నారి.. చైతన్య భేరి
తెలంగాణ రాష్ర్ట సాధన పోరులో అమోఘ పాత్ర పోషించిన స్త్రీమూర్తులకు తెలంగాణ నవ నిర్మాణంలో సముచిత స్థానం కల్పిం చాలని విమలక్క సూచి స్తున్నారు. నవ తెలంగాణలో మహిళల పాత్రపై ఆమె అంతరంగమిది..
- శ్రీధర్ సూరునేని, మంచిర్యాల
తొలి, మలి దశ తెలంగాణ పోరులో సగ భాగం బాధ్యత లను భుజాన ఎత్తుకు న్న స్త్రీలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించారు. పురుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో పోరుసల్పుతూ తమదైన ముద్ర వేశారు. గత కాలపు పోరాటాల్లో స్త్రీల పాత్రను అణగదొక్కిన సందర్భాలు న్నారుు. తెలంగాణ ఉద్యవుంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. బహుజన తెలంగాణ సాధనలో భాగంగా భూమి కోసం, భుక్తి కోసం, వివుుక్తి కోసం ప్రజలంతా చైతన్యం కావాల్సిన సవుయుమిది. పోరులో అమోఘపాత్ర పోషించిన స్త్రీవుూర్తులకు తెలంగాణ నవ నిర్మాణంలో సవుుచిత ప్రాధాన్యం కల్పించినప్పుడే సవుసవూజ స్థాపన సాధ్యం.
నాటి సాయుధ పోరాటం నుంచి నేటి అస్తిత్వ పోరాటం వరకు మహిళలు కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలోనే బలమైన కాకతీయ రాజ్యానికి వ్యతిరేకంగా ఆదివాిసీ స్త్రీలు సమ్మక్క-సారక్క చేసిన పోరాటం అసాధారణం. బహుజన రాజ్యాధికార కాంక్షను సాకారం చేసిన సర్వాయి పాపన్న తన తల్లి దర్వాయి తన మార్గదర్శి అని ప్రకటించిన విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఆరుట్ల కమలాదేవి, కామ్రేడ్ రంగవల్లి ఉద్యమంలో స్త్రీల పాత్రను చాటి చెప్పే మహిళామణుల్లో కొందరు మాత్రమే. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న బతుకమ్మ సైతం ‘అమ్మ’రూపంలో ఉండటం తెలంగాణలో స్త్రీల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్తోంది. మలిదశ ఉద్యమంలో పురుషులకు దీటుగా వందలు, వేలుగా స్త్రీలు గజ్జెకట్టి పోరులో నిలిచి ధూం-ధాంలతో ప్రజల్లో చైతన్యం రగిల్చి ఆంక్షల సంకెళ్లు తెంచడంలో తమ వంతు పాత్ర పోషించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరులో పోలీసుల లాఠీదెబ్బలు ఎదుర్కొనడమే కాకుండా చంటిబిడ్డతో రెండు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన కామ్రేడ్ కరుణ వంటి పోరాటయోధుల భాగస్వామ్యం ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉంది. ఉస్మానియా విద్యార్థినులు పోరు దారిలో నిలిచి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు.
డజన్ల కొద్ది కేసులు ఎదుర్కొని నెలల పాటు తెలంగాణ సాధన కోసం జైల్లో ఉన్న ఆడబిడ్డగా నేను గర్విస్తున్నా. తెలంగాణ సాధన కోసం అమరులయిన తమ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చేందుకే ప్రత్యక్ష పోరులో నిలిచిన మాతృమూర్తులకు జోహార్లు. ఆడబిడ్డలం వేదికగా ఏర్పడి అమరుల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేందుకు, తెలంగాణవాదులకు మద్దతు అందించేందుకు తెలంగాణలో పర్యటించాం. ఆత్మీయతను పంచేందుకు అమ్మల సంఘంగా ఏర్పడిన మాతృమూర్తులు ఉన్నారు.
అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఎప్పటికీ విఫలం కాదని చరిత్ర చెప్తోంది. దానికి నిదర్శనమే తెలంగాణ సాకారం. ఇందులో కొన్ని వర్గాలతో పాటు స్త్రీలే కాకుండా సబ్బండ వర్ణాల సంకల్పం ఉంది. బహుజన బతుకమ్మతో తెలంగాణలో అట్టడుగు వర్గాలకు దక్కాల్సిన ప్రాధాన్యాన్ని చాటి చెప్పాం. చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లికి ప్రతీకగా నిలిపి ఆమె పోరాట చరిత్రను జగతికి వెల్లడించాం. తెలంగాణ ఏకమై తన సత్తా చాటిన మిలియన్ మార్చ్, సాగరహారం వంటి పోరు ఘట్టాలలో, సకల జనుల సమ్మెలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక వర్గాలతో పాటు పోరాటంలో మేము సైతం అని నినదించిన తెలంగాణ వీర వనితలు ఉన్నారు. తెలంగాణ కల సాకారమైన వేళ సావూజిక తెలంగాణ సాధనకు అడుగులు వేయూలంటే అందులో ఆడవాళ్లకు అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే!