ఖాకీ వనంలో.. గంజాయి మొక్కలు
స్మగ్లర్లకు పోలీసుల సహకారం
మారేడుమిల్లి సీఐ, కానిస్టేబుళ్లపై కేసులు
గంజాయి రవాణాలో పోలీసుల పాత్రపై ఇంటెలిజె¯Œ్స నిఘా
సాక్షి, రాజమహేంద్రవరం/చింతూరు/మారేడుమిల్లి :
కాసుల వేటకు అలవాటు పడిన కొందరు ఖాకీలు గంజాయి స్మగ్లర్లకు బాహాటంగా అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలను నిజం చేసిన ఘటన ఇది. ఏజెన్సీలోని చింతూరు మండలం రత్నాపురం జంక్ష¯ŒS వద్ద
పట్టుబడిన రూ.64 లక్షల విలువైన 2,125 కేజీల గంజాయి రవాణా వెనుక మారేడుమిల్లి సీఐ ఆర్.అంకబాబు, కానిస్టేబుల్ సత్యనారాయణల పాత్ర ఉందని తేలడంతో.. వారిపై చింతూరు పోలీస్ స్టేష¯ŒSలో కేసు నమోదు కావడం పోలీస్ శాఖలో సంచలనం రేపింది. పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఈ చర్య ఆ శాఖలోని అక్రమార్కుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏజెన్సీ ప్రాంతమే కదా! తమను ఎవరూ పట్టించుకోరనే తెగింపుతో స్మగ్లర్లకు సహకరిస్తున్నవారు.. ఉన్నతాధికారులకు ఇంటెలిజె¯Œ్స నివేదికలు వెళుతున్నాయని గ్రహించలేక అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు వారిపై రహస్య విచారణలు జరపడం, స్మగ్లింగ్ బాగోతాలు బయటపడడం, చివరకు సస్పెన్ష¯ŒSకు గురి కావడం లేదా ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతోంది. గంజాయి స్మగ్లింగ్ రాకెట్లో ఒకరిద్దరి ఖాకీల పేర్లు మాత్రమే బయటకు రాగా మరికొంతమంది కూడా దీనికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలోనూ పలువురు పోలీసులు..
రాష్ట్ర విభజనకు పూర్వం ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి భారీ ఎత్తున గంజాయి రవాణా సాగుతూండేది. సరిహద్దు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో డొంకరాయి ఎస్ఐ ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా.. మోతుగూడెం ఎస్సైపై అప్పటి తెలంగాణ అధికారులు బదిలీ వేటు వేసి, వీఆర్‌లో పెట్టారు. గతంలో కూడా మారేడుమిల్లికి చెందిన ఓ సీఐపై గంజాయి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గంజాయి రవాణా జరిగే మార్గంలో ఏవైనా తనిఖీలు నిర్వహిస్తున్నారా? ఎలాంటి అడ్డంకులున్నాయనే సమాచారాన్ని స్మగ్లర్లకు చేరవేయడంతోపాటు, గంజాయి వాహనాలు సురక్షితంగా గమ్యానికి చేరేలా కొందరు పోలీసులే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఫలితంగా స్మగ్లర్ల నుంచి కొంతమంది ఖాకీలకు భారీ మొత్తంలో ముడుపులు అందేవనే ఆరోపణలున్నాయి.
సహకరించే పోలీసులపై చర్యలు
గంజాయి రవాణాలో స్మగ్లర్లకు సహకరించే పోలీసులపై చర్యలు తీసుకుంటామని చింతూరు ఓఎస్డీ డాక్టర్ కె.ఫకీరప్ప తెలిపారు. గంజాయి రవాణాలో పోలీసుల పాత్ర ఉన్నట్లు ఎవరైనా ఆధారాలు అందించాలని కోరారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఏజెన్సీలో 8 వేల కిలోల గంజాయి పట్టుకున్నామని, 60 మందిని అరెస్టు చేయడంతోపాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఇంత భారీ మొత్తంలో గంజాయి పట్టుకోవడం ఇదే ప్రథమమని తెలిపారు.