Systematic investment plan in mutual funds
-
మీ పెట్టుబడికి మీరే డ్రైవర్!
భవిష్యత్ లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నియమబద్ధంగా పెట్టుబడులు పెట్టే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇందుకు నెలవారీ వస్తున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులే నిదర్శనం. 16,928 కోట్లు సిప్ రూపంలో అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో సిప్ ద్వారా వచి్చన గరిష్ట పెట్టుబడులు ఇవి. అంతేకాదు, ప్రతి నెలా ఈ మొత్తం పెరుగుతూ పోతుండడం, మరింత మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని తెలియజేస్తోంది. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లు, రెగ్యులర్ ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది తెలిసి ఉండాలి. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్ ద్వారా సంపద సమకూర్చుకోవాలని ఆశించే వారు ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనమో తెలిసి ఉంటే, తమ లక్ష్యం సులువు అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందిస్తాయి. రెగ్యులర్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ డి్రస్టిబ్యూటర్ ద్వారా లేదా బ్రోకర్ ద్వారా విక్రయించే ప్లాన్. దీనిపై వారికి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) నుంచి కమీషన్లు అందుతాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ పెట్టుబడి నుంచి ఏటా వసూలు చేసే మొత్తం) రెగ్యులర్ ప్లాన్లలో అధికంగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. మూడో పక్షం (బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థలు) కూడా రెగ్యులర్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అయినప్పటికీ వీటిపై కమీషన్ చెల్లింపులు ఉండవు. కనుక డైరెక్టర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లను ప్రవేశపెట్టి పదేళ్లు అవుతోంది. అయినా, ఇప్పటికీ ఎక్కువ మంది పెట్టుబడులు రెగ్యులర్ ప్లాన్లలోకే వెళుతున్నాయి. డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఫోలియోలు ఎంతో తక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతీ ఇన్వెస్టర్ వీటి మధ్య వైరుధ్యాన్ని తప్పక తెలిసి ఉండాలి. అనుకూలతలు... మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ (సలహాదారు) లేదా పంపిణీదారు (డి్రస్టిబ్యూటర్) సేవలు అవసరం లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టే వారికి వ్యయాలు ఆదా చేసుకునేందుకు తీసుకొచి్చందే డైరెక్ట్ ప్లాన్లు. సులభంగా చెప్పాలంటే డ్రైవర్ సాయం లేకుండా ఎవరి కారును వారు డ్రైవ్ చేసుకున్నట్టు. ఇన్వెస్టర్ తన పెట్టుబడుల నిర్వహణను తానే చూసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్‌లో టీఈఆర్ అని ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్). ఇందులో ఫండ్ నిర్వహణ చార్జీలు, మార్కెటింగ్ వ్యయాలు, రిజిస్ట్రార్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, ఇతర వ్యయాలు కలిపి ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్లలో పంపిణీదారులకు కమీషన్ చెల్లించాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్న వివిధ రకాల వ్యయాలకు కమీషన్ కూడా తోడు కావడంతో రెగ్యులర్ ప్లాన్లలో టీఈఆర్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి విలువపై వార్షికంగా టీఈఆర్‌ను అమలు చేస్తారు. కానీ చార్జీ మినహాయింపు ఏరోజుకారోజు కొనసాగుతుంది. పెట్టుబడి నుంచి అధిక వ్యయాలను మినహాయించినప్పుడు ఆ మేర రాబడి తగ్గుతుంది. ఒక ఇన్వెస్టర్ రెండు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10,000 చొప్పున లమ్సమ్‌గా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ‘ఏ’ అనే పథకంలో టీఈఆర్ ఒక శాతంగా ఉంది. ‘బీ’ అనే పథకంలో టీఈఆర్ 2.5 శాతంగా ఉంది. కానీ, పదేళ్ల తర్వాత రూ.10,000 పెట్టుబడి ‘ఏ’ పథకంలో రూ.36,587గా మారితే, ‘బీ’ పథకంలో రూ.31,407 సమకూరింది. అంటే వ్యత్యాసం ఎంతుందో స్పష్టంగా అర్థమవుతోంది. రాబడులు పేరొందిన ఈక్విటీ ఫండ్స్ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వారి రాబడులు పరిశీలించినా.. డైరెక్ట్ ప్లాన్లలోనే ఎక్కువ ఉంటున్నాయి. ఉదాహరణకు మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎక్స్ఐఆర్ఆర్) డైరెక్ట్ ప్లాన్‌లో 16.73 శాతం రాగా, రెగ్యులర్ ప్లాన్‌లో ఇది 15.60 శాతంగానే ఉంది. అంటే గడిచిన పదేళ్లలో ఈ పథకంలో చేసిన రూ.6 లక్షల సిప్ కాస్తా డైరెక్ట్ ప్లాన్‌లో రూ.14.26 లక్షలుగా మారితే, రెగ్యులర్ ప్లాన్‌లో రూ.13.42 లక్షలు అయి ఉండేది. అంటే ఈ రెండింటి మధ్య రూ.82,945 వ్యత్యాసం కనిపిస్తోంది. రెగ్యులర్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇన్వెస్టర్ పదేళ్ల కాలంలో కమీషన్ల రూపేణా ఇంత మొత్తం నష్టపోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లోనూ రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో రూ.67,540, రూ.60,788 చొప్పున అధిక రాబడి వచ్చింది. నేపథ్యం.. 