టీవీషోపై ఘాటుగా స్పందించిన ట్రంప్‌! | Trump slams TV comedy show | Sakshi
Sakshi News home page

టీవీషోపై ఘాటుగా స్పందించిన ట్రంప్‌!

Published Mon, Nov 21 2016 11:15 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

టీవీషోపై ఘాటుగా స్పందించిన ట్రంప్‌! - Sakshi

టీవీషోపై ఘాటుగా స్పందించిన ట్రంప్‌!

తనపై జోకులు వేస్తే తేలికగా తీసుకునేది లేదని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ఘాటు సంకేతాలు ఇచ్చారు. అమెరికాలో అత్యంత పాపులర్‌ కామెడీ టీవీ షో ‘సాటర్‌డే నైట్‌ లైవ్‌’పై ట్రంప్‌ మండిపడ్డారు. ఈ కామెడీ షో పక్షపాతపూరితంగా, ఏకపక్షంగా ఉందని, ఇందులో ఏమాత్రం హాస్యం లేదని విమర్శించారు.

అధ్యక్షుడితోపాటు ఇతర రాజకీయ నాయకులను ఎగతాళి చేస్తూ కామెడీ షోలు నిర్వహించడం అమెరికాలో చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. అయితే, తాను అధ్యక్షుడు అయిన తర్వాత ఇలాంటి ఎకసెక్కాలు కుదరవని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చారు. ‘సాటర్‌డే నైట్‌ లైవ్‌ షోలోని కొన్ని భాగాలను నేను చూశాను. ఇవి పూర్తిగా ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా ఉన్నాయి. ఏమాత్రం హాస్యపూరితంగా లేవు. మాకు సమాన సమయం కేటాయించాలి కదా?’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అయితే, ట్రంప్‌ ట్వీట్‌పై హాలీవుడ్‌ స్టార్‌ బాల్డ్‌విన్‌ ఘాటుగా బదులిచ్చారు.  ‘ఇక ఎన్నికలు ముగిసిపోయాయి. మీరు అధ్యక్షుడిగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రజలు చెప్పేది ప్రజలు చెప్తారు’ అని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement