Tuition fees
-
ఫీజు పైసల్... ముందే వసూల్ !
సాయివర్ధన్ (పేరుమార్చాం) పాలీసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లా మీర్పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్నాడు. కాలేజీలో రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన ఆ విద్యార్థికి యాజమాన్యం షాక్ ఇచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, ట్యూషన్ ఫీజు చెల్లించాలని, లేకుంటే అడ్మిషన్ ఇవ్వలేమని తెలియచెప్పింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలైన తర్వాత, ఆ మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో రూ.52 వేల రూపాయలు చెల్లించి అడ్మిషన్ పొందాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన టి.మానస (పేరుమార్చాం) డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సు పూర్తి చేసింది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, యాజమాన్య ఒత్తిడితో ఫీజు చెల్లించింది. ఏడాది క్రితం కోర్సు పూర్తి కావడంతో ఒరిజినల్ సరి్టఫికెట్ల కోసం కాలేజీకి వెళితే ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పారు. దీంతో మళ్లీ డబ్బు కట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.46 వేలు ఇప్పటికీ అందలేదు.సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఆర్థికభారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. దీని కింద అర్హత సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా కాలేజీలో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేయొచ్చు. కానీ ప్రస్తుతం కాలేజీల్లో పరిస్థితి తారుమారైంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద అర్హత సాధించినా సరే... అడ్మిషన్ సమయంలో ట్యూషన్ ఫీజు పూర్తిగా చెల్లించాల్సిందే.సీనియర్ విద్యార్థులయితే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లించాలి. ప్రభుత్వం రీయింబర్స్ నిధులు కాలేజీకి విడుదల చేసినప్పుడు... సదరు విద్యార్థుల బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయడమో... లేక చెక్కు రూపంలో విద్యారి్థకి అందిస్తామంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యాకాలేజీలు ఇదే తరహా ముందస్తుగా ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. ఉచితంగా ఉన్నత చదువులు చదవాలనుకున్న విద్యార్థులకు తాజా పరిస్థితులు సంకటంగా మారాయి. ఏటా 12లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో 5,539 పోస్టుమెట్రిక్ కాలేజీలున్నాయి. ఇందులో 2,641 జూనియర్ కాలేజీలు, 1,514 డిగ్రీ, పీజీ కాలేజీలున్నాయి. 235 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు కాగా, 217 పారా మెడికల్ కాలేజీలున్నాయి. ఇతర వృత్తివిద్యా కేటగిరీల్లో మిగిలిన కాలేజీలున్నాయి. వీటి పరిధిలోని 12 లక్షల మంది విద్యార్థులు ఏటా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ముందస్తు వసూళ్లకు దూరంగా ఉంటున్నా, వృత్తి విద్యా కళాశాలలు మాత్రం అడ్మిషన్ల సమయంలోనే ఫీజులు వసూలు చేస్తున్నాయి. ,ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కనీసం కాలేజీలకు వెళ్లి ఫీజులపై తనిఖీలు కూడా చేయడం లేదు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాంఫీజు రీయింబర్స్మెంట్ నిధుల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.1,550 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు చెల్లిపులు చేస్తున్నాం. మా కార్యాలయానికి విద్యార్థులు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అదనపు సంచాలకులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి ముందస్తు ఫీజు వసూలపై సంక్షేమ శాఖల అధికారులు సీరియస్‌గా పరిగణించాలి. కాలేజీల వారీగా విచారణ చేపట్టాలి. అలా వసూళ్లకు పాల్పడిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థులెవరూ ముందస్తుగా ఫీజులు చెల్లించొద్దు. – ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ పరిస్థితి ఫీజు రీయింబర్స్ నిధులు విడుదల చేయకపోవడంతోనే యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో ఫీజు నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. – కందడి శ్రీరామ్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు -
ఫీజులు.. గుండెలు గుభిల్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్‌కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్‌కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది. మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు. ⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్‌లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే. భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్‌డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలుప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. భారీగా ఫీజుల భారం.. దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది. 44 శాతం మంది చదువులకు దూరం నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు -
ముందే ఫీ‘జులుం’