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య రాబడుల్లో ఇంత స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నా, ఈ ప్రయోజనాన్ని పొందుతున్న ఇన్వెస్టర్లు 25 శాతానికి మించి లేరు. యాంఫీ గణాంకాల ప్రకారం మొత్తం 13.89 కోట్ల వ్యక్తిగత ఫండ్స్ ఫోలియోల్లో డైరెక్టర్ ప్లాన్లలో పెట్టుబడులకు సంబంధించినవి కేవలం 3.45 కోట్ల ఫోలియోలే ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో డైరెక్ట్ ప్లాన్ల నుంచి వస్తున్నది 12 శాతం మించి లేదు. ఇందుకు గల కారణాలపై మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆంటోనీ హెరెడియా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లు సైతం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి సంపదను సమకూర్చి పెట్టాయి. దీనికి తోడు డైరెక్ట్ ప్లాన్లపై ఎక్కువ మందిలో అవగాహన లేదు’’అని వివరించారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డైరెక్ట్ ప్లాన్ల వైపే మొగ్గు చూపుతుంటే, నాన్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లలోనూ 50 శాతం మంది డైరెక్టర్ ప్లాన్లనే ఎంచుకుంటున్నారు. కేవలం రిటైల్ విభాగంలోనే డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకుంటున్న వారు తక్కువగా ఉంటున్నారు. ఏమిటి మార్గం..? ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన ఉంటే మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపిక కీలకం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో వేలాది పథకాలు ఉన్నాయి. ఇందులోనూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, రిస్‌్కకు అనుగుణంగా అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. ఈక్విటీ మార్కెట్ల పట్ల అవగాహన కలిగి ఉండి, రోజులో కొంత సమయం కేటాయించే వీలున్న వారు నేరుగా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సేవలను ఆశ్రయించినట్టయితే, వారు మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను సూచిస్తారు. కాకపోతే సెబీ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కేవలం 1,328 మందే ఉన్నారు. కనుక ఇన్వెస్టర్లు డిస్కౌంట్ బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థల సేవలను సైతం పొందొచ్చు. కాకపోతే చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సూచనల మేరకే నడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యత్యాసాలు ► మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పంపిణీదారులు, బ్రోకర్లు తదితర మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. కనుక రెగ్యులర్ ప్లాన్‌లో యూనిట్ ఎన్ఏవీతో పోలిస్తే, డైరెక్ట్ ప్లాన్ యూనిట్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ►డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువ. దీంతో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి వీటిల్లో ఎక్కువ. ►డైరెక్ట్ ప్లాన్లను ఏ సంస్థా సూచించదు. ఇన్వెస్టర్ నేరుగా ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డైరెక్ట్ ప్లాన్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జెరోదా, గ్రోవ్ వంటి సంస్థలు సైతం డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరంగా రూ.39,927 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతక్రితం జూన్ త్రైమాసికంలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,508 కోట్లుగానే ఉన్నాయి. నూతన పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉండడం ఇందుకు మేలు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే.. సెప్టెంబర్ ఆఖరుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.12.8 లక్షల కోట్లుగా ఉంది. జూన్ చివరికి ఈ మొత్తం రూ.11.1 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లగా.. ఈ ఏడాది మార్చి నుంచి నికరంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈక్విటీ పథకాల్లోకి వచ్చే నికర పెట్టుబడుల్లో 50 శాతం ఎన్‌ఎఫ్‌వోల నుంచే ఉంటున్నట్టు పరిశ్రమకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.18,258 కోట్లను ఆకర్షించగా.. సెక్టోరల్ ఫండ్స్ రూ.10,232 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.4,197 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.3,716 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.3,000 కోట్ల చొప్పున సెప్టెంబర్ క్వార్టర్లో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ డేటా పేర్కొంది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.8,666 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాలు ఆగస్ట్ నెలలో నికరంగా రూ.8,666 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. నూతన ఫండ్ పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేశాయి. ఇలా ఈక్విటీ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు ప్రవేశించడం వరుసగా ఆరో నెలలోనూ నమోదైంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఆగస్ట్ చివరికి రూ.36.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది జూలై ఆఖరుకు రూ.35.32 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) ఆగస్ట్ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో రూ.22,583 కోట్లు, జూన్‌లో రూ.5,988 కోట్లు, మేలో రూ.10,083 కోట్లు, ఏప్రిల్‌లో రూ.3,437 కోట్లు, మార్చిలో రూ.9,115 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి రావడం గమనార్హం. 