Subsidy amount
-
మూడు నెలల్లో రూ.37,000 కోట్ల సబ్సిడీ!
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.37,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అందించినట్లు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్లో తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) విధానం ద్వారా రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి స్పందిస్తూ..‘రైతులకు తక్కువ ధరకు ఎరువులు లభ్యమయ్యేలా ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. కొన్ని ఎరువుల తయారీకి సంబంధించి కంపెనీలకు ఇప్పటికే 100 శాతం రాయితీలు అందించాం. రిటైల్ దుకాణంలో అమర్చిన పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల ద్వారా ఆధార్‌తో రైతులు సబ్సిడీపై ఎరువులు పొందుతున్నారు’ అని చెప్పారు.2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం అందిస్తున్న ఎరువుల సబ్సిడీ వివరాలను మంత్రి తెలియజేశారు.2010-11లో రూ.65,836.68 కోట్లు2011-12లో రూ.74,569.83 కోట్లు2012-13లో రూ.70,592.1 కోట్లు2013-14లో రూ.71,280.16 కోట్లు2014-15లో రూ.75,067.31 కోట్లు2015-16లో రూ.76,537.56 కోట్లు2016-17లో రూ.70,100.01 కోట్లు2017-18లో రూ.69,197.96 కోట్లు2018-19లో రూ.73,435.21 కోట్లు2019-20లో రూ. 83,466.51 కోట్లు2020-21లో రూ. 1,31,229.5 కోట్లు2021-22లో రూ. 1,57,640.1 కోట్లు2022-23లో రూ.2,54,798.9 కోట్లు2024-25లో జులై 2024 వరకు అందించిన సబ్సిడీ రూ.36,993.39 కోట్లు‘చట్టబద్ధంగా 45 కిలోల యూరియా బ్యాగ్ రూ.242 (ఛార్జీలు, పన్నులు మినహాయింపు)గా ఉంది. యూరియా ఉత్పత్తికి అయ్యే వాస్తవ ఖర్చులు, రైతులకు అందిస్తున్న ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. అందుకోసం ప్రభుత్వ సబ్సిడీలు ఉపయోగపడుతున్నాయి. ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల కోసం ప్రభుత్వం ఏప్రిల్ 2010 నుంచి న్యూట్రియంట్ బేస్ట్ సబ్సిడీ(ఎన్బీఎస్) విధానాన్ని అమలు చేస్తోంది. ఎరువుల ధరలు వాటి ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. క్రమంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల్లో మార్పులుంటాయి’ అని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: దివాలా దిశగా అగ్రరాజ్యం!2010-11 నుంచి ఎరువుల ఉత్పత్తి వివరాలను మంత్రి వెల్లడించారు.2010-11లో 376.25 లక్షల టన్నులు2011-12లో 387.78 లక్షల టన్నులు2012-13లో 374.94 లక్షల టన్నులు2013-14లో 380.46 లక్షల టన్నులు2014-15లో 385.39 లక్షల టన్నులు2015-16లో 413.14 లక్షల టన్నులు2016-17లో 414.41 లక్షల టన్నులు2017-18లో 413.61 లక్షల టన్నులు2018-19లో 413.85 లక్షల టన్నులు2019-20లో 425.95 లక్షల టన్నులు2020-21లో 433.68 లక్షల టన్నులు2021-22లో 435.95 లక్షల టన్నులు2022-23లో 485.29 లక్షల టన్నులు2023-24లో 503.35 లక్షల టన్నులు -
రేషన్ తో పాటు రూ.2,500 ప్రతి ఇంటికి అందిస్తున్నాం: సీఎం జగన్
-