పాలిసెట్ ద్వారా ధనుంజయ్ రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని ఓ కాలేజీలో సీటు సాధించాడు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హత ఉంది. ట్యూషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన తర్వాత అడ్మిషన్‌కు కాలేజీకి వెళ్లాడు. అయితే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో ఒక్కసారిగా రూ.18వేలు చెల్లించే పరిస్థితి లేక ధనుంజయ్ సతమతమయ్యాడు. సీటు కోల్పోతాననే ఆందోళనతో తండ్రికి అసలు విషయం చెప్పగా, అప్పు చేసి వెంటనే ఫీజు చెల్లించి కాలేజీలో చేరాడు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకానికి అర్హత ఉన్న ధనుంజయ్ ఒక్కడే కాదు..ఆ కాలేజీలో కన్వినర్ కోటాలో వివిధ బ్రాంచ్‌ల్లో సీటు దక్కించుకున్న దాదాపు 500 మందికి పైగా విద్యార్థులంతా ఇదే తరహాలో ట్యూషన్ ఫీజు సొంతంగా చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర వృత్తివిద్యా కాలేజీలన్నీ ఇదే తరహాల్లో విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజు చెల్లిస్తేనే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఆయా కోర్సులు అందించే కాలేజీలు ఇలా... సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తోంది. వృత్తివిద్యా కోర్సుల అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఆదాయపరిమితికి లోబడిన, కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్లో చేరే విద్యార్థులు, దోస్త్ ద్వారా జనరల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఈ పథకం అమలవుతోంది. వాస్తవానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సీటు సాధిస్తే నిబంధనలకు లోబడి ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా కాలేజీలో అడ్మిషన్ తీసుకొని కోర్సు పూర్తిచేసే వరకు ఉచితంగా చదువుకోవచ్చు. కానీ మెజారిటీ కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అడ్మిషన్ సమయంలోనే కొన్ని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థి నుంచి ముందస్తుగా ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. అలా ఫీజును చెల్లించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు చెల్లిస్తే.. అప్పుడు రికవరీ రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 12.65లక్షలు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు నిధులు విడుదల చేస్తుంది. నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాలో అవి జమ అవుతాయి. పాలిటెక్నిక్ కోర్సు మూడు సంవత్సరాలు, ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు... ఇలా ఆయా కోర్సు కాలపరిమితి ఉండగా, విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ సంవత్సరానికి సంబంధించిన నిధులను తదుపరి అకడమిక్ ఈయర్ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కాలేజీ ఖాతాలో జమ చేస్తుంది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం విద్యార్థి చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెక్కు రూపంలో అతనికే చెల్లిస్తుంది. వాస్తవానికి విద్యార్థి నుంచి ఫీజు వసూలు చేసుకోవడం, తర్వాత అతడికి తిరిగి చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. లిఖిత పూర్వక ఫిర్యాదులు నిల్ రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు అదే కాలేజీలో చదవాల్సి ఉండడంతో ముందస్తు ఫీజు వసూళ్లపై విద్యార్థులు ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు. ఇలా ఫిర్యాదు చేస్తే కాలేజీల్లో ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనే భావన మెజారిటీ విద్యార్థుల్లో ఉంది. ఫీజుల చెల్లింపులపై సంక్షేమ శాఖలకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. -
ఏఐసీటీఈ పచ్చ జెండా.. భారీగా పెరగనున్న సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక ఉన్నత విద్యా మండలి (ఏఐసీటీఈ) తాజాగా పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి 2015లో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ)లను ఆదేశించింది. దీనితో విద్యార్థులపై ఫీజుల భారం పెరిగిపోనుంది. ఫీజులు పెంచాలన్న ఏఐసీటీఈ నిర్ణయంపై అంతటా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండింతలకుపైగా..: ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో దాదాపు అన్ని సాంకేతిక, మేనేజ్మెంట్ కోర్సుల ఫీజులు రెండింతలకుపైగా పెరగనున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్య మరింత భారం కానుంది. ఉదాహరణకు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్ట వార్షిక ఫీజు రూ.35 వేలుగా ఉండగా.. ఏఐసీటీఈ ఆదేశాలు అమలైతే ఏకంగా రూ. 67 వేలకు పెరగనుంది. గరిష్ట ఫీజు రూ.1.35 లక్షల నుంచి ఏకంగా రూ. 1.89 లక్షలకు చేరనుంది. పెంపుపై రాష్ట్ర ఎఫ్ఆర్సీ తర్జనభర్జన రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొద్దినెలలుగా కసరత్తు చేస్తోంది. 2019లో నిర్ధారించిన ఫీజులకు మరో 10 శాతం పెంచి ఆదేశాలు ఇస్తారని ఇప్పటిదాకా అంతా భావించారు. కానీ ఏఐసీటీఈ పిడుగులాంటి ఆదేశాలు జారీ చేయడంతో.. ఏం చేయాలన్న దానిపై ఎఫ్ఆర్సీ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితుల్లో.. ఫీజుల పెంపు సమస్యగా మారుతుందేమోనని భావించిన ఎఫ్ఆర్సీ.. శనివారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేసినట్టు సమాచారం. ఫీజులు పెంచితే ఉద్యమమే.. రెండేళ్లుగా కరోనాతో పేద, మధ్య తరగతి వర్గా లు ఆర్థికంగా చితికిపోయాయి. జీవనమే దుర్భరమైన కుటుంబాలూ ఉన్నా యి. బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఫీజు లు పెంచి పేదలకు ఉరి బిగించాలనే నిర్ణయం దారుణం. ఫీజులు పెంచితే ఉద్యమం తప్పదు. – నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పెంచాల్సిన అవసరమేంటి? అధ్యాపకులకు ఏడో వేతన ఒప్పందం అమలు చేస్తున్నామని ప్రైవేటు కాలేజీలు ఏఐసీటీఈని నమ్మించాయి. అందుకే శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇది ముమ్మాటికీ అన్యాయమే. అధ్యాపకులకు ఇప్పటికీ ఐదో వేతన ఒప్పందం మేర వేతనాలే అందడం లేదు. కరోనా సమయం నుంచి అధ్యాపకులకు జీతాలు ఇవ్వని కాలేజీలూ ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ఫీజులు పెంచడం దారుణం. – సంతోష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక కాలేజీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు -
విదేశీ విద్య.. ఇలా సాధ్యమే!
