17 నుంచి రంజాన్ తోఫా
కర్నూలు(అగ్రికల్చర్): రంజాన్ పర్వదినాన్ని పురష్కరించుకొని ముస్లిం కార్డుదారులకు రంజాన్ తోఫా అందజేయనున్నారు. 2.02 లక్షల మంది ముస్లిం కార్డుదారులకు తోఫా కానుకలను ఈ నెల 17 నుంచి పంపిణీ చేయనున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా కార్డుల వివరాలను తహసీల్దార్లకు పంపారు. ఇందులో అనర్హులు ఉన్నారా... లేదా అర్హత కలిగిన ఏ కుటుంబమైనా లేదా అనేదానిని పరిశీలించాల్సి ఉంది. రంజాన్ తోఫా కింద 5కిలోల గోదుమ పిండి, 2 కిలోల చక్కెర, 1కిలో సేమియా, 100 ఎంఎల్ నెయ్యి ఇస్తారు. అన్ని ప్రత్యేక ప్యాకెట్లలోనే ఉంటాయి. వీటిని ఒక బ్యాగ్లో వేసి ఇస్తారు. ఇప్పటి వరకు స్టాక్ పాయింట్లకు 60 శాతం సరుకులు వచ్చాయని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ తెలిపారు. ఈ– పాస్ మిషన్ల ద్వారానే కార్డుదారులకు పంపిణీ చేస్తారు.