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. కేంద్రం తీపికబురు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధి దారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది. ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీని పెంచేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT — ANI (@ANI) October 4, 2023 గతంలో రూ.200 ఇప్పుడు.. గతంలో కేంద్రం పీఎంయూవై పథంలోని లబ్ధి దారులు గ్యాస్ సిలిండర్‌పై రూ.200 రాయితీ అందించేది. ఇప్పుడు మరో రూ.100 పెంచింది. దీంతో ఇంతకు ముందు ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.703 ఉండగా, తాజాగా, కేంద్రం నిర్ణయంతో పీఎంయూవై పథకం కింద సిలిండర్ ధర రూ.603కే లభ్యమవుతుంది. రూ.1650 కోట్లు విడుదల గత నెలలో కేంద్రం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను అందించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1,650 కోట్లను విడుదల చేసింది. ఉజ్వల కనెక్షన్ పెంపుతో పీఎంయూవై పథకం కింద మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 10.35 కోట్లకు పెరిగింది. -
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ జోరు తగ్గనుందా? కారణం ఇదే అంటున్న నిపుణులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరింత ప్రియం అయ్యాయి. ఇప్పటికే ప్రధాన కంపెనీలు వివిధ మోడళ్ల ధరలను పెంచాయి. ఇతర కంపెనీలు వీటిని అనుసరిస్తున్నాయి. ఫేమ్–2 పథకం కింద ఇచ్చే సబ్సిడీకి భారీ పరిశ్రమల శాఖ కోత విధించడమే మోడళ్లు ఖరీదవడానికి కారణం. భారత్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు 2015లో కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) పథకం దేశీ ఈవీ రంగానికి బూస్ట్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) హెచ్చరించింది. సబ్సిడీ తగ్గుదల ఇలా.. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్‌కు గతంలో ఇచ్చిన రూ.15,000 సబ్సిడీ కాస్తా ఇక నుంచి రూ.10,000 ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో గతంలో ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. రానున్న రోజుల్లో పరిశ్రమ వాస్తవిక వృద్ధి చూస్తుందని బజాజ్ అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, 2023 మే నెలలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 1,04,755 యూనిట్లు రోడ్డెక్కాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయన్న నేపథ్యం కూడా ఈ విక్రయాల జోరుకు కారణమైంది. ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్, ఆంపియర్ టాప్–5లో నిలిచాయి. వృద్ధి వేగానికి కళ్లెం.. ప్రభుత్వ చర్యతో ఈ–టూ వీలర్ల వేగానికి కళ్లెం పడుతుందని ఎస్ఎంఈవీ తెలిపింది. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, ఈ–టూవీలర్ల మధ్య ధర వ్యత్యాసం అమాంతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈవీల జోరు పెరిగే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలని అవేరా ఏఐ మొబిలిటీ ఫౌండర్ రమణ తెలిపారు. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..) కస్టమర్లు సన్నద్ధంగా లేరు.. భారత్‌లో ధర సున్నితమైన అంశం అని ఎస్ఎంఈవీ ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ద్విచక్ర వాహనం కోసం అధికంగా ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరని స్పష్టం చేశారు. ‘పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనాల్లో అధిక భాగం మోడళ్లు రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువ. మార్కెట్ వృద్ధి చెందే వరకు సబ్సిడీలను కొనసాగించాల్సిందే. భారత్‌లో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ప్రకారం