జయంత్ ‘హ్యాట్రిక్’
వరల్డ్ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడో స్వర్ణం
న్యూఢిల్లీ: భారత లిఫ్టర్ సుధాకర్ జయంత్... ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో ఏడాదీ స్వర్ణ పతకం గెలిచాడు. 62 కేజీల విభాగంలో జయంత్ 185 (స్నాచ్ 85+క్లీన్ అండ్ జర్క్ 100) కేజీల బరువు ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు.
హుస్కోనెన్ జారీ (ఫిన్లాండ్-170 కేజీలు), ఫ్రెడెరిక్ రాబర్ట్ (ఫ్రాన్స్-145 కేజీలు) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం సొంతం చేసుకున్నారు. 2013లో ఇటలీలో జరిగిన పోటీల్లో జయంత్ 192 కేజీల బరువు ఎత్తి పసిడిని సాధించడంతో పాటు స్నాచ్‌లో 87 కేజీలతో గేమ్స్ రికార్డు నెలకొల్పాడు. 2012లో ఉక్రెయిన్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో కూడా జయంత్ స్వర్ణం గెలిచాడు.