Sreeramulu
-
ఆ పదవిపై ఆసక్తి లేదు : శ్రీరాములు
సాక్షి, బెంగళూర్ : ఉప ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష తనకు లేదని బీజేపీ నేత శ్రీరాములు స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని వదంతులు సృష్టించారని, ఉపముఖ్యమంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని ఆయన చెప్పారు. బాదామిలో సీఎం సిద్ధరామయ్యపై పోటీ చేసిన శ్రీరాములుకు పార్టీ అత్యధిక ప్రాధాన్యత కల్పించిన విషయం తెలిసిందే. యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావాలనే తామంతా కోరుకుంటున్నామని, పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా అంగీకరిస్తానని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ఎన్నికలు జరిగిన 222 స్ధానాలకు గాను బీజేపీ 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, కాంగ్రెస్ 74 స్ధానాల్లో, జేడీఎస్ 39 స్ధానాల్లో, ఇతరులు 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. -
ఆ సర్వేలో నిజం లేదు
సాక్షి, బళ్లారి: ఓటమి భయంతోనే సీఎం సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, ఐదు సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిగా ఆయనే గెలవలేని పరిస్థితి ఉంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చని బీజేపీ శాసనసభా పక్ష నేత, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విమర్శించారు. ఆయన శనివారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో పస లేదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు పేర్కొనడంలో నిజం లేదు అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేలు అబద్ధమని తేలిపోయినట్లు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ స్వతంత్రంగా అధికారంలోకి వస్తారని సర్వేలు చెప్పలేదని, అదే మాదిరిగా ఈసారి కూడా యడ్యూరప్ప కర్ణాటకలో సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలు అనంతరం సిద్దూ ఇంటికే పరిమితం అవుతారని, కాంగ్రెస్ ఎన్ని సర్వశక్తులు ఒడ్డినా తాము ఒంటరిగా 150 సీట్లతో గద్దెనెక్కుతామని జోస్యం చెప్పారు. శ్రీరాములే పోటీ చేసి గెలుస్తారు మొళకాల్మూరు ఎమ్మెల్యేగా తిప్పేస్వామి గెలుపొందారంటే అది శ్రీరాములు ఆశీస్సులే, గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్‌ఆర్‌సీపీ తరుపున తిప్పేస్వామికి శ్రీరాములు టికెట్ ఇవ్వడంతో పాటు గెలుపునకు కృషి చేయడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నది మరువకూడదని శెట్టర్ హితవు పలికారు. శ్రీరాములుపై తిప్పేస్వామి తిరుగుబాటు చేయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి వ్యవహరించారని, ఎట్టి పరిస్థితుల్లోను మొళకాల్మూరు నుంచి శ్రీరాములే పోటీ చేస్తారని, ఆయనే భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. తిప్పేస్వామి రాజకీయ సమీకరణలు నిజం కావన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటమో లేదా మరేదైనా నిర్ణయం తీసుకోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే అనవసర గొడవలకు దిగితే జనమే బుద్ధి చెబుతారన్నారు. శ్రీరాములుకు మొళకాల్మూరులో గెలిచే శక్తి ఉందన్నారు. ఆయన అక్కడే కాకుండా రాష్ట్రంగా పలు జిల్లాల్లో ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారని చెప్పారు. -
శ్రీమంతుడు... శ్రీరాములు!
