బాబు ఆస్తులకు పెంపుడు కుక్కలా?
తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌పై నిలదీయరేం
జనం విరాళాలతో ఆఫీసులకు సోకులా
టీడీపీ నేతలపై హరీశ్‌రావు ఆగ్రహం
హైదరాబాద్: చంద్రబాబునాయుడు ఆస్తులను కాపాడడానికి పెంపుడు కుక్కల్లాగా, తాబేదారులుగా తెలంగాణ టీడీపీనేతలు మాట్లాడ డం మానుకోవాలని మంత్రి టి.హరీశ్‌రావు సూ చించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో హామీ లు ఇవ్వని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటివాటితో కలిపి 4 నెలల్లోనే 120 కార్యక్రమాలను చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ అభివృద్ధికోసం సీఎం పడుతున్న తపన ను, చిత్తశుద్ధిని చూడకుండా చంద్రబాబు మె ప్పుకోసం కొందరు టీడీపీ నేతలు నోటికొచ్చిన ట్టు మాట్లాడుతున్నారని హరీశ్ విమర్శించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటుతోపాటు, తెలంగాణపై రెండుకండ్లు, నాలుగు నాలుకలంటూ మాటమార్చిన చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగుతూ టీటీడీపీ నేతలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణపట్నంలో, లోయర్ సీలేరులో తెలంగాణకు రావాల్సిన 54 శాతం న్యాయమైన వాటాను ఇవ్వకుండా మోసం చేస్తున్న చంద్రబాబును నిలదీయాలని సవా ల్ చేశారు.
తెలంగాణ అభివృద్ధికోసం కేసీఆర్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉన్నారని చెప్పారు. టీడీపీకి, చంద్రబాబుకు ముందుచూపు ఉంటే తెలంగాణలో విద్యుత్ ప్లాంట్లను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారమే హైదరాబాద్‌లో ఉంటున్న చంద్రబాబు కరెంటు విషయంలో మాత్రం దానిని ఎందుకు అమలుచేయడం లేదన్నారు. సచివాలయంలో కూచుని, మంజీరా నీళ్లుతాగే హక్కు బాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు. టీడీపీలో చేరితే అభివృద్ధి, టీఆర్ఎస్లో చేరితే ఆకర్షణా అని అడిగారు. రాజధానికోసం ఆడపడుచుల గాజులు, లక్షల రూపాయలు వసూలు చేసి మరికొంత కాలంలో ఖాళీ చేయాల్సిన కార్యాలయాలకు, ఇంటికి, బుల్లెట్‌ప్రూఫ్ కార్లకు, హెలీకాప్టర్ల అద్దెకు వాడుకుంటున్నారని విమర్శించారు. అధికారంలో ఉంటే న్యాయం చేయలేరనే భావనతోనే జనం రెండుసార్లు ఓడించారన్నారు.