srilekha
-
యర్రగొండపాలెం : RO శ్రీలేఖ చౌదరీపై ఈసీ వేటు
యర్రగొండపాలెం: సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించి వివాదాస్పద అధికారిగా మారిన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) పి.శ్రీలేఖ చౌదరీపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఆమెను ఆర్వో బాధ్యతల నుంచి తప్పిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు ఎన్నికల కమిషన్ యర్రగొండపాలెం నియోజకవర్గ ఆర్వో బాధ్యతలు అప్పచెప్పింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీని టార్గెట్‌గా చేసుకుని ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ప్రజలకు నీళ్లు సరఫరా చేసి పక్కన పడేసిన పాత ట్యాంకర్లపై ఉన్న సీఎం జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్లను సైతం ఆమె వదల్లేదు. అలాగే, నిబంధనల ప్రకారం వైఎస్సార్సీపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, స్టిక్కరింగ్‌లను సైతం ఆమె తొలగింపజేశారు. కానీ, అదే సమయంలో టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలు, జెండాలను తొలగించేందుకు ఆమె శ్రద్ధ వహించలేదు. బస్టాండ్‌కు సమీపంలో జెండా కర్రపై బహిరంగంగా కనిపిస్తున్న ఆ పార్టీ చిహ్నం, అక్కడికి సమీపంలోని బీజేపీ కార్యాలయంపై ఉన్న బోర్డు, జెండాలను పట్టించుకోలేదు. పత్రికల్లో వార్తలు వచ్చినా ఆమె పట్టనట్లు వ్యవహరించారు. ఇదేంటని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ, బీజేపీ ఫ్లెక్సీలు, జెండాలపై వివాదం చెలరేగడంతో వాటిని తొలగించారు. ఇక శ్రీలేఖ పచ్చనేతల ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారని, ఆర్వో కార్యాలయంలో జరిగే ప్రతి సమాచారం టీడీపీ నేతలకు చేరవేసే వారని ఆమెపై ఆరోపణలున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో స్టిక్కర్లు పంచారని, భోజనాలు పెట్టించారని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఒక కేసు, ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌పై మూడు కేసులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నర్రెడ్డి వెంకటరెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు. గ్లాసు గుర్తుపై తెరవెనుక మంత్రాంగం..ఇక నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ గుర్తును కేటాయించాల్సి వచ్చింది. గత నెల 29న నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఆమె చివరివరకూ స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరిపారని, ఆర్వో కార్యాలయం కేంద్రంగా చివరివరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తే టీడీపీ అభ్యర్థికి ఇబ్బందులు ఎదురవుతాయని, ఆ పార్టీ నుంచి ఒత్తిళ్ల మేరకు ఆమె స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపణలొచ్చాయి. ఈవీఎంలో కూడా ఆ గుర్తు కనిపించకుండా చేశారన్న విమర్శలున్నాయి. పోలింగ్ సమయంలో కూడా ఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజామున 3గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు కావడంతో పోలింగ్ కొనసాగిస్తూ వచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి.పచ్చ పత్రికలో అసత్య కథనంఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులకు గురైన మహిళా ఆర్వోపై వేటు.. అంటూ పచ్చపత్రిక ఈనాడులో ప్రచురితమైన కథనంలో ఏమాత్రం నిజంలేదని పలువురు ఖండించారు. ఎన్నికల సమయంలో ఆర్వోతో అభ్యర్థులు కలిసి మాట్లాడటం సహజమని.. అంతమాత్రాన బెదిరించారని ఆరోపించడం సరికాదని వారంటున్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా నిర్వహించలేక పోయారని, కౌంటింగ్ నిర్వహణ కూడా అదే విధంగా ఉండవచ్చన్న ఉద్దేశంతో ఆమెను విధుల నుంచి తప్పించి ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు. -