రూరల్ హీరోస్ స్థోమత చిన్నదైనా... మనసు దొడ్డది అని శ్రీరాములు గురించి తెలిసిన ప్రతి ఒక్కరు అంటుంటారు. అయితే తన ఆశయాన్ని అందరూ మెచ్చుకుంటున్నా తను చూపిన బాటలో నడిచేందుకు మాత్రం అంతా వెనుకడుగు వేస్తుండడమే ఆయనను బాధిస్తుంటుంది. సన్మానాలు వద్దు...ప్రశంసలు వద్దు. కటిక పేదవాడు సైతం కాస్త గౌరవంగా బతకాలి. అలా కావాలంటే అవసరాలను అదుపులో పెట్టుకొని రాయితీలకు స్వస్తి చెప్పేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిస్తున్నారు శ్రీరాములు. ఎవరీ శ్రీరాములు? పాలడుగు శ్రీరాములు స్వగ్రామం ప్రకాశం జిల్లా చీమకుర్తి. 1939లో ఏడుగురు సంతానంలో ఒకరిగా జన్మించారు. కటిక దారిద్య్రంలో పుట్టిన ఆయన ఫిఫ్త్ఫారం వరకు మాత్రమే చదువుకున్నారు. 1955లో సైన్యంలో చేరారు. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ సెంటర్ (ఎంఈజీ సెంటర్)లో సేవలు ప్రారంభించారు. 18 సంవత్సరాలపాటు సేవలు అందించి, నాయక్ హోదాలో రిటైర్ అయ్యారు. 1961లో గోవా యుద్ధంలో, 1962లో చైనా-ఇండియా యుద్ధంలో, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో, 1971లో బంగ్లా-పాక్ యుద్ధంలో భారత్ తరఫున సేవలు అందించారు. 1973లో సైన్యం నుంచి రిటైరయ్యారు. మరుసటి సంవత్సరంలో ఆయనకు విజయవాడ టెలిగ్రాఫ్ ఆఫీసులో మెసెంజర్‌గా ఉద్యోగం లభించింది. రెండు నెలల తర్వాత బదిలీపై ఒంగోలులో సేవలు కొనసాగించి 1999 డిసెంబర్లో ఉద్యోగ విరమణ చేశారు. ‘గివ్ ఇట్ అప్’ సైన్యంలో చేరిన శ్రీరాములు తొలిసారిగా క్యాంటీన్‌కు భోజనానికి వెళ్లారు. పళ్లెంలో మటన్ కర్రీ. ఒక వైపు నోరూరుతుండగానే మరో వైపు కళ్లనిండా నీళ్లు తిరిగాయి. కారణం కమ్మని భోజనం కళ్లముందు కనిపించగానే కటిక దారిద్య్రం అనుభవిస్తున్న తన కుటుంబ సభ్యులు కళ్లముందు మెదలడమే. దీంతో ఆయన ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని ఆనాడే ఎంచుకున్నారు. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి... ప్రతి పౌరుడు వారానికి ఒక పూట భోజనాన్ని మానుకొని ఆహార కొరతను నివారించేందుకు ముందుకు రావాలని కోరడంతో స్పందించి నాటి నుంచి వారానికి ఒకపూట భోజనం మానేయడం ప్రారంభించారు. అలా మిగిల్చిన మొత్తాన్ని ప్రకృతి వైపరీత్యాల నిధికి విరాళంగా పంపించడం ప్రారంభించారు. గివ్ఇట్ఆప్లో శ్రీరాములు వదులుకున్నవి మాజీ సైనికులకు రాయితీపై సరుకులు తీసుకునేందుకు మిలటరీ క్యాంటీన్ కార్డు ఇస్తారు. దేశంలో చాలామంది కనీసం తిండి లేకుండా జీవిస్తున్నారని, కనుక తనకు క్యాంటీన్ కార్డు అనవసరం అంటూ ఇప్పటివరకు ఆయన ఆ సౌకర్యాన్ని పొందేందుకు ఇష్టపడలేదు. ఇప్పటివరకు మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోలేదు. సైనికులు రిటైర్ అయితే వారి కుటుంబానికి 2.5 ఎకరాల మాగాణి, లేదా 5 ఎకరాల మెట్టభూమి లేదా 30 గదుల ఇంటి స్థలం ఇస్తారు. వాటినీ కాదనుకున్నారు.తనకు ఇద్దరు కుమారులు ఉన్నా వారికి కూడా ఇప్పటివరకు కనీసం మాజీ సైనికుల కోటా కింద రిజర్వేషన్ పొందలేదు.ఇన్ని చేసి కూడా ఇటీవల మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపునకూ స్పందించి ఒంగోలు విజయ ఎలక్ట్రానిక్స్‌లో తనకు ఉన్న గ్యాస్ కనెక్షన్ నెంబర్ 7015865 ను వదులుకున్నారు. అంతే కాకుండా, తనకు మాజీ సైనికునిగా, టెలిగ్రాఫ్ కార్యాలయంలో పనిచేసి రిటైరైనందును వస్తున్న రెండు పెన్షన్లలో ఒకటి మాత్రమే తన కుటుంబానికి చాలంటూ నెలకు రూ. 8 వేలు పెన్షన్‌ను స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ విషయాలపై ఆయనను కదిలిస్తే ఆయన మాట్లాడేది ఒక్కటే. వ్యక్తి ప్రచారం కన్నా...ఆశయం ప్రచారం కావాలి. బతకడానికి డబ్బు అవసరమే అని సింపుల్‌గా చెబుతుంటారు. అందుకే ఆర్థికంగా శ్రీమంతుడు కాలేకపోయినా ఈయన ఆశయంలో శ్రీమంతుడే. - సాక్షి, ఒంగోలు -
ఇటు వ్యాయామం... అటు సహజాహారం!