ఇది 20 శాతానికి చేరుకోవడానికి నిరంతర రాయితీలు ఇవ్వాల్సిందే’ అని వివరించారు. (ఇదీ చదవండి: యూపీఐ నుంచి పొరపాటున డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..) వరుసలో బజాజ్ చేతక్.. బజాజ్ చేతక్ ధర రూ.22,000 పెరిగింది. దీంతో చేతక్ ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.1.44 లక్షలకు చేరింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ ధర వేరియంట్‌ను బట్టి రూ.17–22 వేల మధ్య పెరిగింది. ఏథర్ 450ఎక్స్ ప్రో సుమారు రూ.8,000 అధికం అయింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1,65,435లకు చేరింది. ఓలా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు రూ.15,000 వరకు ప్రియం అయ్యాయి. ప్రస్తుతం ఎస్1–ప్రో రూ.1,39,999, ఎస్1 రూ.1,29,999, ఎస్1 ఎయిర్ ధర రూ.1,09,999 పలుకుతోంది. ఈ–స్కూటర్ మోడల్స్ ధరలను పెంచబోమని హీరో ఎలక్ట్రిక్ ఇప్పటికే తెలిపింది. -
సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలి
న్యూఢిల్లీ: తమకు రావాల్సిన రూ.1,200 కోట్ల సబ్సిడీ బకాయిలు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని పార్లమెంటరీ ప్యానెల్‌ను ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సంఘం (ఎస్ఎంఈవీ) కోరింది. పరిశ్రమ నిధుల సమస్యను ఎదుర్కొంటుండడం ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు అవరోధంగా నిలుస్తోందని పేర్కొంది. ‘‘ఇప్పుడు యావత్‌దేశం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సరఫరా వ్యవస్థతో సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వద్ద రూ.1,200 కోట్ల సబ్సిడీలు నిలిచిపోవడంతో పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమ కలసి సమస్యలను పరిష్కరించుకుని, ఎలక్ట్రిక్ వాహన లక్ష్యాలను చేరుకునేందుకు పనిచేయాల్సిన అవసరం ఉంది’’అని ఈవీ పరిశ్రమ కోరింది. ఫేమ్ పథకం కింద సబ్సిడీలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సైతం తెలిపింది. ఫేమ్–2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు రూ.10వేల కోట్లను ప్రోత్సాహకాలను 2019 నుంచి ఇస్తోంది. -
గ్యాస్ సబ్సిడీ అంతంతే!
నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎల్పీజీ సిలిండర్‌ను ఆన్లైన్లో బుకింగ్ చేస్తున్నాడు. మూడు నాలుగు రోజుల వ్యవధిలో సిలిండర్ డోర్ డెలివరి కూడా జరుగుతోంది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతుండడంతో మార్కెట్ ధర చెల్లిస్తూ వస్తున్నాడు. కానీ, సబ్సిడీ సొమ్ము మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. గత పది మాసాల కాలంలో ఐదు సిలిండర్లు తీసుకున్నా నయా పైసా ఖాతాలో పడలేదు. ఆలస్యంగా గుర్తించిన శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ దష్టికి తీసుకెళ్లాడు. ఆన్లైన్లో పరిశీలించి బ్యాంక్ లింకేజి కట్ అయిందని, తిరిగి పునరుద్ధరించుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ఇదీ ఒక శ్రీనివాస్ సమస్య కాదు.. నగరంలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ సబ్సిడీ సొమ్ము చుక్కలు చూపిస్తోంది. నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ సమస్యగా తయారైంది. వినియోగదారుడు మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తున్నా.. సబ్సిడీ సొమ్ము నగదుగా వెనక్కి జమ అవుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. కొందరు వినియోగదారులకు నెలల తరబడి అసలు నగదు జమ అంటూ లేకుండా పోతోంది. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ కోసం తెరిచిన బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ నగదు జమకు అనేక సమస్యలు ఆటంకంగా మారాయి. మరోవైపు ఎల్పీజీ సిలిండర్æ బుకింగ్ సమయాల్లో సైతం చిన్న చిన్న తప్పిదాలు బ్యాంక్ లింకేజి బంధంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా గ్యాస్ సబ్సిడీ నెలల తరబడి నిలిచిపోతోంది. గ్యాస్ సబ్సిడీ నగదు రూపంలో జమకు ఒక నిర్దిష్ట సమయం అంటూ లేక పోవడంతో వినియోగదారులు గుర్తించే సరికి నాలుగైదు సిలిండర్లు డోర్ డెలివరీ అవుతున్నాయి. ఆలస్యంగానైనా గుర్తించి డిస్ట్రిబ్యూటర్ దష్టికి తీసుకెళ్లితే సబ్సిడీ నగదు సొమ్ము జమ తమకు సంబంధం లేదంటూ చేతులేత్తుస్తూ ఒక ఉచిత సలహా పారేయడం సర్వసాధారణంగా తయారైంది. వాస్తవంగా పథకం అమలు ఆరంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతూ వచ్చింది. కానీ, తిరిగి పాత పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతోంది. వినియోగంలో లేకుంటే అంతే.... వంట గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధామైన బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకుంటే సబ్బిడీ సొమ్ము వెనక్కి వెళ్తోంది. కొందరు వినియోగదారులు వంట గ్యాస్ సబ్సిడీ కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటిని అనుసంధానం చేయించారు. కేవలం ఆ ఖాతాలు సబ్సిడీ సొమ్ముకు పరిమితం కావడంతో కనీస నగదు లేక కొన్నిసార్లు ఇన్‌యాక్టివ్ అవుతుంటాయి. దీంతో బయట నుంచి వచ్చిన సొమ్ము ఖాతాలో జమ కావడానికి సాంకేతిక సమస్యలు తయారవుతున్నాయి. దీంతో గ్యాస్ సబ్సిడీ కాస్త ఆయిల్ కంపెనీలకు వెళ్లిపోతుంది. ఒక సారి సబ్సిడీ వెనక్కి వస్తే ఆ తర్వాత సబ్సిడీ విడుదల నిలిచిపోతుంది. బ్యాంక్ లింకేజి బంధం కూడా తెగిపోతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయాల్లో సైతం పొరపాటున గ్యాస్ సబ్సిడీ వదులుకునే ఆప్షన్‌కు నెంబర్ ప్రెస్ అయితే సబ్సిడీ కాస్త నిలిచిపోయి బ్యాంక్ లింకేజి బంధం తెగుతోంది. దీంతో సబ్సిడీ సొమ్ము అందడం లేదు. బ్యాంక్ లింకేజీనిపునరుద్ధరించుకోవాలి వంట గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకుంటే సబ్సిడీ నగదు జమ కాదు. బుకింగ్ సమయంలో గ్యాస్ సబ్సిడీ వదలుకునే ఆప్షన్ పొరపాటున నొక్కినా సబ్సిడీ నిలిచిపోతుంది. బ్యాంక్ లింకేజి కట్ అవుతోంది. సబ్సిడీ సొమ్ము కావాలంటే బ్యాంక్ ఖాతాలను వినియోగంలోకి తీసుకొని రావాలి. తిరిగి బ్యాంక్ ఖాతాలను గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానం చేసుకొవాలి. బ్యాంక్ లింకేజీలను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.– అశోక్‌కుమార్, అధ్యక్షుడు, వంటగ్యాస్ డీలర్ల సంక్షేమ సంఘం, హైదరాబాద్ -
గ్యాస్ డెలివరీ చేయకుండానే చేసినట్లు ఎస్ఎంఎస్లు