2020 జూలై– 2021 ఫిబ్రవరి మధ్య ఎనిమిది నెలల పాటు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. నూతన మైలురాయి.. ‘‘ఓపెన్ ఎండెడ్ పథకాల్లోని సానుకూల పెట్టుబడుల రాకకుతోడు.. ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఏయూఎం రూ.36 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించేందుకు తోడ్పడ్డాయి’’ అని యాంఫి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. సిప్ ఖాతాలు పెరగడం అన్నది ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఆగస్ట్‌లో ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలలో ఇన్వెస్టర్లు రూ.6,863 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు మైవెల్త్‌గ్రోత్ సహ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. విభాగాల వారీగా... ► ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.4,741 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ► ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోకి రూ.3,073 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ► మల్టీక్యాప్, లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి ఆగస్ట్‌లో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ పథకాల నుంచి ఆగస్ట్‌లో ఇన్వెస్టర్లు రూ.163 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్టర్లు రూ.18,706 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ► సిప్ ఖాతాలు జూలై ఆఖరుకు 4.17 కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి 4.32 కోట్లకు పెరిగాయి. ► నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.9,923 కోట్లుగా ఉన్నాయి. జూలైలో ఈ మొత్తం రూ.9,609 కోట్లుగా ఉంది. ► గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.24 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో మాత్రం ఈ విభాగం నుంచి ఇన్వెస్టర్లు రూ.61 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► ఆగస్ట్‌లో డెట్ పథకాల్లోకి నికర పెట్టుబడులు రూ.1,074 కోట్లుగానే ఉన్నాయి. జూలైలో వచి్చన రూ.73,964 కోట్లతో పోలిస్తే డెట్‌లోకి పెట్టుబడులు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ► డెట్‌లో ఫ్లోటర్ ఫండ్స్‌లోకి రూ.9,991 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.3,065 కోట్ల చొప్పున వచ్చాయి. ► లిక్విడ్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.11,808 కోట్లను ఉపసంహరించుకున్నారు. ► ఆగస్ట్‌లో ఫండ్స్ పరిశ్రమలోకి (అన్ని విభాగాలూ) నికరంగా రూ.32,976 కోట్లు వచ్చాయి. -
ఫండ్స్ పెట్టుబడులను సమీక్షిస్తున్నారా..
దీర్ఘకాలంలో ఈక్విటీల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందన్న అవగాహన పెరుగుతోంది. ఫలితమే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గత కొన్నేళ్లలో పెరుగుతూ వస్తోంది. కాకపోతే మార్కెట్ పతనాల్లో సిప్ పెట్టుబడుల్లో కాస్త క్షీణత కనిపించడం సాధారణమే. తిరిగి మార్కెట్ల రికవరీతో పరిస్థితి మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీయండి, డెట్ ఫండ్స్ కానీయండి.. వాటిల్లో పెట్టుబడులు పెట్టేయడంతో పని పూర్తయినట్టు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో మన పెట్టుబడులను నిపుణులే నిర్వహిస్తుంటారు కనుక వాటి గురించి ప్రత్యేకంగా చూడాల్సినది ఏముంటుందని అనుకోవడం కూడా సరికాదు. తమ జీవిత లక్ష్యాలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు తప్పకుండా క్రమానుగతంగా వాటి పనితీరును సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్జనా శక్తి పెరగడం, జీవిత అవసరాలు అధికం కావడం.. దీనికితోడు కాస్త రిస్క్ తీసుకుంటే మంచి రాబడులను ఈక్విటీల్లో సొంతం చేసుకోవచ్చన్న అవగాహనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విస్తృతం చేస్తోంది. అయితే, ఎంతో మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నప్పటికీ.. తమ పెట్టుబడులను తరచుగా సమీక్షించుకోవాలన్న విషయం వారికి తెలియడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం అంటే మీ పెట్టుబడులపై ఓసారి లుక్కేయడం కాదు. ఓ పథకంలో పెట్టుబడులపై లాభం లేదా నష్టం వచ్చిందా? అన్న దానికే పరిమితం కానే కాదు. మీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం అంటే అందుకు సంబంధించి వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. పెట్టుబడులపై రాబడులు వస్తే ఉత్సాహంతో పొంగిపోయినట్టే.. నష్టాలు కనిపిస్తే అసంతప్తికీ లోనవుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలే చూపిస్తుంటే వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం దండగని భావించి అమ్మేయడం మాత్రం సరికాదు. అదే సమయంలో మార్కెట్లు పతనమయ్యాయా? అన్నది చూడాలి. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో అదే సమయంలో రాబడుల తీరు ఎలా ఉందీ పరిశీలించాలి. ఫండ్స్ స్కీమ్ విధానాల్లో మార్పులు జరిగాయా? అన్నది చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఎక్స్పెన్స్ రేషియో (ఫండ్స్ పెట్టుబడుల నిర్వహణకుగాను వసూలు చేసే చార్జీ), రిస్క్, స్కీమ్ సైజు, అస్సెట్ రేషియో, రిస్క్ అంశాలు మారిపోయాయా అన్న దానిపై దృష్టి సారించాలి. అంతేకాదు, ఇన్వెస్టర్ ఏ అంశాలను చూసి అయితే ఆ పథకాన్ని ఎంచుకున్నారో.. అనంతర కాలంలో ఆ అంశాల్లో మార్పులు వచ్చాయేమో పరిశీలించడం మర్చిపోవద్దు. సాధారణంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మంచి రాబడుల తీరును (ఇతర పథకాలు, బెంచ్ మార్క్ కంటే మెరుగైన పనితీరు) చూపించే ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్కీమ్ ఉద్దేశాల్లో మార్పులు జరగకపోయి, ఇన్వెస్టర్ తాను ఏ అంశాలను అయితే మెచ్చి ఆ పథకాలను ఎంచుకున్నారో... అవేమీ మారనప్పుడు, కేవలం నష్టాలను చూపిస్తుంటే వాటి నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదన్నది నిపుణుల సూచన. కేవలం అద్భుత రాబడులనే చూసి పథకం ఎంచుకుంటే మాత్రం వాటిని ప్రత్యేకంగా సమీక్షించాల్సి ఉంటుంది. సమీక్ష ఏదైనా కానీయండి.. స్వల్ప కాలంలో రాబడుల తీరు నచ్చక ఆయా పథకాలను మార్చేస్తే పెట్టుబడులకు విజయం అందడం కష్టమేనని గుర్తించాలి. మరీ ముఖ్యంగా తమ జీవిత లక్ష్యాల్లో మార్పులు సంభవించినప్పుడు ఇన్వెస్టర్లు తప్పకుండా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం అవసరమని నిపుణుల సూచన. ఉదాహరణకు రిటైర్మెంట్ (60 ఏళ్లు వచ్చే నాటికి) కోసమని పెట్టుబడులు మొదలు పెట్టారనుకుంటే.. అనంతర కాలంలో 60 ఏళ్ల కంటే ముందుగానే రిటైర్ అవ్వాలని భావిస్తే అప్పుడు తప్పకుండా పోర్ట్ ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల్లో సమతుల్యం కూడా అవసరం. పోర్ట్ ఫోలియోను వార్షికంగా ఒకసారి సమీక్షించుకోవడం వల్ల పన్నుల పరంగా ప్రయోజనం కూడా ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు, వాటికి తగిన పెట్టుబడుల సాధనాల ఎంపిక అనేది ఎక్కువ మంది ఇన్వెస్టర్లలో కనిపించదన్నది వాస్తవం. కానీ, దీన్ని ఎక్కువ మంది అంగీకరించరు లేదా గుర్తించరు. అందుకే ఈ విషయంలో ఆర్థిక సలహాదారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని గుర్తించాలి. -
అవకాశం ఎక్కడ ఉన్నా అందిపుచ్చుకోవడమే..!
లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో వృద్ధి, లాభాలకు అవకాశం ఉన్న స్టాక్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవే మల్టీక్యాప్ ఫండ్స్. విడిగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే మల్టీక్యాప్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువ. అదే సమయంలో అచ్చమైన లార్జ్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే మల్టీక్యాప్ ఫండ్స్‌లో అస్థిరతలు ఎక్కువ. గత ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే రాబడులు ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో అధిక శాతం స్టాక్స్ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. త్వరలో ఈ విభాగంలోని స్టాక్స్ కూడా ర్యాలీ చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనుక లార్జ్‌క్యాప్‌కే పరిమితం కాకుండా, మార్కెట్ వ్యాప్తంగా పెట్టుబడుల అవకాశాలను గుర్తించి ఇన్వెస్ట్ చేసే మల్టీక్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచి ఆలోచన అవుతుంది. అందులోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ కూడా ఒకటి. రాబడులు..: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ పథకానికి మార్కెట్లో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1994 అక్టోబర్‌లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి నేటి వరకు వార్షికంగా 14.43 కాంపౌండెడ్ రాబడులను (సీఏజీఆర్) ఈ పథకం అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ–50 వృద్ధి 10.36 శాతమే. గత 15 ఏళ్లుగా ఈ ఫండ్‌లో ప్రతీ నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇన్వెస్టర్లకు రూ.51.6 లక్షలు సమకూరేది. ప్రతీ నెలా రూ.10వేల చొప్పున గత మూడేళ్లలో మొత్తం రూ.3.6 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, అదిప్పుడు రూ.3.9 లక్షలుగా ఉండేది. అంటే సీఏజీఆర్ రాబడులు 6.1 శాతమే. అదే గత ఐదేళ్లలో ప్రతీనెలా రూ.10వేల చొప్పున పెట్టుబడి పెడితే రూ.7.4 లక్షలు అయ్యేది. ఇక్కడ సీఏజీఆర్ రాబడులు 8.5 శాతం. ఇక గత పదేళ్ల కాలంలో ప్రతీ నెలా రూ.10వేల పెట్టుబడి పెట్టి ఉంటే రూ.23 లక్షలు సమకూరేవి. ఇక్కడ సీఏజీఆర్ రాబడులు 12.5 శాతం. అంటే దీర్ఘకాలంలో ఈ పథకం స్థిరమైన, మెరుగైన రాబడులను ఇచ్చినట్టు చెప్పుకోవాలి. కనుక మార్కెట్లలో అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని, ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం అయితే దీన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం టాప్ డౌన్, బోటమ్ అప్ ఈ రెండు విధానాలను రంగాల వారీ, స్టాక్ వారీ ఎంపికకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్ అనుసరిస్తున్నారు. ఇందులో టాప్ డౌన్ అంటే, స్థూల ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక రంగంలో పరిణామాలు, అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ ధోరణులను పరిగణనలోకి తీసుకుని అనువైన రంగాలను పెట్టుబడులకు ఎంచుకోవడం. అదే బోటమ్ అప్ అంటే.. విడిగా కంపెనీలను, వాటి వృద్ధి అవకాశాలు, స్టాక్ వ్యాల్యూషన్ల ఆధారంగా పెట్టుబడులకు ఎంపిక చేసుకోవడం. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 78 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌లో 71 శాతం, మిగిలిన మేర మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 26 శాతం పెట్టుబడులను ఈ రంగం స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. -
ఏడాది మారింది... మరి మీరు?