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. అయితే, ఆ వ్యాయామం కోసమే కాకుండా.. రసాయనిక అవశేషాల్లేని సహజాహారాన్ని ఇంటిపట్టునే పండించుకోవడానికి కూడా ఉపయోగపడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే రేణుకుంట్ల శ్రీరాములు తన ఇంటిపైన 3 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు. హైదరాబాద్ ఆల్విన్ కంపెనీ మాజీ ఉద్యోగైన శ్రీరాములు(61) కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో స్థిరపడ్డారు. ఇంతకుముందున్న ఇంటి వద్ద పెరట్లో చాలా ఖాళీస్థలం ఉండడంతో పూలమొక్కలు, కూరగాయ మొక్కలు పెంచే అలవాటుంది. కొద్ది నెలల క్రితం 3 అంతస్థుల కొత్త ఇంట్లోకి మారిన తర్వాత.. మేడ మీద గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేసి ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. గుండ్రంగా ఉండే పెద్ద గ్రోబాగ్స్ పది, 50కి పైగా చిన్న కుండీల్లో టమాటా, బీర, పొట్ల, సొర, దోస, గోంగూర, పాలకూర, చుక్కకూర సాగు చేస్తున్నారు. మొక్కలకు ఎండాకాలంలో మొక్కలకు షేడ్‌నెట్ వేయడానికి, కోతుల నుంచి రక్షించుకోవడానికి టైపైన పక్కాగా ఇనప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. మొక్కలంటే ప్రాణం కాబట్టి కొంత ఖర్చయినప్పటికీ ఈ ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. దసరా పండుగ తర్వాత గ్రోబాగ్స్ తెచ్చి టై కిచెన్ గార్డెన్‌కు శ్రీకారం చుట్టారు. ట్రాక్టర్ ఎర్రమట్టి, అర ట్రాక్టర్ చివికిన పశువుల ఎరువుతోపాటు కోకోపిట్, వేపపిండితో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొక్కలకు రోజ్క్యాన్తో తగుమాత్రంగా నీరు పోయడంతో శ్రీరాములు దినచర్య ప్రారంభమవుతుంది. కనీసం గంట సేపు చక్కని వ్యాయామం దొరుకుతోందని ఆయన చెప్పారు. దీంతోపాటు మొక్కలను దగ్గరగా పరిశీలించడం వీలవుతోందన్నారు. నలుగురు కుటుంబానికి అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో 60% వరకు ప్రస్తుతం తామే పండించుకుంటున్నామన్నారు. 15-20 రోజులకోసారి వేపనూనెను మొక్కలపై పిచికారీ చేస్తామని, అంతకుమించి మరేమీ అవసరం రావడం లేదని ఆయన తెలిపారు. రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలను సొంతంగా మేడ మీద పండించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కూరగాయలు, ఆకుకూరలను కోసిన 5 నిమిషాల్లోనే వండుకునే వీలుండడం, రుచి చాలా బాగుండడం సంతృప్తినిస్తోందన్నారు. ప్రగతినగర్ మాజీ సర్పంచ్ అయిన శ్రీరాములు ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. టైలు ఖాళీగా ఉంచేకన్నా ఉన్నంతలో సహజాహారాన్ని పండించుకోవడం మేలని తన చేతల ద్వారా చాటుతున్నారు. - ఇంటిపంట డెస్క్ -
చిత్రవర్ణాలే శ్రవణస్వరాలుగా...