విదేశాల్లో చదవటమంటే చాలా మందికి ఒక కల. ఒకప్పుడిది చాలా ధనవంతులు, ఎంతో ప్రతిభ కలిగిన వారికే సాధ్యమయ్యేది కూడా. కానీ, ఇపుడు విదేశీ విద్యావకాశాలు విస్త ృతమై... చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా.. వాటిలో ప్రవేశానికి కటాఫ్ 99 శాతం. దీన్నే రీచ్ఐవీ సీఈఓ విభా కాగ్జి మాటల్లో చెప్పాలంటే... దేశంలో ఆమోదనీయ స్థాయిలో ఉన్న నాణ్యమైన విద్య 2 శాతంలోపే!!. మరి మిగిలిన 98 శాతం మంది మాటేంటి? అందుకే ఇపుడు తల్లిదండ్రులు కూడా సాధ్యమైనంత వరకూ తమ పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలంటే అది విదేశాల్లోనే సాధ్యమనే భావనతో ఉంటున్నారు. కాకపోతే ఈ ఖరీదైన విదేశీ విద్యను అందుకోవడం ఆర్థి కంగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అందుకోవాలంటే అందుకు ప్రణాళిక అవసరమంటున్నారు నిపుణులు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం విదేశాల్లో కోర్సు పూర్తి చేయడమన్నది ఖరీదైన వ్యవహారమే. ఐవీ లీగ్ కాలేజీల్లో ఏడాది ట్యూషన్ ఫీజు రూ.30– 35 లక్షల మధ్య ఉంది. దీనికి తోడు అదనపు వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వసతి, ఆహారం, కన్వేయన్స్, విద్యకు అవసరమైన వస్తువుల కొనుగోలు, హెల్త్ ఇన్సూరెన్స్, వినోద ఖర్చులు అదనం. వీటన్నిటికీ మరో రూ.10 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం ప్రభావం, రూపాయి విలువ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2018లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 శాతం వరకు పడిపోయింది. మరి 2–4 ఏళ్ల కోర్సుల కాలంలో రూపాయి విలువలో వచ్చే వ్యత్యాసాల ఆధారంగా కోర్సు ఫీజులకు చేసే చెల్లింపులు పెరిగిపోవడం, లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని విదేశీ విద్య కోసం పంపించాలనుకునే వారు మూడేళ్ల కోర్సు కోసం రూ.50 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. దీనికి 8 శాతం ద్రవ్యోల్బణ రేటును కూడా ముడిపెట్టాలి. అంటే... ఇప్పుడు రూ.50 లక్షల వ్యయమయితే, పదేళ్ల తర్వాత 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా కోర్సు ఫీజు రూ.1.07 కోట్లకు పెరిగిపోతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని చూస్తే అసాధ్యమేనని అనిపించొచ్చు. కానీ, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సాధ్యమే. ముందుగానే ప్రారంభించాలి పిల్లల విద్యా వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ముందు నుంచే పొదుపు మొదలు పెట్టిన వారికి లక్ష్యం సులువవుతుంది. పిల్లలు నెలల వయసులో ఉన్నప్పటి నుంచే వారి విద్యావసరాలకు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలనేది ఫైనాన్షియల్ అడ్వైజర్లు చేసే సూచన. అందుకే. సిప్ విధానంలో ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే పిల్లలు ఉన్నత విద్యకు వచ్చే సరికి రూ.50 లక్షల నిధి సాకారం అవుతుంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనుక పెద్ద భారం కూడా అనిపించదు. దీర్ఘకాలం చేతిలో మిగిలి ఉంటే... అధిక రాబడుల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సరైన చోట పెట్టుబడి పైన చెప్పుకున్నట్టు ముందు నుంచే ఇన్వెస్ట్ చేస్తూ వెళితే అనుకున్నంత నిధి సమకూరుతుందనుకోవద్దు. మీ అవసరాలకు తగిన మొత్తం సమకూరేందుకు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, దానిపై ఆశించే రాబడులు, కాంపౌండింగ్ ప్రయోజనంతో నిర్ణీత సమయానికి ఎంత సమకూరుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇందుకు అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచన తీసుకోవాలి. 5–10 ఏళ్లు, అంతకుమించి సమయం ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ కలగలసిన సాధనాల్లో మెరుగైన రాబడులనే ఆశించొచ్చు. ‘‘దీర్ఘకాలం పాటు సమయం ఉంటే 65–70%పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సురక్షితమే. మంచి ఫలితాల కోసం బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోవాలి. స్టాక్స్, బాండ్లలోనూ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీలకు వర్తించే పన్ను ప్రయోజనాలే వీటికీ అమలవుతాయి. ఇవి 65% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక లాభం ఏడాదిలో రూ.లక్ష దాటితే (అమ్ముకున్న సమయంలో) దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లక్ష వరకూ పన్ను ఉండదు. ఆపై లాభంపై 10%పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఫిన్స్కాలర్జ్ వెల్త్ మేనేజర్స్ వ్యవస్థాపకురాలు రేణు తెలిపారు. ఆలస్యంగా మొదలు పెడితే... పిల్లలు పుట్టిన వెంటనే వారి విద్య కోసం పెట్టుబడి మొదలుపెట్టని వారు, ఈ అవసరాన్ని కొంత ఆలస్యంగా తెలుసుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వారు... సిప్తోపాటు ఏక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం పరిష్కారం. లక్ష్యానికి దీర్ఘకాలం లేకపోతే వచ్చిన సమస్య ఏంటంటే రాబడులకు రిస్క్ తీసుకోలేని పరిస్థితి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో అంత ఆటుపోట్లు ఉండవు. రాబడులు బాండ్ ఈల్డ్స్‌కు