staff shortages
-
రైల్వేలో కాంట్రాక్టు నియామకాలు
న్యూఢిల్లీ: వేర్వేరు విభాగాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటంపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేల్లోని కీలక రంగాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకోవాలని నిర్ణయించింది. ఆవిరితో నడిచే లోకో మోటివ్‌లు, పాత రైల్వే బోగీలు, సిగ్నల్స్ నిర్వహణ, పరిరక్షణకు పదవీవిరమణ చేసిన ఉద్యోగుల సేవల్ని తీసుకోనున్నట్లు తెలిపింది. కాంట్రాక్టు నియామకాలను చేపట్టాలని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వేశాఖ ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే నియామకాల బోర్డు(ఆర్ఆర్బీ) ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మాజీ ఉద్యోగుల్ని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకునే అధికారాన్ని జోనల్ మేనేజర్లకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కాంట్రాక్టు విధానంలో ప్రధానంగా స్టెనోగ్రాఫర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను భర్తీ చేస్తామన్నారు. -
కష్టాల కాఖీ..
పెరిగిన పని ఒత్తిడితో నాలుగో సింహం నలిగిపోతోంది. పోలీసులు సతమతమవుతున్నారు. కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్సైల వరకు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్న జిల్లాల ఆవిర్భావం తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువైంది. సిబ్బంది కొరతతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది. కేసుల విచారణ, నిందితుల అరెస్ట్‌లో కానిస్టేబుల్ నుంచి ఎస్సైలే కీలకం కావడంతో వారికి తీరిక లేకుండాపోతోంది. జనగామ: రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్కార్ నుంచి పోలీసులకు అత్యున్నతమైన గౌరవం, సౌకర్యాలు దక్కుతున్నా.. అదే స్థాయిలో రెట్టింపు కష్టాలు వేధిస్తున్నాయి. మొన్న ఇవాంక.. నిన్న ప్రపంచ తెలుగు మహాసభలు, రోజూవారీగా మంత్రుల పర్యటనలు ఇలా వరుస డ్యూటీలు చేస్తూ నలిగిపోతున్నారు. బందోబస్తుల పేరుతో జిల్లాలోని పోలీసులు పట్టుమని పది రోజులు కూడా పోలీస్టేషన్లో విధులను నిర్వర్తించ లేకపోతున్నారు. అధికారులు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యటనలతో అసలు డ్యూటీ మరిచిపోతున్నారు. అదనపు పని చేస్తూ.. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా.. ఉన్నతాధికారులకు చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది పోలీసులు ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వరుస బందోబస్తులు స్టేషన్ డ్యూటీలతోపాటు ప్రభుత్వం తలపెట్టే ప్రతి కార్యక్రమానికి పోలీసుల అవసరం ఉండడంతో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. ఒకరోజు ముందే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాక బందోబస్తు పేరుతో పక్కజిల్లాలకు సైతం పంపిస్తున్నారు. సిబ్బంది ఇలా డ్యూటీలపై బయటికి వెళ్లడంతో లేక చాలా పోలీస్స్టేషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. గొడవలు, భూతగాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలా అనేక సమస్యలను ఎదుర్కొం టున్న బాధితులు న్యాయం కోసం ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. జనవరి వరకు భారం తప్పదు జిల్లాలో పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. వచ్చే ఏడాది జనవరి వరకు ఇక్కడ పని చేస్తున్న వారికి పని భారం తప్పదు. ప్రభుత్వం 38 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. తట్టుకుని పనిచేయాల్సిందే. అయినప్పటికీ శాంతిభద్రతల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నం. –మల్లారెడ్డి, డీసీపీ, జనగామ వీఐపీల రాకపోకలతో హైవేలపై హడావుడి ‘హలో.. హైదరాబాద్ నుంచి ఫలనా మంత్రి గారు బయల్దేరారు.. తెల్లవారుజామునే పై అధికారుల నుంచి ఫోన్. దీంతో పెంబర్తి నుంచి స్టేషన్ ఘన్పూర్ చిన్నపెండ్యాల వరకు హైసెక్యూరిటీ. వెంటనే మరో మంత్రి.. ఆ తర్వాత ఉన్నత స్థాయి అధికారుల పర్యటనలు.. హైవేపై పోలీసులు చక్కర్లు కొడుతున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్, అపరిచిత వ్యక్తులపై నిఘా రోజూ చేయాల్సిన పనే. అటుగా వెళ్లిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు.. కంటిపై రెప్పవాల్చకుండా 24 గంటలపాటు విధులు నిర్వర్తించాల్సిందే. ఈ బందోబస్తులకు తోడు సమస్యల పరిష్కారానికి జరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, రాస్తారోకోలను కట్టడి చేయాల్సిన డ్యూటీ కూడా పోలీసులదే. బందోబస్తు డ్యూటీలు ముగించుకొని అలసిపోయి తీరా స్టేషన్‌కు వెళ్లేసరికి ‘సారూ పొద్దుగాల వచ్చిన.. మా కేసు ఏమైందంటూ’ ఆవేదన వెలిబుచ్చే బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఇంత పని ఒత్తిడిలోనూ కేసుల నమోదు, విచారణ, నిందితుల కోసం గాలింపు, కోర్టుకు తరలింపు, కేసుల క్లియరెన్స్‌కు ఉన్నతాధికారుల టార్గెట్లు ఉండనే ఉంటాయి. దీంతో కానిస్టేబుళ్లు, అధికారులు బాధను దిగమింగుకుని విధులు నిర్వరిస్తున్నారు. -
