terror outfit
-
‘టీఎంసీని ఉగ్రసంస్థగా ప్రకటించి.. సీఎం మమతను అరెస్ట్ చేయాలి’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. సందేశ్‌కాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందుగుడు సామాగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సువేందు టీఎంసీ, సీఎం మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ లభ్యమైన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవని తెలిపారు. ‘సందేశ్‌కాళీలో లభించిన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉపయోగించేవి. అందుకే టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పడే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంటుంది. సందేశ్‌కాళీలో ఆయుధాలకు సంబంధించి ఘటనకు సీఎం మమత బాధ్యత వహించాలి. సీఎం మమతను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని సువేందు డిమాండ్ చేశారు.Paschim Medinipur, West Bengal | Bengal Assembly LoP Suvendu Adhikari says, "All the weapons found in Sandeshkhali are foreign. Explosives like RDX are used in horrific anti-national activities. All these weapons are used by international terrorists. I demand to declare Trinamool… pic.twitter.com/IOfFUknMFL— ANI (@ANI) April 27, 2024 శుక్రవారం సందేశ్‌కాళీలో సీబీఐ జరిపిన సోదాల్లో టీఎంసీ సస్పెండెడ్ నేత షాజహాన్ షేక్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, ఒక పోలీసు తుపాకీ లభించింది. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులపై టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వేళ (శుక్రవారం) సీబీఐ పలు చోట్ల సోదాలు చేపట్టింది’ అని ఆరోపణలు చేసింది.జనవరిలో ఈడీ అధికారులుపై టీఎంసీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి శుక్రవారం సీబీఐ పలు చోట్లు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక.. షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులు ఫ్రిబవరి 29న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ముంబయిలో 26/11 ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడులకు కారణమైన లష్కర్-ఈ తోయిబాను ఉగ్రసంస్థగా గుర్తించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రకమైన అభ్యర్థనను భారత్ కోరనప్పటికీ తాము స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ముంబయిలో నవంబర్ 11, 2008న ఉగ్రవాదులు వరుసదాడులకు పాల్పడ్డారు. పదిమంది ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా ముంబయిలోకి చొరబడ్డారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, నారిమన్ లైట్ హౌస్ సహా ఇలా 12 చోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో కలిపి మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు మరో 14 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. ఇందులో నలుగురు ఇజ్రాయెల్ దేశస్థులున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అక్టోబర్ 7న హమాస్ బృందం ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: టీకాతో యువతలో అకాల మరణాలు ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు -
Nupur Sharma: నూపుర్ శర్మ అంతుచూస్తాం
ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మపై.. విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఉగ్రవాద సంస్థ ముజాహుద్దీన్ గజ్వాతుల్ హింద్ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ: ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ తాజాగా నూపుర్ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది ఆ ఉగ్ర సంస్థ. ‘‘నూపుర్ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది ఎంజీహెచ్. నూపుర్ శర్మ తొలుత అవమానించింది. ఆ తర్వాత క్షమాపణలు చెబుతోంది. ఇదంతా బీజేపీ చేస్తున్న మాయాజాలం. చాణక్యనీతిని ప్రయోగిస్తూ ప్రజలను బుట్టలో వేసుకుంటోంది. ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తోంది. బీజేపీ నేతలు క్రమం తప్పకుండా ఇస్లాం వ్యతిరేక ప్రకటనలు ఇస్తున్నారు. ఆరెస్సెస్, రామ్ సేన, భజరంగ్ దళ్, శివ సేనలు.. వరుసగా ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగలు చేస్తున్నాయి అంటూ ఆ టెలిగ్రామ్ ప్రకటనలో ఉంది. కశ్మీర్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది. గట్టి భద్రత ఇదిలా ఉంటేనూపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి గట్టి భద్రత కల్పించారు ఢిల్లీ పోలీసులు. వ్యాఖ్యల తర్వాత ఎదురువుతున్న వేధింపులు, బెదిరింపులపై ఆమెను పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు స్పందించారు. ఇదిలా ఉంటే.. బీజేపీ ఈ వ్యవహారానికి వీలైనంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. అందుకే నూపుర్ మీద తక్షణ చర్యల కింద పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ వెంటనే ఆమె క్షమాపణలు తెలియజేశారు కూడా. అయితే.. అప్పటికే ఇస్లాం దేశాలు సదరు వ్యాఖ్యలపై తీవ్ర ఖండన మొదలుపెట్టాయి. భారత్‌లోని కేంద్ర ప్రభుత్వాన్ని, అధికార పక్ష నేతల ఇస్లాం వ్యతిరేక విధానాలపై ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. చదవండి: భారతీయ ఉత్పత్తులు మాకొద్దు! -
భారత్‌పై ఐసిస్ కుట్ర బట్టబయలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర సంస్థ ఐసిస్ కుట్రపూరిత ప్రణాళిక మరోసారి బట్టబయలైంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేబూని జీహాద్ చేపట్టాలని ఐసిస్ తన డిజిటల్ మ్యాగజైన్లో ఓ వర్గాన్ని రెచ్చగొడుతోందని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. జాతి భద్రతకు ముప్పుగా ముంచుకొచ్చిన మ్యాగజైన్‌పై భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని పిలుపు ఇచ్చిన ఐసిస్ డిజిటల్ మ్యాగజైన్ ఈ పోరాటానికి మద్దతుగా తాము నిలబడతామని హామీ ఇచ్చింది. రహస్య టెలిగ్రాం చానెల్స్, వెబ్ మీడియా ద్వారా ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ పేరిట ఐసిస్ డిజటల్ మ్యాగజైన్ దేశ ప్రజల్లో విద్వేష భావాన్ని నూరిపోస్తోందని ఆ కథనం పేర్కొంది. బాబ్రీమసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ వర్గాన్ని ఈ మ్యాగజైన్ రెచ్చగొడుతోందని స్పష్టం చేసింది. సీఏఏపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ కోర్టుల నిర్ణయాలకు కట్టబడిఉండరాదని ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని పేర్కొంది. చదవండి : ఐసిస్ అడ్డాగా ఐటీ రాజధాని..! -
12 మంది 'ఉగ్ర' అనుమానితుల అరెస్ట్
ఢిల్లీ: 12 మంది ఉగ్ర అనుమానితులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద గ్రూపుతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ సమాచారం రావడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ వెలుపల, నైరుతి ఢిల్లీలో జరిపిన ఈ దాడుల్లో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి దగ్గర నుంచి బాంబు తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.