అత్తాపూర్‌కు చెందిన సుభాషిణీ రెడ్డి ఈ నెల 4న తన మొబైల్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసింది. నాలుగు రోజులు తరువాత క్యాష్ మెమో కూడా జనరేట్ అయింది. అయితే సిలిండర్ ఇంటికి డెలివరి కాలేదు. విచిత్రమేమంటే 10వ తేదీన సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో అవాక్కైన ఆమె డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా మరో సారి బుక్ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. సిలిండర్ రాకపోవడానికి కారణం మాత్రం సమాధానం చెప్పలేదు. దీంతో చేసేదిలేక ఆమె మరోసారి బుక్ చేయక తప్పలేదు. మూడు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది.. కానీ. వారం గడుస్తున్నా సిలిండర్ మాత్రం ఇంటికి చేరలేదు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గోపాల్ ఈనెల 15న గ్యాస్ బుక్ చేశారు. రెండు రోజుల్లో క్యాష్ మెమో జారీ అయింది. మూడు రోజుల తర్వాత బాయ్ సిలిండర్ ఇంటికి తీసుకొచ్చారు. మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి బుక్ చేస్తే తెచ్చిన సిలిండర్ డెలివరి చేసి వెళ్తానన్నాడు. చేసేది లేక బాయ్ ముందే మరోసారి మొబైల్ ద్వారా బుక్ చేయక తప్పలేదు. బుకింగ్ ఎస్ఎంఎస్ చూసి సిలిండర్ డెలవరీ చేసి వెళ్లాడు బాయ్. ఆ తరువాత సిలిండర్ డెలివరీ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. రెండో సారి బుకింగ్‌కు మరుసటిరోజు క్యాష్ మెమో జారీ అయింది. అ తర్వాత సిలిండర్ డెలవరీ ఎస్ఎంఎస్ వచ్చింది. అయితే సిలిండర్ మాత్రం రెండో సారి రాలేదు. సాక్షి, సిటి బ్యూరో : మహా నగరంలో ఇదీ గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. ఏజెన్సీలు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. వంట గ్యాస్ ధర పెరిగే కొద్దీ డిస్ట్రిబ్యూటర్లు తెలివిమీరుతున్నారు. సబ్సిడీ పై వంట గ్యాస్ ఏడాదికి 12 సిలిండర్ల పరిమితి కారణంగా గ్యాస్ బుకింగ్‌కు బుకింగ్‌కు మధ్య ఒక గడువు అంటూ లేకుండా పోయింది. ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని తెప్పించుకునే వెసులు బాటు ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శించి వినియోగదారుల సబ్సిడీ సిలిండర్ ఎత్తుకెళుతున్నారు. ఫలితంగా వాణిజ్య అవసరాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) వంట గ్యాస్ రాజ్యమేలుతోంది. వాణిజ్య అవసరాలకూడొమెస్టిక్ సిలిండర్లు... ఇంటీవసరాలకు ఉపయోగపడాల్సిన వంట గ్యాస్ హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్ధల అవసరాలను తీరుస్తోంది. మహానగరంలో పెద్ద హోటల్స్ ఐదువేలకు పైగా ఉండగా, చిన్న చితక హోటల్స్, టీ, టిఫిన్, గరం మర్చి సెంటర్లు, బండీలు సుమారు లక్షల వరకు ఉంటాయన్నది అంచనా. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్‌లో వాణిజ్య పరమైన సిలిండర్లు వినియోగమవుతుండగా, మిగిలినా చిన్నాచితకా హోటల్స్, బండీల్లో డొమెస్టిక్ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి...దీంతో ప్రతిరోజు లక్షకుపైగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లు దారిమళ్లుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య కనెక్షన్లు అంతంతే.. మహా నగరంలోని హైదరాబాద్–రంగారెడ్డి –మేడ్చల్ జిల్లాలో కలిపి మూడు చమురు సంస్ధలకు చెందిన వాణిజ్య కనెక్షన్లు 50 వేలకు మించిలేవు. డొమెస్టిక్ మాత్రం 26.21 లక్షల వరకు ఉన్నాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలుండగా ప్రతిరోజు 1.20 లక్షవరకు డొమెస్టిక్ సిలిండర్ల డిమండ్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం 60 వేలకు మించి డోర్ డెలివరి కావడం లేదు. వాణిజ్యఅవసరాలకు కొరత లేకుండా పోయింది. -
గొర్రెలు ఎప్పుడొస్తాయో?