హైదరాబాద్ : కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌లో మెరిసిన నటి శ్రీలేఖ - ఫోటోలు
-
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
సోమందేపల్లి : స్థానిక రంగనాయకులు కాంప్లెక్స్ (ఎన్టీఆర్ సర్కిల్) వద్ద ఉన్న ఓ నీటి తొట్టెలో పడి మనోజ్ కుమార్ (5) అనే బాలుడు మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని యాకర్లపల్లికు చెందిన రవి, సుభాషినమ్మ దంపతులకు మనోజ్ కుమారుడు. సుభాషినమ్మ చెల్లెలుకు పెళ్లి కుదరడంతో ఆమె భర్త, కుమారుడితో కలిసి సోమవారం పుట్టిళ్లయిన గుడ్డం నాగేపల్లికి వచ్చింది. పెళ్లి పనుల్లో భాగంగా ఇంటికి రంగు కొనేందుకు మంగళవారం సుభాషినమ్మ తన కుమారుడు మనోజ్‌కుమార్, సోదరుడు శ్రీకాంత్‌తో కలిసి సోమందేపల్లికు వచ్చింది. పెయింటింగ్స్ కొనుగోలు చేస్తుండగా మనోజ్ ఆడుకుంటూ దగ్గరలో ఉన్న నీటితొట్టెలో పడిపోయాడు. అయితే ఇది గమనించిన సుభాషినమ్మ, శ్రీకాంత్‌లు బాబును ఎవరో కిడ్నాప్ చేశారని భావించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం వరకూ చిన్నారి కోసం వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి స్థానికులు పెయింట్ షాప్‌కు దగ్గరలో ఉన్న ఓ నీటితొట్టెలో పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడ వెదికారు. అప్పటికే మనోజ్‌కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రవి, సుభాషినమ్మ తమ కుమారుడు ఇక లేడని బోరున విలపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి తనకల్లు : మండల కేంద్రానికి చెందిన శ్రీలేఖ (17) అనే విద్యార్థిని అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గంగన్న కుమార్తె శ్రీలేఖ కదిరి బ్లూమూన్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షల్లో తాను పాస్ అవుతానో లేదోనని తరచూ మదనపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విషపూరిత ద్రావకం తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు అనంతపురం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
సంగీత దర్శకురాలు శ్రీలేఖతో చిట్‌చాట్
-
టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్
కాజీపేట రూరల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ కార్పొరేటర్ బస్కే శ్రీలేఖ దంపతులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. శ్రీలేఖ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం విదితమే. ఈ మేరకు హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యాలయంలో తన మద్దతుదారులు, కడిపికొండ కుచెందిన పలువురితో కలిసి టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ శ్రీలేఖ, ఆమె భర్త కృష్ణ టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాకుల రవీందర్, బి.రాంచంద్రారెడ్డి, దామెరుప్పుల కోటేశ్వర్, శంకర్‌బాబు, లక్ష్మీనారాయణ, కిశోర్, కన్నయ్య, బస్కె దశరథం, రమణారెడ్డి, కొడవటి అశోక్, బత్తిని సతీష్, బస్కె సాగర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ ప్రేమకథ!
ప్రేమ, వినోదం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈరోజుల్లో ప్రేమకథా చిత్రమ్’. దీనికి ‘కరీం నగర్లో’ అనేది ఉపశీర్షిక. క్రాంతి పిల్లి, సూర వేణుకుమార్, డింగారి సిద్ధార్థ్, వెంకట్, శ్రీలేఖ, ఉషాశ్రీ, సంజన, ప్రసన్న హీరో హీరోయిన్లుగా, అప్పారావు, ఆంజనేయులు ప్రధాన పాత్రల్లో క్రాంతి పిల్లి దర్శకత్వంలో పిల్లివారి కుటుంబం ఈ సినిమాను నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం చూస్తే ప్రేమలో ఎలా మోసపోకూడదో, ఏ ప్రేమ నిజమో, ఏది అబద్ధమో తెలుసుకుంటారు. ఈ చిత్రంలో మొత్తం 24 మంది సీనియర్ ఆర్టిస్టులు చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శరత్ చంద్ర. -
