‘కల్బుర్గి హత్యకు నిరసనగా అవార్డు తిరిగిచ్చేస్తా’
న్యూఢిల్లీ: కన్నడ సాహితీవేత్త, హేతువాది ఎంఎం కల్బుర్గి హత్యకు నిరసనగా.. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డును తిరిగిచ్చేస్తానని ప్రముఖ ిహ ందీ రచయిత ఉదయ్ ప్రకాశ్ చెప్పారు. ‘ప్రొఫెసర్ కల్బుర్గి హత్య నన్ను కుదిపేసింది. నాకు ఇచ్చిన నగదు బహుమతిని, ప్రశంసాపత్రాన్ని ఈ నెల 8న ఢిల్లీ వెళ్లాక తిరిగిచ్చేస్తా. ఒకపక్క మనం తస్లీమా నస్రీన్ వంటి వారికి ఆశ్రయమిచ్చి భావప్రకటన స్వేచ్ఛ గురించి గొప్పలు పోతాం. మరోపక్క మన దేశ రచయితలు, కళాకారులు, హేతువాదులు దాడులకు గురవుతుంటారు’ అని ప్రకాశ్ మధ్యప్రదేశ్లోని తన గ్రామం సీతాపూర్ నుంచి పీటీఐకి ఫోన్లో తెలిపారు.