గతేడాది చాలా పెట్టుబడి సాధనాలు సగటు కంటే తక్కువ రాబడులే ఇచ్చాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ అస్థిరతలు చూసింది గతేడాదిలోనే. అయితే, 2019లో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. ప్రతికూలతలను అధిగమించి, పెట్టుబడి అవకాశాలను అందుకోవాలంటే అందుకు ప్రతి ఒక్కరూ పాటించతగిన ఆర్థిక విధానాలు కొన్ని ఉన్నాయి. అవేంటన్నది నిపుణుల మాటల్లోనే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున మార్కెట్లలో అస్థిరతలు కొనసాగేందుకు అధిక అవకాశాలున్నాయి. ఈ అస్థిరతలను అధిగమించేందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉపయోగపడుతుంది. ఎన్నికల వరకు స్టాక్స్ ధరలు పరిమిత పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడ్డాక దిశను ఎటువైపు అయినా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడమే సరైన మార్గం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ఏవీ ధరలు పెరగడం వల్ల తక్కువ ఫండ్స్ యూనిట్లు, మార్కెట్లు కరెక్షన్ బాట పడితే ఎన్ఏవీ ధరల పతనంతో ఎక్కువ యూనిట్లు సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లు కొంతమేర కరెక్షన్కు గురైన ఈ సమయంలో సిప్‌ను ఆపకూడదు. దీనివల్ల తక్కువ ధరలకు ఎన్ఏవీలను కొనుగోలు చేసుకునే అవకాశం కోల్పోతారు. ముఖ్యంగా 12–18 నెలల క్రితం సిప్ ఆరంభించిన వారు కచ్చితంగా ఈ సమయంలో ఆపకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏడాది, ఏడాదిన్నర క్రితం మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. కనుక గరిష్ట ధరల్లో పెట్టుబడి పెట్టిన వారు, ఇప్పుడు తక్కువ ధరకే కొనే అవకాశాన్ని కోల్పోకూడదు. లార్జ్‌క్యాప్‌నకు ప్రత్యామ్నాయాలు చాలా వరకు ప్రధాన లార్జ్‌క్యాప్ ఫండ్స్ గతేడాది మెరుగైన పనితీరు చూపించలేకపోయాయి. ఈ ఏడాది కూడా వీటి పనితీరు అంత బాగుండకపోవచ్చనే అంచనా ఉంది. అధిక రాబడులు కోరుకునే వారు అధిక రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని మరిచిపోవద్దు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ టాప్ 100, రిలయన్స్ లార్జ్‌క్యాప్, యూటీఐ మాస్టర్‌షేర్ పథకాలన్నీ గతేడాది ఒక శాతం నుంచి రెండున్నర శాతం నష్టాలను మిగిల్చాయి. ఇదే కాలంలో నిఫ్టీ– 50 సూచీ 3 శాతం రాబడులను ఇచ్చింది. కనుక లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు బదులు ఈ సమయంలో మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మల్టీక్యాప్ ఫండ్స్ భిన్న మార్కెట్ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయని వారు సూచిస్తున్నారు. దీంతో అధిక రాబడులిచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ కాస్త తక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే... మల్టీక్యాప్ ఫండ్స్ అయినప్పటికీ క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) ద్వారా కనీసం ఐదేళ్లు ఆపైన ఇన్వెస్ట్ చేయడం ద్వారానే మెరుగైన రాబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను భారం తగ్గించుకోవచ్చు ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత కూడా ఈక్విటీల్లోకి, మ్యూచువల్ ఫండ్స్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆగలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. సిప్ ద్వారా 2018లో వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం వృద్ధి నెలకొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి దీర్ఘకాల మూలధన లాభం పొందితే దానిపై 10 శాతం పన్ను చెల్లించాలి. అయితే, ఈక్విటీ ఫండ్స్‌లో వచ్చే లాభాల్లో ఇది స్వల్ప మొత్తమేనని ఇన్వెస్టర్లు అర్థం చేసుకున్నట్టున్నారు. నిజానికి 10 శాతం పన్ను రాబడులను పెద్దగా ప్రభావం చేసేది కాదని నిపుణుల అభిప్రాయం కూడా. నెలకు సిప్ ద్వారా రూ.5,000– 10,000 మొత్తం ఇన్వెస్ట్ చేసే వారిపై ఇప్పటికిప్పుడు ఈ పన్ను ప్రభావం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ స్వల్ప మొత్తంపై ఏడాదిలో వచ్చే లాభాలు పన్ను పడే స్థాయిలో ఉండవు. అదే రూ.30,000– 50,000 మధ్య ఇన్వెస్ట్ చేసే వారయితే వార్షికంగా 12 శాతం రాబడులు వచ్చాయనుకుంటే రెండేళ్ల తర్వాత మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తారు. రెండేళ్లలో వారు పొందే లాభం రూ.