స మానంగా ఉంటాయి. మూడేళ్లకు పైగా కొనసాగితే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే తక్కువ పన్ను రేట్లు అమలవుతాయి. విద్యా రుణం తీసుకోవచ్చు... లక్ష్యానికి సరిపడా ఇన్వెస్ట్ చేయలేని వారు, ఇన్వెస్ట్ చేసినప్పటికీ నిర్ణీత సమయంలో అవసరమైనంత నిధి సమకూరని వారు, ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడం ఆరంభించిన వారు పిల్లల విదేశీ విద్యా వ్యయాలను గట్టెక్కేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం పరిష్కారం. దాదాపు అన్ని బ్యాంకులు విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మంచి విద్యా సంస్థల్లో సీటు సంపాదిస్తే సులువుగానే రుణం పొందొచ్చు. పైగా, విద్యా రుణంపై ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్ను చెల్లించే ఆదాయం ఉన్న వారికి ఇదో అదనపు ఆకర్షణ. సంప్రదాయ ఇన్వెస్టర్లయితే... పిల్లల ఉన్నత విద్య అనేది విస్మరించరాని అంశం. అలాగే, వాయిదా వేసేది కూడా కాదు. పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోలేని వారు అయితే, పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం మరింత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రమ్య (25) నెదర్లాండ్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్‌కు వెళుతోంది. ఆమె చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాడు. కానీ, సంప్రదాయ సాధనాల్లో చేయడంతో రాబడులు పెద్దగా లేవు. దీంతో కోర్సుకు కావాల్సినంత సమకూరలేదు. దీంతో రమ్య విద్యావసరాల కోసం ఆమె తండ్రి తన రిటైర్మెంట్ నిధిలోనూ కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని మెరుగైన రాబడులను ఇవ్వలేవు. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం కాస్తంత నయం. రికరింగ్ డిపాజిట్ కూడా కాస్త మెరుగైన ఆప్షనే. లక్ష్యానికి సమీపంలో... పిల్లల ఉన్నత విద్యకు మరో 2 ఏళ్లు ఉందనగా, ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు కొద్దికొద్దిగా వాటిని డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఎందుకంటే ఉన్నట్టుండి మార్కె ట్లు పడిపోతే పెట్టుబడుల విలువ అమాంతం కరిగిపోయే ప్రమా దం ఉంటుంది. కనుక పెట్టుబడులను రక్షించుకోవాలనుకుంటే ముందు నుంచే క్రమంగా వైదొలగడం అవసరం. విద్యా వ్యయం ఏ దేశంలో ఎంతెంత? యూఎస్ఏ ట్యూషన్ ఫీజు: ప్రైవేటు కాలేజీల్లో సుమారు రూ.25–30 లక్షలు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.15–23 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.75,000. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరంలో తక్కువ. మొత్తం ఖర్చు: ఏటా దాదాపు రూ.34 లక్షలు. ఆస్ట్రేలియా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అయితే రూ.10–16 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌కు 12–18 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.86,000. పట్టణాలను బట్టి ఇందులో మార్పు ఉంటుంది. సిడ్నీ, కాన్బెర్రా పట్టణాల మధ్యే నివాస వ్యయం నెలకు రూ.17,000 తేడా ఉంటుంది. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. యూకే ట్యూషన్ ఫీజు: రూ.8–18 లక్షలు. నివాస వ్యయం: లండన్‌లో అయితే ప్రతి నెలా రూ.1.1 లక్ష వరకు. లండన్ బయట అయితే రూ.91,000. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. కెనడా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–15 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.8–20 లక్షలు. నివాస వ్యయం: వీసా అవసరాలను బట్టి ప్రతి నెలా రూ.57,000 వరకు మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.19.8 లక్షలు సింగపూర్ ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5–13 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–25 లక్షలు. నివాస వ్యయం: రూ.50,000 వరకు ప్రతి నెలా. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.18 లక్షలు జర్మనీ ట్యూషన్ ఫీజు: పబ్లిక్ యూనివర్సిటీల్లో ఫీజు ఉండదు. కొన్ని నామమాత్రంగా ఏడాదికి రూ.40,000 వరకు చార్జ్ చేస్తున్నాయి. నివాస వ్యయం: మ్యూనిక్, బెర్లిన్ వంటి పెద్ద పట్టణాల్లో అయితే ప్రతి నెలా రూ.54,000. కాలేజీ డార్మెటరీల్లో ఉండేట్టు అయితే రూ.42,000 చాలు. ఫ్రీబర్గ్, హాన్నోవర్ వంటి చిన్న పట్టణాల్లో అయితే రూ.42,000 వరకు అవసరం అవుతుంది. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.5.4 లక్షలు. -
జీతాలు, సదుపాయాలను బట్టే స్కూల్ ఫీజులు!