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలసమైంది. గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించింది. ఎన్నో ఆపసోపాలు పడి, ఆరోపణలు ఎదుర్కొని తొలి విడత గొర్రెలను పంపిణీ చేశారు. గతేడాది జూన్ 20న గొర్రెల పంపిణీ చేపట్టారు. ఒక్కో యూ నిట్‌లో ఒక పొట్టేలు, 20 గొర్రెలను అందించారు. జిల్లాలో 133 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాలు (సొసైటీలు) ఉన్నాయి. ఇందులో 8,590 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతలో 4,323 యూనిట్లకు గాను 4,282 యూనిట్లు పంపిణీ చేశారు. ఈ యూనిట్లలో 3,880 గొర్రెలు చనిపోగా 2,100 గొర్రెలకు బీమా మంజూరైంది. తొలి విడత కోసం అధికారులు మూడు నెలల పాటు మహారాష్ట్రకు వెళ్లి నానా తిప్పలు పడి గొర్రెలను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన గొర్రెలు వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక చాలా వరకు చనిపోయాయి. కొన్ని యూనిట్లలో రోగాలతో మృత్యువాత పడ్డాయి. దీంతో కొందరు లబ్ధిదారులు గొర్రెలను అమ్ముకోవాల్సి వచ్చింది. రెండో విడతలో 4267 యూనిట్లు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సారి లబ్ధిదారుల సమక్షంలోనే గొర్రెలు కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. యూనిట్ ధర రూ.1.25లక్షలు కాగా, బ్యాంకులతో సంబంధం లేకుండా 75శాతం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. తొలివిడతలో ఎదురైనా ఇబ్బందులను అధిగమించి రెండో విడత గొర్రెల పంపిణీ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరింత ఆలస్యం.. జూలై 2నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అనుకున్నట్లు జూలై 2న పంపిణీ అయ్యే అవకాశాలు లేదు. ఎందుకంటే గొర్రెల రవాణాకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు టెండర్లు ఇంకా పూర్తి కాలేదు. మొదటి విడతలో రవాణా వాహనాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్‌కు చెందిన లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని చివరకు గొర్రెలు కొనుగోలు చేసే రోజు చేతులెత్తేయడంతో అధికారులు అకోలిలోనే వాహనాలు మాట్లాడుకొని తీసుకొచ్చారు. ఇప్పుడా పరిస్థితి రాకుండా ఉండేందకు ట్రాన్స్‌పోర్టు కోసం ముందుగా టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ పూర్తయి, గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేయాలంటే మరో 15 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యం జరిగి వర్షాలు ఎక్కువగా ఉండే సమయంలో గొర్రెలు పంపిణీ చేస్తే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాది సైతం వ్యాధులతో చాలా గొర్రెలు మృతి చెందాయి. సమస్యలు అధిగమించేనా.. మొదటివిడత గొర్రెల పంపిణీలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. మహారాష్ట్రలోని అకోల, బుల్తానా, తులియ, ఉస్మానాబాద్, బీడ్, ఔరంగబాద్ వంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేశారు. అయితే ఆయా ప్రాంతాల్లో సమయానికి గొర్రెలు దొరక్క ఇబ్బందులు ఎదురయ్యాయి. దొరికిన గొర్రెలు సైతం కొన్ని చిన్నవిగా ఉండడం, కొన్ని ముసలి గొర్రెలు ఉండడంతో అప్పట్లో లబ్ధిదారులు అనాసక్తి చూపారు. అయినా ఏదోవిధంగా వారిని ఒప్పించిన అధికారులు యూనిట్లు పంపిణీ చేశారు. తొలి విడతలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, కొంత మంది లబ్ధిదారులు గొర్రెలు అమ్ముకున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు గొర్రెలకు వ్యాధులు సోకి మృత్యువాత పడ్డాయి. కొన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక మృతి చెందాయి. కొన్ని ప్రాంతాల్లో పశుగ్రాసం సమస్య కూడా ఏర్పడి పోషణ భారంగా మారి అమ్ముకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండో విడతల ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో విడత పంపిణీకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచారు. -
ఏదో ఒకటే..!