కొత్త ఠాణాలను వేధిస్తోన్న కొరత
► నాలుగు పీఎస్‌లల్లో సిబ్బంది అంతంతే ► నిర్వహణ ఖర్చులకు డబ్బులు కరువు ► నిధులు విడుదల చేయని ప్రభుత్వం ► సమస్యల వలయంలో స్టేషన్లు రామారెడ్డి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో గతేడాది అక్టోబర్ 11న కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. కామారెడ్డిని కొత్త జిల్లాగా, రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్, బీబీపేటలను కొత్తగా ఐదు మండలాలుగా ఏర్పాటు చేసింది. అయితే వీటిల్లో తాత్కాలిక భవనాలల్లో రెవెన్యూ, పోలీసు స్టేషన్లను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు శాంతి భద్రతలను కోసం ఏర్పాటు చేసిన పోలీసుస్టేషన్ కనీస సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా విధులు నిర్వహించేందుకు పాత వాహనాలనే కేటయించారు. దీంతో అవి పదే పదే మొరాయిస్తున్నాయి. ఈ కారణంగా ఎస్ఐలతో సహా సిబ్బంది రాత్రి గస్తీకి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 323 గ్రామ పంచాయతీలు, 9లక్షల72వేల 625 జనాభాతో కామారెడ్డిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. ఎఫ్ కేటగిరిలో స్టేషన్ల ఏర్పాటు.. పోలీసుశాఖ పరంగా గ్రామీణ ప్రాంత పోలీసు స్టేషన్లు ఎఫ్ కేటగిరిలోకి వస్తాయి. జిల్లాలోని రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ పోలీసు స్టేషన్లకు 1 ఎస్ఐ, 2 ఏఎస్ఐలు, 3 హెడ్ కానిస్టేబుళ్లు, 18 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. అయితే రామారెడ్డి పోలీసు స్టేషన్లో 1ఎస్ఐ 2హెడ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. మిగితా మూడు స్టేషన్లలో ఏఎస్ఐ ఉన్నా పూర్తిస్థాయిలో సిబ్బందిని కేటాయించలేదు. దీంతో వీఐపీల పర్యటనలకు బందోబస్తు కల్పించడం, నేరాల నియంత్రణకు రా త్రి గస్తీ నిర్వహించడం, స్టేషన్లో ఫిర్యాదులను స్వీకరించి విచారణకు తీసుకురావడం వంటి పనులు ఉన్న సిబ్బందికి కత్తి మీద సాములా తయ్యారైంది. నిర్వహణ భారంతో ఒత్తిడి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ పోలీసుస్టేషన్ల నిర్వహణ కోసం వివిధ కేటగిరీల ఆధారంగా రూ.25వేల నుంచి రూ.75 వేల వరకు నిర్వహణ కోసం ప్రతి నెలా డబ్బులను పోలీసు స్టేషన్లకు కేటాయిస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటైన నాలుగు స్టేషన్లకు 8నెలలు గడుస్తున్నా డబ్బులను మంజూరు చేయలేదు. కొత్త స్టేషన్లలో ఎస్ఐలు నిర్వహణ భారంతో మరింత ఒత్తిడికి గురవుతున్నారు. మెరాయిస్తున్న పాత వాహనాలు.. రాత్రిపూట జిల్లాలోని 323 జీపీల పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించడం గ్రామాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే అక్కడికి చేరుకొని పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకోడం కోసం వేగంగా ఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొత్త పోలీసుస్టేషన్లకు రెండు నెలల క్రిత్రం పాత వాహనాలనే కేటాయించారు. అయితే ఈ వాహనాలు పదే పదే మెరాయిస్తున్నాయి. దీంతో బైకులపై పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వాహనాలతో ఇబ్బంది, సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహించడం ప్రతి జీపీకి పోలీసు అధికారిని నియమించడం సాధ్యం కావడం లేదు. ప్రజలకు చేరువయ్యేదెలా..? పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే కొత్తగా ఏర్పాటైన మండల కార్యాలయాలకు పోలీసు స్టేషన్లకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లా, మండలాలు ఏర్పాడి 8 నెలలు పూర్తి అయినా ప్రభుత్వం కనీసం పోలీసు స్టేషన్‌కు కొత్త వాహనం, సిబ్బందిని కేటాయించకపోతే ఎలా విధులు నిర్వహిస్తారని ప్రజలు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. -
పనిభారం
• ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది కొరత • సక్రమంగా అందని వైద్య సేవలు • 500 పడకలకు పెంచితే అదనపు సిబ్బంది అవసరం • ప్రతిపాదనలు పంపినా పట్టించుకోని ప్రభుత్వం రెండు, మూడు నెలల్లో ట్రామా కేర్, ఎంసీహెచ్ భవనాలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రి 500 పడకలస్థాయికి పెరుగుతుంది. అదనంగా 200 మంది సిబ్బంది అవసరమవుతారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న 41 పోస్టుల్లో స్పెషలిస్ట్ సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, అనలిస్ట్, రేడియాలజిస్ట్, హెడ్నర్స్, స్టాఫ్‌నర్స్, ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వార్డుబాయ్, స్ట్రెచ్చర్ బేరర్లను నియమించాల్సి ఉంది. – ఖమ్మం వైద్య విభాగం ఖమ్మం, వైద్య విభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు 500 పడకల నిర్మాణానికి పూనుకుంది. కానీ సిబ్బంది కొరతతో రోగులకు వైద్య సేవలకు అందటం లేదు. 15 ఏళ్ల క్రితం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని 250 పడకల స్థాయికి తెచ్చారు. అప్పుటి జనాభా ప్రకారం వైద్య సేవలు సక్రమంగానే అందేవి. జిల్లా జనాభా పెరగటంతో సరిహద్దు జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. దీంతో ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ సేవలు పెరిగాయి. ప్రస్తుతం రోజూ 1000 నుంచి 1200 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని వివిధ విభాగాల సిబ్బందికి పనిభారం పెరిగింది. ఉన్న పడకలకు అదనంగా మరో 100మంది ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. పడకలు పెరుగుతున్నా సిబ్బంది మాత్రం పెరగటం లేదు. ఈ క్రమంలో అందరికీ పూర్తి స్థాయిలో వైద్యం అందించలేక పోవటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో వేరే గత్యంతరం లేక డాక్టర్లు హైదరాబాద్, ఇతర పట్టణాలకు వెళ్లాలని రిఫర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 202 మంది సిబ్బందితోనే ఆస్పత్రి నిర్వహణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఆస్పత్రికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్, వరంగల్ తర్వాత అత్యధికంగా రోగుల తాకిడి ఇక్కడే ఉంటోంది. అయినా ఈ ఆస్పత్రిని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. అన్ని రకాల వైద్యానికి ఇక్కడ అవకాశమున్నా తగిన సిబ్బంది మాత్రం లేరు. కేవలం 202 మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. 143 మంది పర్మినెంట్, 59 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 250 పడకల స్థాయిలో గతంలో 243 మంది సిబ్బంది ఉండేవారు. పలువురు ఉద్యోగ విరమణ పొందటంతో ప్రస్తుతం 41 ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో స్పెషలిస్ట్ సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, అనలిస్ట్, రేడియాలజిస్ట్, హెడ్నర్స్, స్టాఫ్‌నర్స్, ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కింది స్థాయి పోస్టులైన వార్డుబాయ్, స్ట్రెచ్చర్ బేరర్స్, జేఎస్‌డబ్ల్యూ అవసరం చాలా ఉంది. పడకలు పెరిగితే సిబ్బందిపై మరింత భారం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న భవనాలు అందుబాటులోకి వస్తే సిబ్బందిపై మరింత భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 250 బెడ్లతో పాటు మరో 270 అందుబాటులోకి వస్తాయి. ట్రామా కేర్, ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉన్నాయి. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని టీఎస్ ఎంఎస్ఐడీసీ అధికారులు చెబుతున్నారు. ఆ భవనాలు పూర్తయితే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యం 520 పడకలకు చేరుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే వాటికి సరిపడా సిబ్బందిని కూడా పెంచాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదనపు సిబ్బంది కోసం అధికారులు పలుమార్లు నివేదిక పంపారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికే వైద్య సేవలు అందించటం చాలా కష్టంగా ఉందని, ఆస్పత్రి స్థాయిని రెట్టింపు చేస్తే వైద్య సేవలు అందించటం కష్టమవుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించిన తర్వాతనే నూతన పడకలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేలబారు సేవలే..