► వాటి ప్రాతిపదికగానే ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నిర్ణయించనున్న ప్రభుత్వం ► నిర్దేశిత ఫీజుకు మించి వసూలు చేస్తే గుర్తింపు రద్దు ►ఒకసారి నిర్ణయించిన ఫీజు మూడేళ్లపాటు అమలు ► ఫీజులో 50 శాతం వేతనాలు, మరో 15 శాతం టీచర్ల సంక్షేమానికే... ► సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలోనూ ఫీజులను నిర్ణయించనున్న సర్కారు ► ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ విధానం ఖరారు.. జనవరిలో ఉత్తర్వులు ►జూన్ లోగా పాఠశాలలవారీగా ఖరారు కానున్న ఫీజులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11,470 ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసూలు చేయాల్సిన ట్యూషన్ ఫీజుల విధానం దాదాపు ఖరారైంది. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ, నిర్ణయానికి విద్యాశాఖ చేపట్టిన కసరత్తు పూర్తయింది. ఫీజుల విధానంపై జనవరిలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కానున్నాయి. జూన్ నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరపు ఫీజులను ప్రభుత్వం అంతకంటే ముందుగానే ఖరారు చేయనుంది. ఈ మేరకు అవసరమైన చర్యలపై విద్యాశాఖ, ప్రభుత్వం దృష్టి సారించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వృత్తివిద్యా కాలేజీల తరహాలోనే పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. కిందటి సంవత్సరంలో పాఠశాల యాజమాన్యం టీచర్లు, సిబ్బందికి చెల్లించిన వేతనాలు, టీచర్ల సంక్షేమం, సదుపాయాలు, నిర్వహణకు వెచ్చించిన ఖర్చుల ప్రాతిపదికగా స్కూల్ ఫీజులను నిర్ణయించ నుంది. దీంతో చాలా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఫీజులు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు ప్రభుత్వం నిర్ణయించే ఫీజులో 50 శాతాన్ని టీచర్ల వేతనాలకే వెచ్చించాలన్న నిబంధనను అమల్లోకి తేనుంది. మరో 15 శాతం నిధులను ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్ తదితర టీచర్ల సంక్షేమం కోసం వెచ్చించేలా నిబంధనల్లో పొందుపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌తోపాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్‌తో కొనసాగే ప్రైవేటు పాఠశాలల్లోనూ వసూలు చేసే ఫీజులను ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించనుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సూచించిన కనీస, గరిష్ట ఫీజుల విధానానికి విద్యాశాఖ ఒప్పుకోలేదు. ప్రభుత్వ నిర్దేశిత ఫీజుకు మించి పైసా వసూలు చేసినా ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయనుంది. ఒకసారి నిర్ణయించిన ఫీజు మూడేళ్లపాటు అమల్లో ఉండేలా విధానం రూపొందించింది. ఫీజులను ఎలా నిర్ణయిస్తారంటే.. పాఠశాల యాజమాన్యం ఆమోదంతో కరస్పాం డెంట్/సెక్రటరీ పాఠశాలల ఆదాయ (వసూలు చేసిన ఫీజు), వ్యయాలకు సంబంధించిన (టీచర్ల వేతనాలు, సదుపాయాలు, టీచర్ల సంక్షేమం, నిర్వహణ ఖర్చులు) ఆధారాలతో తమ పాఠశాలల్లో వసూలు చేసే ఫీజులను తరగతులవారీగా జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీకి (డీఎఫ్ఆర్సీ) ఆన్ లైన్ లో ప్రతిపాదించాలి. వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్, ఆడిట్/పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, సభ్య కన్వీనర్‌గా డీఈవో ఉండే డీఏఎఫ్ఆర్సీ పరిశీలిస్తుంది. వసూలు చేసిన ఫీజులు, అయిన ఖర్చుల్లో తేడాలున్నా, యాజ మాన్యం ప్రతిపాదనల్లో లోపాలున్నా డీఎఫ్ఆర్సీ ఆయా యాజమాన్యాలతో చర్చించి, తమ సిఫారసులను ప్రభుత్వానికి పంపిస్తుంది. అన్ని జిల్లాల్లోని డీఎఫ్ఆర్సీల నుంచి పాఠశాలలవారీగా వచ్చే సిఫారసులను ప్రభుత్వం పరిశీలించి తుది ఫీజును ఖరారు చేయనుంది. ఆ ఫీజునే పాఠశాలలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఫీజు నిబంధనల్లోని ప్రధానాంశాలు... ♦ ఏ రకమైన పేరుతోనూ పాఠశాల యాజమాన్యం డొనేషన్ వసూలు చేయరాదు. ♦ వన్ టైమ్ కింద దరఖాస్తు ఫీజు 100 లోపు ఉండాలి. ♦ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 లోపే ఉండాలి. ♦ తిరిగి చెల్లించే (రిఫండబుల్) విధానంలో రూ. 5 వేలలోపే కాషన్ డిపాజిట్ ఉండాలి. ఆ మొత్తాన్నీ పాఠశాల యాజమాన్యం డీఎఫ్‌ఆర్‌సీకి సమర్పించాలి. ఇవి మినహా మరే పేరుతోనూ వన్ టైమ్ ఫీజు వసూలు చేయొద్దు. ♦ టీచర్లు, సిబ్బంది వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిర్వహణ ఖర్చులు, వసతులు, సదుపాయాలు, స్పెషల్ ఫీజులను పరిగణనలోకి తీసుకొని ట్యూషన్ ఫీజు నిర్ణయిస్తారు. ఈ మొత్తాన్ని కనీసంగా మూడు విడతల్లో వసూలు చేయాలి. ♦ రెగ్యులర్ సిలబస్‌తో సంబంధం లేకుండా ఇతరాల పేరుతో వసూలు చేసే ఫీజులను ట్యూషన్ ఫీజు ఖరారులో పరిగణనలోకి తీసుకోరాదు. అది తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలేయాలి. సిల బస్తో సంబంధం లేకుండా వసూలు చేసే వాటికి వేరే అకౌంట్ నిర్వహించాలి. ♦ పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ కొనుగోళ్లకు మూడు షాపుల పేర్లను సూచించాలి. ♦ పాఠశాలల్లో బుక్స్, స్టేషనరీ, యూనిఫారాల కౌంటర్లు ఉండకూడదు. ♦ ప్రభుత్వ నిర్దేశిత ఫీజుకు మించి వసూలు చేస్తే పాఠశాల గుర్తింపు రద్దవుతుంది. ♦ ఒక విద్యా సంవత్సరంలో వసూలు చేసే ఫీజుల నిర్ణయం కోసం అంతకు ముందు విద్యా సంవత్సరం సెప్టెంబర్ నెలాఖరులోగా యాజమాన్యాలు ప్రతిపాదనలు అందజేయాలి. ఆ ప్రతిపాదనలను డీఎఫ్ఆర్సీలు 60 రోజుల్లో పరిశీలించి, ప్రభుత్వానికి సిఫారసులు చేయాలి. ప్రభుత్వం జనవరి కల్లా వాటిని ఖరారు చేస్తుంది. ♦ మార్చి 21 నుంచి ఆపై విద్యా సంవత్సరపు తరగతులు ప్రారంభమవుతాయి. ఒకవేళ జూన్ నాటికి ఫీజులు ఖరారు కాకపోతే కిందటి విద్యా సంవత్సరంలో వసూలు చేసిన ఫీజులనే అమలుచేయాలి. -
ట్యూషన్ ఫీజుకు పన్ను మినహాయింపు ఎంత?
నేను బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక్కొక్కరికి రూ.1,200 చొప్పున రూ.2,400 ట్యూషన్ ఫీజు పన్ను మినహాయింపు (ఒక ఆర్థిక సంవత్సరంలో) లభిస్తోంది. నా సోదరుడు ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ట్యూషన్ ఫీజులో ఇలాంటి పరిమితులు లేవని చెప్పాడు. ఆదాయపు పన్ను విషయంలో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ తేడాలు ఎందుకు? - భాస్కర్, బెంగళూరు ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి తేడాలు ఉండవు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, పిల్లల ట్యూషన్ ఫీజు విషయమై రెండు సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సెక్షన్ 10 కింద ఒక్కో పిల్లవాడికి రూ.1,200 (నెలకు రూ.100) చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లలకు అంటే రూ.2,400 పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక సెక్షన్ 80సి కింద ట్యూషన్ ఫీజు కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్), ఎన్ఎస్సీ(నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్)ల్లో పెట్టుబడులన్నింటికీ కలిపి గరిష్టంగా రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇవేమీ లేకుంటే కేవలం ట్యూషన్ ఫీజుకే రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. నేను ఇటీవలనే రిటైరయ్యాను. పన్ను ఆదా చేయడం కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లో పెట్టుబడులను కొనసాగించవచ్చా? - విద్యా దేవి, విశాఖపట్టణం రిటైరవ్వడం వల్ల ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయకూడదని ఏమీ లేదు. మీ పెట్టుబడులను ఈఎల్ఎస్ఎస్ల్లో నిరంభ్యతరంగా కొనసాగించవచ్చు. ఇతర పన్ను ఆదా స్కీమ్‌లతో పోల్చితే ఈఎల్ఎస్ఎస్ల్లోనే లాక్-ఇన్ పీరియడ్ తక్కువగా(మూడేళ్లు) ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు పొందవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఎలాంటి పన్నుల బాదరబందీ ఉండదు. నా వయస్సు 43 సంవత్సరాలు. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ ఫండ్-హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు 60 ఏళ్లు రాగానే ఈ హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ యూనిట్లను విక్రయిస్తే, నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? అలా కాకుండా నాకు 58 సంవత్సరాలు వచ్చే వరకూ హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత వాటిని హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ డెట్ ఫండ్‌కు బదిలీ చేసి, నాకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ డెట్ ఫండ్ యూనిట్లను విక్రయించిన సందర్భంలో పన్ను బాధ్యత ఎలా ఉంటుంది? - చిన్నారావు, విజయవాడ హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ ఫండ్-హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ అనేది ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్. ఇతర ఈక్విటీ ఫండ్లకు వర్తించే పన్ను నియమాలే ఈ ఫండ్‌కు కూడా వర్తిస్తాయి. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి, మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నారు. అంటే మీరు 17 ఏళ్లపాటు ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తారు. దీంతో ఈ ఫండ్ ద్వారా పొందే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత నియమనిబంధనల ప్రకారం, ఈక్విటీ ఫండ్స్‌లో ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించి, మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ యూనిట్లను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం రాదు. అయితే మీరు హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ యూనిట్లను మీకు 59 సంవత్సరాల రాకముందే ఉపసంహరించుకుంటే మీరు 1 శాతం ఎగ్జిట్‌లోడ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ యూనిట్లను హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ డెట్ ఫండ్‌కు బదిలీ చేసి, 60 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవాలని భావిస్తే, హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ డెట్ యూనిట్ల విక్రయంపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌కు 58వ ఏట బదిలీచేసి 60 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవాలనేది మీ ప్రణాళిక. అయితే డెట్ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ రెండేళ్ల వరకే ఉంటాయి. మీ డెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లలోపే ఉంటాయి కాబట్టి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ ఆదాయానికి జత చేసి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. మ్యూచువల్ ఫండ్ టర్నోవర్ రేషియో అంటే ఏమిటి? ఒక ఫండ్ విశ్లేషణలో ఈ టర్నోవర్ రేషియో ఎంతవరకు ఉపయోగపడుతుంది? - సరళ, హైదరాబాద్ ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఆ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను ఎంత తరచుగా మార్చాడనేది మ్యూచువల్ ఫండ్ టర్నోవర్ రేషియో ద్వారా తెలుస్తుంది. టర్నోవర్ రేషియో అధికంగా ఉంటే, మీ ఫండ్ మేనేజర్ ఫండ్ పోర్ట్‌ఫోలియో షేర్లను అధికంగా మార్చాడని అర్థం. ఉదాహరణకు ఒక ఫండ్ టర్నోవర్ రేషియో రేట్ వంద శాతంగా ఉందనుకోండి. అంటే ఫండ్ పోర్ట్‌ఫోలియో షేర్లను ఫండ్ మేనేజర్ పూర్తిగా మార్చివేశాడని అర్థం. ఫండ్ నిర్వహణ తీరు ఎలా ఉందనేది టర్నోవర్ రేషియో సూచిస్తుంది. తక్షణం లభించే అవకాశాలు, త్వరిత లాభాల కోసం ఫండ్ పోర్ట్‌ఫోలియోలో షేర్లను తరచుగా మారిస్తే టర్నోవర్ రేషియో అధికంగా ఉంటుంది. మరోవైపు షేర్లను కొనుగోలు చేసి, అలాగే హోల్డ్ చేస్తే టర్నోవర్ రేషియో తక్కువగా ఉంటుంది. టర్నోవర్ రేషియో అధికంగా ఉందంటే, లావాదేవీలు అధికంగా జరిగాయని అర్థం, దీంతో సహజంగానే లావాదేవీల వ్యయాలు పెరుగుతాయి. ఫండ్ వ్యయాల పేరుతో ఈ భారం ఇన్వెస్టర్లపైననే పడుతుంది. భారీగా లాభాలు వస్తేనే ఈ వ్యయాలకు అర్థం ఉంటుంది. అలారాని పక్షంలో ఫండ్ల పనితీరు ప్రభావితమవుతుంది. -
సెక్షన్ 80సీకి 8 మార్గాలు..
