TSPC
-
సీఎం కేసీఆర్ ప్రకటన.. నిరుద్యోగుల్లో ఆశలు
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. సర్కారీ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు’ అని సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కొలువుల జాతర మొదలుకానుంది. ఒకటీ రెండు నెలల్లో 50 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం సీఎం కేసీఆర్ ఆదేశించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. విద్యాశాఖ, పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో అత్యధిక పోస్టులు అందుబాటులోకి రానున్నా యి. రాష్ట్రంలో 2018 తరువాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఇన్నాళ్లు నిరుద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇపుడు సీఎం ప్రకటనతో వారికి ఊరట లభించినట్లైంది. వీరంతా సీరియస్‌గా ప్రిపరేషన్లో మునిగిపోనున్నారు. విద్యాశాఖలో 15 వేలకు పైనే రాష్ట్రంలోని పాఠశాలల్లో దాదాపు 15 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2017 సంవత్సరంలో 8,972 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విద్యాశాఖ తాజాగా మరో 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల స్థానాల్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. అం దులో ప్రధానంగా విద్యార్థులు ఎక్కువగా ఉండి, ఒక్కరిద్దరే టీచర్లు ఉన్న స్కూళ్లు, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లలో గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లు పని చేశారు. అంటే ఆ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు కచ్చితంగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వేలకు పైగానే ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంటుంది. పోలీసుశాఖలో 20 వేలు రాష్ట్ర పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల చెప్పారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖలో ఆయా పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. మరోవైపు వైద్యారోగ్య శాఖలో 12 వేల పోస్టులు, రెవెన్యూ శాఖలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబు తోంది. వీటితోపాటుఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా.. రాష్ట్రంలో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఆయా శాఖల ద్వారా నిబంధనలకు సంబంధించిన క్లియరెన్స్‌లు లభిం చకపోవడంతో అన్నింటినీ భర్తీ చేయలేకపోయారు. 52,724 పోస్టులు భర్తీకి వివిధ ఏజెన్సీలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. అందులో 36,758 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో 35,724 పోస్టుల భర్తీ చేసినట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ గవర్నర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. పాతవి... కొత్తవి కలిపి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. 2019 సెప్టెంబరు నాటికి వీటికి రాతపరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చేశాయి. సబ్ ఇన్స్పెక్టర్లతోపాటు, సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు ఈ ఏడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. మైదానాల కొరత, కరోనా లాక్డౌన్ కారణంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)ల శిక్షణలో తీవ్ర జాప్యం నెలకొంది. అక్టోబరు మొదటివారంలో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయి విధుల్లో చేరారు. తాజాగా 1,162 మంది సబ్ ఇన్స్పెక్టర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ లెక్కన 10,375 పోస్టులు భర్తీ అయ్యాయి. మరోవైపు భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని తాజాగా 20 వేల వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మూడేళ్లలో 52 వేలకు పైగా పోస్టుల భర్తీ వైద్యారోగ్య శాఖలో 12 వేలు.. రెవెన్యూలో 4 వేలు తాజా లెక్క తేలాలి... రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన లెక్కల ప్రకారం ఉన్నత విద్యలో 4,702, వ్యవసాయ శాఖలో 3,673, పశుసంవర్ధక శాఖలో 1,842, బీసీ సంక్షేమ శాఖలో 2,881, అటవీ శాఖలో 3,602 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇపుడు సీఎం ఆదేశాలతో అన్ని శాఖల్లో తాజాగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించాక... నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతించనుంది. -
త్వరలో 2 వేల పోస్టులకు నోటిఫికేషన్లు
- ఆ తరువాత 8,792 టీచర్ పోస్టులకు జారీ - టీఎస్పీఎస్సీ చైర్మన్‌తో ఎంపీ బాల్క సుమన్, మేయర్ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో త్వరలోనే 2 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. ఆ తరువాత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుందన్నారు. ఎంపీతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనే యులు గౌడ్, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్వీ నేత రాకేశ్ తదితరులు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, కార్యదర్శి వాణీప్రసాద్‌ను శుక్రవారం టీఎస్ పీఎస్సీ కార్యాలయం లో కలిశారు. పోస్టుల భర్తీ ప్రక్రియను వేగ వంతం చేయాలని కోరారు. పోస్టుల నియామకాల ప్రక్రియ, త్వరలో జారీ కావాల్సిన నోటిఫికేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే గురుకులాల్లో 7,306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని, త్వరలోనే స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందన్నారు. రాష్ట్రంలో విడతలవారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. త్వరలోనే గ్రూపుృ2 ఫలితాలను విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి వెల్లడించినట్లు తెలిపారు. -
మెరిట్ జాబితాలు ఆన్లైన్లోనే..