ఒకే ఒక ఆశతో...
అందరూ కొత్తవారితో తీసిన ‘ఒకే ఒక ఆశ’ చిత్రం విజయవంతం కావాలని సీనియర్ నటి కవిత అభిలషించారు. తరుణ్ తేజ, శరత్ అలి, శ్రీలేఖ, హరిత ముఖ్యపాత్రల్లో శ్రీలత నాయుడు సమర్పణలో సర్వోదయ మూవీస్ పతాకంపై పరాంకుశం రవి కుమార్ దర్శకత్వంలో జాని, చిన్నయ్య దొర నిర్మించిన చిత్రం ‘ఒకే ఒక ఆశ’. ఈ సినిమా పాటల సీడీని కవిత విడుదల చేశారు. ‘‘ఈ చిత్రానికి నేనే పాటలు స్వరపరిచాను. ఏప్రిల్ మొదటివారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. కెమేరా మ్యాన్ ఎస్ రైసాబ్, సహ నిర్మాతలు పి.పద్మజ, పి. శ్రీలత నాయుడు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
నన్నూ చంపేశారు
ఇద్దరు ఆడపిల్లల్ని రెండు కళ్ళలా చూసుకుంది. కనుచూపు మేర కనబడిందల్లా సాధించేలా పెంచింది. ఆడపిల్లలైతేనేం... కొడుకుల కంటే బలవంతులని నమ్మింది. తన ప్రేమే ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడుతుందని భావించింది. కానీ ప్రేమను ఉన్మాదం చంపేస్తుందని ఊహించలేదు! సమాజం మొద్దుబారిపోయింది. నా పిల్లల్నే కాదు, నన్నూ చంపేశారు అంటోంది. దీంట్లో నా పిల్లల తప్పేంటి? నా తప్పేంటి?! అని అడుగుతోంది. ‘వాడి’ తల్లిదండ్రుల పెంపకం బాగుంటే నా పిల్లలు బతికుండేవారని వాపోతోంది. ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయింది. కుమిలి కుమిలి ప్రాణం పెగిలిపోయింది. తనలాగ ఇంకొక తల్లికి జరక్కూడదు. తన పిల్లల్లా ఏ ఆడపిల్లకీ జరక్కూడదు అని ఆశిస్తోంది. ... ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన యామిని, శ్రీలేఖల తల్లి హైమావతితో ఫ్యామిలీ ఇంటర్వ్యూ ‘‘ఏ అర్ధరాత్రో కలత నిద్రలోకి జారుకుంటాను...‘మమ్మీ!’ అని పిలుపు... ఆశగా వెంటనే బయటకు వచ్చి చూస్తాను. యామిని లేదు. శ్రీలేఖా లేదు. కళ్ల ముందు అంతా చీకటి. శూన్యం. నా జీవితంలో ఇక మిగిలింది అదే!’’ ఏడ్చి ఏడ్చి గుండె తడి ఆరిపోయిన హైమావతి చెప్పిన మాటలివి. కిందటినెల 14వ తారీఖున హైదరాబాద్ కొత్తపేటలో ఓ దారుణం జరిగింది. యామినీసరస్వతి, శ్రీలేఖ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లను అమిత్‌సింగ్ అనే ఓ ఉన్మాది ప్రేమ పేరుతో దారుణంగా హత్య చేశాడు. కూతుళ్లే లోకంగా, వారి భవిష్యత్తే తన కలగా బతుకుతున్న ఆ తల్లికి తీరని కడుపు శోకాన్ని మిగిల్చాడు. తనకు జరిగిన ఈ అన్యాయం బిడ్డలున్న ఏ తల్లీతండ్రికి జరగకూడదని చెబుతున్న హైమావతి వ్యధ ఇది... ‘‘మొన్న జూన్‌లో నా పుట్టిన రోజు వస్తే, ఎన్నడూ లేనిదీ ఇద్దరికిద్దరు తెగ హడావిడి చేశారు. అప్పుడప్పుడు నేను పాకెట్‌మనీగా ఇచ్చిన డబ్బులను దాచుకొని, అర్ధరాత్రి కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేశారు. ‘ఇవన్నీ ఎందుకర్రా’ అంటే ‘మా కోసం ఎంతో కష్టపడుతున్నావు అమ్మా! నీకోసం ఈ మాత్రం చేయలేమా!’ అన్నారు. ‘ఇంకో మూడు నెలల్లో అక్క పెళ్లయిపోతుంది. మరో ఏడాదిలో నేను ఫారిన్ వెళ్లి, జాబ్ చేసి, నీకు బోలెడు డబ్బులు పంపిస్తా. అప్పుడు నువ్విలా రోజూ బస్సులో అంతేసి దూరం వెళ్లే బాధ తప్పుతుంది’ అంది శ్రీలేఖ. ‘పెళ్లయినా నేను మమ్మీదగ్గరే ఉంటాను..’ గారాలు పోయింది యామినీ. నా బిడ్డలకు నేనంటే ఎంత ప్రేమ అని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరికీ రెండేళ్లే తేడా. ఎంత బాగుంటారో స్నేహితుల్లా అనేవారు చూసినవారంతా! ఇద్దరి మధ్య అంత ఆప్యాయత ఉండేది. అక్కచెల్లెళ్లు అంటే చిన్న చిన్న గొడవలైనా ఉండటం సహజం అనుకుంటారంతా! కానీ వీరిద్దరూ దేనికీ గొడవపడేవారే కాదు. పరిస్థితులను అర్థం చేసుకొని, మసలుకునేవారు. శ్రీలేఖ పుట్టినప్పుడు ఒక్కక్షణం - కొడుకైతే బాగుండు, ఒక అమ్మాయి- ఒక అబ్బాయి ఉంటారు కదా అనుకున్నాను. కానీ, శ్రీలేఖ పుట్టాక ఇద్దరికీ ఒకరికొకరు తోడు అనుకున్నాను. అలాగే పెరిగారు. మా వారు (కృష్ణారెడ్డి. కండక్టర్) ఉద్యోగరీత్యా పిల్లలు నిద్రలేవకముందే డ్యూటీకెళ్లిపోయేవారు. వాళ్లు పడుకున్నాక ఇంటికి వచ్చేవారు. ఆ విధంగా వారికి నాతోనే అటాచ్మెంట్ ఎక్కువ. కిందటేడాది వరకు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోనే ఉన్నాం. అక్కడే సర్వశిక్ష అభియాన్‌లో ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలను కనిపెట్టుకొని ఉండటానికి మా అమ్మ నాతోనే ఉండేది. ఏడాది క్రితం... యామినీ ఇంజనీరింగ్ చదువైపోయింది. శ్రీలేఖ చదువు ఇంకో ఏడాదిలో పూర్తవుతుంది. యామిని పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ, కోచింగ్ తీసుకుంటోంది. శ్రీలేఖ పై చదువుల కోసం ప్లాన్.. ఇవన్నీ హైదరాబాద్‌లో ఉంటే సరిగ్గా అవుతాయనే ఉద్దేశంతో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. సాగర్రింగ్రోడ్లోనే మా తమ్ముడి కుటుంబం ఉంటుంది. అన్నింటికీ అందుబాటులో ఉంటుందనే కొత్తపేటలో ఇల్లు తీసుకున్నాం. అమ్మ ఎలాగూ నాతోనే ఉంటుంది. ఇవన్నీ చూసుకునే నేను ఉద్యోగానికి భరోసాగా వెళ్లేదాన్ని. ఈ రోజుల్లో ఆడపిల్లలకు బయట ఎలాంటి రక్షణ ఉందో చూస్తూనే ఉన్నాం. అందులోనూ నేను పొద్దున్నే డ్యూటీకి వెళితే, తిరిగి రాత్రికి గాను రాను. అందుకే చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి, బయల్దేరేదాన్ని. మూడు నెలల క్రితం... యామినికీ ఓ సాఫ్ట్వేర్ సంబంధం వచ్చింది. అన్నివిధాల నచ్చిన సంబంధం. మే 31న ఎంగే జ్మెంట్ చేశాం. అక్టోబర్‌లో పెళ్లి అనుకున్నాం. అక్క ఎంగేజ్మెంట్లో శ్రీలేఖదే హడావిడి అంతా! శ్రీలేఖ కలలు ఒకలా ఉన్నా, ఇంకో రెండేళ్లలో తన పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. ఆర్నెల్ల క్రితం... శ్రీలేఖ ఒకసారి చెప్పింది తనతో పాటు చదివిన ఒకబ్బాయి వేధిస్తున్నాడని... నా గుండెలో రాయి పడినంత భయమేసింది. ఆ అబ్బాయిని మా తమ్ముడు వెళ్లి మందలించాడు. అతని తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాను. ‘ఇలా అయితే, పోలీసు కేసు పెడతాను’ అని హెచ్చరించాను. ఆ తర్వాత శ్రీలేఖను అడిగాను... ‘ఇప్పుడు ఏ సమస్యా లేదు’ అని చెప్పింది. నేను కాస్త తెరిపిన పడ్డాను. ఆ రోజు... యామినికి ముందు రోజు నుంచి కాస్త జ్వరం. క్లాస్‌కు వెళ్లలేదు. మా బంధువు ఒకరు చనిపోతే, అమ్మ అక్కడికి వెళ్లింది. సాయంత్రానికి వచ్చేస్తానంది. అక్క కోసం శ్రీలేఖ కాలేజీకి వెళ్లలేదు. ఇద్దరు ఉన్నారు కదా ఒకరికొకరు తోడుగా అని, పాలు కలిపి, ఇద్దరికీ ఇచ్చి.. వంట చేసిపెట్టి రోజులాగే 7 గంటలకల్లా ఆఫీసుకు బయల్దేరాను. వెళుతున్న నాకు ‘జాగ్రత్తమ్మా!’ అని చెప్పారు. అంతే...! అదే నా బిడ్డల చివరి మాట. అదే నాకు చివరి చూపు. నేను బస్సు దిగేవరకు మధ్యలో ఒక్కసారైనా ఫోన్ చేసేవారు. ఇంకా చేయలేదేంటి అనుకుంటూనే... షాద్‌నగర్‌లో బస్సు దిగాను. నేను ఫోన్ చేయబోతుండగానే, అప్పుడే నా ఫోన్ మోగింది. మా పై ఇంటిలో ఉండేవారు... ‘యామిని, శ్రీలేఖలను ఎవరో వచ్చి పొడిచేశారు... అని చెబుతున్నారు. గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. తిరిగి కొత్తపేటకు ఎలా చేరుకున్నానో... ఇప్పటికీ గుర్తులేదు. హాస్పిటల్లో ఇద్దరు బిడ్డలు రక్తపు మడుగులో.. ఏం చెప్పను!! విగతజీవులైన బిడ్డలను చూసి కుప్పకూలిపోయాను. ఇప్పటికీ వాళ్లు లేరంటే నమ్మకం కలగడం లేదు. ఏ వైపు చూసినా వారి రూపాలే! ఏ మాట విన్నా వారి గొంతే! ... పండగ వచ్చిందంటే ఆ కళ అంతా వారిలోనే చూసుకొని పొంగిపోయేదాన్ని. ఇప్పుడు... వారిద్దరినీ కోల్పోయి గుండె తడి ఆరిపోయి కట్టెలా మిగిలాను. ఒకరికోసం ఒకరు తోడున్నారులే అని భరోసా ఉండేది. ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు నన్ను ఒంటరిదాన్ని చేసి. శిక్ష తప్పదు... పోలీసుల ద్వారా విషయాలు తెలిసి నివ్వెరపోయాను. ఆ ఉన్మాది (అమిత్‌సింగ్) మేం ఉన్న ఏరియాలోనే తన స్నేహితుల గదిలో ఉన్నాడని, నా ఇంటి మీద నిఘా ఉంచాడని, పెద్దలెవరూ లేని సమయం చూసుకొని నా ఇంటి దీపాలను ఆర్పేశాడని. నా బిడ్డల చావుకు కారణమైనవాడిని బతకనివ్వకూడదు. వెంటనే చంపేయాలి. అతడిని చంపితే నా బిడ్డలు తిరిగొస్తారని కాదు. కానీ, ఇలాంటి శిక్ష ఏ తల్లీకి పడకూడదన్నదే నా బాధ. మగపిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి శిక్షపడుతుందో వారికి తెలిసిరావాలి. ఆడపిల్ల బయట తిరిగితే రక్షణ లేదనుకుంటాం. కానీ, ఇంట్లో ఉన్నా రక్షణ లేదంటే...! మేం హెచ్చరించినప్పుడే తమ కొడుకు విషయంలో ఆ తల్లీతండ్రీ జాగ్రత్తపడి ఉంటే.. మూడు నెలల్లో పెళ్లి పీటలెక్కాల్సిన నా కూతురు మట్టయ్యేదా? ‘మీ కేమండీ! ఇద్దరు ఆడపిల్లలు ముత్యాల్లా ఉన్నారు. చక్కగా చదువుకున్నారు! అనేవారంతా.. !’ అలాంటి నా బంగారు తల్లులను పొట్టనపెట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు. నా బిడ్డలు చేసిన పాపమేంటి? అబ్బాయి ప్రేమను కాదంటే ఆడపిల్ల చావల్సిందేనా! ప్రేమ పేరుతో మన ఇళ్ల మధ్యే ఉన్మాదులు తిరుగుతుంటే వారిని గుర్తించేదెలా? కూతుళ్లను కాపాడుకునేదెలా?!’’ అంటూ కూతుళ్ల భవిష్యత్తే లోకంగా బతికిన ఆ తల్లి వేసిన ప్రశ్నలకు ఈ సమాజం ఏం బదులిస్తుంది? - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి చెబితేనే సేవ్ అవుతారు వేధింపులు ముందే తెలుసు కాబట్టి పోలీసు కేసుపెట్టి ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు. చాలామంది అమ్మాయిలు... అబ్బాయిల వేధింపులకు బయట సమాజం ఏమనుకుంటుందో అని భయపడి ఏమీ చెప్పరు. అదే అడ్వాంటేజీగా అబ్బాయిలు తీసుకుంటున్నారు. ఎవరైనా వేధిస్తుంటే తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, పోలీసులకు తప్పక తెలియజేయాలి. అలాగే చుట్టుపక్కల వారినీ అలెర్ట్ చేయాలి. అలాగే... సైబర్ కంట్రోల్ 100 కి డయల్ చేసి, షీ టీమ్ హెల్ప్ కావాలి అని అడిగితే వెంటనే సాయం అందుతుంది. సైబరాబాద్ షీ టీమ్ పేరున ఫేస్బుక్ పేజీ కూడా ఉంది. వాట్సప్ నెంబర్ 9490617444 కు ఫిర్యాదుచేయవచ్చు. బండిమీద వెళ్లేటప్పుడైనా, ఎక్కడైనా వేధిస్తున్నట్టు తెలిస్తే వెంటనే తమ వద్ద ఉన్న ఫోన్ ద్వారా ఫోటోలు తీసి పంపవచ్చు. - రమా రాజేశ్వరి, ఐపిఎస్, డిసిపి, మల్కాజిగిరి, షీ టీమ్స్ హెడ్, హైదరాబాద్ -
అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న ప్రేమోన్మాది అరెస్టు
హైదరాబాద్ : నగరంలోని కొత్తపేటలో అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతి, శ్రీలేఖను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పరారైన నిందితుడు అమిత్‌సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ గుర్తించిన పోలీసులు మంగళవారం అతనిని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. అమిత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిందుతుడి సెల్‌ఫోన్ సిగ్నిల్స్ ఆధారంగా గుజరాత్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈనెల 14 న కొత్తపేట గాయత్రీపురం రోడ్ నెం-1లోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామినిలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువతులు చికిత్స పొందుతూ మృతిచెందారు. అక్కాచెల్లెళ్ల లను హత్య చేసిన తర్వాత అమిత్‌సింగ్ ఉప్పల్‌కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్చాఫ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ గాలించారు. 4 బృందాలుగా విడిపోయిన పోలీసులు ఆ కోణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిగ్నల్స్ ఆధారంగా మంగళవారం గుజరాత్ లో అమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆ ఉన్మాది ఎక్కడ?
♦ ఇంకా దొరకని అక్కాచెల్లెళ్లను హత్యచేసిన నిందితుడు అమిత్‌సింగ్ ♦ పోలీసుల దర్యాప్తులో కానరాని పురోగతి సాక్షి, హైదరాబాద్ : కొత్తపేట గాయత్రీపురంలో జంట హత్యలు జరిగి వారం కావస్తున్నా నిందితుడు అమిత్ సింగ్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. రోజురోజుకు అత్యాధునిక సాంకేతిక సేవలతో మన ముందుకు వస్తున్న సైబరాబాద్ పోలీసులు...గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని ఈ 21 ఏళ్ల కుర్రాడిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. భారీ చోరీ జరిగితే 24 గంటలు గడవక ముందే దొంగలను పట్టుకున్నామంటూ ప్రెస్మీట్లు పట్టి మరీ చెప్పే సిటీ పోలీసులు...ఇద్దరు యువతులను కర్కశంగా చంపిన అమిత్‌సింగ్ జాడ కనిపెట్టలేకపోవడం విడ్డూరం. ఇది మన పోలీసుల వైఫల్యమనుకోవాలా? లేక అమిత్ తెలివిగా వ్యవహరించి తప్పించుకుంటున్నాడనుకోవాలా?...ఈ ప్రశ్నలకు పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది. పురోగతి లేదు... అమిత్‌సింగ్ తండ్రి అమర్‌సింగ్, తల్లితో పాటు చెల్లెలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు...మరిన్ని వివరాలు రాబట్టేందుకు స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అమిత్ ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్ఛాప్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ తీవ్రంగా గాలించినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. హత్య చేసిన తర్వాత ఉప్పల్ నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు వెళ్లిన అమిత్ ఢిల్లీలో ఉండే పెద్దమ్మ కూతురి వద్దకు రైల్లో వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఫలితం లేదు. ఇప్పటికే నాలుగు బృందాలుగా విడిపోయి ఎక్కడెక్కడ ఉండే అవకాశముందని భావిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఓ కేసు నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఎనిమిది మంది హైదరాబాద్ పోలీసుల బృందం...ఢిల్లీలో అమిత్‌సింగ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు కూడా కొంత మంది పోలీసులు వెళ్లినా ఫలితం దక్కలేదు. చనిపోయాడా? ‘నన్ను ప్రేమించి వంచించిన శ్రీలేఖతో పాటు అడ్డొచ్చిన యామిని సరస్వతీని కూడా హత్యచేశా. ఇది మీకు చెప్పేందుకు ఫోన్ చేశా. ఇక నేను కూడా చస్తాను నాన్న’ అని చివరిసారిగా తండ్రి అమర్‌సింగ్‌తో అన్నట్టు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే అమిత్ ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ అలా జరిగితే ఇప్పటికే మన పోలీసులకు మృతదేహం దొరికిపోయేది. హత్య జరిగి ఆరు రోజులైనా అమిత్ సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ దొరకకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించేలా చేస్తోంది. గతంలో ఏ మాత్రం నేరచరిత లేని అమిత్ తెలివిగా వ్యవహరించి పోలీసుల కన్నుగప్పి సిటీ దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్లాడనడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మంగళవారం ఉదయం 8. 40 గంటలకు హత్య చేసిన అమిత్ జాడ ఇప్పటివరకు కచ్చితంగా గుర్తించలేని పోలీసులు...అతడి బ్యాంక్ ఖాతా లావాదేవీలపై కన్నేసినా ఎలాంటి పురోగతి లేదు. అమిత్‌తో చనువుగా ఉండే స్నేహితులందరినీ ప్రశ్నించినా ఏ మాత్రం ప్రయోజనం కనబడటం లేదు. పట్టుకుంటాం... అమిత్‌సింగ్‌ను అరెస్టు చేసి తీరుతామని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. ఇప్పటికే తమ సిబ్బంది అదే పనిలో ఉన్నారని, సాంకేతికత ఆధారంగా అమిత్ ఎక్కడున్నాడో గుర్తించగలిగామన్నారు. రెండు రోజుల్లో తప్పక అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి భరోసా కరువు.. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన యామిని సరస్వతీ, శ్రీలేఖ తల్లిదండ్రులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రస్తుతం హస్తినాపురంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు బిడ్డలనూ కోల్పోయి అచేతన స్థితిలో ఉన్న వీరిని ప్రభుత్వం నుంచి పరామర్శించేవారే కరవయ్యారు. మేమున్నామనే భరోసా ఇచ్చేవారు కానరావడం లేదు. పుష్కరఘాట్లలోను, మొక్కలు నాటుతూ...ఇలా ఎక్కడబడితే అక్కడ కనిపించే మన మంత్రులకు...ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఓ తల్లి ఆక్రందనలు మాత్రం వినిపించడంలేదు. చనిపోయినా చూపునిచ్చారు అమిత్ సింగ్ చేతిలో హతమైన శ్రీలేఖ, యామిని సరస్వతీ కళ్లు దానం చేశారు. తాము చనిపోయి ఇతరులకు చూపునిచ్చారు. అటువంటి మంచివారిని పొట్టనబెట్టుకున్న హంతకుడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడం బాధనిపిస్తోంది. అయినా మాకు చట్టంపైనా గౌరవముంది. హంతకుడికి కఠిన శిక్ష విధించాలని మృతుల బంధువు లక్ష్మీ ప్రసన్న డిమాండ్ చేశారు. -
వాళ్లను చంపేశా.. నేను చస్తా!
-
వాళ్లను చంపేశా.. నేను చస్తా!
* తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడిన అమిత్‌సింగ్ * నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు హైదరాబాద్: ‘‘నన్ను ప్రేమించి వంచించిన శ్రీలేఖతో పాటు అడ్డువచ్చిన ఆమె అక్కను కూడా చంపేశా. ఇది మీకు చెప్పేందుకు ఫోన్ చేశా. ఇక నేను కూడా చస్తాను నాన్న’’ తన ప్రేమను తిరస్కరించిందన్న కసితో యువతిని, ఆమె సోదరిని అత్యంత కర్కశంగా హత్య చేసి పారిపోయిన మృగాడు అమిత్ సింగ్ తన తండ్రితో ఫోన్లో చివరిసారిగా మాట్లాడిన మాటలు ఇవి.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో మంగళవారం అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతి, శ్రీలేఖను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పరారైన నిందితుడు అమిత్‌సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అమిత్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు మరింత సమాచారం కోసం అతడి ఇద్దరు స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేస్తున్నట్లు సమాచారం. అక్కాచెల్లెళ్ల లను హత్య చేసిన తర్వాత అమిత్‌సింగ్ ఉప్పల్‌కు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్చాఫ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. అలాగే ఉప్పల్ నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు వెళ్లి... ఢిల్లీకి రైళ్లో ఏమైనా వెళ్లి ఉంటాడా అని తెలుసుకునేందుకు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు కూడా కొంత మంది పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, హత్యోదంతం తర్వాత అమిత్ తనతో చివరిసారిగా మాట్లాడాడని అతడి తండ్రి అమర్‌సింగ్ పోలీసుల ముందు అంగీకరించినట్టు సమాచారం. ‘నువ్వు ఎక్కడున్నావో ఇప్పుడు అక్కడే ఉండు. పోలీసు స్టేషన్‌కు వెళదాం’ అని తండ్రి అంటే.. ‘ఇక నేను బతకను.. చస్తాను నాన్న..’ అని చెప్పి అమిత్ ఫోన్ స్విచ్చాప్ చేసినట్టు తెలిసింది. కాగా, దాదాపు 15 రోజుల క్రితం ఓ స్నేహితుడి నుంచి అమిత్ రూ.2,000 తీసుకున్నట్టు, ఈ డబ్బులతోనే కత్తి, సుత్తె కొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
'ఎలా ప్రేమించాలో నేర్పావు గానీ..'
ఎలా ప్రేమించాలో నేర్పావు గానీ.. ఎలా ఆపాలో చెప్పలేదు.. అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్‌లో ఓ సందేశం అమిత్ సింగ్ నంబర్‌తో వాట్సాప్‌లో మంగళవారం కనిపించింది. దీన్ని బట్టి అతని ఉద్దేశాన్ని గ్రహించవచ్చు. హైదరాబాద్: 'మా అమ్మాయిని వేధిస్తున్నాడు... ఇక నుంచి ఆ ఆగడాలు ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంద'ని మృతుల తల్లి హైమావతి నిందితుడి తల్లిదండ్రులను హెచ్చరించింది. వారం క్రితం తమ బంధువులతో కలిసి షాద్‌నగర్‌కు వెళ్లిన ఆమె... అమిత్ సింగ్‌ను కూడా మందలించింది. తొలి రెండు రోజులు శ్రీలేఖ ఇంటివైపు అమిత్ సింగ్ కన్నెత్తి చూడలేదు. ఆ రెండు రోజులు తీవ్రంగా ఆలోచించుకున్న అమిత్... శ్రీలేఖ తనకు దక్కదని...అంతమొందించాలనుకున్నాడు. శుక్రవారం నుంచి ఇంటి దగ్గర రెక్కీ మొదలు పెట్టాడు. ఇంటి బాధ్యతలు చూసుకునే అమ్మమ్మ నారమ్మ మహబూబ్ నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిందని తెలుసుకున్నాడు. శని, ఆది, సోమవారం.. ఇలా మూడు రోజుల పాటు ఆ ఇంటి ముందరే చక్కర్లు కొట్టాడని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం అక్క యామినికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తోడుగా శ్రీలేఖ ఉంది. అప్పటికే వాళ్ల అమ్మ విధుల కోసం మహబూబ్ నగర్ బయలుదేరింది. అప్పుడే అప్రమత్తం చేసి ఉంటే.. ఉదయం ఏడు గంటల నుంచే ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న అమిత్ సింగ్ శ్రీలేఖకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో ‘ఇంటి బయటకు రా... మాట్లాడాలి’ అంటూ ఎస్ఎంఎస్ పంపించాడు. ఆ విషయం ఇంటిపైన ఉండే సురేశ్ కుటుంబ సభ్యులకో... పోలీసులకో చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. నిమిషాల్లోనే.. యామినికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో శ్రీలేఖ ఇంటిపైన ఉండే సురేశ్ టిఫిన్ తీసుకొద్దామని 8.20 గంటలకు బయటకు వెళ్లడాన్ని అమిత్ గమనించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో నేరుగా ఇంట్లోకి వెళ్లి శ్రీలేఖపై ఎనిమిదిసార్లు దాడి చేశాడు. ఇది గమనించిన యామిని అడ్డుకునేందుకు యత్నించగా ఆమెను కూడా 18 సార్లు పొడిచాడు. దాదాపు 20 నిమిషాల్లోనే ఈ ఘోరం చేసి పరారయ్యాడు. వారిని పొడిచిన తీరు అమిత్సింగ్లోని ఉన్మాదానికి అద్దం పడుతోంది. స్నేహితులు సహకరించారా? ఘటనా స్థలిలోనే అమిత్ చెప్పులు, బ్యాగు, కత్తులు, సుత్తి, వైరు వదిలేసి వెళ్లాడు. పట్టుకునేందుకు వచ్చిన రంజిత్‌ను నెట్టి.. మెయిన్‌గేట్ నుంచి పక్కనే ఉన్న ఓపెన్ ఫ్లాట్ లోపలికెళ్లాడు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనికి స్నేహితులు ఎవరైనా సహకరించారా? అన్న దిశగా ఆరా తీస్తున్నారు. అన్ని చోట్లా గాలింపు.. శ్రీలేఖ కోసం ఆరు నెలలుగా స్థానికంగానే అమిత్ కిరాయికి ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. ఏ ఏ ఇళ్లలో ఉన్నాడనే వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నిందితుడు ఏ మార్గాల్లో వెళ్లడానికి అవకాశం ఉందో... ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లతో పాటు ఎక్కడ తల దాచుకునే ఆస్కారం ఉందో ఆ ప్రాంతాల్లో నాలుగు బృందాలు జల్లెడ పడుతున్నాయి. బీహార్ వెళ్లే అవకాశం ఉండటంతో అటువైపుగా కూడా దృష్టి సారించారు. షరీఫ్‌గా పరిచయం హయత్‌నగర్‌లోని అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్‌లో బీటెక్ చదువుతున్నానని అమిత్‌సింగ్ స్థానికులకు చెప్పేవాడు. బాధితురాలి ఇంటికి సమీపంలోని ఓ గ్రౌండ్లో రెండురోజులకొకసారి క్రికెట్ ఆడుతుండేవాడు. కొన్నిసార్లు శ్రీలేఖతోనూ అక్కడ మాట్లాడడని... ఆ సమయంలో ఆమె స్నేహితురాళ్లతో షరీఫ్‌గా పరిచయం చేసుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే పట్టుకుంటాం అక్కాచెల్లెళ్ల హత్య జరిగిన తీరు నిందితుడి ఉన్మాదాన్ని చాటి చెబుతోంది. ఇది దారుణం. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న మా సిబ్బంది బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం. -సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్. -
తీవ్ర విషాదంలో టాలీవుడ్..