల్లదనానికి తోడు చక్కని పరిమళాలు వీస్తున్నాయి. ఆ తోట ఒక అంచున పెద్ద కాలువ. నీరు బాగా ఇంకిపోయి ఉంది. పాయలు పాయలుగా సన్నని ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ కాలువ గట్టు మీద పెద్ద మామిడిచెట్టు. సమయం మధ్యాహ్నం దాటింది. పొద్దు పడమటికి వాలింది. ఆ చెట్టు కింద భిక్షుగణంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షువులకి తాము తీసుకోవలసిన ఆహార నియమాల గురించి బోధిస్తున్నాడు." ‘‘భగవాన్! నేను రోజుకు మూడు పూటలా తినేవాణ్ణి. చిన్నతనం నుండి అదే అలవాటు. బౌద్ధసంఘంలో చేరాక ఉదయం, సాయంత్రం కొన్నాళ్ళు తిన్నాను. మధ్యాహ్నం క్రమంగా మానేశాను. కొన్నాళ్ళు చాలా బాధ అనిపించింది. ఆకలికి తాళలేకపోయాను. కానీ.. కొన్నాళ్ళకు అదే అలవాటైంది. ఆ తరువాత మీరు.. ‘రాత్రి భోజనం మానండి’ అన్నారు. నెమ్మదిగా మానేశాను. ఇప్పుడు రోజుకి ఒక్కపూట భోజనం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఉత్సాహంగా ఉన్నాను. తేలికపడ్డాను. చదువు పట్ల శ్రద్ధ పెరిగింది.’’ అన్నాడు ఉదాయి అనే భిక్షువు. అంతలో ఆ పక్కనే ఉన్న తుమ్మచెట్లు మీదనుండి పిచ్చుకల అరుపులు వినిపించాయి. కొందరు అటుకేసి చూశారు. అరుపులు నెమ్మదిగా సద్దుమణిగాయి. చిక్కని కొమ్మల్లో చిక్కుకుపోయిన పిచ్చుక నెమ్మదిగా బైటపడి, రెక్కలు దులుపుకుని లేచిపోయింది. ‘‘భగవాన్! రాత్రిపూట చీకటిలో భిక్ష కోసం తిరగాలంటే.. ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. ఒకసారి నేను మురికి గుంటలో పడ్డాను. మన ధర్మపాలుడైతే ముళ్ళ పొదలో చిక్కుకున్నాడు’’ అన్నాడు ఒక భిక్షువు. ‘‘నేనైతే.. ఒకసారి దొంగలమూకతో కలసిపోయాను’’ అన్నాడు ఇంకో భిక్షువు. ‘‘భగవాన్! నా అనుభవం చెప్పడానికి మరీ ఇబ్బందికరం. ఆరోజు రాత్రి మబ్బు పట్టింది. నేను ఒకరి ఇంటికి వెళ్ళే సమయానికి పెద్ద మెరుపు మెరిసింది. ఇంటి పెరట్లో ఉన్న స్త్రీ నన్ను ఒక్కసారి చూసి భూతం అనుకొని భయపడింది. పెద్దగా అరిచింది. తెగ తిట్టి పోసింది. నేను ‘‘చెల్లీ! నేను భిక్షువుని’’ అని సర్ది చెప్పి బైటపడ్డాను’’ అన్నాడు మరో భిక్షువు. కానీ కొందరు భిక్షువులు మాత్రం అసహనంగా కూర్చొని ఉన్నారు. వారికి ఒంటిపూట భోజనం అలవాటు కావడం లేదు. మూడుపూటలా తింటే గానీ.. ఆకలి శాంతించదు. కొందరు కనీసం రెండు పూటల’’ అన్నారు. అంతలో.. తుమ్మచెట్టు మీద మరలా పిచ్చుకల అలజడి.. చిక్కని కొమ్మల మధ్య చిక్కుకుపోయిన ఎండు పీచుల మధ్య చిక్కుకుపోయింది ఒక పిచ్చుక. అది అటూ ఇటూ కొట్టుకుంటుంది. కొట్టుకున్న కొద్దీ ఇంకా ఇంకా చిక్కుకు పోతోంది. బుద్ధుడు నెమ్మదిగా.. ‘‘భిక్షువులారా! మీలో ఒకరు వెళ్లి ఆ బంధనాలు విడిపించండి’’ అన్నాడు. ఒక భిక్షువు లాఘవంగా చెట్టెక్కి పిచ్చుక బంధనాల్ని తొలగించాడు. అది భయంతో తుర్రున ఎగిరిపోయింది. ‘‘భిక్షువులారా! చూశారా! ఆ పిచ్చుక చిక్కుకున్న బంధాలు చిన్న చిన్న పీచులు. ఎండిపోయినవి. బలహీనమైనవి. కానీ, ఆ పిచ్చుక దాన్ని తెంచుకోలేక పోయింది.. కారణం?’’ అని అడిగాడు. ‘‘ఆ పిచ్చుక ఆ బంధనాల కంటే బలహీనమైంది’’ అన్నాడు ఉదాయి. ‘‘మరి, చాలా బలమైన గొలుసులతో తాళ్ళతో బంధించిన ఏనుగు ఆ బలమైన బంధనాన్ని సైతం తెగ తెంచుకోగలదు. ఆహారం విషయంలో మీలో కొందరు ఆ పిచ్చుకలాంటి వారే. మరికొందరు ఏనుగు లాంటివారు. కోరికల్ని తెగ తెంచుకోగలిగారు’’ అన్నాడు. ‘‘బుద్ధుడు, ఇంకా ఎందరో భిక్షువులు ఒంటిపూట భోజనంతో సంతోషంగా, ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటున్నారు. మేమెందుకు పిచ్చుకలంత బలహీనులం కావాలి?’’ అనుకున్నారు ఆకలికి ఆగలేనివారు. వారూ నెమ్మదిగా దాన్ని సాధించుకున్నారు. మాకు పిచ్చుకలతో పోలికా? అన్నట్లు దృఢచిత్తులయ్యారు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం!
‘ద గ్రేట్ డిక్టేటర్’ సినిమాలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి – హిట్లర్ పాత్ర (డిక్టేటర్) రెండు – హిట్లర్ పోలికలతో ఉన్న క్షురకుడి పాత్ర. వేల సంఖ్యలో సైనికులు బారులు తీరి ఉన్న సన్నివేశమది. వందల సంఖ్యలో మిలిట్రీ అధికారులు హిట్లర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మహాసభలో హిట్లర్ సైనికుల్ని ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి హిట్లర్ బదులు, అతని పోలికలతో ఉన్న క్షురకుడు చేరుకుంటాడు. అతనే హిట్లరనుకుని అధికారులు గౌరవ వందనం సమర్పించి అతణ్ణి వేదిక మీదికి తీసుకు వెళతారు. ఒక నిమిషం తడబడి ఆ తర్వాత – ఒక సామాన్యుడిగా తను కోరుకుంటున్నదేమిటో మాట్లాడతాడు. హిట్లర్ను ఎద్దేవా చేసే చార్లీ చాప్లిన్ తన అంత రంగాన్ని అతి సామాన్యుడైన క్షురకుడి పాత్ర ద్వారా ఈ విధంగా వ్యక్తం చేశాడు. ‘ద గ్రేట్ డిక్టేటర్’లోని ఉపన్యాసంముఖ్యాంశాలు ఇక్కడ మీకందిస్తున్నాను. ‘‘క్షమించాలి! నాకు చక్రవర్తిని కావాలని లేదు. అలాంటి ఉద్దేశమే లేదు. ఎవరినో జయించాలని కాని, ఎవరి మీదనో పెత్తనం చలాయించాలని