- ఆటోమేటిక్ జనరేషన్‌కు టీఎస్పీఎస్సీ యోచన - ఉద్యోగాల సంఖ్యను బట్టి రోస్టర్, రిజర్వేషన్ల మేరకు అన్నీ ఆటో జనరేషన్ - ఇంటర్వ్యూ జాబితాల రూపకల్పన కూడా ఆన్లైన్ ద్వారానే - పారదర్శకతకే ప్రథమ ప్రాధాన్యం.. టీఎస్పీఎస్సీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ పరీక్షల్లో పారదర్శకతకే ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో కీలకమైన అంశంపై దృష్టి సారించింది. ఉద్యోగ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు వివిధ చర్యలు చేపడుతున్న కమిషన్ ఇప్పుడు పరీక్షల తర్వాత ప్రక్రియను ఆన్లైన్ ద్వారా చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తోంది. అభ్యర్థుల మెరిట్ జాబితాలను ఆన్లైన్ ద్వారా ఆటోమేటిగ్గా జనరేట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా ఏ దశలోనూ మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా చేయాలని యోచిస్తోంది. వీటికి సంబంధించిన అంశాలపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి దృష్టి కేంద్రీకరించినట్టు తెలిసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగ పరీక్షలను మొదటిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించి చరిత్ర సృష్టించిన టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కూడా ఆన్లైన్ ద్వారా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇది కొంత కష్టతరమైన ప్రక్రియే అయినా.. ఆన్లైన్ ద్వారా చేపడితే పారదర్శకతను మరింతగా పెంచవచ్చని భావిస్తోంది. ఇందుకోసం భారీ కసరత్తు చేయాల్సి ఉంది. ఇందులో ప్రతీది ఆన్లైన్ చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రూపొందించాలి. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులతో పాటు మొత్తం పోస్టుల్లో ఎన్ని ఏ రిజర్వేషన్ వారికి కేటాయించాలి? ఓపెన్ కోటాలో ఉన్న పోస్టులు ఎన్ని? వాటి రోస్టర్ పాయింట్లు ఎలా ఉన్నాయి? రిజర్వేషన్లవారీగా పోస్టులను విభజించడంతోపాటు పరీక్షకు ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు? అందులో ఏ రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులు ఎంతెంత మంది? వారు రాత పరీక్షలో సాధించిన మార్కులు ఎన్ని? అన్న సమగ్ర వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పోటీ పరీక్షల్లో మార్కులు సాధించిన అభ్యర్థులందరి కామన్ మెరిట్ జాబితాతోపాటు రిజర్వేషన్లవారీగా మెరిట్ జాబితాలను జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలున్న పోస్టులకైతే 1:2 చొప్పున జాబితాలను జనరేట్ చేయాలి. ఇందులో రిజర్వేషన్ల వారీగా పోస్టులు.. రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను తీసుకుని ఆయా రిజర్వేషన్ కేటగిరీల్లో మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూలకు అభ్యర్థుల జాబితాను జనరేట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ క్లిష్టమైనదేనని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ చక్రపాణి గ్రహించారు. అయితే దీనిని విజయవంతం చేయగలిగితే పోస్టులకు ఎంపికైన వారి ఎంపిక జాబితాల రూపకల్పన సులభం కావడంతోపాటు పారదర్శకతను మరింతగా పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వంలోని ఏ విభాగమైనా ఏ పోస్టులకు ఉద్యోగ పరీక్షలను నిర్వహించినా ఈ ప్రక్రియ మొత్తాన్ని మాన్యువల్‌గానే చేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ నేతృత్వంలో దీనిని ఆన్లైన్ ద్వారా చేయగలిగితే మెరిట్ జాబితాల రూపకల్పనలో, ఉద్యోగ నియామకాల్లో ఏ స్థాయిలోనూ లోపాలకు, మానవ తప్పిదాలకు ఆస్కారం ఉండదని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియను ఒకటికి ఐదారుసార్లు పరీక్షించి అమల్లోకి తేవాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. -
టీఎస్పీఎస్స ఏఈ, మేనేజర్ (ఇంజనీరింగ్)
Strength of materials 1. Area of S.F.D between two sec of a beam is 140 KN-M. The change of B.M. between those two sec is 1) 70 KN-M 2) 140 KN-M 3) 280 KN-M 4) none 2. Two beams one of circular sec and the other a square of same length strength the ratio of weight of circular to square 1) 1.118 2) 1.342 3) 1.00 4) 0.793 3. An amount which should be removed from top and bottom of a circular section of dia `d' to obtain maximum modulus of section 1) 0.01 d 2) 0.1d 3) 0.011d 4) 0.11d 4. The depth of the strongest timber beam of sect c/s which would be cut of a cylindrical log of dia `d' is 1) dÖ3 2) dÖ2 3) Ö2/3 d 4) Ö3/2 n 5. If a beam is cut in halves horizontally and the two halves are laid