ఆమె మాట్లాడలేదు. కానీ తన బొమ్మలతో మాట్లాడిస్తుంది.ఆమెకు వినపడదు. కానీ ఆమె చిత్ర వర్ణాలు శ్రావ్యగీతాలను వినిపిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే... భగవంతుడు ఏ జీవికైనా ఒక లోపం ఇచ్చినప్పుడు, దానిని సరి దిద్దుకునేలా మరో రూపంలో మంచి చేస్తాడని మానసి నిరూపించింది... డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై ఆవిడ పేరు శ్రీరాణి, బీఫార్మసీ చేశారు. ఆయన బి.ఎస్.మూర్తి. మద్రాసు ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రొఫెసర్. వారి గారాల కుమార్తె మానసి. తనకు ఫలానాది కావాలి అని నోరు విప్పి చెప్పలేని కుమార్తెకు బంగారు భవిష్యత్తునివ్వడం కోసం ఆ తలిదండ్రులు తమ జీవన గమ్యాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఆమెని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మార్గం సుగమం చేశారు. ఆ వివరాలు ఆవిడ మాటల్లోనే... పంచేంద్రియాల్లో ఏ ఒక్క ఇంద్రియం సరిగ్గా పని చేయకపోయినా మిగిలిన ఇంద్రియాలు మరింత ఉత్సాహంతో పనిచేస్తాయి. మా అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. మానసి పేరుకు తగ్గట్టు మనసుతోనే వింటుంది. తను 1991 జూన్ 9 న సౌత్ కర్ణాటకలోని మణిపాల్‌లో పుట్టింది. అప్పటికి మా వారు కాన్పూర్ ఐఐటిలో పనిచేస్తున్నారు. మానసి పుట్టిన ఏడాది తర్వాత గానీ ఆమెకు వినికిడి శక్తి లేదని మాకు తెలియలేదు. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న మాకు ఈ వార్తతో తలమీద పిడుగు పడ్డట్లే అయింది. అయితే కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుని, డాక్టర్ల సూచన మేరకు అమ్మాయిని స్పీచ్ థెరపిస్ట్‌కు చూపించాం. వారు అమ్మాయికి వినికిడి యంత్రం అమర్చారు. కాన్పూర్‌లో స్పీచ్ థెరపీ ప్రారంభించాం. మానసికి నాలుగు సంవత్సరాల వయసులో పాఠశాలలో చేర్పించాం. ఆ స్కూల్లో అంతా హిందీ మీడియమే. అందువల్లనో ఏమో మానసి పెద్దగా ప్రతిభ ప్రదర్శించలేకపోయింది. అయితే అదే సమయంలో మానసిలోని మరో కోణం బయటపడేసరికి తల్లిగా నేనెంతో ఆనందించాను. అదేమంటే... డ్రాయింగ్ వేయడంలోనూ, ఆ వేసిన డ్రాయింగ్‌కి రంగులు పూయడంలోనూ చెప్పలేనంత శ్రద్ధాసక్తులు చూపుతోంది. ఒక్కోసారి నా దగ్గరకు కాగితాలు పెన్సిల్ తీసుకువచ్చి, నన్ను డ్రాయింగ్ వేసి, వాటికి రంగులు వేయమని అడిగేది. నేను వేస్తున్నంతసేపూ పక్కనే కూర్చుని, నిశితంగా పరీక్షించేది. ఆ తరవాత తనంతట తాను ఏవేవో బొమ్మలు వేస్తుండేది. అమ్మాయిలోని శ్రద్ధ గమనించిన అక్కడి టీచర్లు ‘సౌత్‌లో అయితే మంచి మంచి ఆర్ట్ స్కూల్స్ దొరుకుతాయి. మీరు అక్కడకు వెళ్లి అమ్మాయిని అక్కడ చేర్పించండి’ అని సూచించారు. అప్పుడు మావారు ప్రత్యేకించి తనకోసమే చెన్నై ఐఐటీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. చెన్నై ‘క్లార్క్ స్కూల్ ఫర్ ద డెఫ్’లో చేర్పించాం. అప్పటికి మానసి వయసు ఆరు సంవత్సరాలు. మానసిని అక్కడ చేర్పించినప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెవిటి పిల్లల టీచర్‌గా నేను ట్రెయినింగ్ తీసుకున్నాను. అదే స్కూల్లో టీచర్‌గా కొత్త జీవితం ప్రారంభించాను. ఆ స్కూల్లో చేరాక మానసి మంచి ప్రతిభ చూపింది. అక్కడ స్థానికంగా ఉండే టీచర్ దగ్గర డ్రాయింగ్‌లో జాయిన్ చేశాను. తనకి తొమ్మిది పది సంవత్సరాలు వచ్చేసరికి, రామ సురేశ్ అనే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ దగ్గర డ్రాయింగు నేర్చుకోవడం ప్రారంభించింది. అలా మానసి కళా యాత్ర ప్రారంభమైంది. స్కూల్ డేస్‌లో డ్రాయింగ్‌లో ఎన్నో బహుమతులు పొందింది. ఏడో తరగతి చదువుతుండగా ఒరాకిల్ కంపెనీ మొత్తం 13 పెయింటింగ్‌లు తీసుకుంది. చెన్నై టి.నగర్‌లోని ఒరాకిల్ ఆఫీసులో తన పెయింటింగ్‌లు చూడవచ్చు. 