కానీ నాకు లేదు. తెలుపు, నలుపు అన్న తేడా లేదు. ప్రతివారికీ చేయగలిగినంత సహాయం చేయాలనే ఉంది. మనం ఒకరికొకరం సహాయపడుకుంటూ ఉండాలి. ఎదుటివారి సంతోషమే మనకు స్ఫూర్తిని, సంతృప్తిని ఇస్తుంది. వారి దుఃఖం కాదు – ఒకరిని అసహ్యించుకోవడం, అవహేళన చేయడం మనం కోరుకోం. ఈ విశాల ప్రపంచం అందరిదీ. మన జీవితం స్వేచ్ఛకూ, ఆనందానికీ ప్రతిరూప మవ్వాలి! కానీ, మనం దారి తప్పుతున్నాం. స్వార్థం మనుషుల అంతరాత్మల్ని విషపూరితం చేస్తోంది. కుత్సితాలతో ప్రపంచాన్ని కుంచింపజేస్తోంది. వేగాన్ని అభివృద్ధి పరిచాం. నిజమే! కానీ, మనలో మనమే ముడుచుకుంటున్నాం. కావాల్సినవన్నీ యంత్రాలు తయారు చేస్తున్నాయి. కానీ, మన కోర్కెల దాహం తీరడం లేదు. మన విజ్ఞానం మనల్ని మానవ ద్వేషులుగా చేస్తూ ఉంది. మన తెలివి తేటలు మనల్ని నిర్దయులుగా, కఠినాత్ములుగా తీర్చి దిద్దుతున్నాయి. యంత్రాల యంత్రాంగం కన్నా, మనకు మాన వత్వపు మనుగడ ముఖ్యం కావాలి. మితిమీరిన తెలివితేటల కన్నా మర్యాద, మన్నన, దయార్ద్ర హృదయం కావాలి. ఈ లక్ష ణాలు లేని జీవితం భయానకమై నశిస్తుంది. రేడియో, విమా నాలు మానవుల్ని దగ్గరి పరిధిలోకి చేరుస్తున్నాయి. మానవుని లోని మంచితనమే వీటిని కనుక్కోగలిగింది. విశ్వమానవ సౌభ్రా తృత్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఈర్షా్య ద్వేషాలు నశిస్తాయి. నియంతలు నశిస్తారు. ప్రజల నుండి లాక్కున్న అధికారం మళ్ళీ, తిరిగి ప్రజలకే దక్కుతుంది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు నశించవు. తాత్కాలికంగా అణచబడ్డా, అవి సంకెళ్ళు తెంపుకొని ధైర్యంగా బతుకుతాయి. సైనికులారా ఆలోచించండి! మీకు తిండి పెట్టి, కసరత్తులు చేయించి, మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటివాడో ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి. మీరు పశువులు కాదు. గడ్డి పోచలు కాదు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. వీర సైనికులారా! స్వేచ్ఛ కోసం పోరాడండి. బానిసత్వం కోసం కాదు. యంత్రాల్ని సృష్టించుకోగల నేర్పరులు మీరే. యంత్రాలై పోకుండా మనుషులుగా నిలదొక్కుకునే ఆత్మశక్తి మీలోనే ఉంది. రండి! ప్రజాస్వామ్యం పేరిట ఏకమై, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! దురాశ, దుఃఖం, అసూయ, క్రూరత్వాలకు నిలువ నీడ లేకుండా చేద్దాం! శాస్త్ర సాంకేతికాభివృద్ధి సాధించే ప్రగతివైపు పయనిద్దాం.. రండి! అందరం ఏకమౌదాం!!’’ ఇది చాప్లిన్ ఉపన్యాసం. ఇక్కడ మరొక విశేషముంది. హిట్లర్ను చార్లీ చాప్లిన్ ఆటపట్టించాడు. కానీ, చాప్లిన్ అభిమానుల్లో హిట్లర్ ఒకడు! ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ‘వరల్డ్ గ్రేటెస్ట్ ఎంటర్టెయినర్’గా, ప్రపంచాన్ని నవ్వుతో శాసించిన సర్ చార్లీ చాప్లిన్ (16 ఏప్రిల్ 1889 – 25 డిసెంబర్ 1977) తన విజయ రహస్యాన్ని తానే అనేకసార్లు బేరీజు వేసుకున్నాడు. ‘ఈ ప్రజలు దేన్ని చూసి నవ్వుతారు?’ అనే శీర్షికతో చాప్లిన్ 1918లో ఒక అమెరికా పత్రికకు వ్యాసం రాశాడు. అందులో ‘‘హాస్యం టోపీ ఎగిరిపోవడంలో లేదు. దాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద మనిషి పడే అవస్థలో ఉంది. ప్యాంటు – పిగిలిపోవడంలో లేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పడే తికమకలో ఉంది. అలాగే జారి పోయే ప్యాంట్ వదిలేస్తే ఎవరికీ నవ్వు రాదు. కానీ, జారిపోకుండా పైకి అనుకుంటూ హడావిడి పడిపోవడంలో హాస్యం ఉంది. అమ్మాయి నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్న పోస్టర్ను, ఒక పెద్ద మనిషి నిలబడి తనివితీరా చూస్తుంటే ఎవరికీ నవ్వు రాదు. సమాజంలో తానొక పెద్ద మనిషినని గుర్తుంచుకుని అలా చూస్తూ ఉంటే తన వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతుందని బాధ పడుతూ, ఉండలేకపోతూ, చూడనట్టు నటిస్తూ... చూస్తూ ఉండ టంలో హాస్యం ఉంది... బలహీనుడై ఉండి, పహిల్వాన్తో ఛాలెంజ్ చేయడం, తెలివిగా తన్నులు తప్పించుకుంటూ ఉండ టంలో హాస్యం ఉంది. హాస్యం కత్తి మీద సాములాంటిది. ఎక్కడ ఏ కొద్దిగా బెడిసి కొట్టినా హాస్యానికి బదులు జుగుప్స, ఏవగింపు, అసహ్యం కలుగుతాయి. ప్రపంచాన్ని తరతరాలుగా కదిలిస్తూ వస్తున్న చార్లీ చాప్లిన్ సునిశిత హాస్యం ఎక్కడి నుంచో రాలేదు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న చాప్లిన్ మేధలోంచి వచ్చింది. ‘‘నూటికి పదిమంది బాగా ఉన్నవాళ్ళూ, తొంభయిమంది లేనివాళ్ళూ ఉన్న ఈ సమాజంలో... 90 శాతం ప్రజల్ని నవ్వించడానికి, 10 శాతం మందిని గేలి చేయడంలో– తప్పేమిటి?’’ అన్నది ఆయన ప్రశ్న! వర్గ దృక్పథాన్ని ఇంత సులభంగా, సరళంగా చెప్పిన వాళ్ళు బహుశా ఎవరూ లేరేమో! హాస్యంతో మానవ వాదానికి ఊపునిచ్చిన మహనీయుడు కూడా మరొకరు లేరేమో!! డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త -
మనసులో మాట చెప్పిన రవితేజ.. చిరు గ్రీన్ సిగ్నల్
-
బోధించడానికి ఏముంటుంది?!