♦ వైద్యం.. మృగ్యం ♦ కానరాని డాక్టర్లు పీడిస్తున్న సిబ్బంది కొరత ♦ పలుచోట్ల అటెండర్లే ఆల్‌రౌండర్లు ♦ పట్టని పారిశుద్ధ్యం పీహెచ్‌సీల పనితీరు ఇదీ.. ♦ ‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతం నిరుపేదల వైద్యానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే దిక్కు. రోగం నయమవుతుందన్న ఆశతో పేదలు ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుంటారు. నయమయ్యేది దేవుడెరుగు... కానీ సకాలంలో వైద్యం అందక రోగం తిరగబెడుతోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నాయి. సిబ్బంది కొరత, డాక్టర్లు లేక వైద్యం అందడం లేదు. వైద్యులు లేక ఆపరేషన్ థియేటర్లకు తాళాలు పడ్డాయి. చాలాచోట్ల ఫార్మాసిస్టులు, అటెండర్లే వైద్యం అందిస్తున్నారు. కనీస వసతులు కరువయ్యాయి. చిరిగిన బెడ్లు వెక్కిరిస్తున్నాయి. విద్యుత్, మంచినీటి సమస్యలు వేధిస్తున్నాయి. పారిశుద్ధ్య సమస్య ఇబ్బంది పెడుతోంది. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. మొత్తానికి జిల్లాలో పీహెచ్‌సీల నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందన్న విషయం గురువారం నాటి ‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతమైంది. ⇔ చిన్నశంకరంపేట పీహెచ్సీలో ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. ఓ స్టాఫ్ నర్స్ డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఉన్న సిబ్బందిసైతం సమయ పాలన పాటించక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ⇔ రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. డిప్యూటేషన్‌పై నియమితులైన వైద్యులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. సిబ్బంది కొరత సైతం తీవ్రంగా వేధిస్తుంది. ⇔ పాపన్నపేటలో ఫార్మసిస్టు, స్టాఫ్ నర్సు, మేల్ సూపర్వైజర్, మరో ఇద్దరు ఫిమేల్ సూపర్వైజర్లు, ముగ్గురు సెకండ్ ఏఎన్‌ఎంలతోపాటు మొత్తం ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నీటి సమస్య తీవ్రంగా ఉంది. ⇔ మెదక్ మండలం సర్ధనలో వైద్యుడు డిప్యూటేషన్‌పై నియమితులయ్యారు. ఆయన వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే వస్తారు. ఆస్పత్రి ఆవరణలో గల బోరుమోటార్‌ను బాగుచేయించకపోవడంతో నీటి తిప్పలు తప్పడం లేదు. ⇔ సదాశివపేట మండలం ఆత్మకూర్‌లో ఇద్దరు వైద్యులకు గాను ఎండేళ్ల నుంచి ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్క డాక్టర్ కూడా ఎప్పుడు వస్తారో తెలియదు. వీరికి స్టాఫ్ నర్సు, నర్సులే వైద్యం అందిస్తుంటారు. ⇔ టేక్మాల్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బోరు పాడైపోవడంతో డ్రమ్ములో నీటి నిల్వ చేసుకుని వినియోగిస్తున్నారు. ⇔ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. నీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ⇔ వెల్దుర్తిలో ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే పనిచేస్తున్నారు. డాక్టర్‌తోపాటు రెండు స్టాప్ నర్సు, మూడు ఏఎన్ఎం,ఫార్మాసిస్టు, మేల్సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచాలున్నా పరుపులు సరిగ్గా లేవు. సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ⇔ కొల్చారం మండలంలో కొల్చారం, రంగంపేట పీహెచ్‌సీల పనితీరు అధ్వానంగా ఉంది. వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. సాయంత్రం వేళ ఓపీ నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ⇔ కౌడిపల్లిలో 24 గంటల పీహెచ్సీ ఉంది. ఇక్కడ ముగ్గురు డాక్టర్లకు గాను ఒక్కరే ఉన్నారు. ఏడు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యం కోసం వచ్చే గర్భిణులు అనేక అవస్థలు పడుతున్నారు. ⇔ హత్నూర మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో సర్జన్లు లేక ఆపరేషన్ థియేటర్లు చాలా కాలంగా మూతపడ్డాయి. ⇔ శివ్వంపేట పీహెచ్సీలో ఒకే వైద్యుడు ఉండడంతో సర్జన్ లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్ మూత పడింది. ⇔ జహీరాబాద్ మండలం మొగుడంపల్లిలో రాత్రి పూట వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ⇔ కోహీర్ మండలం దిగ్వాల్లో ప్రహరీ లేకపోవడంతో పందులు, కుక్కలు పీహెచ్సీ ఆవరణలో స్వైరవిహారం చేస్తున్నాయి. ⇔ ఝరాసంగంలో రెగ్యులర్ వైద్యుడు లేకపోవడంతో కాంట్రాక్టు వైద్యుడే సేవలందిస్తున్నారు. ఒకే వైద్యుడి ఉండడంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ⇔ జిన్నారంలో సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్‌పై బొల్లారం, పటాన్‌చెరుల్లోని ఆసుపత్రులకు పంపారు. కానుకుంట పీహెచ్సీ పరిస్థితి అధ్వానంగా మారింది. ఏడాది కాలంగా ఆసుపత్రికి రెగ్యులర్ వైద్యులు లేరు. ⇔ రామచంద్రాపురంలో సరిపడా మందులున్నా సిబ్బంది, గదుల కొరత తీవ్రంగా ఉంది. సరిపడా గదులు లేక మహిళా సిబ్బంది నరకయాతన పడుతున్నారు. ⇔ గజ్వేల్ మండలం అహ్మదీపూర్, శ్రీగిరిపల్లి పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ⇔ జగదేవ్‌పూర్ మండలం తిగుల్, జగదేవ్‌పూర్‌లో సరిపడా సిబ్బంది లేక సరైన వైద్యం అందడం లేదు. వైద్యులు స్థానికంగా ఉండకపోవడంతో ఎప్పుడు వస్తారో తెలియదు. వైద్యుల కోసం రోగులు నిరీక్షించక తప్పడం లేదు. ⇔ కొండపాక, కుకునూరుపల్లి గ్రామాలతోపాటు ములుగు, సింగన్నగూడ సిబ్బంది కొరత ఉంది. ⇔ వర్గల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బోరుబావిలో నీరు అడుగంటడంతో ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుంటున్నారు. పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో పారిశుద్ధ్య లోపాన్ని ఎత్తి చూపుతుంది. వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఫార్మాసిస్ట్ వైద్యం అందిస్తున్నారు. ⇔ దుబ్బాక ఆసుపత్రిలో ఐదుగురు డాక్టర్లకు గాను ముగ్గురే ఉన్నారు. జనం సీజనల్ వ్యాధుల బారిన పడితే ఉన్న వైద్యుల పైనే భారం పడుతుంది. తొగుటలో వైద్యులు సకాలంలో రావడం లేదు. నెలలో రెండు, మూడు రోజులు వస్తున్నట్టు సమాచారం. రోగి చేయి పట్టాలన్నా ఫార్మాసిస్టే దిక్కు. ⇔ మిరుదొడ్డిలో సిబ్బంది ఎప్పుడంటే అప్పుడే పీహెచ్‌సీకి వస్తుంటారు.సమయ పాలన లేదు. పరిసరాలు అపరిశుభ్రంగానే ఉన్నాయి. ⇔ దౌల్తాబాద్, రాయపోలు, ఇందుప్రియాలలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ⇔ చేగుంటలో సాయంత్రం 4 వరకే వైద్య సేవలందుతున్నాయి. ఆ తరువాత అయితే ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ⇔ నంగునూరు రాజగోపాల్‌పేటలో ైవె ద్యులు కొరత ఉంది. చిన్నకోడూరు, ఇబ్రహీంపూర్లో, పుల్లూరు, చింతమడక, నారాయణరావుపేటో వైద్యుల సమస్య లేకపోయినా సిబ్బంది పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ⇔ కంగ్టి, పెద్దశంకరంపేట, కల్హేర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తేలిక పాటి జబ్బులకు నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. కల్హేర్ ఆసుపత్రిలో నిత్యం దాదాపు 300కు పైగా రోగులకు స్టాఫ్ నర్సులే పరీక్షలు నిర్వహిస్తారు. ⇔ ఖేడ్ మండలం తుర్కపల్లిలో వైద్యులు లేక డెలివరీలు కావడం లేదు. కంగ్టి మెడికల్ ఆఫీసర్ మూడేళ్ళుగా డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఫలితంగా ఇక్కడి వారు వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. -
వర్సిటీని వేధిస్తోన్న ఖాళీలు
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడి నియాకాలు లేవు. ఉన్నత విద్యారంగానికి ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడమే తప్పా ఆచరణలో అవేవి లేవు. దీంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక విద్యార్థులకు నాణ్యమైన విద్య కరువైంది. రెగ్యులర్ వారిలో చాలా మందికి పరిపాలనా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తరగతి గదుల మొఖం చూడటం మానేశారు. అదనపు బాధ్యతలు లేని వారిలో పలువురు మొక్కుబడిగా వచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అకడమిక్ కన్సల్టెంట్ల(ఏసీ)తోనే కొద్దో గొప్పో తరగతులు సా..గుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. బోధనా సిబ్బంది పొందుతున్న వేతనాలకు సంబంధం లేకుండా మొక్కుబడిగా విధులు బోధిస్తున్నారని, నాణ్యమైన విద్య అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధ్యాపకులు వర్సిటీకి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో తెలియని దుస్తితి. పలు విభాగాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ కరువు.. వర్సిటీలో ప్రస్తుతం 18 విభాగాలు, 26 కోర్సులు నడుస్తున్నాయి. 26 కోర్సులకు పలు కోర్సుల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే సాగుతున్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాథ్స్, బీఈడీ, ఎల్ఎల్ఎం, ఫార్మాస్యూటిక్ కెమిస్ట్రీ, ఐడేళ్ల కోర్సు ఐఎంబీఏలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక ఏసీలతోనే తరగుతులు నెట్టుకొస్తున్నారు. భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరొం దిన ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సు ఉంది. ఇది ఓయూ నుంచి తెయూకు బదిలీ అయ్యాక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏసీతో నెట్టుకొస్తున్నారు. గతంలో ఈ కోర్సు చేసి న విద్యార్థులు 30కి 30 మంది సీఎస్ఐఆర్ ఫెలోషిప్, మంచి ఉద్యోగాలు సాధించేవారు. ప్రస్తుతం డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉండి పోయారు. దీంతో సౌత్ క్యాంపస్‌లో సరైన బోధన లేక విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం లేదు. రెగ్యులర్ ఫ్యా కల్టీ లేని కోర్సుల్లో విద్యార్థులు పీహెచ్డీ చేసేందుకు వీలు లేక నష్టపోతున్నారు. 67 రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టు లు ఖాళీ ఉండగా, 57 మంది ఏసీలు విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన కోర్సులకు మరో 42 అధ్యాపకల పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. నాక్ గ్రేడింగ్‌పై ప్రభావం..! ఇటీవల వర్సిటీ నాక్ గుర్తింపు సాధించింది. అయితే నాక్ పీర్టీం వచ్చినపుడు రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువగా ఉండ టం, ప్రత్యేక సైన్స్ కళాశాల, ల్యాబ్స్ లేకపోవడం మైన స్‌గా మారాయి. ఈ అంశాలు నాక్ గ్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో కేవలం నాక్ బీ గ్రేడ్‌నే ఇచ్చింది. లేదంటే ఏ గ్రేడ్ సాధించే అవకాశం ఉండేదని వర్సిటీ అధికారులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. సైన్స్ కళాశాల, ల్యాబ్‌లు లేవు.. తెయూలో సైన్స్ కళాశాల లేక మైనస్‌గా మారింది. ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాలలోనే సైన్స్ కోర్సులు సాగుతున్నాయి. సరిపోయే గదులు లేక తరగతి గదుల్లోనే ల్యాబ్స్ ఉన్నాయి. దీంతో సరైన ల్యాబ్స్ లేక విద్యార్థులు పరిశోధనలు సాగించలేక పోతున్నారు. ల్యాబ్స్ లేక సైన్స్ విద్యార్థులు ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ఫెలోషిప్’లను పొందలేక పోతున్నారు. తగినంత ఫ్యాకల్టీ అవసరం.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి. ప్రభుత్వం వర్సిటీల్లో కోర్సులు, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని రిక్రూట్ చేయాలి. ప్రస్తుతం తెయూలో తగినంత రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకున్నా సాధ్యమైనంత మేర నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నాం. సైన్స్ కళాశాల, ల్యాబ్స్ లేక విద్యార్థులు పరిశోధనలు చేయలేక పోతున్నారు. వీసీ పార్థసారథి వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నాక్ గుర్తింపు రావడంతో యూజీసీ, రూసా, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖల నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. - ప్రొఫెసర్ లింబాద్రి, రిజిస్ట్రార్ -
సిబ్బంది లేక.. పథకాలు పడక