ప్రజల్లో పొదుపు శక్తిని ప్రోత్సహించడానికి కేంద్రం అనేక పన్ను రాయితీలిస్తోంది. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలో 80సీ పేరుతో ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. కానీ చాలామంది సెక్షన్ 80సీ అనగానే బీమా, పీపీఎఫ్, పీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఈ సెక్షన్ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందేందుకు అనేక పథకాలున్నాయి. సెక్షన్ 80సీలో ఉండి అంతగా ప్రాచుర్యం లేని ఇన్వెస్ట్మెంట్ పథకాల గురించి ఈ వారం తెలుసుకుందాం. వీటిల్లో ఏ పథకాన్ని ఎంచుకున్నా.. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. యులిప్ ఇన్వెస్ట్మెంట్, బీమా, పన్ను ప్రయోజనాలను యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్) అందిస్తుంది. చెల్లించిన ప్రీమియాన్ని వివిధ ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి వాటిలో వచ్చే లాభనష్టాలను అందిస్తాయి. కాబట్టి వీటి రాబడులపై ఎటువంటి హామీ ఉండదు. వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన ఐదేళ్ల వరకు వైదొలిగే అవకాశం లేదు. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగానే పరిగణించాలి. చిన్న వయస్సు ఉండి, రిస్క్ సామర్థ్యం ఉన్న వారికి ఈ పథకాలు అనువుగా ఉంటాయి. ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం లేదా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. వీటి రాబడులు కూడా ఈక్విటీ మార్కెట్స్పై ఆధారపడి ఉంటాయి. పన్ను ఆదాచేసే పథకాలన్నింటిలోకి తక్కువ లాకిన్ పీరియడ్‌ను కలిగివున్న పథకమిది. వీటి రాబడిపై ఎటువంటి పన్ను భారం ఉండకపోవడం, ఇన్వెస్ట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వైదొలిగే అవకాశం ఉండటం ప్రధాన ఆకర్షణ. వీటి రాబడులు మార్కెట్ల ఒడిదుడుకులకు అనుగుణంగా మారతాయి. ఇవి దీర్ఘకాలిక దృష్టితో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైనవి. అధిక రాబడిని ఆశించే వారు, రిస్క్‌కు సిద్ధపడ్డవారు ఇన్వెస్ట్ చేయొచ్చు. డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే పన్ను భారం లేని ఆదాయాన్ని మధ్యమధ్యలో పొందే అవకాశం ఉంది? స్టాంప్ డ్యూటీ ఇంటిని కొనుగోలు చేసినప్పుడు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వ్యయాన్ని సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇంటిని కొన్న సంవత్సరంలో మాత్రమే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలి. ఇంటి రుణం రుణం తీసుకొని ఇంటిని నిర్మించిన వారికి రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. చెల్లిస్తున్న రుణంలో అసలుకు (అంటే వడ్డీ కాకుండా)చెల్లించే మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. అదే రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బీ) కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. సుకన్య సమృద్ధి.. దీన్ని కేంద్రం ఈ మధ్యే ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవింగ్ పథకాల్లో అత్యధిక కాలపరిమితి దీనికే ఉంది. దీని కాలపరిమితి అమ్మాయికి 21 ఏళ్లు లేదా వివాహ తేదీ ఏది ముందైతే అది. ఈ పథకంపై అందించే వడ్డీ ఏటా మారుతుంది. ఈ ఏడాది వడ్డీరేటును 9.2 శాతంగా ప్రకటించారు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక అమ్మాయిపై ఒక ఖాతా మాత్రమే ప్రారంభించగలరు. గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరిట ప్రారంభించొచ్చు. దగ్గర్లోని పోస్టాఫీసులో ఈ పథకాన్ని ప్రారంభించొచ్చు. పెన్షన్ పథకాలు.. పెన్షన్ నిధి కోసం ఇన్వెస్ట్ చేసే యాన్యుటీ ప్లాన్ కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఎల్ఐసీతో సహా అనేక బీమా కంపెనీలు ఈ పథకాలను అందిస్తున్నాయి. ఎన్ఎస్సీ, డిపాజిట్లు.. పోస్టాఫీసు అందించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఐదేళ్ల పోస్టాఫీసు, బ్యాంకు డిపాజిట్లు కూడా సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. రిస్క్ లేకుండా స్థిరమైన వడ్డీ ఆదాయం కావాలనుకునే వారికి ఇవి బాగుంటాయి. కానీ ఈ పథకాల వడ్డీపై పన్ను భారం ఉంటుంది. దీన్ని ప్రతి ఏటా ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజులు.. పిల్లల చదువులకయ్యే వ్యయాలపై కూడా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇది మీరు చెల్లించే మొత్తం ఫీజులపై లభించదు. కేవలం అందులో పేర్కొన్న ట్యూషన్ ఫీజుకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతేకాని డొనేషన్స్, ల్యాబ్, డెవలప్మెంట్ ఫండ్ రూపంలో వసూలు చేసే ఫీజులకు ఇది వర్తించదు. నర్సరీ విద్య నుంచి విశ్వవిద్యాలయం కోర్సులకు వరకు ఇది వర్తిస్తుంది. కాని గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. -
ఫీ‘జులుం’
