TV comedy show
-
సిద్ధూకు తలంటేసిన హైకోర్టు!
న్యూఢిల్లీ: నిబంధనలు ఎందుకు పాటించరు, చట్టసభ సభ్యులే నిబంధనలు పాటించకుంటే ఎలా అని పంజాబ్ సాంస్కృతిక శాఖ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రశ్నించింది. మంత్రిగా ఉన్న సిద్ధూ టీవీ కామెడీ షోలో పాల్గొనడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందంటూ దాఖలైన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. 'ప్రతిదీ చట్టం చెప్పదు. ఔచిత్యం, నైతికత మాట ఏంటి? మంత్రిగా సర్వీసు నిబంధనలు పాటించకుండా మీ కింద పనిచేసే వారికి రూల్స్ పాటించాలని ఎలా చెబుతారు? స్టార్ ఎంపీలకు వర్తించే నిబంధనలను ఎందుకు ఆయన పాటించరు?' అని న్యాయస్థానం ప్రశ్నలు కురిపించింది. చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు లాభదాయక పదవులు, ప్రైవేటు వ్యాపారాలు చేయరాదని, కోడ్ ఆఫ్ కండక్ట్, 1952 చట్టం చెబుతోందని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మే 11కు హైకోర్టు వాయిదా వేసింది. -
టీవీషోపై ఘాటుగా స్పందించిన ట్రంప్!
తనపై జోకులు వేస్తే తేలికగా తీసుకునేది లేదని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఘాటు సంకేతాలు ఇచ్చారు. అమెరికాలో అత్యంత పాపులర్ కామెడీ టీవీ షో ‘సాటర్డే నైట్ లైవ్’పై ట్రంప్ మండిపడ్డారు. ఈ కామెడీ షో పక్షపాతపూరితంగా, ఏకపక్షంగా ఉందని, ఇందులో ఏమాత్రం హాస్యం లేదని విమర్శించారు. అధ్యక్షుడితోపాటు ఇతర రాజకీయ నాయకులను ఎగతాళి చేస్తూ కామెడీ షోలు నిర్వహించడం అమెరికాలో చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. అయితే, తాను అధ్యక్షుడు అయిన తర్వాత ఇలాంటి ఎకసెక్కాలు కుదరవని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ‘సాటర్డే నైట్ లైవ్ షోలోని కొన్ని భాగాలను నేను చూశాను. ఇవి పూర్తిగా ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా ఉన్నాయి. ఏమాత్రం హాస్యపూరితంగా లేవు. మాకు సమాన సమయం కేటాయించాలి కదా?’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే, ట్రంప్ ట్వీట్‌పై హాలీవుడ్ స్టార్ బాల్డ్విన్ ఘాటుగా బదులిచ్చారు. ‘ఇక ఎన్నికలు ముగిసిపోయాయి. మీరు అధ్యక్షుడిగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రజలు చెప్పేది ప్రజలు చెప్తారు’ అని బదులిచ్చారు.