► బీమాకు ఇన్పుట్ సబ్సిడీకి లింకు ► మరోసారి రైతులపై సర్కారు చిన్నచూపు ► అన్నదాతలకు తప్పని ఇబ్బందులు టీడీపీ సర్కార్ రైతులను మొదటినుంచి నయవంచనకు గురిచేస్తోంది. రుణమాఫీ విషయంలో మాట తప్పిన సీఎం.. ఇప్పుడు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలపై వారిని నిలువునా ముంచేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు అన్నదాతకు మేలు చేసే ప్రభుత్వమని చెబుతూనే మరోవైపు వారిని చిన్నచూపు చూస్తున్నారు. వేంపల్లె : పంటల బీమా అందిన వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు వీల్లేదని..అందుకు సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు పంపింది. దీంతో అధికారులు ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఎవరికైతే పంటల బీమా వస్తుందో.. ఆ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కేవలం బీమాతో సరిపెట్టాలనే యోచనలో ఉన్నారు. ఈనెల 19వ తేదీనుంచి సంబంధిత పత్రాలు గ్రామ సభల ద్వారా ఇస్తామని అధికారులు చెబుతూనే.. అందులో మొత్తానికి సంబంధించిన కాలం ఖాళీగా ఉంచారు. బ్యాంకుల వివరాలు ఇచ్చిన తర్వాత రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందుతుందా.. పంటల బీమా చేతికి వస్తుందా.. లేదా అనే విషయాన్ని గమనించి ఆ కాలాన్ని పూరించనున్నారు. 2016 ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.77కోట్లు పత్తి, వేరుశనగ, కంది, వరి పంటలకు మంజూరైంది. వేరుశనగకు రూ.62కోట్లు, మిగతా పంటలకు రూ.15కోట్లు వచ్చింది. అయితే ఇన్పుట్ సబ్సిడీకి, పంటల బీమాకు లింక్ పెట్టారు. ఉదాహరణకు హెక్టార్‌కు ఇన్పుట్ సబ్సిడీ రూ.15.. 2హెక్టార్లకు రూ.30వేలు ఉందనుకుందాం. బ్యాంకులో తీసుకున్న పంట రుణానికి రూ.40వేలు బీమా వస్తే ఆ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందే పరిస్థితి లేదు. కేవలం బీమా మొత్తంతోనే సరిపెట్టుకోవాలి. ఇక వాతావరణ బీమా వేరుశనగ పంటకు మాత్రమే రూ.56కోట్లు మంజూరైంది. ఇదెక్కడి న్యాయం రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణం రూ.10వేలకు రూ.400నుంచి రూ.500 లెక్కన బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. పంటల బీమా సంస్థలు ప్రైవేట్ సంస్థలుగా ఉన్నాయి. రైతులు తమ సొంత డబ్బులను బీమా ప్రీమియం కింద చెల్లిస్తే దీనికి, ఇన్పుట్ సబ్సిడీకి లింక్ పెట్టడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీ విషయంలో మాట తప్పిన చంద్రబాబు మరోసారి రైతులపై ఉక్కుపాదం మోపుతున్నారని.. ఇది ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ఈవిషయమై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంపై పోరాటం చేయాలని రైతులు కోరుతున్నారు. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మొత్తాలు ఇప్పుడే రైతులకు అందే పరిస్థితి కనిపించలేదు. సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. జిల్లాలో 61మంది రైతులు ఉన్నారు. వీరి వివరాలను ఆయా బ్యాంకులనుంచి వ్యవసాయశాఖాధికారులు తెప్పించుకోవాలి. వీరికి పంటల బీమా ఏ మేరకు పోతుందో పరిశీలించాలి. తర్వాత బీమా రూ.30వేలలోపు ఉన్న రైతులను ఎంపిక చేసి ఇన్పుట్ సబ్సిడీ అందించనున్నారు. చంద్రబాబు మాత్రం మంగళవారం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నామని చెప్పినా.. రైతులకు మాత్రం అందే పరిస్థితిలేదు. రైతులంటే చంద్రబాబుకు చులకన.. సీఎం చంద్రబాబుకు రైతులంటే చులకన. వర్షాభావంతో అల్లాడుతుంటే ఆదుకోకుండా ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్దతి కాదు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా రెండు దక్కితే కానీ రైతులు పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. –ఎస్.