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టపరుస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ శాఖలో వివిధ స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు దీని పరిధిలోనే పనిచేస్తాయి. అయితే.. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్ విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి, పల్లెప్రగతి, ఈ-పంచాయతి వంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. క్షేత్రస్థాయిలో తగిన సంఖ్యలో సిబ్బంది లేకుండా పథకాలు రూపకల్పన చేస్తే ఫలితం ఉండదని గ్రామ పంచాయతీ సర్పంచులు పేర్కొంటున్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో పంచాయతీ కార్యదర్శి ఉండాల్సి ఉండగా... ఐదు నుంచే ఏడు గ్రామాల బాధ్యతలు ఒక్కరికే అప్పగిస్తున్నారని, ఇలా అయితే పథకాల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో పోస్టుల వరకు పంచాయతీరాజ్ శాఖలో వివిధ స్థాయిల్లో 2,917 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తాజాగా తేల్చారు. ఈ శాఖలో అన్ని పోస్టుల కలిపి మొత్తం 7,253 పోస్టులుండగా, ప్రస్తుతం 4,336 మంది సిబ్బందే ఉన్నారు. ఆ ఆపరేటర్లకు ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వొద్దు పంచాయతీరాజ్‌లో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు త్వరలోనే మంగళం పాడాలని పంచాయతీరాజ్ విభాగం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో వివరాల నమోదు కోసం గతేడాది ఓ ప్రైవేటు కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం వీరిని నియమించుకుంది. ఈ ఏడాది మార్చి ఆఖరుకు సదరు ప్రైవేటు ఏజెన్సీ కాంట్రాక్ట్ కాలపరిమితి ముగియనున్నందున ఏప్రిల్ 1 తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల’ కోసం విలేజ్ లెవల్ ఎంటర్ప్రైన్యూర్లను నియమిస్తున్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఇకపై ఉండబోదని ఆ విభాగం అధికారి ఒకరు తెలిపారు. -
‘సాగర్’ నిర్వహణ ఎలా?
నాగార్జునసాగర్ రెండు రాష్ట్రాల వరప్రదాయిని, లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు, పట్టణాలకు తాగునీరు..అంతకు మించి రెండు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు అందిస్తున్న ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్వహణకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. వాచ్‌మన్‌లే ఇంజినీర్లలా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యాం నిర్వహణ సిబ్బంది మాట అటుంచి ఐదేళ్లుగా మెకానికల్ ఇంజినీర్ లేకపోవడం ఇక్కడి దుస్థితికి అద్దంపడుతోంది. వేసవి సీజన్లోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్ల మరమ్మతులతో పాటు డ్యాం అంతర్భాగంలోని గ్యాలరీలలోని లీకేజీలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రస్ట్‌గేట్లను ఎత్తి,దించడంతో పాటు ఇనుపతాళ్లకు గ్రీజింగ్ చేయడం, దిగువన తుప్పు పట్టిన (వాక్వేప్లేట్లు)ఇనుప నిచ్చెనలకు వెల్డింగ్ పెట్టడం, క్రస్ట్‌గేట్ల వెంట నీరు లీకేజీ కాకుండా గేట్లకు ఇరువైపులా రబ్బరు సీళ్లను తొడగ డం లాంటిపనులు పూర్తిచేయాలి. ఎక్కడైనా అలైన్మెంట్ పాడైతే వాటిని సరిచేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా డ్యాంలో వెల్డర్ లేకపోవడం శోచనీయం. ఇటీవల సాగర్‌డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ సాగర్‌ను సందర్శించి చేయాల్సిన మరమ్మతుల గురించి వివరించింది. బ్రిడ్జిమీది గేట్లు అలైన్‌మెంటు తొలగి ఒకవైపు ఒరిగి ఉండటం, వాటిని లేపినపుడు మొరాయిస్తుండటం, వాక్వేప్లేట్లు విరిగిపోవడం తదితర పనులను రివ్యూ ప్యానల్ గుర్తించింది. ఈపనులన్నింటినీ గత ఏడాది మొదలు పెట్టినప్పటికీ సిబ్బంది కొరతతో మమ అనిపించారు. క్రస్ట్‌గేట్ల నిర్వహణ సెక్షన్‌ను, అందులో పనిచేసే ఉద్యోగులను అవగాహనలేని అధికారులు ఆంధ్రాకు తరలించడంతో ఆ ఉద్యోగులు పనిచేయడం వదిలి తెలంగాణకు రావడానికి అధికారులు,రాజకీయనాయకుల చుట్టూ తిరగుతూ నానాఅగచాట్లు పడ్డారు. దీంతోగేట్లపనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈలోపు సీజన్ మారింది. జలాశయంలోకి నీరురావడంతో ఇక ఆ పనులు అలాగే మిగిలి పోయాయి. చాలామంది ఉద్యోగులు ఆంధ్రాకు తరలిన వారు ఆ ప్రాంతీయులు