Sun Petrochemicals Pvt Ltd
-
తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో సన్ పెట్రోకెమికల్స్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నాగర్ కర్నూల్ ,మంచిర్యాల ,ములుగులో పంప్డ్ స్టోరేజి పవర్ ,సోలార్ పవర్ ప్రాజెక్టును నెలకోల్పనుంది. తద్వారా 7వేల మందికి ఉపాధి లభించనుంది.Big investment : Sun Petrochemicals signs ₹45,500 crore investment MoU with #Telangana to establish large-scale pumped storage Hydro and solar power projects Deal will create over 7,000 jobs, to develop three Pumped Storage Hydro Power projects in Nagarkurnool, Mancherial, and…— Naveena (@TheNaveena) January 22, 2025 -
పీఎస్‌యూ ఆయిల్ సంస్థలకు కొత్త అన్వేషణా క్షేత్రాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, సన్ ఫార్మా డైరెక్టర్లు ఏర్పాటు చేసిన కొత్త కంపెనీ సన్ పెట్రోకెమికల్స్ ప్రైవేటు లిమిటెడ్ తదితర కంపెనీలకు ప్రభుత తాజా వేలంలో చిన్న స్థాయి ఆయిల్, గ్యాస్ అన్వేషణా క్షేత్రాలు దక్కాయి. మొత్తం 46 క్షేత్రాలకుగాను ప్రభుత్వం గతేడాది వేలం నిర్వహించింది. 34 క్షేత్రాలకు బిడ్లు రాగా.... ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ వీటిలో 31 క్షేత్రాల బిడ్లను ఖరారు చేసి కాంట్రాక్టులకు కట్టబెట్టింది. బీపీసీఎల్‌కు చెందిన భారత్ పెట్రో రీసోర్సెస్ లిమిటెడ్‌కు 4, హెచ్‌పీసీఎల్ సబ్సిడరీ ప్రైజ్ పెట్రోలియంకు 3, ఐవోసీకి 3, సన్ పెట్రోకెమికల్స్‌కు ఒకటి దక్కాయి. నిప్పన్ పవర్, హార్డీ ఎక్స్‌ప్లోరేషన్, అదానీ వెల్స్పన్ తదితర కంపెనీలకు మిగిలినవి లభించాయి.