మధుసూదన్‌రెడ్డి(రైతు), నాగూరు రైతులు క్షమించరు.. చంద్రబాబు ప్రభుత్వాన్ని రైతులు క్షమించే పరిస్థితిలేదు. మోసపూరిత విధానాలతో ఇబ్బంది పెడుతున్నారు. మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ, బీమాకు రెండూ అందజేయాలి. –సి.చిన్నగంగన్న(రైతు), కత్తలూరు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.. ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పంపిణీ విషయంపై ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి.రెండు హెక్టార్లకు ఇన్పుట్ సబ్సిడీ రూ.30వేలు రైతుకు అందుతుంది. ఈ మొత్తం అందే వారికి బీమా వస్తే ఇన్పుట్ సబ్సిడీ రాదు. ఇప్పటికే బ్యాంకులనుంచి వివరాలు తెప్పించుకుంటున్నాం. ఈనెల 19వ తేదీ నుంచి పత్రాలు రైతులకు అందజేసి ఎవరికి ఎంత మొత్తంలో అందుతుందో ఆయా మండల వ్యవసాయాధికారులు తెలియజేస్తారు. ప్రభుత్వ ఆదేశాలను తాము తప్పకుండా పాటించాల్సి ఉంది. – ఠాగూర్ నాయక్ (వ్యవసాయ శాఖ జేడీ), కడప -
రాయచూరులో కుండపోత
రాయచూరు / రాయచూరు సిటీ , న్యూస్‌లైన్ : నైరుతి రుతుపవనాలు తిరుగు ప్రయాణంలో రాయచూరును అతలాకుతలం చేశాయి. శనివారం రాత్రి నగరంలో కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు సకాలంలో స్పందించలేదని జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఐదు గుడిసెలు కూలి ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు గాయపడ్డారు. వందలాది ఇళ్లు జలమయమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. రాత్రంతా ప్రజలు జాగరణ చేయక తప్పలేదు. శనివారం రాత్రి 11 గంటల నుంచి కురిసిన వర్షం దాదాపు రెండు మూడు గంటల పాటు వివిధ ప్రాంతాలన్నింటినీ అతలాకుతలం చేసింది. జలాల్నగర్లో ఐదు గుడిసెలు కూలిపోయాయి. దీంతో స్థానికంగా ఉంటున్న భీమణ్ణ అనే యువకుడి కాలు విరగ్గా పద్మమ్మ అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పిడుగులు, ఉరుముల గర్జన కు తోడు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన నీరుబావి కుంట, జలాల్నగర్ లేఔట్‌లోని ఇళ్లల్లో రెండు మూడు అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరి పరిస్థితి చూడనలవి కాదు. తట్ట బుట్ట పిల్లజల్లని చేతపట్టుకుని ఎత్తైన ప్రాంతం కోసం పరుగులు తీశారు. బసవనబావి సర్కిల్ నుంచి రాజేంద్రగంజ్ రోడ్డు మధ్యలోని మున్నూరువాడి స్కూల్ ఎదుట నాలుగు అడుగుల మేర నీరు చేరింది. దీంతో ఉదయం వరకు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మురికి కాలువలన్నీ పూడికలతో నిండి ఉండటంతో స్థలాల ఆక్రమణ, మురికి కాలువలపై ఇళ్ల నిర్మాణం, ఫలితంగా నీరుబావికుంట, జలాల్నగర్ ఇళ్లు జలమయమయ్యాయి. సమీపంలో హెగ్గసనహళ్లిలోని కోణద వాగు నిండి ప్రవాహం ముంచెత్తింది. ఐదేళ్ల క్రితం ఇదే రీతిలో ప్రజలు ఆందోళన చెందారు. ప్రస్తుతం అదే విధంగా వ ంకలో భారీ స్థాయిలో పిచ్చి మొక్కలు, పూడిక విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వ ర్షం నీరంతా ఊరు మీద పడింది. దీంతో ఆ గ్రామంలోని ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వేలాది ఎకరాలు నీటమునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంత తీవ్ర నష్టం జరుగుతున్నా తగు రీతిలో స్పందించలేదన్న ఆగ్రహంతో అక్కడి ప్రజలు రాయచూరు-హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో జరిపారు. ఈ వాగు వల్ల తాము వర్షాకాలంలో పడరాని పాట్లు పడుతున్నామని, తీవ్రంగా నష్టపోయాని వాపోయారు. తక్షణం పరిహార పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయచూరు తహశీల్దార్ చామనూరు ప్రజలకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అసిస్టెంట్ కమిషనర్ ఎన్.మంజుశ్రీ ప్రజలను ఓదార్చేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రెండు గంటల పాటు రాస్తారోకో జరిగింది. రెండవ శనివారం, ఆదివారం సెలవు కావడంతో జెడ్పీ, ఇతర రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడం సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.