రేషన్ బియ్యం పట్టివేత
బోధన్ టౌన్ : పట్టణ శివారులోని బైపాస్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 29 క్వింటాళ్ల 95 కిలోల రేషన్ బియాన్ని బుధవారం సివిల్ సప్లై్స అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్వో సుదర్శన్ మాట్లాడుతూ సివిల్ సప్లై్స శాఖ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని ఆచన్‌పల్లి బైసాస్ వద్ద సాధారణ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ సమయంలో నిజామాబాద్ వైపునకు వెళుతున్న టీఎస్ 16 ఈఏ 7826 నంబర్‌గల ఫ్యాసింజర్ ఆటోలో, ఏపీ 25 వై 0233 నంబరు గల టాటా ఏస్‌లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని, వాహనాలను తనిఖీ చేయడానికి ఆపడంతో డ్రైవర్లు వాహనాలను వదిలి పారిపోయారని తెలిపారు. ఆటోల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ 49 వేల 931 రూపాయలు ఉంటుందని తెలిపారు. రేషన్ బియ్యాన్ని బోధన్‌లోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించి, ఆటోలను బోధన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో జీపీఏ హరిబాబు, డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వెంకట్రావులు పాల్గొన్నారు.