నీటి మీద పెయింటింగ్ గీసి.. కంటతడి పెట్టించాడు
న్యూఢిల్లీ: పెయింటింగ్ అందమైన కళ.. ఆ కళతో ప్రకృతి అందాలను, అద్భుతాలను రమణీయంగా చిత్రించిన చిత్రకారులు ఎందరో! ఆ కోవకే చెందిన ఓ చిత్రకారుడు ఇప్పటివరకు ప్రపంచంలో ఏ చిత్రకారుడూ చేయని ప్రయత్నాన్ని చేసి సఫలం అయ్యాడు. నీటిపై అద్భుతంగా పెయింటింగ్ గీసి చూపరులకు కన్నీళ్లు తెప్పించాడు టర్కీకి చెందిన ఓ చిత్రకారుడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అయింది.
విన్సెంట్ వాన్ గోగ్స్ స్టార్రీ నైట్ చిత్రాన్ని టర్కీ ప్రజలకు అసలు వారి చరిత్రలో ఉందో.. లేదో కూడా తెలియని 17వ శతాబ్దపు ఇబ్రూ విద్యతో నీటిపైన చిత్రాన్ని గీసి చూపించాడు. కాగా, ఈ విద్య తర్వాతి కాలంలో యూరప్ లో ‘టర్కిష్ పేపర్’గా ప్రసిద్ధికెక్కింది. ఒక బేసిన్ లో నీటిని తీసుకున్న అతను.. అందులో ఆయిల్, చిత్రాలను గీయడానికి ఉపయోగించే రసాయనాలను వేశారు. వాటన్నింటికి నీటిపైన చిత్ర రూపం తీసుకొచ్చిన చిత్రకారుడు ఒక పేపర్ మీదకు ఆ చిత్రాన్ని తీసుకున్నారు. సాధారణంగా నీటి మీద గీసే ఏ చిత్రమైనా అదే ఆకృతిలో రాదు. కానీ, చిత్రం అదే ఆకృతిలో అత్యద్భుతంగా రావడంతో చూపరులందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. దీనిపై స్పందించిన వారు దాదాపు ఏడ్చినంత పని చేశారు. అతను క్యాన్సర్, గ్లోబల్ వార్మింగ్ లాంటి వాటిని తగ్గించలేకపోవచ్చు. తన క్రియేటివిటీతో ఏదైనా సాధించగలడని వ్యాఖ్యానించారు.