అక్కడే ఉండిపోయారు. ఐదుగురే సిబ్బంది.. ప్రస్తుతం సరిపోను సిబ్బంది లేకపోవడంతో పనులు ఈ ఏడాది మొదలైనప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. వాచ్‌మన్‌లే ఇంజినీర్లలా పనులు చేస్తున్నారు. డ్యాం మెయింటెనెన్స్ డివిజన్లో సిబ్బంది కేవలం ఐదుగురే ఉన్నారు. దీంతో పనులు చేయడం కష్టంగా మారింది. వాటర్‌సప్లయ్, బీఅండ్‌ఆర్, సెంట్రల్స్టోర్లలో పనిచేసే సిబ్బందిని డ్యాం నిర్వహణకు బదిలీచేసినారెండేళ్లుగా ఆయాసెక్షన్ల నుంచి రిలీవ్‌కాని ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది కొంతమందిని బదిలీ చేశారు. అయినా వారు రిలీవ్ అయ్యి నేటికీ విధుల్లో చేరలేదు. పాతస్థానాలలోనే విధులు నిర్వహిస్తున్నారు. సంబంధిత పైఅధికారులు డ్యాం ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని క్రస్ట్‌గేట్ల డివిజన్‌కు ఉద్యోగులను బదలాయించి ముఖ్యమైన పనులను చేయాల్సిన ఆవశ్యకతఎంతైనా ఉంది. జూలై మాసం నుంచే వరదలు వస్తేపనులు చేయడం కష్టంగా మారనుంది. డ్యాం నిర్వహణ డివిజన్‌కు ఇతర డివిజన్ల నుంచైనా సిబ్బందిని తరలించి తాత్కాలిక మరమ్మతు పనులను చేయించాల్సిన అవసరం ఉంది. -
కొత్త సవాళ్లు..
పత్యామ్నాయ ఉపాధిలో భాగంగా రైతులు పాడివైపు పరుగులు తీస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం... ప్రభుత్వం ఇటీవలే విజయ డెయిరీ పాల ధరను లీటర్‌కు రూ.4 పెంచడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలవాల్సిన పశువైద్యం జిల్లాలో అధ్వానంగా మారింది. సిబ్బంది కొరతతో పలు కేంద్రాలు మూతపడ్డాయి. చాలాచోట్ల అటెండర్లే వైద్యం అందిస్తున్నారు. ఈ దశలో రైతులు కుంగిపోతున్నారు. ⇒ ‘మిల్క్ గ్రిడ్’కు సిబ్బంది కొరత ⇒ ఖాళీల భర్తీలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ⇒ కునారిల్లుతున్న పశువైద్య కేంద్రాలు ⇒ చాలాచోట్ల అటెండర్లే దిక్కు ⇒ ఇప్పటికే కొన్ని మూత ⇒ పశువైద్యాన్ని మెరుగుపరిస్తేనే మేలు గజ్వేల్: వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాడి పోషణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. విజయ డెయిరీ పాల ధరను లీటర్‌కు రూ.4కు పెంచడం, ‘మిల్క్‌గ్రిడ్’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టడం.. గజ్వేల్‌లో ఈ పథకానికి అంకురార్పణ జరగటంతో రైతుల్లో ఉత్సాహం రెట్టింపైంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడటం వారికి శాపంగా మారింది. మిల్క గ్రిడ్తోపాటు ఇతర పథకాల అవులుకు పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న సవుస్యలు అవరోధంగా మారనున్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136 మంది డిప్లొమా హోల్డర్స్‌కు గాను 90 మంది, 236 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు గాను 171 మందే పనిచేస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి అంకురార్పణ జరిగిన గజ్వేల్ నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12 మంది వైద్యాధికారులు పోస్టులకు గాను ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 డిప్లొమా హోల్డర్స్‌కు గాను 18 పోస్టులు ఖాళీగా, 20 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు 12 ఖాళీలున్నాయి. అధ్వానంగా కేంద్రాలు.. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితోపాటు మరికొన్ని పశువైద్య కేంద్రాలు మూతపడ్డాయి. నియోజక వర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్లపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ దశలో ‘మిల్క్ గ్రిడ్’ ద్వారా విరివిగా పశువులను అందించి ‘పాలధారను’ పెంచాలనుకుంటుండగా రైతులు మాత్రం పశువైద్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి కొత్త రూపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాబోతున్న పథకంలో దాణా, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించనున్నామని రెండు రోజుల క్రితం గజ్వేల్‌లో పర్యటించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.