లక్ష దాటుతుంది. ఆ మొత్తాన్ని ఒకే ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటేనే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఈ పన్ను కూడా చెల్లించకుండా మార్గం ఉంది. ఏడాది దాటాక ప్రతీ నెలా అంతే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటూ తిరిగి అదే ఫండ్ లేదా మరో ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. దీంతో పన్ను వర్తించేంత లాభాలు రాకముందే తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు 2018 ఏప్రిల్ నెలలో ఓ ఫండ్‌లో ఎన్ఏవీ రూ.25 వద్ద రూ.25,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. 1,000 యూనిట్లు వచ్చి ఉంటాయి. 2019 ఏప్రిల్ నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆ మరుసటి నెలలోనే వెయ్యి యూనిట్లను రెడీమ్ చేసుకుని తిరిగి ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ప్రతీ సిప్‌కు ఏడాది పూర్తయిన వెంటనే తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటే సరి. మల్టీ ఇయర్ హెల్త్ ప్లాన్ వైద్య బీమాకు ఏటా ప్రీమియం చెల్లించాలి. లేదంటే కవరేజీ ఆగిపోతుంది. దీనికి బదులు ఒకేసారి రెండేళ్లకు ప్లాన్ తీసుకుని ప్రీమియం చెల్లించడం వల్ల తగ్గింపుతోపాటు... ఏడాదికే ప్రీమియం చెల్లించాల్సిన ఇబ్బందీ తప్పుతుంది. న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ 2017లో వృద్ధుల వైద్య బీమా ప్రీమియంను ఒకేసారి రెట్టింపునకు పైగా పెంచింది. కనుక ఒకేసారి ఎక్కువ సంవత్సరాలకు పాలసీ తీసుకోవడం వల్ల తగ్గింపు ఒక్కటే కాదు, ప్రీమియం పెరిగే భారం కూడా కొంత వరకు తప్పించుకున్నట్టు అవుతుంది. ఎన్పీఎస్ కూడా చూడొచ్చు.. జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనం కోసం ప్రణాళికలు వేసుకునే వారికి అనువైన సాధనాల్లో ఒకటి. ఇందులో చార్జీలు ఇతర సాధనాలతో పోలిస్తే తక్కువ. ఈక్విటీ, డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంలో 20 శాతంపై పన్ను ఉండేది. ఇది నచ్చక చాలా మంది దీనికి దూరంగా ఉండిపోయారు. అయితే, ఎన్పీఎస్ పథకం నుంచి రిటైర్మెంట్ వయసులో ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలని తెలిసిందే. ఇక ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఎన్పీఎస్ నిర్వహణను చూసే పీఎఫ్ఆర్డీఏ గతేడాది అక్టోబర్‌లో మరో నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు వచ్చే వరకూ కూడా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతించింది. గత ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా రెండంకెల రాబడులు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఈక్విటీలకు 50 శాతం వరకు కేటాయించుకునే వారికి 11.31 శాతం చొప్పున వార్షిక రాబడులు, పూర్తిగా డెట్‌కే పరిమితమైన వారికి వార్షికంగా 10.55 శాతం చొప్పున పెట్టుబడుల వృద్ధి ఉంది. ఇక పన్ను ప్రయోజనాలు అదనం. బేసిక్ వేతనంలో 10 శాతాన్ని సెక్షన్ 80సీసీడీ(2) కింద ఉద్యోగి తరఫున కంపెనీ ఎన్పీఎస్కు జమ చేస్తే పన్ను ఉండదు. అలాగే, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ఎన్‌పీఎస్‌లో అదనంగా మరో రూ.50,000 పెట్టుబడిపైనా పన్ను ఉండదు. కనుక దీన్ని తప్పకుండా పరిశీలించాల్సిన పథకంగా ఫైనాన్షియల్ అడ్వైజర్ల సూచన. విదేశీ ఫండ్స్‌లో కూడా... అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్ఏవీల ధరలు కొంత కాలం క్రితం వరకూ బాగా పెరిగాయి. తాజాగా అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో వాటి ఎన్ఏవీలు తగ్గుముఖం పట్టాయి. అంతమాత్రాన అమెరికా ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల విశ్లేషణ. అమెరికన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్నో అంశాలను అధ్యయనం చేశాకే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. బలమైన బ్రాండ్, మార్కెట్ వ్యాల్యూ, బలమైన నగదు ప్రవాహాలు వంటి అంశాలను చూస్తాయి. పైగా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత కూడా పెట్టుబడుల విలువ పెరిగేందుకు దోహదపడుతుంది. కనుక తమ పిల్లలను విదేశీ విద్యకు పంపించాలనుకునే వారు ఈ తరహా ఫండ్స్‌లో ముందునుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రుణాన్ని బదలాయించుకుంటే...? రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు వాటి అంతర్గత బెంచ్ మార్క్ రేటుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పారదర్శకత తక్కువగా ఉంటోంది. దీనికి బదులు రెపో రేటు, 91, 182 రోజుల ట్రెజరీ బిల్లు ఈల్డ్ రేటు లేదా ఏదైనా ఇతర బెంచ్ మార్క్ మార్కెట్ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను అనుసరించాలని ఆర్బీఐ ఇటీవలే ఆదేశించింది. గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత రుణాలకూ ఇది అమలుకానుంది. బ్యాంకుల మధ్య పోటీ పెరిగి కస్టమర్లకు తక్కువ రేట్లకే రుణం లభించే పరిస్థితులకు ఇది దారితీస్తుంది. కనుక అధిక వడ్డీ రేటుకు రుణం తీసుకున్న వారు దాన్ని తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రుణం తొలి నాళ్లలో ఈఎంఐలో ఎక్కువ మొత్తం వడ్డీకే వెళుతుంది. కనుక మొదట్లోనే రుణాన్ని బదలాయించుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ. పెద్దల పేరు మీద పెట్టుబడి 60 ఏళ్లు దాటిన వారు వార్షికంగా పొందే రూ.50వేల వడ్డీ ఆదాయానికి పన్నును మినహాయిస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. 60 ఏళ్ల లోపు వయసులో ఉన్న వారు ఏటా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక తమ తల్లిదండ్రులకు పన్ను వర్తించేంత ఆదాయం లేకపోతే, వారికి గిఫ్ట్‌గా ఇచ్చి, వారి పేరిట డిపాజిట్ చేయడం మంచి ఆలోచన. ఇది చట్టబద్ధం కూడా. పైగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అర శాతం వరకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. భార్యా, పిల్లలకు గిఫ్ట్ ఇచ్చి వారి పేరిట ఇన్వెస్ట్ చేసినా, అది గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఆదాయం కిందే చట్టం పరిగణిస్తుంది. తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇస్తే మోసపూరిత లావాదేవీగా చట్టం పరిగణించదని ట్యాక్స్‌స్పానర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు సుధీర్కౌశిక్ తెలిపారు. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ ప్రస్తుతం వడ్డీ రేట్ల పరంగా ఆటుపోట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కనుక ఈ సమయంలో దీర్ఘకాల డెట్ ఫండ్స్ కంటే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాల ఫండ్స్, దీర్ఘకాలంలో గడువు తీరే బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇంక్రిమెంటల్ రిస్క్ తీసుకున్నా గానీ దీర్ఘకాల డెట్ ఫండ్స్ తగినంత రాబడులను ఆఫర్ చేయడం లేదని, వీటికి బదులు మూడేళ్ల లోపు గడువు తీరే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఐవో ధావల్ దలాల్ సూచించారు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ (రుణ చరిత్ర) ఉన్న కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చని కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం హెడ్ అవనీష్ జెయిన్ సూచన. 2–5 ఏళ్ల కాలానికి ఇవి మంచి రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు డెట్ ఫండ్స్‌లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ ప్రయోజనం నష్టపోతారు. ఈ రకమైన రిస్క్ వద్దనుకునేవారు ఎఫ్ఎంపీలను పరిశీలించొచ్చు. ఇవి డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసి గడువు తీరే వరకు కొనసాగుతాయి. దాంతో బాండ్ ఈల్డ్స్‌కు అనుగుణంగానే రాబడులు ఉంటాయి. -
యులిప్స్.. మ్యూచువల్ ఫండ్స్.. ఏవి ఉత్తమం?
