జూలై18న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సుఖ్వీందర్ సింగ్ (గాయకుడు), ప్రియాంక చోప్రా (నటి)
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 6. దీనికి శుక్రుడు అధిపతి. వీరు పుట్టిన తేదీ 18. దీనికి కుజుడు అధిపతి. వీరిపై ఈ సంవత్సరం కుజ, శుక్రుల ప్రభావం ఉంటుంది. వీరు స్వతస్సిద్ధంగా చురుగ్గా. పద్ధతిగా ఉండి, ఏ కార్యాన్నైనా అవలీలగా చేస్తారు. విధినిర్వహణనూ, కుటుంబపరమైన బాధ్యతలనూ ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తారు.బంధుమిత్రులను ఆదరిస్తారు. వ్యాపార స్థిరాస్తి వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. సంగీతం, నాట్యం, మార్షల్ ఆర్ట్స్, విలువిద్య వంటివాటిని నేర్చుకోవాలనే కోరిక ఏర్పడి వాటిని సాధన చేస్తారు. విలాసవంతమైన వస్తువులను కొంటారు. ఉన్న ఆస్తులను అభివృద్ధి చేస్తారు.
ఊహించిన విధంగా ఆస్తి కలిసి వస్తుంది. సినీనటులు, మీడియా రంగంలోని వారు, మిలటరీ, పోలీస్ ఉద్యోగాలలో ఉన్న వారికి, నగల వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. లక్కీ నంబర్స్: 1,6,9; లక్కీ డేస్: సోమ, మంగళ, శుక్రవా రాలు; లక్కీ కలర్స్: తెలుపు, ఎరుపు; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్. సూచనలు: శుక్రప్రభావం వల్ల వివాహితు లకు కొత్త బంధాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించడం అవసరం. నవగ్రహాభిషేకం, పేద కన్యలకు వివాహం జరిపించ డం, వికలాంగులను ఆదుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్