Tribal tradition Dresses
-
... అద్దాల అందం
‘నిన్నటి ఆధునిక కళ నేటి సంప్రదాయ కళ’ అంటారు. కొన్ని దశాబ్దాల వెనక్కి వెళితే....లంబాడ గిరిజనుల సంప్రదాయ వస్త్రాధారణ కన్నుల పండగగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో తప్ప సంప్రదాయ దుస్తులు ధరించే వారు కనిపించడం లేదు. ఇక సంప్రదాయ వస్త్రధారణ అనేది నిన్నటి కళేనా? ‘కానే కాదు’ అంటుంది బాలమణి. ఎనభై సంవత్సరాల బాలమణి పాతతరం ప్రతినిధి. ‘అయ్యో...మా కళలు మాకు దూరం అవుతున్నాయే’ అని నిట్టూర్చేది ఒకప్పుడు. ఇప్పుడు ఆమెలో నిన్నటి నిట్టూర్పు లేదు. ‘ఇదిగో మా కళలు మళ్లీ మా దగ్గరికి వస్తున్నాయి’ అనే సంతోషం ఆమె కళ్లలో మెరుస్తుంది....కల్చరల్ ఐడెంటిటీగా భావించే ‘లంబాడీ ఎంబ్రాయిడరీ’కి మళ్లీ ప్రాధాన్యత పెరిగింది. సేవాలాల్, మేరీమా, పన్నీ భవానీ పూజలు, తీజ్...మొదలైన పండగలకు సంప్రదాయ దుస్తులు వేసుకోవడం తప్పనిసరిగా మారింది. ప్రత్యేక కార్యక్రమాల్లో సెలబ్రిటీలు కూడా బంజార సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు. దీంతో వీటిని రూ. 30వేల నుండి రూ. 2లక్షల వరకు ఖర్చుపెట్టి మరీ తయారు చేయించుకుంటున్నారు.సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ పాటల చిత్రీకరణకు ఈ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మహిళలు వేసుకునే సంప్రదాయ దుస్తులను పేట్యి, పేట్, గుంగుటో, కాంట్లీపేటీ, పులియ, గున్నో ...ఇలా ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తారు. వారు ధరించే ఆభరణాలు టోబ్లీ(చెవులకు పెట్టుకునేవి), హస్లీ(మెడలో వేసుకునే కడియం), వాంగ్డీ, కస్తులు( కాళ్లకు వేసుకునే వంకులు), హారం( రూపాయి బిల్లలను అతికించి వెండితో తయారు చేసే ఆభరణం) బల్యా(గాజులు)లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పట్కారి వారు వీరికి దుస్తులు, ఆభరణాలు, అలంకరణ వస్తువులు తయారుచేస్తుంటారు.బాలమణికి, సోనియా రాథోడ్‌కి ఎన్నో తరాల దూరం ఉంది. అయితే సంప్రదాయ కళల పట్ల వారి అభిరుచి విషయంలో మాత్రం ఎలాంటి దూరం లేదు. ఒకరు తమ తరం కళను ఈతరంలో చూసుకోవాలనుకుంటున్నారు. మరొకరు అలనాటి సంప్రదాయ కళలకు వారధిగా ఉండాలనుకుంటున్నారు.ఒకరిది ఆశావాదం. మరొకరిది ఆ ఆశావాదాన్ని ఆచరణలో తీసుకొచ్చి పూర్వ కళలకు అపూర్వ వైభవాన్ని తీసుకువచ్చే నవ చైతన్యం.– ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్అద్దాల రవిక అందమే వేరు!నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మా అమ్మానాయినలు, తర్వాత అత్తామామలు లంబాడ దుస్తులు తయారీ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. రెండు రూపాయిలకు రవిక కుట్టడం నుంచి నాకు తెలుసు, రవికలు, అద్దాలు, రంగు రంగుల అతుకులతో పేటీలు కుట్టి ఇస్తే వాళ్ల ఇండ్లల్లో పండే ప్రతీ పంట మాకు పెట్టేవాళ్లు. కాలం మారింది. ఇప్పుడు మాతోపాటు, ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని కుడుతున్నారు. ఏ బట్టలు వేసుకున్నా రాని అందం అద్దాల రవికతో వస్తుంది – బాలామణికలర్ఫుల్గా!నాకు చిన్నప్పటి నుండి మా సంస్కృతి సంప్రదాయాలంటే బాగా ఇష్టం. మా తండాలో ఉత్సవాలు జరిగినప్పుడు అందరం సంప్రదాయ దుస్తులు వేసుకుంటాం. తీజ్తో సహా ఇతర పండుగలకు కలర్‌ఫుల్ దుస్తులతో ఆడవారు కన్పించే తీరు కన్నుల పండుగగా ఉంటుంది. వేడుకలు, ఉత్సవాలలో సంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. – డాక్టర్ సోనికా రాథోడ్పెద్దల బాటలో...గిరిజన సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. వివాహాలు, ఇతర శుభ కార్యాక్రమాలలో సాంప్రదాయ దుస్తులు తప్పకుండా వేసుకోవాలి. అప్పుడు మన సంస్కృతి, సాంప్రదాయాన్ని పెద్దలు చూపిన మార్గాన్ని అనుసరించిన వారం అవుతాం. – పద్మ, సేవాలాల్ సేనా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్‌తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. -
మారిన మావోయిస్టుల పంథా
పార్వతీపురం: చేతిలో తుపాకీ... నెత్తిన టోపీ... కాళ్లకు బూట్లు... యూనిఫామ్‌తో ఒకప్పుడు కనిపించిన మావోయిస్టులు వారి పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. జనం కోసం... వారిలో ఒకరిగా కలసిపోయి సమస్యలపై పోరాడేందుకు... గిరిజన సంప్రదాయ దుస్తులు... వారి అలంకరణతో కలసిపోయి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల మావోయిస్టుల అలికిడి ఉన్నట్లు సమాచారం. వీరు ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజనులతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించేందుకు... గిరిజనుల బతుకులు బాగుచేస్తామంటూ వారికి దగ్గరవుతున్నట్లు సమాచారం. విస్తృతంగా సమావేశాలు వారి కొత్త వ్యూహంలో భాగంగా ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజనులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. ఆయా గ్రామాల్లోని గిరిజనులను గ్రూపులుగా తయారు చేసి, వారి ద్వారానే సమస్యలు వివరింపజేసి... తామెలా దోపిడీకి గురవుతోందీ తెలియజేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల వైఫల్యాలను ఎదిరించడంపై వారికి శిక్షణనిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గిరిజనులు సారాకు బానిసవుతున్న విషయాన్ని గుర్తించి, తయారు చేస్తున్న వారిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తయారీ నియంత్రణకు చురుగ్గా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఓబీలో సారా తయారు చేస్తున్నవారిని హెచ్చరించినట్లు సమాచారం. మౌలిక సదుపాయాలపై విప్పుతున్న గళం గిరిజన గ్రామాలకు, గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించలేని అధికారులు, పాలకుల అసమర్ధత, నిర్లక్ష్యంపైనా ప్రశ్నించేలా గిరిజనులను చైతన్య పరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచం మినరల్ వాటర్‌వైపు పరుగులిడుతున్న తరుణంలో గిరిజనులు కనీసం గుక్కెడు మంచినీటికి నోచుకోకపోవడంపై మావోయిస్టులు వారిని చైతన్యపరుస్తున్నారు. ఏఓబీలో మరలా పట్టు సాధించేందుకు గట్టి కృషి చేస్తున్నట్లు సమాచారం.