=అక్షరాలు నేర్వాలంటే లక్షలు కావాల్సిందే = దరఖాస్తుల విక్రయంతోనే రూ.250 కోట్ల వ్యాపారం = 40 శాతం పెరిగిన ట్యూషన్ ఫీజులు = చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో :‘కొత్త సంవత్సరం’ నగరంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు సరి‘కొత్త కష్టాల’ను మోసుకొస్తోంది. ఇప్పటికే నీటిపన్ను, ఆస్తిపన్ను, కరెంటు పన్నుల పెంపు ‘షాక్’తో బేజారవుతున్న జనం నెత్తిన త్వరలో స్కూల్ ఫీజుల బాంబు పేలబోతోంది. ఈ ఏడాది 1 నుంచి 10 వరకు ప్రతి తరగతికి గతేడాది కన్నా 20-40 శాతం ఫీజులు పెంచాలని రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్లు నిర్ణయించాయి. ఇప్పటికే పలు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ స్కూళ్లల్లో ఫీజులను ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాయి. విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టాన్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా డిసెంబరులోనే అడ్మిషన్స్‌కు తెరతీశాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే అడ్మిషన్స్ జరపాలని నిబంధనలు ఉన్నప్పటికీ యాజ మాన్యాలు ఖాతరు చేయడం లేదు. నగర శివారులోని కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో నవంబరు నెలాఖరికే అడ్మిషన్లు అయిపోయినట్లు సమాచారం. కార్పొరేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజులతో పాటు డొనేషన్ల పేరిట తల్లిదండ్రుల నుంచి రూ.లక్షలకు లక్షలు గుంజేస్తున్నాయి. దీంతో మధ్యతరగతి వర్గాలే కాదు.. సంపన్న వర్గాల వార్షిక బడ్జెట్ సైతం కుదుపునకు గురవుతోంది. దరఖాస్తు ఫారాలకే రూ.250 కోట్లు నగరంలోని పేరున్న పాఠశాలలు నవంబరు నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడంతో.. దరఖాస్తుల అమ్మకాలతో ఇప్పటికే రూ.250 కోట్ల వ్యాపారం జరిగి నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఈ నెలాఖరుకు అడ్మిషన్లు ముగిస్తున్నామని యాజమాన్యాలు ప్రకటించడంతో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల్లో మరింత హడావిడి కనిపిస్తోంది. దీంతో తమ నివాసాలకు దగ్గరగా ఉన్న అన్ని పాఠశాలల నుంచి అడ్మిషన్ ఫారాలను కొనుగోలు చేస్తున్నారు. దరఖాస్తు ఫారాలు ఖరీదు రూ.500 నుంచి రూ.1500 (పాఠశాల స్థాయిని బట్టి) పలుకుతుండగా.. ఒక్కొక్కరు కనీసం 10 నుంచి 15 పాఠశాలల్లో అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ రూపంలో ఇంకా సీటు రాకుండానే రూ. 7వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. వాస్తవానికి ఏ పాఠశాలలోనైనా దరఖాస్తు ఫారం ధర రూ.110కి మించకూడదని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఆర్టీఈ చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించాలన్న నిబంధనలను కూడా యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు ఏడాది కిందటే ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే.. నిబంధనల పమలును పర్యవేక్షిం చాల్సిన పాఠశాల విద్యాశాఖ మాత్రం నిద్రపోతోంది. తల్లిదండ్రులు పాసైతేనే... పిల్లవాడికి సీటివ్వాలంటే ముందు తల్లిదండ్రులు తగిన అర్హతలు పొంది ఉండటం తప్పనిసరంటున్నాయి కొన్ని కార్పొరేట్ పాఠశాలలు. తాము నిర్వహించే ప్రవేశ పరీక్షను (ఎంట్రన్స్ టెస్ట్) విద్యార్థి పాసైనప్పటికీ తల్లిదండ్రుల విద్యార్హతలు, ఆర్థిక స్థితిగతులు, నివాస ప్రాంతపు వివరాలను బేరీజు వేశాకే వారి పిల్లలకు కేటాయించేదీ, లేనిదీ చెబుతామంటున్నాయి. అంతేకాదు.. ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థులు నర్సరీ స్థాయిలోనే ఆప్షనల్స్ కూడా ఎంచుకోవాలట మరి. ఉదాహరణకు పిల్లాడికి చదువుతో పాటు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్‌లలో ఒక ఆటను, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని నిబంధన పెడుతున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలే కాకుండా ఆప్షనల్స్‌కు సంబంధించిన కిట్లను ముందుగానే (పాఠశాలలో ఉన్న దుకాణంలోనే) కొనాల్సి ఉంటుంది. ఒకవేళ వీటన్నింటికీ సరేనన్నా.. బిల్డింగ్ ఫండ్ కింద డొనేషన్ ఎంత కట్టగలరనే అంశంతోనే సీటు ఖరారవుతుందనేది సుస్పష్టం. అక్రమార్జనకు కళ్లెం ఏదీ? చట్టాలు, నియమాలు, నిబంధనలు అన్నీ ఉన్నాయి. కొరవడిందల్లా విద్యాశాఖ అధికారుల్లో చిత్తశుద్ధే. అధికారుల పర్యవేక్షణ కరువైన కారణంగా ప్రైవేటు యాజమాన్యాల అక్రమార్జనకు అంతుపంతూ లేకుండా పోయింది. కేవలం దరఖాస్తుల అమ్మకాల ద్వారానే (లక్షలు ఆర్జిస్తూ) తమ పరిపాలనా ఖర్చును రాబట్టుకుంటున్నాయి. ఇక డొనేషన్లు, అధిక ఫీజుల సంగతి సరేసరి. విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ టెస్ట్‌లు నిర్వహించడం నేరం. ప్రైవేటు యాజ మాన్యాల అడ్డగోలు వ్యవహారాలపై తల్లిదండ్రుల సంఘాలు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. - రమణకుమార్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి మార్గదర్శకాలు అందాక.. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ విషయమై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందితే ఆ మేరకు చర్యలు చేపడతాం. ఇక అడ్మిషన్ల విషయానికి వస్తే.. ఏ పాఠశాైలైనా విద్యా సంవత్సరం ప్రారంభంలో మాత్రమే అడ్మిషన్స్ ప్రక్రియను చేపట్టాలి. నవంబరు, డిసెంబరుల్లో అడ్మిషన్లు అయిపోయాయనడం నిబంధనలను ఉల్లంఘించడమే. రాత పూర్వకంగా ఏవరైనా ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. - వీఎన్ మస్తానయ్య, హైదరాబాద్ ఆర్జేడీ పెంచక తప్పదు..! ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్నులు, విద్యుత్ చార్జీలు విపరీంతంగా పెరిగాయి. అంతేకాదు.. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరల కారణంగా, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల వేతనాలను కూడా పెంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఫీజుల పెంపు తప్పనిసరి. ఇంటర్నేషల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్‌లో జరుగుతున్న దోపిడీని చూపిస్తూ, సాధారణ పాఠశాలలపై చర్యలకు ఉపక్రమించడం అధికారులకు భావ్యం కాదు. -కె. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్