ఎరువుల దుకాణంపై విజిలెన్స్ దాడులు
కదిరి టౌన్ : పట్టణంలోని హిందూపురం రో డ్డుౖ వెపున్న క్రిష్ణా ఎరువుల ఏజెన్సీలో గురువారం సా యంత్రం విజిలెన్స్ అం డ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కదిరి మం డల వ్యవసాయాధికారి శ్రీహరినాయక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ వ్యవసాయాధికారి ఉమాపతి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఏసీటీఓ జిలానీబాషా ఆకస్మికంగా ఎరువుల దుకాణంపై దాడి నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన రికార్డులు, స్టాక్ రిజిష్ట్రరు, గోదాములో నిల్వ ఉన్న సరుకులను లెక్కించారు. దీంతో అక్రమంగా నిల్వ ఉన్న రూ.8లక్షలా 9వేల 467ల విలువ కలిగిన యూరియా, కాంప్లెక్స్, ఇతర ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ అక్రమంగా ఎరువులు నిల్వ వుంచితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.