side by side it can be compausion to the original beam carry 1) the same load 2) double the load 3) half the load 4) ¼ of load 6. The properly of a liquid which enable it to stick to another body with which its comes into contact 1) cohesion 2) surface tension 3) density 4) adhesion 7. Dimensions of kinematics viscosity are 1) m/s 2) kg-s/m2 3) m2/s 4) kg (m-s) 8. A cantilever beam of length `l' is loaded at the free end by a point load 'w'. If the flexural rigidity of the beam is doubled, the new deflection decreased by _______ times 1) 2 2) 3 3) 4 4) 2/3 9. By integrating the elastic line we obtain 1) intensity of load 2) S.F 3) Slope 4) deflection 10. The point of contraflexure in a fixed beam carrying UDL will occur at a dist from the centre 1) 0.211 l 2) 0.5 l 3) 0.4 l 4) 0.15 l 11. In a Simply supported beam carrying eccentric load `W' . Write the formula for deflection under load 1) 2) 3) 3) none 12. Radius of gyration of solid circular column is 1) D/4 2) D/8 3) D/2 4) D/16 13. Polar M.I. is 1) M.I about z-axis of member 2) M.I about x-axis of member 3) M.I. about y-axis of member 4) M.I about x.y-axis 14. If the cylindrical is subjected to external water pressure, then the hoop stress is 1) compressive 2) tensile 3) shear 4) bending 15. The relation between the volumetric strain, longitudinal and circumferential strain is given by; 1) ev = 2 ec + eL 2) eL = 2 ev + ec 3) ec = 2 eL + ev 4) ev + ev + eL 16. Column will be having Maximum buckling load, if its 1) both ends are fixed 2) one end fixed and other hinged 3) both ends are hinged 4) one end fixed and one end free 17. Least radius of gyration square column; 1) a2/Ö3 2) a/2Ö3 3) a3/4Ö3 4) none 18. The minimum compressive stress develop in a dam is at 1) centre 2) heel 3) toe 4) 1/3 rd 19. The condition for a redundant frame is 1) n = 2j-3 2) n<2j-3 3) n > 2j-3 4) none 20. No tension is produced at the base of retaining wall of width B, when eccentrically is less than 1) B/3 2) B/6 3) B/2 4) B/4 21. The moment or resistance of diagonal square section is ____times the square section 1) 1.713 2) 1.414 3) 1.5 4) 1 22. In a cantilever truss, the member in the bottom chord due to downward vertical loading is subjected to 1) tensile stress 2) compressive stress 3) shear stress 4) bending stress 23. The conjugate beam for a fixed beam is 1) another fixed beam 2) A S.S. beam 3) propped contilever beam 4) beam without supports 24. For a retaining wall, factor of safety against sliding is; 1) 1.2 2) 1.5 3) 2.0 4) 0.5 25. Euler's clipping load is applicable, when the column is in _______ equilibrium 1) stable 2) unstable 3) neutral 4) none Answers 1) 2 2) 1 3) 3 4) 3 5) 3 6) 4 7) 3 8) 1 9) 3 10) 4 11) 2 12) 1 13) 1 14) 2 15) 1 16) 1 17) 2 18) 2 19) 3 20) 2 21) 2 22) 2 23) 4 24) 2 25) 3 -
తొలి ఉద్యోగ పరీక్ష నేడే
-
తొలి ఉద్యోగ పరీక్ష నేడే
* 4 జిల్లాల్లోని 99 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేసిన టీఎస్పీఎస్సీ * అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి: చైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో తొలి ఉద్యోగ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లలో భాగంగా మొదట జారీ చేసిన 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని 99 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు 30,783 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆన్లైన్ విధానంలో పరీక్షను మొదటిసారిగా నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేసేందుకు (ఆన్లైన్ మాక్ టెస్టు) ప్రత్యేక లింకును ఇచ్చింది. అలాగే ఆదివారం పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బందితో మాక్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దీంతో తొలి పరీక్షను కూడా విజయవంతంగా నిర్వహిస్తామన్న భావనకు వచ్చింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఆలస్యంగా వెళితే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక పేపరు-1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పేపరు-2 సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు ఉదయం పరీక్ష కోసం 8:30 గంటల నుంచి 9:15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, మధ్యాహ్నం పరీక్ష కోసం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి కచ్చితంగా వెళ్లాలని సూచించారు. గ్రామీణ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు జనరల్ స్టడీస్ పేపరును తెలుగులోనూ ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు తీసుకోనున్నందున, ఈ ప్రక్రియకు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఆయా కేంద్రాలకు రావాల్సిన అవసరం ఉంది. కేంద్రాల వారీగా హాజరయ్యే అభ్యర్థులు నగరం అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ 25,303 75 కరీంనగర్ 1,310 4 ఖమ్మం 1,310 6 వరంగల్ 2,860 14 మొత్తం 30,783 99 -
తెలంగాణలో 20న తొలి పరీక్ష
⇒931 ఏఈఈ పోస్టులకు టీఎస్పీఎస్సీ ఆన్లైన్ (సీబీఆర్) టెస్ట్ ⇒ దేశంలోనే తొలిసారిగా సీబీఆర్ విధానం ⇒ 99 పరీక్షా కేంద్రాలు.. 30,783 మంది అభ్యర్థులు ⇒ గంటన్నర ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఉద్యోగార్థుల ఎంపికకు ఈ నెల 20న తొలిపరీక్ష నిర్వహించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్) పోస్టుల భర్తీకై టీఎస్పీఎస్సీ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు(హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్) కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ నిమిత్తం ఆయా పట్టణాల్లో మొత్తం 99 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్(సీబీఆర్) విధానంలో జరగనున్న ఆన్లైన్ పరీక్షకు మొత్తం 30,783 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణియన్ ఆదివారం తెలిపారు. ఒకేసారి 30 వేలమందికిపైగా అభ్యర్థులకు ఆన్లైన్లో టెస్ట్ నిర్వహించడం దేశంలోనే ప్రప్రథమమని ఆమె పేర్కొన్నారు. రెండు దఫాలుగా ఆన్లైన్ పరీక్షలు అభ్యర్థులు రెండు దఫాలుగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. 20న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు తొలి సెషన్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో సివిల్ ఇంజనీరింగ్ పేపర్ పరీక్ష జరగనుంది. ప్రతి సెషన్లోనూ 2.30 గంటల సమయం ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు గంటన్నర ముందుగానే చేరుకొని, రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలి. అభ్యర్థులు తమ అడ్మిట్(హాల్ టికెట్)కార్డులను www.tspsc.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మొత్తం ఆంగ్లమాధ్యమంలోనే ఉంటుంది. పరీక్ష రాసేముందు అభ్యర్థులు ఆన్లైన్లో ఇచ్చిన సూచనలను తప్పకుండా చదివితే, పరీక్ష రాయడం మరింత సులభంగా ఉంటుందని అధికారులు సూచించారు. అభ్యర్థులకు సూచనలు ఇలా.. - పరీక్షాకేంద్రాలకు వెళ్లే ముందు అభ్యర్థులు వెరిఫికేషన్ నిమిత్తం తమ హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు ధ్రువీకరణ (పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లెసైన్స్ తదితర) పత్రాల్లో ఒకదాన్ని వెంట తీసుకెళ్లాలి. - అభ్యర్థి ఫొటో, సంతకం ముద్రితమై ఉన్నం దున హాల్‌టికెట్‌ను లేజర్ ప్రింటర్, లేదా కలర్ ప్రింటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం మేలు. - హాల్‌టికెట్‌లో అభ్యర్థి ఫొటో సరిగా కనిపించనట్లైతే ఆథరైజేషన్ కోసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను వెంట తీసుకెళ్లాలి. - పరీక్షా కేంద్రానికి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, వాచ్, కాలిక్యులేటర్లు, పర్సులు, పేపర్లు తేకూడదు. ప్రశ్నలకు సంబంధించిన లెక్కలు చేసుకునేందుకు కంప్యూటర్లోనే వర్చువల్ కాలిక్యులేటర్ సదుపాయాన్ని కల్పిస్తారు. - వేలిముద్రల ద్వారా అభ్యర్థిని గుర్తించనున్నందున చేతులకు మెహందీ పెట్టకూడదు. - ఉదయం సెషన్లో 9.15, మధ్యాహ్నం సెషన్లో 1.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేటు వేస్తారు. ఒకసారి గేటు వేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం ఒంటగంట నుంచే పరీక్షాకేంద్రం లోపలికి అనుమతిస్తారు. - పరీక్షగదిలోకి 40 నిమిషాల ముందు అనుమతిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు పంపరు. - ప్రతి సెషన్లోనూ 150 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష మొత్తం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. - అంధులు, చేతి వేళ్లు లేని వైకల్య అభ్యర్థులు పరీక్ష రాసేందుకు స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చు. అంధులకు మాత్రమే అదనంగా 20 నిమిషాల సమయం ఇస్తారు.