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లేక మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాకు సెక్షన్ 80 సీ ప్రయోజనాలు అవసరం లేదు. కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ ఫండ్‌ను ఎంచుకున్నాను. నా నిర్ణయం సరైనదేనా? - ఆనంద్, హైదరాబాద్ బీమా కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. సౌకర్యం, వ్యయాలు ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే యులిప్‌ల కన్నా సిప్ విధానమే ఉత్తమం. యులిప్‌లకు సంబంధించి మొదటి 4,5 ఏళ్లలో అధిక వ్యయాలు చార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ గరిష్టంగా 2.5 శాతం చార్జీలను (ఈక్విటీ ఫండ్స్ అయితే 2.25 శాతం మాత్రమే) వసూలు చేస్తాయి. యులిప్‌లు అయితే స్కీమ్ ప్రారంభ సంవత్సరాల్లో కనీసం 5 నుంచి 6 శాతం చార్జీలను వసూలు చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో పెట్టుబడి వ్యూహాలు, పోర్ట్‌ఫోలియో తదితర అంశాలు పారదర్శకంగా ఉంటాయి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్ పనితీరు, రాబడులు మీరు ఆశించిన విధంగా లేకపోతే వాటి నుంచి ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌ల్లో అలా కాదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఐదేళ్ల కాలానికి లాకిన్ అయి ఉంటాయి. ఇక మీ ఆర్థిక అవసరాలు, మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ప్లాన్ అనేది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. మా వాల్యూ రీసెర్చ్ దీనికి ఫోర్ స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. మీరు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించి ఎగ్జిట్లోడ్లోని మార్పులను తెలుసుకునే వీలుందా? ఎగ్జిట్ లోడ్ మార్పుల వివరాలను ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సిన బాధ్యత మ్యూచువల్ ఫండ్ సంస్థలకు లేదా? - నిర్మల్ కుమార్, కొత్తగూడెం మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన సమయంలో ఉండే ఎగ్జిట్ లోడ్.. మీ ఇన్వెస్ట్మెంట్ కాలానికి వర్తిస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎగ్జిట్లోడ్లో మార్పులు, చేర్పులు వచ్చినా వాటితో మీకేమీ సంబంధం ఉండదు. ఏదైనా స్కీమ్‌లకు సంబంధించి ఎగ్జిట్ లోడ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తే సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆ వివరాలను వార్తాపత్రికల ద్వారా తెలియజేయాలి. ఈ వివరాలను తమ వెబ్‌సైట్‌ల్లో కూడా పబ్లిష్ చేయాలి. అయితే నేరుగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సిన తప్పనిసరి నిబంధన ఏదీ లేదు. ఇలా చేయడం వ్యయంతో కూడుకున్నందున మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఈ వెసులుబాటు ఉంటుంది. ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ రాబడుల గురించే కాకుండా తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్రభావం చూపే వ్యయాలు, చార్జీలపై కూడా ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, లేదా మ్యూచువల్ ఫండ్స్ నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునేటప్పుడు తెలుసుకోవలసిన అన్ని వివరాలను (ప్రతీ స్కీమ్‌కు సంబంధించి) మా వెబ్సైట్ అందిస్తుంది నా వయసు 54 సంవత్సరాలు. నా భార్య వయసు 50 సంవత్సరాలు. మాకు 16 సంవత్సరాల వయసున్న కూతురు ఉంది. మా ముగ్గురి కోసం నేను న్యూ ఇండియా ఎష్యూరెన్స్ నుంచి ఒక మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నాను. ఒక్కొక్కరికి రూ.5 లక్షల కవర్ ఉండేలా ఏడాదికి రూ.35,000 ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇదే కాకుండా రూ.10 లక్షలకు ఐసీఐసీఐ హెల్త్ ఫ్లోటర్ పాలసీ కూడా తీసుకున్నాను. ఈ రెండు పాలసీలకు గత ఏడు సంవత్సరాలుగా ఎలాంటి క్లెయిమ్స్ చేసుకోలేదు. ఈ హెల్త్ పాలసీల్లో కొనసాగమంటారా? వద్దంటారా? తగిన సలహా ఇవ్వండి? - సదాశివరావు, విజయవాడ ఈ వయసులో మెడిక్లెయిమ్ పాలసీల నుంచి వైదొలగడం సరైనది కాదు. మధ్య వయసు తర్వాత ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. గత ఏడేళ్లుగా మీరు ఎలాంటి క్లెయిమ్ చేయలేదు. కాబట్టి లాయల్టీ అడిషన్స్, నో క్లెయిమ్ బోనస్‌లను మీరు అదనంగా పొందుతారు. ఈ పాలసీల్లోనే కొనసాగడం ఉత్తమం. కొత్తగా మీరు పాలసీ తీసుకుంటే ఈ ప్రయోజనాలు మీకు లభించవు. భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి క్లెయిమ్‌లు చేయాల్సిన అవసరం ఉండకూడదనే ఆశిద్దాం. ఒకవేళ వైద్య సాయం అవసరమైన పక్షంలో ఈ పాలసీలు మీకు తగిన విధంగా వైద్య ఖర్చులను తట్టుకోవడంలో భరోసాను ఇస్తాయని చెప్పవచ్చు.