భగవాన్ శ్రీ రమణ మహర్షితో ఆయన జీవించి ఉన్న కాలంలో మౌనంగా ముఖాముఖీ జరిపినవారిలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఒకరు! మొరార్జీ 1977 నుండి 1979 వరకు భారత ప్రధాని. ఆయనకు 1935 ఆగస్టులో రమణ మహర్షిని చూసే భాగ్యం కలిగింది. ఈ విషయాన్ని స్వయంగా తన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ లో రాసుకున్నారు. ఆ రోజు శ్రీ రమణ మహర్షి సోఫా మీద ఆసీనులై ఉన్నారు. ఆయన ఒంటిపై ఉన్నది ఒక్క కౌపీనమే (గోచీ). ఆ ప్రసన్న వదనం వెలిగిపోతోంది. ఆ వదనం మీద మొరార్జీకి ఒక జ్యోతిశ్చక్రం కనిపించింది. ఆయన ఎదురుగానే కూర్చొని ఉన్నారు ఈయన. ఏమీ అడగలేదు. ఆయనా ‘ఏమిటీ’ అని అడగలేదు. దాదాపు గంటసేపు అలా భగవాన్ ముఖాన్నే చూస్తూ కూర్చున్నారు మొరార్జీ. ఆ తర్వాత, వెళ్లేందుకు పైకి లేవగానే, భోజనం చేసి వెళ్లమని భగవాన్ సైగ చేశారు. ఆ దర్శనం మొరార్జీపై చెరగని ముద్రవేసింది. మహర్షి సన్నిధిలో కూర్చున్నప్పుడు దైవం ఆత్మజ్ఞానంగా మొరార్జీకి ప్రత్యక్షమయ్యారట. అంటే, ఆత్మజ్ఞానంలో ఆయనకు దేవుడు సాక్షాత్కరించాడు. ఢిల్లీలోని శ్రీ రమణ మహర్షి కేంద్రం 1979లో శ్రీ రమణ మహర్షి 99వ జయంత్యుత్సవాన్ని నిర్వహించింది. ఆ వేడుకలకు భారత ప్రధాని హోదాలో మొరార్జీ దేశాయ్ అధ్యక్షత వహించారు. ‘‘భగవాన్ శ్రీ రమణ మహర్షి ఎప్పుడూ ఉద్బోధలు చేయలేదు. ‘నేను జ్ఞానినే అయితే ప్రతి వారినీ జ్ఞానిగానే భావిస్తాను. ఇంక బోధించడానికి ఏముంది?’ అనేవారు. ఎవ్వర్నీ మార్చడానికి ప్రయత్నించలేదు. అసలు వారి సన్నిధి వల్లనే పరివర్తన కలిగేది’’.. అని రమణ మహర్షి సామీప్యంలో తనకు కలిగిన అనుభూతులను తన ప్రసంగంలో మొరార్జీ వెల్లడించారు. నేడు ఆ మహర్షి జన్మదినం. -
ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి
విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధ ముగిసిన వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు తిమ్మాపురం(కాకినాడ రూరల్) : ఆత్మ విశ్వాసంతో లక్ష్య సాధనకు ముందుకు సాగాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకొండి లక్ష్మి స్మారక గోశాల ఆవరణలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు, ఒత్తిడికి గురి కాకూడదన్నారు. జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, కాలాన్ని వృథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమగ్రతతో పని చేస్తే పరిపూర్ణమైన విజయం సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటిస్తూ పక్కవారిని కూడా పరిశుభ్రత పాటించేలా కృషి చేయాలని సూచించారు. దేశం ఏమి ఇచ్చిందని ఆలోచించకుండా దేశానికి మనం ఏమి ఇచ్చామనే కోణంలో ఆలోచించాలన్నారు. మనం బతుకుతూనే పక్కవారిని బతికించేందుకు చేతనైనంత సాయం చేయాలన్నారు. ధనం సాయం చేస్తే ఖర్చయిపోతుందని, దానాల్లో కల్లా విద్యాదానమే గొప్పదన్నారు. విద్యాదానంతో తరతరాలు గుర్తుండిపోతారన్నారు. మహనీయుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను రోజుకి కనీసం 10 లైన్లను చదవాల్సిందిగా తల్లిదండ్రులకు సూచించారు. ఏపీజే అబ్ధుల్ కలాం రాసిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలన్నారు. సర్వేపల్లి రా«ధాకృష్ణ కోసం తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో పయనించాలని కోరారు. సమాజం, దేశం పట్ల భక్తి, గౌరవభావాలు పెంపొందించుకోవాలన్నారు. మహనీయుల అడుగుజాడల్లో పయనించేందుకు యువత నడుం బిగించాలని కోరారు. మంచి పుస్తకాలు చదవడం, అవగాహనతో కూడిన విద్య నేర్చుకోవడం, చేసే ప్రతి పనిలో ప్రత్యేకత, సృజనాత్మకత ఉండాలన్నారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం రూపొందించిన విజయానికి పది సూత్రాలను తప్పకుండా పాటిస్తామంటూ శిక్షణ తరగతులకు హాజరైన విద్యార్థులతో ప్రతిజ్ఙ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ధార్మిక మండలి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
రమణయ్యపేట (కాకినాడ రూరల్): దేవాలయాల భూములు, ఆస్తుల పరిరక్షణ కోసం ధార్మిక పరిషత్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శ్రీపీఠం స్వామిజీ స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ రూరల్ రమణయ్యపేట శ్రీపీఠంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండోమెంట్ భూముల పరిరక్షణకు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలకు పాలకులు కొత్త భాష్యం చెబుతున్నారని ఆరోపించారు. ఎండోమెంట్ ఆస్తుల సంరక్షణకు «రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల ఆధ్వర్యంలో ధార్మిక çమండలి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు.« ధర్మకర్తల మండళ్లు కాస్తా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారని విమర్శించారు. ఏపీ, తెలంగాణలో 33 వేల దేవాలయాలున్నాయని, ఇందులో 20 వేల దేవాలయాల్లో నిత్యం దీప, ధూప, నైవేద్యాలు జరుగుతున్నాయని, మిగతా 13 వేల దేవాలయాలు మూతపడినట్టు తెలిపారు. మూతపడిన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు సమర్పించే ఆదాయంలో 10 శాతం కామన్ గుడ్ ఫండ్ సీఎంకు వెళుతుందన్నారు. వీటి వినియోగంపై ఆర్డీఏలో సమాచారం కోరినా ఇవ్వడం లేదని ఆరోపించారు. విజయవాడలో సిద్ధార్థ కళాశాలకు ప్రభుత్వం విలువైన భూములు కేటాయించడం దారుణమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల ఎంపిక రాజకీయాలకతీతంగా ఆధ్యాత్మికతో పనిచేసేవారికి అవకాశం కల్పించాలన్నారు. మక్కా, జెరూసలేం యాత్రలకు వెళ్లే భక్తులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం హిందువులకు రాయితీలు ఇవ్వకపోగా, సర్చార్జీలు, టోల్గేట్ చార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించారు. దేవాలయాలు, పండుగలు నిర్వహించేటప్పుడు దేవుని ప్రచారం చేసే ఫ్లెక్సీల కన్నా పాలకమండలి సభ్యులు, రాజకీయనేతల ఫ్లెక్సీలు అధికంగా కనిపిస్తున్నాయని వాపోయారు. ఈ ఖర్చును భక్తులు హుండీలో సమర్పించిన నిధుల నుంచి వినియోగంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉత్కృష్ట ప్రబంధం మనుచరిత్ర
భువన విజయం సాహితీ ప్రసంగాల్లో తాతా సందీప్ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అల్లసాని పెద్దన విరచిత మనుచరిత్ర ఉత్కృష్టమైన ప్రబంధమని యువ ద్విగుణిత అష్టావధాని తాతా సందీప్ కొనియాడారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న భువన విజయం సాహితీ ప్రసంగాలలో భాగంగా ‘మనుచరిత్ర–జీవన విధులు’ అంశంపై శుక్రవారం ఆయన ప్రసంగించారు. ‘శిరీష కుసు మ పేశల సుధామయోక్తుల’తో గ్రంథాన్ని రచించమన్న రాయలవారి కోర్కెపై పెద్దన మనుచరిత్రను అందించారని తెలిపారు. ఆదర్శ గృహస్థాశ్రమ ధర్మాలను ప్రవరాఖ్యుని పాత్ర ద్వారా పెద్దన తెలియజేరని చెప్పారు. పరివ్రాజకులు, సిద్ధు లు, భిక్షకులు వస్తే ఆతిథ్యం ఇవ్వడం పరమ ధర్మంగా ప్రవరాఖ్యుడు భావించేవాడన్నారు. హిమాలయాలపై లేపనం కరిగిపోయి, ఇంటికి వెళ్లలేని స్థితి ఎదురయినప్పుడు కూడా, ఇంట్లో అతిథి, అభ్యాగతుల సేవలు ఎలా జరుగుతున్నాయోనని ప్రవరాఖ్యుడు కలత చెందాడని సందీప్ తెలిపారు. ప్రవరాఖ్యుని భార్య సోమిదమ్మ పాత్ర ద్వారా ఆదర్శ గృహిణి ఎలా ఉండాలో, కంటికి ఒత్తి పెట్టుకుని విద్యనేర్పే బ్రహ్మమిత్రుడి పాత్ర ద్వారా ఆదర్శ గురువు ఎలా ఉండాలో పెద్దన తెలియపరిచారన్నారు. కుటిలబుద్ధితో, మాయోపాయాలతో విద్యనేర్చుకున్న ఇందీవరాక్షుని పాత్ర ద్వారా శిషు్యడు ఎలా ఉండరాదో వివరించారని చెప్పారు. పూవ్వు, తావిలా భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలని హంసీచక్రవాదం ద్వారా తెలియజేశారన్నారు. విభావసి అనే స్త్రీ తన తండ్రికి అంత్యక్రియలు చేసే ఘటన మనుచరిత్రలో కనిపిస్తుందని చెప్పారు. భువన విజయం సభలు ఇక్కడే జరిగాయి చరిత్ర పరిశోధకుడు వై.ఎస్.నరసింహారావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ భువన విజయం సభలు రాజమహేంద్రవరంలోనే జరిగాయని మైసూరు విశ్వవిద్యాలయం రిటైర్డ్ తెలుగుశాఖ అధిపతి చెన్నాప్రగడ తిరుపతిరావు పరిశోధనల్లో వెల్లడయిందని తెలిపారు. సభకు డాక్టర్ మోపిదేవి విజయగోపాల్ అధ్యక్షత వహించారు. మంగళంపల్లి పాండురంగ విఠల్ స్వాగత వచనాలు పలికారు. యార్లగడ్డ మోహనరావు వందన సమర్పణ చేశారు. పరిషత్ గౌరవాధ్యక్షుడు చింతలపాటి శర్మ, డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, డాక్టర్ ఎ.వి.ఎస్.మహాలక్ష్మి, ఎం.వి.రాజగోపాల్ హాజరయ్యారు. -
లోకేశ్ ప్రసంగానికి ముగ్ధులైన ఎన్ఆర్ఐలు
- టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్ హైదరాబాద్: తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో చేసిన ప్రసంగానికి ప్రవాస భారతీయులు ముగ్ధులయ్యారని ఆ పార్టీ మీడిమా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్కార్కే ప్రసాద్ తెలిపారు. లోకేశ్ ఆలోచనలను, దూరదృష్టిని మెచ్చి వారు 780 గ్రామాలు దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో వివరించారు. అలాగే మరో 220 గ్రామాలను దత్తత తీసుకునేందుకూ వారు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘ప్రపంచాన్ని అమెరికా శాసిస్తోంటే.. ఆ దేశాన్ని మాత్రం అక్కడ స్థిరపడిన తెలుగువారు శాసిస్తున్నారు.’ అని ఎడిసన్ హోటల్లో జరిగిన సమావేశంలో లోకేశ్ వ్యాఖ్యానించారని తెలిపారు. ఏపీలో ఎన్ఆర్ఐ భవన నిర్మాణానికి బ్రహ్మాజీ వలివేటి రూ.60 లక్షల విరాళాన్ని ప్రకటించారన్నారు. ‘తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని మాట్లాడుతూ.. తానా 100 గ్రామాలను దత్తత తీసుకుంటుందని వెల్లడించారు. సమావేశంలో మోహనకృష్ణ మన్నవ, జె.తాళ్లూరి ప్రసంగించారు.’ అని ప్రసాద్ వివరించారు.