11 వ తరగతి చదువుతున్న సమయంలో, చెన్నైలో ఒక ప్రదర్శన కూడా నిర్వహించింది. అందులో చాలా పెయింటింగ్‌లను ఎందరో ఇష్టంతో కొనుక్కున్నారు. ఆ ప్రోత్సాహంతో ఢిల్లీలోని అపర్ణ ఆర్ట్ గ్యాలరీలో ప్రతి సంవత్సరం డిసెంబరు 3 నుంచి 10 వరకు ‘ఫ్యామిలీ ఆఫ్ డిసేబుల్డ్’ అని వికలాంగుల విభాగంలో ‘బియాండ్ లిమిట్స్’ పేరున జరిగే కార్యక్రమంలో పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తోంది. అక్కడ తనవి చాలా పెయింటింగ్స్ సేల్ అయ్యాయి. తన నుంచి నేను నేర్చుకున్నాను..! మా అమ్మాయి నా నుంచి ఎంత నేర్చుకుందో, మా అమ్మాయి నుంచి నేను అంతకు రెట్టింపు నేర్చుకున్నాను. అమ్మాయితో మాట్లాడటానికి వీలుగా, అదేవిధంగా వినికిడి లోపం ఉన్నవారికి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలనే విషయంలో ముందుగా నేను ప్రత్యేక శిక్షణ తీసుకుని, డిప్లమా, బిఈడీ పూర్తి చేసి, అమ్మాయి చదివిన ‘క్లార్క్ స్కూల్ ఫర్ ద డెఫ్’ (మైలాపూర్)లో చాలా ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్నాను. ప్రస్తుతం తను మద్రాసులోని ‘స్టెల్లా మేరీస్’ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్‌లో ఫైనలియర్ చదువుతోంది. ఆ తరవాత మాస్టర్స్ డిగ్రీ చేస్తానంటోంది. డ్రాయింగ్‌లో రకరకాల ప్రయోగాలు చే స్తోంది. ఆయిల్, అక్రిలిక్, పెన్ ఆన్ పేపర్, డ్రై క్రేయాన్స్... ఇలా ఎన్నో. అయితే మానసికి మాత్రం వ్యక్తిగతంగా లాండ్‌స్కేప్స్ అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా స్నో స్కేప్స్. ఇంతవరకూ అన్నీ గ్రూప్ ఎగ్జిబిషన్లే నిర్వహించింది. ప్రస్తుతం సింగిల్ షో పెట్టాలనుకుంటున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే... మా అమ్మాయి మాకు దేవుడిచ్చిన వరం. తన లోపాన్ని తను సరిదిద్దుకోగలగటమే కాక మమ్మల్ని కూడా చైతన్యవంతులుగా చేసింది. అది ఆమె మాకిచ్చిన వరం. -
కాటికి పంపిన కలహాలు
భార్యను నరికి చంపిన భర్త హతురాలు హాస్టల్ వార్డెన్ అతనిది అంతంత మాత్రం చదువు.. ఆమె ఉన్నత విద్యావంతురాలు. అతను నిరుద్యోగి.. ఆమె ప్రభుత్వోద్యోగి. చిన్నప్పటి నుంచి మేనమామ అంటే ఆమెకు ప్రేమ.. ఒకరికి ఉద్యోగం లేకపోయినా మరొకరికి ఉంది కదా అని సొంత తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లు వారి సంసారం సజావుగా సాగింది. ఆ తరువాత అతనిలో అనుమానపు బీజం మొలకెత్తింది. అది పెనుభూతంగా మారింది. పచ్చని వారి సంసారంలో చిచ్చు రగిల్చింది. భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టించింది. తరచూ కలహాలకు కారణమైంది. అదే వారి మధ్య రక్త సంబంధాన్ని తెంచేసింది. తాళి కట్టిన భర్తే వైవాహిక బంధాన్ని ఎగతాళి చే శాడు. భార్యను పట్టపగలే నరికి చంపి హంతకుడిగా మిగిలాడు. - రామాపురం రామాపురం మండలం నీలకంఠరావుపేట ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ గొట్టివీటి లక్ష్మీదేవి(40) గురువారం భర్త గొట్టివీడు శ్రీరాములు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రామాపురం నుంచి విధి నిర్వహణ నిమిత్తం మధ్యాహ్నం ఆమె నీలకంఠరావుపేటకు ఆటోలో బయలుదేరారు. అదే ఆటోలో శ్రీరాములు కూడా వెళ్లాడు. ఆటోలోనే భ్యాతో అతను గొడవపెట్టుకున్నాడు. మాటామాటా పెరిగింది. అంతలోనే నీలకంఠరావుపేట వచ్చింది. ఇద్దరూ దిగి హాస్టల్ వద్దకు కాలినకడన బయలుదేరారు. హాస్టల్ సమీపించగానే తన వెంట తెచ్చుకున్న మచ్చుకొడవలితో శ్రీరాములు తన భార్య లక్ష్మీదేవిని దారుణంగా నరికాడు. దాడిలో ఆమె చేతులు, తల, శరీరంపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మిదేవిని చూసిన అక్కడి జనం 108కు సమాచారం అందించారు. చాలా సేపటి వరకు అంబులెన్స్ రాకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు వదిలేశారు. స్థానికులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఎస్ఐ వెంకటాచలపతి తమ సిబ్బందితో కలసి నేర స్థలానికి చేరుకున్నారు. తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. తరచూ గొడవలు.. రామాపురం మండలం మిద్దెకాడపల్లెకు చెందిన లక్ష్మిదేవిని గాలివీడు మండలం కరివిరెడ్డిగారిపల్లెకు చెందిన తన మేనమామ గొట్టివీటి శ్రీరాములుకు 1981లో ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ఒక కుమార్తె. ప్రస్తుతం ఆమె తిరుపతిలో ఉండి బీడీఎస్ చదువుతోంది. ఏడాది కిందట లక్ష్మిదేవి నీలక ంఠరావుపేటలోని ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె భర్తతో కలసి రామాపురంలో నివాసముంటున్నారు. ప్రతిరోజూ విధులకు వచ్చివెళ్లేవారు. భార్యపై అనుమానంతో అతను తరచూ ఆమెతో గొడవకు దిగేవాడని సమాచారం. ఈ నేపథ్యంలో అతను ఒకసారి నిద్ర మాత్రలు మింగిన అతను, మరోసారి విషపు మందు తాగినట్లు తెలుస్తోంది. భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు తమ వార్డెన్‌ను హాస్టల్ సమీపంలోనే భర్త చంపడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన వెళ్లిన హాస్టల్ వార్డెన్ మాధవీలత వెంటనే లక్కిరెడ్డిపల్లె ఏఎస్‌డబ్ల్యూఓకు సమాచారం అందించారు. ఆమె సూచన మేరకు మాధవీలత హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి నేర ప్రదేశాన్ని పరిశీలించారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. -
‘అర్కావతి లే ఔట్’పై సీబీఐ దర్యాప్తు చేయించాలి
బళ్లారి ఎంపీ శ్రీరాములు సాక్షి, బళ్లారి : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను నీతి నిజాయితీపరుడని చెప్పుకునే వారని, అయితే ఆర్కావతి లేఔట్ డీ నోటిఫికేషన్లో ఆయన అసలు రంగు బయటపడిందని, వెంటనే డీనోటిఫికేషన్‌కు సంబంధించిన ఉదంతంపై సీబీఐ దర్యాప్తుకి అప్పగించాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు అన్నారు. ఆయన గురువారం నగరంలోని కౌల్‌బజార్‌లో విలేకరులతో మాట్లాడారు. నిజంగా సిద్ధరామయ్య నిజాయితీ పరుడైతే ఆర్కావతి లేఅవుట్ వివాదంపై సీబీఐకి అప్పగించి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బళ్లారి రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నట్లు పత్రికల్లో చదివానని, అయితే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి తాను చేసిన కృషి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు. న్రియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించి, మంచినీటి సమస్య తీర్చడంతోపాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చే శానని, కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పిలిచినా బహిరంగ విచారణకు తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తూ అరచేతిలో వైకుంఠం చూపుతారని, వాటిని ప్రజలు నమ్మకూడదని కోరారు. తన ఆప్త మిత్రుడు గాలి జనార్దనరెడ్డికి కర్ణాటక కేసులకు సంబంధించి బెయిల్ వచ్చిందని, త్వరలో అన్ని కేసులకు సంబంధించి బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గోవిందరాజులు, శ్రీనివాస మోత్కర్ పాల్గొన్నారు. -
రాష్ర్టంలో బీజేపీ అధికారమే ధ్యేయం
