teacher problems
-
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
రామచంద్రాపురం :ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శంకర్‌బాబు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎస్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, సుధాకర్, ఈశ్వర్ ప్రసాద్, విజయ్‌కుమార్, అలీ, తాజోద్దిన్, బష్య, ప్రతాప్‌రెడ్డి, రాజమల్లయ్య తదితరులు ఉన్నారు. -
సమస్యల పరిష్కారంలో ఏపీ సర్కార్ విఫలం
హైదరాబాద్: ఉద్యోగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వైయస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్(వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కె. జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.ఓబుళపతిలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2015 జనవరిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన కరవు భత్యం(డీఏ) ఇంత వరకు చెల్లించలేదని తెలిపారు. పదవ పీఆర్సీలో మిగిలిన జీవోలను కూడా జారీ చేయలేదన్నారు. చివరికీ ఉపాధ్యాయ బదిలీలలో పారదర్శకత, స్పష్టత లేదన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం టీచర్లను గందరగోళ పరిస్థితులలోకి నెట్టిందన్నారు. ఇప్పటికైనా బదిలీ ద్రువీకరణ పత్రాలను వెంటనే ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్‌కి తెరదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం దిగి రావాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాలంటూ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి డిమాండ్ చేశారు. శనివారం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఉపాధ్యాయలకు 60 శాతం ఫిట్మోంట్తో పీఆర్సీని అమలుచేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు నిరసనగా ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ధర్నా పోస్టర్ ను వైఎస్సార్ టీఎఫ్ నేతలు అశోక్ కుమార్ రెడ్డి, ఓబులపతి విడుదల చేశారు. -
పెండింగ్‌లో టీచర్ల సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలన కారణంగా ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం ఆమోదిం చిన ఫైళ్లకు కూడా మోక్షం లభించడం అనుమానమేనని అధికారవర్గాలు చెబుతున్నా యి. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే వీటికి పరిష్కారం లభిస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. సమస్యల పరిష్కారానికి అధికారవర్గాలు చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు ఇవీ.. 2,500 పండిట్, 2,500 పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు సీఎం, ఆర్థిక శాఖల ఆమోదముద్ర పడింది. ఈ ఫై లు విద్యాశాఖకు చేరేసరికి ఆ శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సెలవులో వెళ్లడంతో జీవో నిలిచి పోయింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు హాఫ్ పే లీవ్‌ను నగదుగా మార్చుకొనే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. కానీ ఆర్థిక శాఖ కొర్రీ వేయడంతో ఫైల్ నిలిచిపోయింది. ప్రతి ఏటా ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే జాతీయ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే పేర్లతో కూడిన ఫైల్ ఇంకా కేంద్ర ప్రభుత్వానికి చేరలేదు. ఎయిడెడ్ టీచర్లకు గ్రాంట్ విడుదల చేయకపోవడం వల్ల జనవరి నుంచి జీతాలు రావడంలేదు. గవర్నర్ గ్రాంట్ విడుదల చేయిస్తేనే జీతాలు అందుతాయి. లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఎయిడెడ్ టీచర్లకు పస్తులే. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసే ఫైలు ఆర్థిక, విద్యాశాఖల మధ్య తిరుగుతోంది. ఎన్నికల ముందు ఉత్తర్వులు రావడం అనుమానమే. ఎయిడెడ్ స్కూళ్ల సిబ్బందికి 2009 నుంచి కారుణ్య నియామకాలు అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు 2004-09 మధ్య కూడా ఈ నియామకాలు వర్తింపజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనికి పరిష్కారం లభించే అవకాశం లేనట్లేనని అధికారవర్గాలు అంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతల జోక్యంతో జరిగిన 800 మంది టీచర్ల బదిలీలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల కాంట్రాక్టు టీచర్ల సర్వీసు క్రమబద్దీకరణ కూడా రాష్ట్రపతి పాలన కారణంగా నిలిచిపోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. -
సమస్యల పరిష్కారం కోరుతూ డీఈవో నిర్బంధం
ఖమ్మం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో జిల్లా విద్యాశాఖాధికారి నిర్లక్ష్యం వహిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని కార్యాలయం గదిలో నిర్బంధించారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చే వరకు కార్యాలయం నుంచి బయటకు వెళ్లనిచ్చేది లేదని గదిబయట ఉపాధ్యాయులు బైఠాయించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కేడర్ వారీగా సీనియారిటీ లిస్టు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ పదోన్నతులు నిర్వహించడంలేదని ఆరోపించారు. ఉపాధ్యాయ రిటైర్మెంట్ కేలండర్‌ను విడుదల చేయకుండా విద్యాశాఖాధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. మెడికల్ బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, డబ్బులు ఇస్తే కాని ఫైల్ కదిలే పరిస్థితి లేదని ఆరోపించారు. ఖమ్మం నగరంలో ఎన్ఎస్పీ కాలనీలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్ మంజూరులో జాప్యం చేస్తున్నారని, జీహెచ్ఎస్ రాజేంద్రనగర్‌లో పనిచేస్తున్న సునీతకు ఓడీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గార్లమండలం ఎస్జీటీ బి.విజయ్‌కుమార్ గ్యాప్ పిరియడ్ సెటిల్మెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో డీఈవోను కార్యాలయంనుంచి బయటకు వెళ్లనిచ్చేది లేదని ఉపాధ్యాయులు పట్టుపట్టారు. కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన డీఈవోను అడ్డుకున్నారు. అనంతరం ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహరరాజు డీఈవోతో చర్చలు జరిపారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. చివరకు ఈనెల 7వ తేదీన సంఘాల నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని డీఈవో హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు శాంతించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు జనార్దన్‌రాజు, రవికుమార్, ఆదినారాయణ, శేషగిరిరావు, ఎ.వెంకటేశ్వర్లు, శేఖర్‌రావు, వీరబాబు, మహేష్, రామనాధం, జగదీష్, గోపాలరావు, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.