ఆరు నెలల్లో సీఎం కుర్చీ దిగుతారు ఆ గనులను ఎందుకు వేలం వేయలేదో సీఎం స్పష్టం చేయాలి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప సాక్షి, బళ్లారి : కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపి బీజేపీని అధికారంలోకి తేవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప సీఎం సిద్ధరామయ్యపై తీవ్ర విమర్శలు చేశారు. బళ్లారి ఎంపీ శ్రీరాములును అత్యధిక మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపేందుకు నగరంలోని బసవభవన్‌లో గురువారం సాయంత్రం బీజేపీ శాఖ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి యడ్యూరప్ప, శ్రీరాములు విడిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తిరిగి వారిద్దరి కృషితో పాటు మోడీ హవా కారణంగా రాష్ర్టంలో తమ పార్టీకి 17 లోక్‌సభ స్థానాలు దక్క డం సంతోషంగా ఉందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు మాత్రమే రావడం ఆపార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన సిద్ధరామయ్య ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్డడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ ఖనిజ తవ్వకాలు సాగించిన 51 కంపెనీలను వేలం వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా.. సీఎం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. గనుల అక్రమార్కులనుంచి సీఎం మామూళ్లు తీసుకుంటున్నందుకే వాటిని వేలం వేయలేదని ఆరోపించారు. గనుల అక్రమాలపై బెంగళూరు నుంచి బళ్లారికి డ్యాన్స్‌లు చేస్తూ పాదయాత్ర చేపట్టిన సిద్దరామయ్య ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మోడీని సిద్ధరామయ్య నరహంతకుడుగా విమర్శించారని, ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యారని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మోడీ తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ఆయన స్నేహ హస్తానికి నిదర్శనమన్నారు. త్వరలో సీఎం సిద్ధరామయ్య తన కుర్చీ దిగడం ఖాయమన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో రానున్నట్లు జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం మాత్రమే బీజేపీకి దక్కుతుందన్నారు. దేశాన్ని ఏకతాటిపై తీసుకుని వచ్చిన మోడీని ప్రపంచ దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక సమగ్రాభివృద్ధికి తామంతా కృతనిశ్చయంతో ఉన్నామని, జాబితా తయారు చేసి ప్రధానమంత్రి వద్దకు వెళ్దామని సీఎం కు సూచించారు. కార్యక్రమంలో బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీలు శాంత, సన్న పక్కీరప్ప, విధాన పరిషత్ సభ్యులు మృ త్యుంజయ జినగ, శశీల్ నమోషీ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, బీజేపీ నాయకులు మహిపాల్, కే.ఎస్.దివాకర్, ఎ.ఎం.సంజయ్, సుధీర్, సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘శ్రీరాములుతోనే బళ్లారి అభివృద్ధి’
సాక్షి, బళ్లారి : బళ్లారి సమగ్రాభివృద్ధి చెందాలంటే బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి శ్రీరాములు గెలుపుతోనే సాధ్యమవుతుందని కేఎంఎఫ్ అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని పలు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బీ.శ్రీరాములు గెలుపొందాలని, నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావాలని, బళ్లారి సుభిక్షంగా ఉండాలని తన ఇష్టదైవం ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. బళ్లారి సమగ్రాభివృద్ధి చెందాలంటే అది శ్రీరాములుతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు పదవులు తప్ప ప్రజాసంక్షేమం పట్టదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా శ్రీరాములు గెలుపును అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు తరుఫున మాజీ బుడా అధ్యక్షుడు గురులింగనగౌడ విస్తృత ప్రచారం చేశారు. మూడు రోజుల నుంచి బళ్లారి తాలూకాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం హలకుంది, హొన్నళ్లి, హొన్నళ్లి తాండా, మించేరి, రూపనగుడి, సంగనకల్లు తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. -
జనకంటక బళ్లారి కలెక్టర్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బళ్లారి జిల్లా కలెక్టర్ ప్రజా కంటకుడిగా తయారయ్యారని, ప్రజాప్రతినిధులు సహా ఎవరికీ గౌరవం ఇవ్వకుండా సర్వాధికారిలా వ్యవహరిస్తున్నారని బీఎస్‌ఆర్‌సీపీ నాయకుడు శ్రీరాములు ఆరోపించారు. శాసన సభలో శుక్రవారం ఆయన బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. తమ మాటేమో కానీ సామాన్య జనానికి సైతం ఆయన లేని పోని ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. ‘ఈ పాపాత్ముడు తొలిగితే చాలు’ అన్నంతగా ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. ఆయన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విసిగి పోయారని తెలిపారు. హంపి ఉత్సవాల సందర్భంగా చిన్న అంగళ్లు కూడా రుసుం చెల్లించాలని ఆదేశించారని ఆరోపించారు. మైనింగ్ వల్ల పర్యావరణానికి ఏర్పడిన హానిని సరిచేయడానికి సేకరించిన రూ.1,800 కోట్లను ఖర్చు చేయలేదని తెలిపారు. ఏదైనా పని మీద ఎమ్మెల్యేలు వెళితే కనీసం రెండు గంటలు వేచి ఉండేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ వెంటనే ఆ కలెక్టర్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు బసవరాజ రాయరెడ్డి ఆయనకు అడ్డు తగులుతూ సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ పర్యవేక్షణ ఉన్నందున, బళ్లారి కలెక్టర్‌ను ఉన్న ఫళంగా బదిలీ చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఆయన మాటలకు కాంగ్రెస్‌కే చెందిన ఎంపీ. రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అటువంటి కట్టుబాట్లు ఏమీ లేవని, అనవసర విషయాలను ప్రస్తావించ వద్దని చురకలు అంటించారు. అనంతరం శ్రీరాములు చర్చను కొనసాగిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని ఆర్భాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం బడ్జెట్లో కేటాయింపులు చూస్తుంటే, ఆ ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం 50 సంవత్సరాలు పడుతుందని దెప్పి పొడిచారు. తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకు పోయినందున కాలువల చివరన ఉన్న ఆయకట్టుకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూడిక తొలగించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పేదలకు తక్కువ ధరకు ఔషధాలను అందించడానికి ఉద్దేశించిన జనరిక్ దుకాణాల్లో మందులు లభ్యం కావడం లేదని ఆరోపించారు. బడ్జెట్లో కొత్త తాలూకాలను ప్రకటించాల్సి ఉండగా, ఆ ఊసే లేదని నిష్టూరమాడారు. -
అటవీ వలలో ‘ఎర్ర’ దొంగలు
రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం దుంగల తరలింపు ఆగడం లేదు. ప్రతి రోజూ దుంగలు తరలిపోతూనే ఉన్నాయి. అక్కడడక్క మాత్రం కొందరు పట్టుబడుతున్నారు. తాజాగా శుక్రవారం రైల్వేకోడూరు రూరల్ మండలం బాలుపల్లె, జ్యోతి కాలనీ సమీపంలో వచ్చిన లారీపై అనుమానమొచ్చిన అటవీ అధికారులు ఆపారు. వీరిని చూడగానే లారీని ఆపి అందులోని దొంగలు పరారయ్యారు. లారీని పరిశీలించిన అధికారుల కంట 30 దుంగలు కంటపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు అవుతుందని రేంజర్ శ్రీరాములు తెలిపారు. ఎఫ్‌బీఓలు లింగారెడ్డి, శ్రీరామమూర్తి పాల్గొన్నారు. సిద్దవటంలో... గొల్లపల్లె బీట్‌లోని నిమ్మకాయలబండ అటవీ ప్రాంతం నుంచి 38 ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత దాడులు నిర్వహించిన అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోనే స్మగ్లర్లు దాగి ఉంటారన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టగా మైదుకూరు మండలం లక్ష్మీపల్లెకు చెందిన వెంకటకృష్ణయ్య అనే కూలీ దొరికాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సిద్దవటం రేంజ్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు.