Ugadi Panchangam 2019
-
వికారినామ సంవత్సర (మకర రాశి ) రాశిఫలాలు
మకర రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వ్యయంలో శని కేతువుల సంచారం, షష్ఠమంలో రాహుగ్రహ సంచారం, వ్యయంలోనూ, జన్మరాశిలోను గురు గ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ప్రతి కార్యక్రమం అధిక శ్రమానంతరం అనుకూల ఫలితాలను ఇస్తుంది. జలసంబంధమైన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రతి విషయంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పనికీ ఒకటికి నాలుగుసార్లు కష్టపడాల్సి వస్తుంది. కళా సంబంధిత వ్యాపారాలలో కూడా రాణిస్తారు. బినామీ పేర్లమీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది. మీలో ఉన్న చిన్న లోపాలను పెద్దది చేసి మీ ప్రతిష్ఠను భంగపరచాలని అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ, పట్టు తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. కుటుంబ పురోగతి బాగుండడం మీకు సంతోషం కలిగిస్తుంది. కొన్ని బాధ్యతలు విస్మరించినందుకు వృత్తి ఉద్యోగాలకు తాళికట్టినందుకు బాధపడతారు. మీవైపు దొర్లిన లోపాలను మీవాళ్ళు బయటపడకుండా సమర్థిస్తారు. మీ ఆశయ సాధనకు పరోక్షంగా సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పాదాలు, కీళ్ళనొప్పులు, ఎముకలకు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెడతాయి. టెండర్లు, ప్రింటెడ్ పనులు, చేతివృత్తులకు సంబంధించిన కాంట్రాక్టులు అధికంగా లాభిస్తాయి. ధనం స్థిరం చేసుకోవడం సమస్య అవుతుంది. ఆస్తుల సంరక్షణకు, వాటిని సంపాదించడానికి పడినంత శ్రమపడాల్సి వస్తుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలలో వివాదాలు ఏర్పడతాయి. చివరకు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. సన్నిహితవర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వల్ల చివరకు వాళ్ళ వల్లనే అధిక పోటీ ఏర్పడుతుంది. బంధువులతో విభేదాలు చాలాకాలం కొనసాగుతాయి. విదేశీయానం, విదేశీ విద్య, ఉద్యోగం, సాంకేతిక విద్య, వైద్యవిద్య మొదలైనవి లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు లేనివారిని చేరదీసి ఆశ్రయం ఇస్తారు. జీవితంలో ఇది మలుపుగా మారుతుంది. వివాహాది శుభకార్యాలు మీ ఇష్టం మీదనే జరుగుతాయి. మీరు ఆశించిన ప్రేమాభిమానాలు మటుమాయం అవుతాయి. మారుతున్న సమాజంతో పాటు ఏనాడో మీ ఆత్మీయ, కుటుంబవర్గం కూడా మారిపోయారని ఆలస్యంగా గ్రహిస్తారు. సన్నిహితుల సహకారం వల్ల రాజకీయపదవి ప్రాప్తి. కార్యాలయంలో, సంస్థలో ప్రతి విషయానికి విమర్శకుల వల్ల, చాడీలు చెప్పేవారి వల్ల ఆటంకాలు, వాగ్వివాదాలు సంభవం. మొండి వైఖరితో ఎవరినీ లెక్క చేయక దేవుడిమీద భారం వేసి మీ పనిని సక్రమంగా నిర్వహించి మంచి ఫలితాన్ని సాధించి, వృత్తి ఉద్యోగాలపరంగా రక్షణ ఏర్పరచుకుంటారు. రాజకీయ వ్యవహారాలలో, శుభకార్యాల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కార్యాలను సానుకూలం చేస్తారు. ఇందుకు సంబంధించి మీరు పేరుప్రఖ్యాతులు ఆశిస్తారు. అందుకు విరుద్ధంగా విమర్శలు ఎదురవుతాయి. ఇతరుల అసమర్థతకు మీరు పరోక్షంగా బాధ్యత వహించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మీ నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితి రావచ్చు. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. గృహసంబంధిత ఖర్చులు అధికం అవుతాయి. దూరప్రాంతం నుండి వచ్చిన లేఖలు, టెలిఫోన్లు మానసిక ఆనందం, ఉత్సాహం, ఆర్థికాభివృద్ధికి కారణం అవుతాయి. కొన్ని ఆలోచనలు ఆలోచనలుగానే ఉంటాయి, అవి అమలు కావు. సంవత్సర ద్వితీయార్ధంలో పట్టుబట్టి కొన్ని ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించిన వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానధర్మాలు, సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు. అందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావలసిన అనువంశిక ఆస్తి మూడువంతులు మీ చేతికి అందుతుంది. అధికమొత్తం ధనం సంతానం కోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిక్నిక్లు, విందువినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలలో అపశ్రుతులు సంభవించవచ్చు. వీలైనంతవరకు ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. లోహ, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి, చిన్న వ్యాపారాలు చేసేవారికి, హోటల్, రియల్ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు సంభవం. స్థానిక రాజకీయ నాయకులతో విభేదాలు వస్తాయి. గట్టిగా ప్రయత్నించి పెండింగ్ బిల్స్ మంజూరు అయ్యే విధంగా శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాలకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామన్న సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూశారన్న ప్రఖ్యాతి లభిస్తుంది. మీ సహచరవర్గంలో ప్రతిభ కలిగిన వాళ్ళను గుర్తించలేకపోయామన్న బాధ కలుగుతుంది. ఈ విషయంలో అంతర్మథనం చెందుతారు. ఆలోచనలు పరిపరివిధాలుగా వెళతాయి. అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహం అమలు చేస్తారు. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. అప్పులు ఇస్తారు, కానీ తిరిగి రావడం గగనం అవుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఆశించే వారికి నిరుత్సాహం కలుగుతుంది. తోటి ఉద్యోగులు మీపై అధికారులకు చెప్పిన చాడీల వలన ప్రమోషన్లు నిలిచిపోతాయి. ఇది మీ మనోవేదనకు కారణం అవుతుంది. సంతానం పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు అందుతాయి. సాంకేతిక వైద్య, న్యాయరంగాలలో రాణిస్తారు. స్కాలర్షిప్లు లభిస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ వంటి వాటికి ఎంపికవుతారు. దగ్గరి దాకా వచ్చి దూరంగా వెళుతున్న సంబంధాలు ఈ సంవత్సరం కుదురుతాయి. సామాజిక సేవాకార్యక్రమాలలో, యూనియన్ కార్యక్రమాలలో పేరుప్రఖ్యాతులు పెంచుకోగలుగుతారు. మీ అభిరుచికి తగిన విధంగా ఒక గార్డెన్హౌస్ని ఏర్పాటు చేసుకుంటారు. అందరితో చర్చించి నిర్ణయాలను అమలు చేస్తారు. మీ వ్యక్తిగత, వ్యాపార, ఆర్థిక సంబంధ విషయాలు ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది. వృత్తిపరంగా నక్క మనస్తత్వం కలిగిన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్త వహించండి. సంతాన పురోగతి బాగుంటుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. కార్యాలయంలో రాజకీయాలు అధికమవుతాయి. ఉద్యోగపరంగా ఇతరులపై వచ్చిన నిందలు, ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో తేల్చి నివేదిక ఇవ్వవలసిన బాధ్యత మీపై పడుతుంది. సున్నితమైన ఈ అంశంలో వాస్తవాల కన్నా మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు చేస్తారు. మధ్యవర్తుల మాటలు నమ్మి వాస్తవాలు విస్మరించి ఒక పొరపాటు సమాచారాన్ని మీరు కూడా ధ్రువీకరిస్తారు. ఇందువల్ల మీ సన్నిహితవర్గం నష్టపోతారు. మీ ఎదుగుదల కొందరికి కంటకంగా మారుతుంది. అసూయగ్రస్తులైన వారితో మీ సన్నిహితులు కూడా చేరటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కొంత అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సమీప బంధువుల జోక్యం ఈ అప్రశాంత వాతావరణానికి కారణం అవుతుంది. యుక్తిగా వ్యవహరించి వాళ్ళని కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంచుతారు. నూతన ఆదాయమార్గాలలో శ్రమించి మంచి ఫలితాలను పొందుతారు. మీ సంతానానికి బాధ్యత తెలుస్తుంది. బాగా చదువుకుని కుటుంబ ప్రతిష్ఠ నిలబెట్టడానికి çఉత్సాహంగా శ్రమిస్తారు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాల కోసం విలువైన స్థిరాస్తులు తాకట్టు పెడతారు. పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహంకాని వారికి వివాహప్రాప్తి. సంతానంలేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైరివర్గం గురించి రహస్య సమాచారం మీ చేతికి అందుతుంది. వాళ్ళు తప్పు చేశారనే సాక్ష్యాధారాలు కొన్ని మీ చేతికి లభిస్తాయి. తొందరపడకుండా సమయం, సందర్భం కోసం వేచిచూస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో ముఖ్యమైన వ్యక్తులకు మీరే ఆంతరంగికులు అవుతారు. మీ మంచితనానికి మీరు అందించే సహాయసహకారాలకు మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధుమిత్రుల నుండి సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు సమసిపోతాయి. కార్యాలయ సంబంధమైన విషయాలు కొన్ని అభూతకల్పనలతో మీడియా ద్వారా వెల్లడవుతాయి. కార్యాలయ ప్రతిష్ఠకు తాత్కాలికంగా భంగం కలుగుతుంది. ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి మీ ప్రణాళికలకు తగినటువంటి విషయాలకు ఒక ఉన్నతవ్యక్తి సహకారం లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మంచి పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. వాటిని నిలబెట్టుకోవడానికి జీవితంలో మీరు ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు. మోసపూరిత డాక్యుమెంట్ల వల్ల, దొంగ స్వామీజీల వల్ల, నకలీ వస్తువుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సహోదర సహోదరీవర్గంలోని ఒకరికి రహస్యంగా సహాయం చేస్తారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న వారికి మంచి పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. లాటరీలు, జూదాలు, క్రికెట్, రాజకీయ ఫలితాల బెట్టింగ్‌లు పనికిరావు. మీ సన్నిహిత వర్గానికి చట్ట పరమైన చిక్కులు, ట్యాక్సులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు మీ శత్రువర్గం వల్ల ఏర్పడతాయి. రాజకీయ పరపతిని ఉపయోగించి వాటి నుండి మీ వారిని రక్షించుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. దీని ప్రభావం మీ వృత్తి ఉద్యోగాల మీద పడకుండా జాగ్రుత్త వహించండి. పిల్లల పురోగతికి ఖర్చు చేయవలసిన ధనం చేతికి అందుతుంది. సమస్యలు పరిష్కారం కావాలి, కొంతమందికి దారి దొరకాలి. అప్పుడే అన్నివిధాలుగా మీకు ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు సంబంధించిన వస్తువులుగానీ, పత్రాలుగానీ, డాక్యుమెంట్లుగానీ మీ దగ్గర ఉండడం వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో చికాకులు పోయి మంచికాలం వచ్చినట్లుగా కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. కరస్పాండెన్స్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్య, విద్య, మందుల వ్యాపారం, ఎరువుల వ్యాపారం, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం అనుకూల దిశలో పయనిస్తాయి. మీ శక్తిసామర్థ్యాలు, మీ ప్రతిభ ఆకస్మాత్తుగా చాలామందికి గుర్తుకువస్తాయి. సాంకేతిక, విద్యారంగాలలో ఉన్నవారికి ప్రజాదరణ, ప్రభుత్వపరమైన అవార్డులు, రివార్డులు సూచిస్తున్నాయి. మీ నెలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. మారిన సామాజిక, రాజకీయ పరిస్థితులు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తమ స్వశక్తితో, తమ స్వంతకాళ్ళపై నిలబడే యత్నాలు చేసి నిలబడతారు. పొదుపు చేసిన ధనంతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆభరణాల పట్ల గతంలో ఉన్న మోజు తగ్గుతుంది. మన ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా భగవంతుడే నిర్ణయాలు తీసుకుంటాడని తెలుసుకుంటారు. రాజకీయాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. పెళ్ళిచూపుల తతంగాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటారు. కుటుంబ ప్రతిçష్ఠ నిలబెట్టడానికి శ్రమిస్తారు. పిల్లలను తమ అభిరుచికి అనుగుణంగా పెంచాలని అనుకుంటారు. కానీ పిల్లలు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే చూసీ చూడనట్లుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనితో భర్తతో విభేదాలు తలెత్తుతాయి. సాధారణ విద్యలోనూ, సాంకేతిక విద్యలోనూ బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న చోట చదువుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. చదువుకోసం దివారాత్రులు శ్రమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. జుట్టు సంరక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసివస్తాయి. సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. బ్యూటీపార్లర్స్ నిర్వహణ, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. మీకు రావలసిన ధనం మెల్లిమెల్లిగా చేతికి వస్తుంది. సామాజిక జీవితంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యతనిస్తారు. ఎందరు ఎన్నివిధాలుగా చెప్పినా మీ అభిప్రాయంలో మార్పురాదు. సంస్థాపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు గోప్యంగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఆంతరంగిక వ్యక్తులను దూరంగా ఉంచుతారు. వైద్యవిద్యను అభ్యసించాలనే కోరిక నెరవేరుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. చోరభయం పొంచివుంది. ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఐఐటీ, సీఏ, ఎంబీఏలలో కూడా రాణిస్తారు. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. -
వికారినామ సంవత్సర (మీన రాశి ) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంటుంది. దశమంలో శని కేతువుల సంచారం, చతుర్థంలో రాహు గ్రహ సంచారం, దశమ, ఏకాదశాలలో గురు గ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. శ్రమానంతరం ఫలితాలు దక్కించుకుంటారు. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి శ్రమిస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. మీ ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో సాధ్యం కావడం కష్టం అని గ్రహించండి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సబ్–కాంట్రాక్టులలో మీ వాటా మీకు కొన్ని అవాంతరాలు దాటుకుని వస్తాయి. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసి మానసిక సంతోషాన్ని పొందుతారు. చాలాకాలం తరువాత బంధాలు తెగిన వ్యక్తులతో తిరిగి సంబంధాలు ఏర్పడతాయి. ఉన్నతస్థితిని సాధించినా సుఖం లేకుండా శ్రమజీవితాన్ని గడుపుతారు. వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాలలో రాణిస్తారు. రాజకీయరంగంలో ప్రారంభం నుండి స్థితి బాగుంటుంది. వీలునామాలు, లిటిగేషన్స్ వ్యవహారాలు లాభిస్తాయి. చెస్, క్రికెట్ మొదలైన క్రీడారంగాలలో బాగా రాణిస్తారు. బలమైన అభిమాన వర్గం ఉంటుంది. హాస్య సంబంధమైన రచనలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది. బాగాలేని సంస్థ రూపురేఖల్ని మార్చి మంచి దారిలో పెట్టగలరు. భూములు, పెద్దలు ఇచ్చిన ఆస్తుల వంటివి అభివృద్ధి చెందుతాయి. కొన్ని వివాదాలు స్థిరాస్థులపరంగా తప్పకపోవచ్చు. మధ్యవర్తిత్వ సంతకాలు మొదలైనవి కలిసిరావు. విధానాలను మార్చుకొని నూతన పంథాలో పాత విషయాలను అందరూ మరిచిపోయేలా చేస్తారు. కొన్ని విషయాలు మరుగున పడితేగానీ కొత్త విషయాలు లాభించవని గ్రహిస్తారు. తెలివిగా ఎత్తువేస్తారు. వీలైనంతవరకు నూతన పరిచయాలకు ప్రాధాన్యతనిస్తారు. పాత మిత్రులను దూరంగా ఉంచడం సంభవం. ఉద్యోగంలో ప్రయోజనం లేని అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఇన్సూరెన్సు విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అడ్రస్సు పొరపాటు వల్ల మీకు అందవలసిన సమాచారం ఆలస్యం అవుతుంది. పెరిగిన కుటుంబ ఖర్చులకు అనుగుణంగా ఆదాయ మార్గాలు లభిస్తాయి. శుభకార్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తారు. మోసపూరిత మనస్తత్వం కలిగిన వారి మాటలు నమ్మి నష్టపోతారు. విందులు, వినోదాలలో అపశ్రుతులు ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. అన్ని విధాలుగా మంచి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేదని ప్రతిసారీ మీ మీదపడి ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళ వల్ల ముప్పు పొంచి వుంది. ముందుగా ఎవ్వరికీ మీ వ్యూహం చెప్పవద్దు. విద్యాసంబంధమైన విషయాలలో కొన్ని మార్పులు, అదనపు అర్హతలు అవసరమవుతాయి. కొన్ని సందర్భాలలో అర్హత ఎక్కువ కావడం వల్ల అవకాశాలు జారిపోవడం జరుగుతుంది. కొన్ని అవకాశాలకు మీ అర్హతలు తక్కువ అవుతాయి. ఇది కొద్ది కాలం మాత్రమే ఇబ్బంది పెడుతుంది. మీ మనసుకు సంతృప్తి కలిగే పని, ఉద్యోగం ఎట్టకేలకు లభిస్తాయి. ఒక స్త్రీ మనస్తత్వం, ఆతిథ్యం మీకు అర్థంకాక ఆలోచనకు దారితీస్తుంది. సభ్యతలేని వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. నడమంత్రపుసిరి మనుషుల్లో ఇంత మార్పు తెస్తుందా అని ఆశ్చర్యపోతారు. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు. ఈ విషయం ఆలస్యంగా మీ దృష్టికి వస్తుంది. మీ నిజాయితీ నిరూపించుకోవలసిన పరిస్థితి రావచ్చు. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే ప్రయత్నాలు విఫలం అవుతాయి. గృహ సంబంధిత ఖర్చులు, రిపేరు ఖర్చులు అధికం అవుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి చర్యలు తీసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో పట్టుబట్టి కొన్ని ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. రవాణా సంబంధమైన, ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాలలో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. అతికష్టం మీద ముఖ్యమైన విషయాలలో మీ తప్పులేదని రుజువవుతుంది. మీ స్వయంకృతాపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా ప్రభుత్వపరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపుతాయి. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించిన వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. ఎంత జాగ్రత్త వహించినా అనుచరవర్గం, సహోదరవర్గం వల్ల చికాకులు తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో, ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడమే కష్టతరమవుతుంది. దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు. ఉద్యోగంలేని వారికి ఉద్యోగప్రాప్తి, సంతానంలేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. పిక్నిక్లు, విందులు, వినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు, సేవలు అందుతాయి. ఉద్యోగపరంగా స్థాన చలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. లోహ, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి, చేతివృత్తి పనివారికి, చిన్న వ్యాపారులకు, హోటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విజయవంతమైన ఫలితాలు, లాభాలు సంభవం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యారంగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఐఐటీ, ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటికి ఎంపికవుతారు. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. మధ్య మధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. విద్యాసంబంధ విషయాలకు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. వ్యాపారంలో చేసిన మార్పుల వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలపైన కొంతమంది దుష్ప్రచారం చేస్తారు. అపనిందలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సంతానాన్ని చదువుల కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు ఋణాలు లభిస్తాయి. ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతిరంగంలోనూ గట్టిపోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు. ప్రజాసంబంధాలు పెంచుకుంటారు. విలువైన డాక్యుమెంట్స్ మొదలైన వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవసరమైన సమాచారం కోసం ఎక్కువ ధనాన్ని, పరిచయాలను ఉపయోగిస్తారు. గృహ, ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. భార్యవైపు బంధువులను చేసి ఆదుకుంటారు. ముఖ్యమైన బాధ్యతల నుండి పాతవాళ్లను తప్పించి కొత్తవాళ్ళకు అప్పజెప్తారు. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలను నైపుణ్యంతో చక్కబెడతారు. రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్, లైసెన్స్‌లు పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. స్థాయికి దిగజారిన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసి పరిష్కార మార్గాలు కనుగొంటారు. ఇందుకు అవసరమైన మనోధైర్యం కలిగి ఉంటారు. గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్‌కార్డు తప్పక లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ శక్తికొలది ఇతరులకు సహాయపడతారు. మీ ప్రతిభాపాటవాలతో పాటు మీ పూజలు, పునస్కారాలు, దానధర్మాల ఫలితం అక్కరకు వస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. సంతానం చదువులో రాణిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు నూటికి తొంబై శాతం కాలం బాగుంది. అయినప్పటికీ సామాజిక పరిస్థితుల వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. స్వగృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. రాత్రిపూట చేసే ఆలోచనలు కలిసివస్తాయి. చాలామంది జీవితాలు మీ ఆలోచనా విధానాల మీద, మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. పగ, ప్రతీకారం, ముక్కు మీద కోపం, వ్యసనాలు మొదలైన వాటికి దూరంగా ఉంటారు. ఇతర భాషలు నేర్చుకోవాలనే విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. స్నేహితుల ఒత్తిడి మేరకు యూనియన్ కార్యక్రమాలలో పాల్గొనవలసి వస్తుంది. యూనియన్ కార్యక్రమాలను పకడ్బందీగా, జాగ్రత్తగా నడిపి మీడియా దృష్టిని ఆకర్షిస్తారు. పసుపు, మిర్చి, కాటన్, కూరగాయలు, బియ్యం, కందిపప్పు, మినపపప్పు వ్యాపారులకు మంచి లాభాలు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా నడుస్తాయి. నిర్మాణ సంబంధమైన పనులకు సంబంధించి మంచి లాభాలు లభిస్తాయి. ఎదుటివాళ్ళను అంచనా వేయడంలో దాదాపుగా పొరపాటుపడరు. మీ అంచనాలు, వ్యూహాలు, పలుకుబడి సమయస్ఫూర్తి భాగస్వాములకు, సంస్థలకు కొండంత అండగా నిలుస్తాయి. మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగినవారు నిజంగా ఎవరని తెలుసుకోగలుగుతారు. స్వల్ప కారణాలు పెరిగి పెద్దవై, భేదాభిప్రాయాలు ఎక్కువై ముఖ్యమైన వారితో చట్టపరంగా విడిపోతారు. దీర్ఘకాలిక ఋణాలను గడువుకు ముందే తీర్చివేస్తారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ మిమ్మల్ని విసిగిస్తున్న ఓ ముఖ్యమైన పని పరిష్కారమవుతుంది. తెలివిగా ప్రవర్తించి అన్ని విధాలా ఆలోచన చేసి శుభకార్యాల విషయాన్ని ఓ కొలిక్కి తెస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. విదేశాలలోని మిత్రుల నుండి కొద్దిపాటి ఆర్థిక సాయం లభిస్తుంది. లాభం చేకూర్చే ప్రయాణాలు వ్యూహ, ప్రతివ్యూహాలు ఆర్థికపరమైన రహస్య లావాదేవీలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. గతంలో వద్దు అనుకున్న వ్యవహారాలను తిరిగి ప్రారంభిస్తారు. పురోభివృద్ధికి ఉపకరించే ఏ అంశాన్నీ నిర్లక్ష్యం చేయరు. మీ ప్రవర్తనలో ఉన్న లోపాలను ఇతరులు విమర్శించక ముందే మార్పులు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా చికాకులు ఏర్పడతాయి. మీతో జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటామని తెలుసుకుని సహోద్యోగులు జాగ్రత్తగా మసలుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య స్థితులు మెరుగుపడతాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవానుగ్రహం వలన ఏ పని చేపట్టినా సమర్థించేవారు, సపోర్టు చేసేవారు ఉంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం సంతానానికి మంచి బోధనలు చేస్తారు. విద్యాపరంగా సంతాన పురోగతి బాగున్నప్పటికీ మార్కులు తగ్గుతాయి. సంతానం ప్రక్కదోవ పట్టకుండా వేయికళ్ళతో జాగ్రత్తగా గమనిస్తారు. ప్రేమ వివాహాలు చేసుకోవాలకున్న వారికి కాస్త ఆలస్యంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. కుటుంబ ప్రతిష్ఠను, తల్లిదండ్రుల ప్రేమను మరిచిపోయి క్షణికావేశంలో ప్రేమవివాహం చేసుకున్నందుకు విచారిస్తారు. నిర్లక్ష్యానికి గురి అవుతున్న స్థిరచరాస్తులను రక్షించుకోవడానికి శ్రమిస్తారు. మేధావులను, ఘటికులను అవలీలగా ఎదుర్కొన్న మీరు ఒక అనామకుడి చేతిలో మోసపోతారు. పోటీపరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి. విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు రెండో యత్నంలో సఫలీకృతమవుతాయి. విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి. పాస్‌పోర్ట్, వీసా, గ్రీన్‌కార్డు వంటివి చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అన్నదాన విరాళాలకు ప్రాముఖ్యతనిస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల ప్రయోజనం శూన్యం అని తెలుసుకుంటారు. ఏది ఏమైనా మీకు బయట నుండి వచ్చే సమస్యల కన్నా ఆత్మీయులు, ఇంట్లో వారి వలన చిక్కులు ఏర్పడతాయి. బ్యాంకు వ్యవహారాలు, క్రెడిట్ కార్డులు, పొదుపు వ్యవహారాలు మొదలైన విషయాలలో సాంకేతికపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. వాయిదా పద్ధతిలో మీకు ఇష్టమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. చేతివృత్తి పనివారికి అనుకూల కాలం. విద్యా, సాంస్కృతిక రంగాలలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. క్రీడారంగంలోని వారికి అవార్డులు లభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో పార్శ్వపు నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో నైపుణ్యం, అంకితభావం మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని తెచ్చిపెడతాయి. కలలుగన్న స్వగృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అవివాహితులైన వారికి ఆకస్మికంగా మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూలమైన సంబంధం కుదురుతుంది. మీకు ఇష్టం లేకపోయినా రాజకీయరంగంలోకి ప్రవేశిస్తారు. తాత్కాలిక వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టి లాభం పొందుతారు. వస్త్రవ్యాపారం, కూరగాయల వ్యాపారం, ఫ్యాన్సీ, హోమియోపతి, అల్లోపతి వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, విద్యాసంస్థల నిర్వాహకులు, పాల వ్యాపారులు విశేషంగా ధనం అర్జిస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేసే యోగం ఉంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యా, వైజ్ఞానిక రంగాలలో అనుకున్నది సాధిస్తారు. ఆహార క్రమశిక్షణ చాలా అవసరం. మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది. కొన్ని వాస్తవాలు బయటపడటంతో ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు. అతని వల్ల ప్రమాదం సంభవిస్తుందేమోనన్న భయం కూడా మీ మనస్సుని కలవరపరుస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
వికారినామ సంవత్సర (కుంభ రాశి) రాశిఫలాలు
ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏకాదశంలో శని కేతువుల సంచారం, పంచమంలో రాహు గ్రహ సంచారం, ఏకాదశంలో, వ్యయంలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహæణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానాలలో కొంతకాలం పనిచేసినప్పటికీ తరువాత మెరుగైన స్థానాన్ని సంపాదిస్తారు. మీ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు తాత్కాలికంగానే ఫలిస్తాయి. మిమ్మల్ని నిష్కారణంగా విమర్శిస్తున్న వారికి పరోక్షంగా సమాధానమిస్తారు. పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఉన్నంతలో మానసిక ప్రశాంతత ఏర్పరచుకోవడంలో ఆనందం ఉన్నదని గ్రహిస్తారు. మీ వ్యవహారశైలిలో అనేకమైన మార్పులు తెచ్చుకుంటారు. పరస్పర విరుద్ధ భావాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు మొండివాళ్ళని కలపడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. మీ సమస్యల కంటే అధికంగా ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి సమయం కేటాయించవలసి వస్తుంది. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మీ మనస్తత్వానికి విరుద్ధంగా ఇష్టం లేకపోయినా కొన్ని పైరవీలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వపరంగా, ప్రైవేటుపరంగా రావలసిన ధనం అతికష్టం మీద చేతికి వస్తుంది. పగ ప్రతీకారాలకు అతీతంగా పెద్దమనిషిగా వ్యవహరిస్తారు. సమాజంలో వివిధ రంగాలలో పేరుప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులను మీ స్వహస్తాలతో సత్కరించి మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు ఏ విషయం చెప్పినా వద్దు, కాదు అని అపశకునాలు పలికి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు మీ కార్యక్రమాలు విజయవంతం కావడం చూసి సిగ్గు విడిచి మళ్ళీ మీతోనే నడుస్తారు. భ్రాంతితో, భయంతో జీవనం వెళ్ళదీస్తున్న వ్యక్తులను చేరదీసి ధైర్యం చెబుతారు. ఆస్తి కోసం, ధనం కోసం తల్లిదండ్రులతో కూడా విరోధం కల్పించే ప్రయత్నం చేస్తారు. అయితే సహోదరవర్గం అండగా నిలిచి దుష్పరిణామాలు సంభవించకుండా అండగా నిలబడతారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీ సాటివాళ్ళు మీ కన్నా అధికంగా లాభం పొందుతారు. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. అఖండమైన రాజకీయ రాజయోగం సంప్రాప్తం. శత్రువర్గంపై అఖండ విజయం. భాగస్వాముల అత్యుత్సాహం వలన కొన్ని నష్టాలు, రావలసిన లాభాలు రాకపోవడం, అధికారులతో వివాదాలు ఏర్పడతాయి. వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. పురాతన వస్తుసామగ్రి సేకరిస్తారు. వినూత్నమైన కార్యక్రమాలు, సరికొత్త వ్యాపారాలు చేసే వారు మీకు సన్నిహితం అవుతారు. మిమ్ములను భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు. అనుభవంలేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు. ప్రభుత్వ కార్యాలయాలలో మీ పరపతి పెరుగుతుంది. చెల్లించిన సొమ్మును చెల్లించలేదని, తీసుకోని ధనం తీసుకున్నారని మొదలైన నిందలు అసౌకర్యానికి గురిచేస్తాయి. సామాజిక చర్చలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వారితో కావలసిన వనరులను, ప్రయోజనాలను సమకూర్చుకుంటారు. ప్రజాసంబంధాలను అభివృద్ధిపరచుకునే ప్రయత్నాలను అధికం చేస్తారు. విందులు, వినోదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకుంటారు. స్థిరాస్తులు అమ్మే సమయంలో మోసపోయే అవకాశం ఉంది. కళా, సాంస్కృతిక వ్యవహారాలలో, క్రీడలలో నూతన అవకాశాలు అందివస్తాయి. కీర్తిప్రతిష్ఠలు సూచిస్తున్నాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరం. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. కొందరి ప్రోత్సాహం, సహకారం వల్ల మీలో నిద్రాణమైన ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ మనోభావాలను వ్యక్తం చేయకుండా ఇతరుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందన్న నిజాన్ని మీరు గ్రహిస్తారు. ఎన్నికలలో శత్రువర్గం కన్నా స్నేహితులే ఎక్కువగా నష్టం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు భేదాభిప్రాయాలు సంభవిస్తాయి. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. మీది అహంకార వైఖరి అని ముద్రవేయడం జరుగుతుంది. ఒకవర్గానికి చెందిన వ్యక్తిగా మీపై ముద్రపడే అవకాశం ఉంది. భూములు, ఫ్లాట్స్, బంగారం కొనుగోలు చేస్తారు. మిత్రవర్గం, సన్నిహిత, సేవకవర్గం వారితో కొంత ఆలస్యంగా అయినా పనులు చేయించుకోగలుగుతారు. బంధువుల వల్ల, సన్నిహిత, రక్తసంబంధీకుల వల్ల, పరస్త్రీల వల్ల నష్టం జరుగుతుంది. శిరోవేదన, పార్శ్వపు నొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది కలిగిస్తాయి. సంస్థల విస్తరణే ధ్యేయంగా కృషి చేస్తారు. అనేకమంది ఉద్యోగుల పట్ల, వారి వారి విధుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. కుటుంబ విషయాల కారణంగా కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. మధ్యమధ్యలో జీవితభాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. స్త్రీ సంతానం పురోగతి బాగుంటుంది. భూమి, భవనాల రూపంలో ధనాన్ని మదుపు పెడతారు. జీవితంలో ఇది మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగపడాలని ఆశిస్తారు. కాలం సజావుగా సాగుతున్నప్పటికీ వర్గవైషమ్యాలు, రాయబారాలు విసుగు కలిగిస్తాయి. వాటిని వదిలించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల లాభపడతారు. మీ ఓర్పు చాలా విజయాలకు కారణం అవుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశాలు లభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో ట్యాక్సులు వసూలు చేసే అధికారుల ద్వారా మీ ప్రత్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలు చేసి కొంతమేరకు నష్టాన్ని కలిగిస్తారు. రాజకీయ పరపతిని ఉపయోగించి చాలావరకు నష్టాన్ని నివారించుకోగలుగుతారు. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేసినందుకు చింతిస్తారు. కోర్టు సమస్యలు సంవత్సర ప్రథమార్ధంలో ఇబ్బందిపెట్టినా ద్వితీయార్ధంలో సానుకూలపడతాయి. బంధువర్గం వారు స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. వారికి మీరు సహాయ నిరాకరణ చేస్తే, మీ ఇంట్లోని వారి ద్వారా మీపై ఒత్తిడి పెంచుతారు. సినీ, కళా పరిశ్రమలోని వారికి మంచి రోజులు గోచరిస్తున్నాయి. టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఎంతమంది పక్కన ఉన్నా, ఎన్నివిధాలుగా కలిసి వచ్చినా ఒంటరిగా ఉన్నామన్న భావన మీ మనస్సులో ప్రబలంగా నాటుకుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మీ తోడబుట్టిన వాళ్ళకు అండగా నిలువవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జ్యేష్ఠ కుమారుడిని అతిగారాబం చేయటం వల్ల ఇంట్లో విమర్శలు వస్తాయి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పెద్దకొడుకు పట్ల మీ ప్రేమాస్పద వైఖరి మారదు. కుటుంబసభ్యుల సౌకర్యం కోసం విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విషయాలలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తారు. వ్యాపారంలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత బాకీలు తీర్చేస్తారు. మొండి బకాయిలు చేతికి అందివస్తాయి. తల్లిదండ్రులకు, పెద్దలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకి చెప్పనిదే ఏ పనీచేయరు. ప్రతి విషయంలోనూ స్వప్రయోజనాలకే ప్రాముఖ్యతనివ్వాలని నిర్ణయించుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. మనోహరమైన మాటల విన్యాసంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబంలోనూ, స్నేహితులతోనూ ఐకమత్యం సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎంత ఆదాయం ఉన్నా కొన్ని సందర్భాలలో ఆర్థికంగా సర్దుబాటు చేసుకోవడానికి ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వపరమైన కాంట్రాక్టులు, లీజులను తక్కువ ధరకే దక్కించుకుంటారు. వ్యాపార విస్తరణ చేయడానికి నూతన భాగస్వాములను కలుపుకుంటారు. నిజంగా ఇబ్బందులలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేస్తారు. ముఖ్యమైన విషయాలలో భాగస్వాములతో లేక కుటుంబసభ్యులతో అభిప్రాయభేదాలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక ఒత్తిడి, శ్రమ కలిగి ఉంటారు. చాలా విషయాలలో ఒంటరిపోరాటం చేయక తప్పదు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదంలోకి లాగే యత్నాలు మీ శత్రువర్గం చేయటం జరుగుతుంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ సైంధవుడిలా అడ్డుపడుతున్న అధికారికి స్థానచలనం కలుగుతుంది. స్థిరంగా మీ కార్యక్రమాలను చేసుకోగలుగుతారు. దూరప్రాంత వ్యాపారాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, లాభాలు పొందుతారు. వైద్యవిద్యను అభ్యసించాలన్న మీ అభిలాష నెరవేరుతుంది. ప్రింటింగ్, ప్రచార సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా లాభిస్తాయి. మీ ప్రయోజనాలను స్థిరంగా కాపాడుకోగలుగుతారు. దురుసుగా మాట్లాడి, చొరవగా చొచ్చుకుపోయే వ్యక్తుల వల్ల మీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన వ్యక్తులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీస వివరణ కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబంలో ఐక్యత మీ ఆనందానికి, పురోభివృద్ధికి కారణం అవుతుంది. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. సంతానం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ధనాన్ని పొదుపు చేయాలని భావిస్తారు. జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరిపేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల లాభపడతారు. విలువైన కాలాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. నిజమైన స్నేహబంధాలను వృద్ధి చేసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు. సమాజంలో ఉపయుక్తమైన వారితో మిత్రత్వం ఏర్పరచుకుంటారు. క్రమశిక్షణాయుతమైన మీ పద్ధతుల వల్ల లాభపడతారు. రాత్రిపూట చేసే దీర్ఘాలోచనలు ఫలిస్తాయి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి వివిధ మార్గాలు అనుసరిస్తారు. రహస్య రాయబారాలు ఫలిస్తాయి. న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా కొందరితో విడిపోయే అవకాశం ఉంది. మీ సన్నిహిత వర్గం దురాశకు పోయి నష్టపోవడం జరుగుతుంది. చాలా విషయాలలో మంచి వ్యక్తిగా, మాట తప్పని వ్యక్తిగా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. వైజ్ఞానిక రంగంలో ఉన్నవారికి, డాక్టర్లకు, లాయర్లకు, బోధనా రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కాలం కలిసివస్తుంది. ప్రభుత్వం నుండి రావలసిన బిల్స్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మానసికమైన ఒత్తిడి ఏర్పడవచ్చు. అసమర్థులకు మీరు అండగా ఉన్నారన్న ఆరోపణలు, అపోహలు రావచ్చు. సన్నిహితులు వారించినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో మీకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికిగాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ గంటలు, గంటలు ఆలోచించే విధానానికి స్వస్తి చెబుతారు. సమస్యలు పొడిగించకుండా వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాలలో లాభపడతారు. ధాన్యం వ్యాపారులకు, తోలు ఉత్పత్తుల వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, జల సంబంధమైన వ్యాపారాలు, ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. గృహం లేక స్థలం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వయం ఆర్థిక పరిపుష్టి సాధిస్తారు. సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలో ప్రతిభని పెంచుకోగలుగుతారు. ఆత్మీయులతో, జీవితభాగస్వామితో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టంలేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసివస్తాయి. ధనాన్ని పొదుపు చేస్తారు. లాభాన్ని పెట్టుబడిగా పెడతారు. వినోదానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారని మీపై ఆరోపణలు వస్తాయి. కొన్ని పుకార్లు తాత్కాలికంగా ఇబ్బంది పెడతాయి. కీలక సమయంలో సహోదరవర్గం సహాయపడతారు. అడుగడుగునా సమస్యలను అధిగమించవలసి వస్తుంది. ఆటంకాలు చాలా వస్తాయి. ఇంటికి అవసరమైన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఏర్పడుతుంది. ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒంటరిగా ప్రతి కార్యక్రమాన్నీ నిర్వహించడం మేలు. ప్రేమవివాహాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. విద్యాపరంగా విశేషించి సాంకేతికవిద్యలో బాగా రాణిస్తారు. పోటీపరీక్షలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. మీ పట్టుదల విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది. పునర్వివాహం చేసుకునే ఉద్దేశం ఉన్నవారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వివాహంకాని వారికి వివాహప్రాప్తి, సంతానంలేని వారికి సంతానప్రాప్తి. మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు, గౌరవప్రదమైన పురస్కారాలు లభిస్తాయి. మీ పిల్లలపై ఇతరులు చూపే మమకారం కృత్రిమంగా తోస్తుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య సయోధ్య కుదర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ఉద్యోగం లభించడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. యోగా, మెడిటేషన్ పట్ల దృష్టి కేంద్రీకరిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. అప్పులు తీరుస్తారు. సాంస్కృతిక, క్రీడారంగాలలో విశేషంగా రాణిస్తారు. రాజకీయ పలుకుబడి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఫైనాన్షియల్ స్కీమ్‌లకు సంబంధించిన విషయాలలో దూరంగా ఉండండి. శాడిస్టు అధికారుల వల్ల కొద్దికాలం ఇబ్బందిపడతారు. ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్స్, బ్యూటీపార్లర్స్, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సంవత్సర ద్వితీయార్ధంలో వృత్తి ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. ఇతర భాషలలో కూడా ప్రావీణ్యత సాధించగలిగితే మరిన్ని మంచి ఫలితాలను అందుకోగలమని భావిస్తారు. కఠినమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారు. కళ్ళు అలసటకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. కార్యాలయంలో సమస్యలు సమసిపోతాయి. చాలా విషయాలలో గతంలో కంటే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. -
వికారినామ సంవత్సర (ధనస్సు రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా సమస్యలు తీరుతాయి. లగ్నంలో శని కేతువుల సంచారం, సప్తమంలో రాహుగ్రహ సంచారం, లగ్న, ద్వితీయాలలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితం స్థిరంగా, ప్రశాంతంగా అభివృద్ధి పథంలో సాగుతుంది. మాట తప్పే మనుషులు, ఉపయోగించుకొని ప్రత్యుపకారం చేయని వాళ్ళు జీవితంలో అధికంగా కష్టం కలిగిస్తారు. అనువంశికంగా సంప్రాప్తించాల్సిన ఆస్తి అనుకున్నంత చేతికి రాదు. ఇతరుల ధనం మీద, స్వజనుల ఆస్తి మీద పెద్దగా ఆశ, ఆసక్తి ఉండదు. స్వార్జితంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. పథకం రచించడంలో, అమలు చేయడంలో మంచి నేర్పరితనం ఉంటుంది. ఎవరైనా తోడు లేకపోతే కార్యక్రమాలు చేయడానికి వెనకాడతారు. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదని భావిస్తారు. సంతాన సంబంధిత విషయంలో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆలోచనలు సంతానం మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయరు. ప్రభుత్వపరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను, లోపాలను అందరికంటే సులువుగా గ్రహిస్తారు. లెక్కలు అన్నీ కాగితం మీద లేకపోయినా అన్నీ గుర్తుంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలలో ఇతరుల మితిమీరిన జోక్యం కాలక్రమేణా ఇబ్బంది కలిగిస్తుంది. జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలలో ప్రావీణ్యత ఉంటుంది. సంపాదన బాగున్నా అందుకు తగిన ఖర్చులు ఉంటాయి. ధనం పొదుపు చేయాలన్న మీ ఆలోచన కొంతవరకు మాత్రమే ఆచరణలో సాధ్యమవుతుంది. అనవసరపు ఖర్చులు చేసే మీ వాళ్ళను అదుపులో పెట్టడంలో మీరు విఫలమవుతారు. ఉద్యోగపరంగా మీరు కోరుకున్న మార్పులు వస్తాయి. మిమ్ములను ఇబ్బంది పెట్టే ఉత్తర్వులు అందుకుంటారు. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు. ఇప్పుడు వారు మీ సహాయం తీసుకోవడమే నామర్దాగా భావిస్తారు. ఎవరి భాగస్వామ్యం లేకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంవత్సర ప్రథమార్ధంలో కొన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. దొంగలు స్నేహితులలోనే ఉన్నారని గ్రహిస్తారు. కుటుంబ పురోగతిపై దృష్టి సారిస్తారు. స్త్రీల సహాయ సహకారాలతో వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను అధిగమించగలుగుతారు. చదువు కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఫలిస్తాయి. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు లాభిస్తాయి. స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. కాంట్రాక్టులు, సబ్–కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు అనుకూలిస్తాయి. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళకు సౌకర్యాలు ఏర్పరుస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో స్థిరాస్తుల వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. విద్య, వైద్య, అలంకార, వినోద సంబంధమైన వృత్తి ఉద్యోగాలవారికి అనుకూల కాలం. బంగారం, వెండి వంటి లోహ వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. అకౌంట్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నిష్కారణమైన వేధింపులు, విమర్శలు కొంతకాలం మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి.ముఖ్యమైన సమయంలో విదేశాలలో ఉండే మీ మిత్రులు ఆదుకుంటారు. కొందరి మధ్య విభేదాలు పరిష్కరించడం వల్ల వాళ్ళు, వాళ్ళు ఏకమై మీకు సమస్యలు, ఆటంకాలు సృష్టిస్తారు. ఉపయుక్తమైన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ యుక్తిగా చేజిక్కించుకుంటారు. చట్టపరమైన సమస్యలు, కోర్టులు, పోలీస్‌స్టేషన్‌లో వివాదాలు మొదలైనవి చికాకు పరుస్తాయి. పదిమందిలో ప్రతిష్ఠ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు స్త్రీల సహాయ సహకారాల వలన ఫలిస్తాయి. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని పక్కనపెట్టి మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తారు. వారికే ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు. ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవారికి లాభాలు తక్కువగా ఉంటాయి. కీళ్ళనొప్పులు, జీర్ణకోశ సంబంధమైన, చర్మసంబంధమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ వల్ల గతంలో పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో మీ మాటలు, నిర్ణయాలు ఇతరులకు నచ్చవు. అయితే మీ నిర్ణయాలే అనుకూల ఫలితాలు రావడానికి కారణం అవుతాయి. మీరు భయపడినట్లుగా సంఘటనలు జరుగవు. కొండల వలె సమస్యలు వచ్చినా మబ్బుల వలె విడిపోతాయి. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శక్తి కొలది దానధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలతో పాటు పితృదేవతల జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. వ్యాపార విషయాలలో మార్పులకు మీరు అంగీకరించని కారణంగా అగ్రిమెంట్స్ వాయిదా పడతాయి. ప్రత్యర్థివర్గంలోని గ్రూపు రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చెప్పుకోదగిన కారణం లేకుండా ముఖ్యమైన వ్యక్తులు దూరం అవుతారు. ఎదుటివారి మనోభావాలను గౌరవించకపోయినా, వారు చెప్పే విషయాలను ఓపిగ్గా వినండి. మీ వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడ్డాయన్న ఆరోపణలు రాకుండా జాగ్రత్త వహించండి. అపోహలతో చేసే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సెక్యూరిటీకి ప్రాధాన్యతనివ్వండి. కొన్ని వ్యాపారాలలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. ఖర్చులు అధికం కావడం వల్ల లాభాలు అంతగా కనబడవు. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని పూర్తిగా వినియోగించుకోలేరు. అందరినీ ధిక్కరించి ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేయగలుగుతారు. మీ మిత్రవర్గానికి శత్రువులైన వారందరికీ మీరు శత్రువుగా ఉండవలసిన అవసరం లేదని గ్రహించండి. చాలా విషయాలలో మీకు కృషి కన్నా అదృష్టం వల్లనే మేలు జరుగుతుంది. పునర్వివాహం కోసం ప్రయత్నాలు చేసుకునేవారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ సంస్థలోని భాగస్వాములు, సహోద్యోగుులు ఓర్వలేని వారు ఉంటారు. ఇది మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. మీకంటే పెద్దస్థాయి కలిగిన వారితో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. మీ స్వయంకృతాపరాధాలే ఇబ్బందికి గురిచేస్తాయి. దురభ్యాసాలకు బానిసలైన సిబ్బంది వల్ల నష్టం కలుగుతుంది. కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మీ స్వప్రయోజనాలు రక్షించుకోవడానికి ఎవరు సహకరించలేని పరిస్థితులలో, విధిలేని పరిస్థితులలో లంచాలు ఇచ్చి కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటారు. వ్యక్తిగత సంభాషణ ద్వారా ప్రత్యర్థుల కార్యక్రమాలు బయటపడతాయి. ఉద్యోగపరంగా దొర్లిన తప్పులకు వెంటనే సంజాయిషీ ఇచ్చి, సమస్య పెద్దది కాకుండా జాగ్రత్త వహిస్తారు. విందు వినోదాలు మీకు లాభించేవి కావని గుర్తించండి. ఇతరుల నుంచి విలువైన వస్తువులను కానుకలుగా స్వీకరించవద్దు. ఆంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారిని రానివ్వకండి. ముఖ్యమైన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు ఎవరూ ఊహించని చోట భద్రపరచండి. మనోధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితాన్నే ఒక మలుపు తిప్పబోతున్న విషయం ఆ క్షణాన మీకు తెలియదు. వృత్తి ఉద్యోగాలపరంగా ఏదో ఒక వర్గానికి కాపు కాయవలసిన పరిస్థితి నుండి తప్పుకుంటారు. సభలు, సమావేశాలు ప్రధాన ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. బహిరంగ సభలలో ప్రసంగించవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వరంగ సంస్థల ద్వారా మేలు పొందుతారు. పైరవీలు చేసి ప్రభుత్వపరమైన ఆర్డర్లు సంపాదిస్తారు. అదృష్టం కలిసివస్తుంది. అధిక శ్రమకు ఓర్చి, వత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యూహ ప్రతివ్యూహాలు నిత్యకృత్యం అవుతాయి. ఊహించని పరిణామాలు ఏర్పడినా ధైర్యంగా ఉంటారు. కష్టపడి సంపాదించుకున్న రాజకీయ పదవులు ఊహించినంతగా ఉపయోగపడవు. మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. అయితే మిత్రుల నుండి వచ్చే చిన్నపాటి సమస్యలు తలనొప్పిగా మారుతాయి. మీ మీద అతిగా ఆధారపడుతున్న సన్నిహితుల పట్ల అసహనం ప్రదర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాల పట్ల జాగ్రత్త వహిస్తారు. బంధువులలో కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నైతిక బాధ్యతలను నెరవేర్చడానికి విశేషంగా కృషి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. ఇతరుల సలహాలను ఎక్కువగా మనస్సుకి తీసుకోరు. అందరి సలహాలు వింటున్నట్లుగా నటిస్తారు. మీకు తోచింది మీరు చేసుకుపోతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి కావలసిన వనరులను సమీకరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఋణాలు కొంతవరకు తీరుస్తారు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మీ అంచనాలు ఫలిస్తాయి. కుటుంబంలో తలపెట్టిన వివాహాది శుభకార్యాలను దిగ్విజయంగా నిర్వహిస్తారు. విద్యాసంబంధమైన విషయాలు, సివిల్ సర్వీస్‌లకు సంబంధించి విషయాలు సానుకూల పడతాయి. జీవితాశయం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తులకు మంచి ధర వస్తుంది. స్థిరాస్థులు వేటినీ అమ్మకూడదని కుటుంబపరంగా నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులు ఈ సంవత్సరం బాగా రాణిస్తారు. మీరు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీపరీక్షలలో చాలా తేలికగా విజయం సాధిస్తారు. పన్నులు వసూలు చేసే అధికారులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లాభం పొందుతారు. సహోదర సహోదరీవర్గంతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. తల్లిదండ్రులపట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి, పరోపకారం చేస్తారు. రాజకీయరంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని ప్రయోజనాలను వదులుకొని మీ పెద్దరికాన్ని, మర్యాదని నిలుపుకుంటారు. జనాకర్షణ పెరుగుుతుంది. మీ సంతానం ప్రతిభ విదేశాలలో రాణిస్తుంది. ప్రభుత్వపరమైన స్కాలర్షిప్పులు లభిస్తాయి. ప్రింటింగ్, అడ్వర్టైజ్మెంట్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. విద్యాసంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. విద్యాసంస్థలు లాభాల బాటలో నడుస్తాయి. అతీంద్రియశక్తుల గురించి, మానవాతీతశక్తుల గురించి మిమ్మల్ని భయపెట్టాలని అనుకునేవారిని దూరంగా ఉంచుతారు. సమష్టిగా నూతన వ్యవహారాలు నిర్వహిస్తారు. నిర్వహించే కార్యక్రమాలపైన స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎవరికి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వాలో చక్కగా నిర్ణయిస్తారు. మిమ్మల్ని వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతాయి. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం, విద్య కోసం చేసే ప్రయత్నాలు రెండవసారి ఫలిస్తాయి. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. నూతన గృహనిర్మాణం, వాహన సౌఖ్యం కలుగుతుంది. ఎన్ని సాధించినా ప్రశాంతత మాత్రం లభించదు. ఉపయోగం కాదు అని మీరు భావించిన కార్యక్రమాలు మీకు ఉపయుక్తంగా మారుతాయి. ఇతరులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ కొంత కాలం మీ దగ్గర భద్రపరచవలసి వస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏకాంత జీవితం గడుపుతున్న వారికి తోడు లభిస్తుంది. అభిప్రాయ భేదాలు పట్టువిడుపు లేని ధోరణి వలన ఆత్మీయులతో విభేదాలు సంభవిస్తాయి. విభేదాలను రూపు మాపుకోవడానికి ఓర్పు వహిస్తారు. కుటుంబంలోని కొన్ని నైతిక బాధ్యతలకు మీ వంతు సహాయం చేస్తారు. సామాజిక సేవాసంస్థలలో ప్రధాన పాత్ర వహిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. చోరభయం పొంచి వుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా సంసార జీవితం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన విషయాలలో ఉపశమనం లభిస్తుంది. వీసా కోసం ప్రయత్నించే వారికి ప్రారంభంలో కొంత గడ్డుకాలాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. దూరప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలలో మీ ప్రతిభ రాణిస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కుల, మత, వర్గ, సామాజిక వివక్ష మీ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తాయి. అనేక సంబంధాలు చూసి చాలాకాలంగా వివాహం కాకుండా ఇబ్బందిపడుతున్న వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. పునర్వివాహం చేసుకునే వారికి ఇది అనుకూల కాలం. మీ సృజనాత్మక చర్యతో చేసే వ్యాపారాలు బాగుంటాయి. బ్యూటీపార్లర్లు, హోటళ్ళు నడిపేవారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం పట్ల మీరు తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. వీలైనంత వరకు వివాదస్పదమైన విషయాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ప్రతిభ కనబరుస్తారు. యాంకరింగ్ రంగంలో రాణిస్తారు. సాంస్కృతిక కళారంగాలలో మంచి ఖ్యాతి లభిస్తుంది. ఆంతరంగిక విషయాలు బయటకు తెలియడం వలన చిక్కుల్లో పడతారు. సహోదర సహోదరీవర్గాన్ని ఆదుకుంటారు. కీళ్ళనొప్పులు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. పొదుపు చేసిన ధనం అక్కరకు వస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి సంభవం. అనేకమందికి సలహాలు ఇచ్చి మేధావిగా, మంచి స్నేహితురాలిగా పేరు తెచ్చుకున్న మీరు సొంత విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి కంగారుపడతారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న సామెత మీ విషయంలో నిజమవుతుంది. మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మీ మీద పెత్తనం చేసే స్త్రీల విషయంలో కాస్త ఆలస్యంగా ప్రతిఘటిస్తారు. సంతానసాఫల్య కేంద్రాలలో మోసపోయే అవకాశం ఉంది. -
వికారినామ సంవత్సర (వృశ్చిక రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శని కేతువుల సంచారం, ద్వితీయ, తృతీయ స్థానాలలో గురు సంచారం, అష్టమంలో రాహు సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విద్య, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాలలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వాహనసౌఖ్యం ఏర్పడుతుంది. గృహనిర్మాణం చేస్తారు. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు. వారిని ఎదుర్కొనవలసి ఉంటుంది. స్త్రీలతో వైరం వద్దు. సాధ్యమైనంతవరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదాస్పదమైన విషయాలన్నీ మధ్యవర్తుల సహాయ సహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నత ఆశయాలను ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చునని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్ధంలో ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి. తెలివితేటలతో వాటిని సరిదిద్దగలుగుతారు. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు కలవరపెడతాయి. మీ కుటుంబసభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని స్వప్రయోజనాలకు వాడుకోవడం జరుగుతుంది. మీ నిజాయతీ, శ్రమ, మంచితనం, వృత్తి పట్ల అంకితభావం నోటి దురుసుతనం వలన మసిబారే అవకాశం ఉంది. మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. బంధువర్గంలో భేదాభిప్రాయం తొలగిపోవటం వలన ముఖ్యమైన బాధ్యతలని తేలిగ్గా నెరవేర్చే వీలు కుదురుతుంది. రాజకీయ లబ్ధి పొందుతారు. వ్యవసాయం, జలసంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. మీకు అండదండలుగా ఉండే అధికారులకు స్థానచలనం కలుగుతుంది. తదుపరి వచ్చే అధికారుల వలన అంతకంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఇప్పటి మీ ఉన్నతస్థితికి కారణం వారసత్వంగా ఆస్తులు, భూములు లభించటమే కారణం అని, ఆస్తి రావలసిన దానికన్నా అధికంగా రావడం వల్లనే బాగుపడ్డారనే వదంతులు వ్యాపిస్తాయి. వృత్తిలో మీకు లభించవలసిన ప్రమోషన్ల కోసం అంతర్గత పోరాటం తప్పనిసరి అవుతుంది. మీకు న్యాయం జరుగుతుంది. ప్రింటింగ్ సమాచార సాధనాల ఖర్చు, స్టేషనరీ ఖర్చులు అధికం అవుతాయి. వ్యాపార విస్తరణలో భార్యవైపు సహాయ సహకారాలు లభిస్తాయి. చాలా విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. కూతురు విషయంలో విశేషమైన అభిమానం, మినహాయింపులు ఉంటాయి. కష్టాలు భయపెడతాయి కానీ పడదోయవు. సహచరవర్గం ఉన్నతస్థానాలలో ఉంటారు. సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకు స్వాతంత్య్రం ఉండదు. మీ ప్రతి విజయానికి మరొకరిని కారణంగా చూపిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సలహాలు చెప్పే మేధావులుగా రాణిస్తారు. ముఖ్యస్థానాలలోని వారికి సర్వస్వం మీరే అవుతారు. నిందలు ప్రచారంలోకి వస్తాయి. సొంత రహస్యాలను సొంత మనుషులు బయట పెట్టనంత వరకు ఇబ్బందులు రావు. విదేశీ వ్యవహారాలు, షేర్ల బిజినెస్‌ల విషయంలో అధిక శ్రమ అవసరం. ఉన్నతాధికారుల వద్ద మంచి అభిప్రాయం, అభిమానం సంపాదించుకుంటారు. మిమ్ములను కూలదోయాలని కుట్రలు పన్నే వర్గం విజయం సాధిస్తారేమోనన్న దిగులు ఉంటుంది. బాల్యమిత్రులు, బంధువర్గంలోని వాళ్ళతో ఏర్పడిన విభేదాలు వృత్తి ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తాయి. స్త్రీ దేవతామూర్తుల ఆరాధన వల్ల విశేషమైన మేలు జరుగుుతుంది. ఆర్థికంగా సంవత్సర ప్రథమార్ధం అంత ప్రోత్సాహకరంగా ఉండదు. విద్యాసంబంధిత విషయాలకు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. విదేశాలకు సంబంధించిన వ్యహారాలు లాభిస్తాయి. పెద్దవాళ్ళతో, సమాజంలో పరపతి కలిగిన వారితో విభేదాలు ఏర్పడతాయి. నిర్మోహమాటమైన మీ మాటలు, చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీడియా వల్ల మానసిక వేదనకు గురి అవుతారు. నైతికధర్మం కలిగి సర్వదా మీ యందు ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులు మీ దృష్టిలో పడతారు. వాళ్ళకి ఇన్నాళ్ళు సహాయపడలేక పోయినందుకు విచారించి తగిన న్యాయం చేస్తారు. ఇందువల్ల మీ వర్గం బలోపేతం అవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన సదస్సులు, విందులు నిర్వహించి మీ కార్యదక్షతను నిరూపించుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది. భాగస్వాములతో వివాదాలు వస్తాయి. భూముల వల్ల అధికలాభం పొందుతారు. ఉద్యోగంలో బదిలీ వేటు ఆఖరి క్షణంలో తప్పుతుంది. బెట్టింగులు, కోడిపందాలు, పేకాటలకు దూరంగా ఉండండి. పదిమందికి బాగోగులు చెప్పే స్థానంలో ఉన్న మీరు మీకంటే చిన్నవాళ్ళతో నీతులు చెప్పించుకోవలసిన పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తపడండి. అమ్మాయి నచ్చితే జాతకం కుదరకపోవడం, జాతకం కుదిరితే అమ్మాయి నచ్చకపోవడం, ఇవన్నీ బాగుంటే అమ్మాయి తరఫువారు సంబంధం వద్దు అనడం, దగ్గరి దాకా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం మానసిక వేదనకు కారణం అవుతాయి. ఎట్టకేలకు ఒకమంచి సంబంధం కుదురుతుంది. విద్యాసంబంధ విషయంలో, పోటీపరీక్షల సంబంధ విషయంలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలు, టీచర్ పరీక్షలు మొదలైన వాటికి ఎంపిక అవుతారు. ఐఏఎస్., ఐపీఎస్, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మకమైన వాటికి ఎంపిక అవుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకోగలుగుతారు. నలుగురికి సహాయపడాలనుకునే మీ మనస్తత్వానికి తగిన విధంగా భగవంతుడు మంచి ఫలితాలను అందిస్తాడు. రాజకీయ వ్యూహాలు లాభిస్తాయి. రాజకీయంగా వచ్చిన నూతన బాధ్యతలను వినూత్నంగా నిర్వహిస్తారు. శత్రువర్గాన్ని లెక్కచేయరు. మోసం చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ప్రజాబలంతో ఎదుర్కొంటారు. అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తారు. ఆరోగ్య సంబంధిత విషయాలలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సహోదర సహోదరీవర్గానికి గోప్యంగా సహాయం చేస్తారు. సన్నిహితులు, మిత్రులు మీ ద్వారా సహాయం పొందుతారు. నూతన వ్యాపారం కలిసిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చివేస్తారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. మీకు రావలసిన ధనం మాత్రం సులభంగా చేతికి అందదు. కుటుంబంలో అశాంతి వాతావరణం లేకుండా మీకు మీరుగా చాలా వరకు సర్దుకుపోతారు. స్త్రీల వల్ల చికాకులు, విభేదాలు సంభవిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు, సేవాసంస్థలకు ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రతి విషయాన్నీ రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకోకపోవడమే మంచి నిర్ణయం అని భావిస్తారు. అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా లేక చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది. అత్యవసరంగా సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తే నిపుణుల సలహాలు తీసుకుని సంతకాలు చేయండి. ప్రేమవివాహాలు కలిసిరావు. పునర్వివాహం కోసం ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాంట్రాక్టులు, సబ్–కాంట్రాక్టులు, లైసెన్స్‌లు, లీజు పొడిగింపు వంటి అంశాలు వివాదస్పదం అవుతాయి. ప్రతి చిన్న విషయానికి పలుకబడి ఉపయోగించవలసి వస్తుంది. రాజకీయ నాయకుల జోక్యం అనివార్యం అవుతుంది. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో సమయోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. మందుల వ్యాపారులకు, వైద్యులకు, లోహపు వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు, చేతివృత్తి పనివారికి, విద్యారంగంలో ఉన్నవారికి, పరిశోధనారంగంలో ఉన్నవారికి, ఆహారధాన్యాల వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వస్త్రవ్యాపారం చేసేవారికి ఫలితాలు మద్యస్థంగా ఉన్నాయి. కళా, సాహిత్య రంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీడియాపరంగా ఖ్యాతి లభిస్తుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. నిర్మాణరంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోళ్ళఫారాలు, పశువుల పెంపకం లాభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరింప చేస్తారు. సిబ్బందికి మీ మనస్తత్వం అర్థంకాక విధిలేని పరిస్థితులలో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటం మేలని గ్రహిస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. అన్యభాషలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. కొత్త బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి రావలసిన బిల్స్, చెక్స్, క్లెయిమ్స్ సరైన సమయంలో రాకపోవడం వల్ల ఋణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైరివర్గం చర్యల వల్ల ఉద్యోగంలో బదిలీ సూచిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఖరీదైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. చోరభయం పొంచి వుంది. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభపడతారు. సంవత్సర ప్రథమార్ధంలో వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థానం లభిస్తుంది. తరతమ భేదం లేకుండా అందరికీ సహాయం చేస్తారు. మీ సన్నిహితవర్గాన్ని బలోపేతం చేసుకుంటారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీ పరీక్షలలో మంచి మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో ఉద్యోగం సాధిస్తారు. సన్నిహిత బంధువుల విమర్శలు బాధించినా పైకి లెక్కచేయనట్లు ఉంటారు. మీ నుండి ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ముఖ్యమైన వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందిపెట్టే వాళ్లను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటారు. చాలా సందర్భాలలో మీకు ఇష్టంలేని విషయంపైనే చర్చించవలసి వస్తుంది. మీరు ఓ ప్రశాంతమైన దారిలో వెళుతుంటే మిమ్మల్ని మరో మార్గంలోకి నడిపించడానికి మీ మిత్రులు ప్రయత్నిస్తారు. మీ మీద ఎటువంటి ప్రలోభాలు పనిచేయవు. జీవితాశయాన్ని సాధిస్తారు. రాజకీయ పదవిప్రాప్తి. మీ మీద ఉన్న బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతారు. కొన్ని పనులు మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. గతంలో లభించిన రాజకీయపదవి వల్ల లాభపడతారు. మీకున్న అవకాశాలను ఉపయోగించుకొని పదిమందికీ ఉపయోగుపడే పనులు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అవివాహితులైన వారికి వివాహకాలం. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. పునర్వివిహా ప్రయత్నాలకు అనుకూలకాలం. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. ఎవరు ఎంతగా భయపెట్టినా జంకకుండా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వెన్నుచూపి పారిపోవటం మీ చరిత్రలో లేదు అని నిరూపిస్తారు. దివారాత్రులు వృత్తి ఉద్యోగాలలో శ్రమించినా గుర్తింపు రాని ఉద్యోగాలను మానేసి మరొక చోట ఉద్యోగం చూసుకుందామని భావిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసి లాభాలు గడిస్తారు. ప్రభుత్వ స్కీములు మీకు ఉపయోగపడతాయి. తనఖా పెట్టిన వస్తువులను విడిపిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాలయాలలో సీటు లభిస్తుంది. కోరుకున్న చదువును అభ్యసించగలుగుతారు. విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కీళ్ళనొప్పులు, చెవి, ముక్కు, గొంతు వంటివి బాధిస్తాయి. కోర్టు వ్యవహారాలలో మీకు న్యాయం జరుగుతుంది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు. దూరప్రాంతంలో ఉన్న ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల పెంపకం విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు. బ్యూటీపార్లర్స్ లాభాల బాటలో నడుస్తాయి. పుట్టింటి యోగక్షేమాలు విచారించడం పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. మీరు ఫోన్లలో, సెల్ఫోన్లలో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని మీ ఇంట్లోవారే పరిశోధిస్తారు. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
వికారినామ సంవత్సర (తులా రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయంలో శని కేతువుల సంచారం, తృతీయ చతుర్థ స్థానాలలో గురుగ్రహ సంచారం, భాగ్యంలో రాహు సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. స్నేహితులను ఆదుకోవడంలో వెనుకా ముందూ ఆలోచించరు. క్రీడలపట్ల ఆసక్తి, సాహస క్రీడలపట్ల మరింత ఆసక్తి ఉంటుంది. భార్యవైపు బంధువులు పెత్తనం చలాయిస్తారు. ఆస్తి కోసం కనిపెట్టుకుని ఉంటారు. చాలా సందర్భాలలో మంచివాళ్ళను చేరదీయలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. జీవితంలో అది వెలితిగా అనిపిస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. లిఖితపూర్వక విషయాలలో ఇతరులకు చెప్పే జాగ్రత్తలు ఏవీ మీ విషయంలో ఆచరణలో పెట్టరు. షేర్స్ బిజినెస్ ప్రమాదకరం, జాగ్రుత్తగా ఉండండి. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. మంచి మిత్రులకు ఇచ్చిన వాగ్దానాలను మరువకండి. ఇతరులు చేసిన మేలు గ్రహిస్తే మరింత మేలు కలుగుతుంది. ఇష్టంలేని వ్యక్తులతో సహజీవనం చేస్తారు. రాజీలేని మీ భావాలకు, పనితనానికి కఠినమైన సవాళ్ళు ఎదురవుతాయి. విలువైన భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయోజనాలు, కీర్తి పరిత్యాగం చేస్తారు. ఎదుటివాళ్ళ వ్యూహం గ్రహించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. ప్రతిష్ఠ కాపాడుకుంటారు. రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు అనవసరమైన సమస్యలు సృష్టిస్తారు. మీ వల్ల లాభం పొందిన వాళ్ళు అండగా నిలబడతారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా వుంటాయి. భాగస్వాముల అసమర్థత వల్ల ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి సమస్యలు పరిష్కరిస్తారు. శుభకార్యాలు చేస్తారు. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు. పాదాలు, మోకాళ్ళనొప్పులు, వెన్నునొప్పి మొదలైన కీళ్ళ రోగాలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలం అవుతాయి. కీలక సమయంలో బంధువర్గం సహాయ సహకారాలు నామమాత్రంగా లభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చుని అదుపులో పెట్టడంలో విజయం సాధిస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి, వివాహం కానివారికి వివాహప్రాప్తి కలుగుుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలు. మీ వృత్తికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచని పక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది. రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. మీకు మేలు జరిగే పత్రాలు, డాక్యుమెంట్స్ మొదలైనవి ఆలస్యంగా అధికారుల పరిశీలనకు వస్తాయి. దూర ప్రయాణాలు, దూరప్రాంత విద్యాసంబంధమైన విషయాలు కష్టంమీద ఫలిస్తాయి. పోటీపరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరును, మీ సంస్థ పేరును ఉపయోగించుకొని లాభపడే అవకాశవాదుల నిజస్వరూపం తెలుస్తుంది. ముఖ్యమైన విషయాలలో జీవితభాగస్వామితో విభేదాలు రావచ్చు. సంతానాన్ని గారాబం చేయడం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు మింగుడుపడవు. బంధువులలో అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చోరభయం పొంచివుంది. కొంతమందితో సిద్ధాంతపరమైన విభేదాలు వస్తాయి. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న మీ వాళ్ళను రక్షించవలసిన పరిస్థితి వలన సంవత్సరాంతంలో మీ పరపతి దుర్వినియోగం అవుతుంది. గతంలో మీకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వులు ఈసారి అమలులోకి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. విద్యాసంబంధంగా నూతన కోర్సులను అభ్యసిస్తారు. సంవత్సర మధ్యంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి, పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధవహించవలసి ఉంటుంది. శత్రువర్గం బలపడి ఉండటం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. బినామీ పేర్లతో చేసే వ్యాపారాలలో లాభపడతారు. టీవీ, సినీరంగంలోని వారికి, యాంకర్లకు, కళాకారులకు నూతన అవకాశాలు కలిసివస్తాయి. ఊహించని ఒక నూతన బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తారు. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది. మీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు, సేవాసంస్థలకు, సాంస్కృతిక సంస్థలకు పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. కష్టపడటంలోని ఆనందాన్ని గుర్తిస్తారు. మీరు చెప్పే మంచి మాటలు, బోధనలను అందరూ ఆచరిస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మీ మాటలు రుచించవు. పూర్వీకులు వ్రాసిన డాక్యుమెంట్లు, వీలునామాల్లోని లోపాలు కీలక సమయంలో ఇబ్బంది పెడతాయి. ఫ్యాన్సీ షాపులవారికి, ఎలక్టాన్రిక్ వస్తువుల విక్రేతలకు, స్టేషనరీ వ్యాపారస్థులకు, బ్యూటీపార్లర్స్ వారికి, చేతివృత్తుల పనివారికి, సుగుంధద్రవ్య వ్యాపారులకు, ఎగ్జిబిషన్ కౌంటర్స్వారికి, హోల్‌సేల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. చెప్పుడు మాటలు విని అయినవాళ్ళని దూరం చేసుకొని నష్టపోతారు. తనఖాలు, మొండిబాకీలు వంటి ఆర్థికఅంశాలపై దృష్టి సారిస్తారు. కొంత పురోభివృద్ధి ఉంటుంది. ప్రజాజీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. వివాదాస్పద అంశాలలో మధ్యవర్తి పరిష్కారాల వల్ల బయటపడతారు. ఒకచోట నష్టపోయినా మరోచోట లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానాన్ని చదువు కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరు చాలా మందికి నచ్చదు. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణం అవుతుంది. ప్రత్యర్థులలో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది. రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వారిపట్ల మీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. నిష్కారణమైన తగాదాలు, స్పర్థలు చోటుచేసుకోవడం ప్రారంభమవుతుంది. విదేశాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో సంపాదించిన ధనంతో విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట విని బాగుపడటం మీ బంధువులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. స్విమ్మింగ్, పిక్నిక్లు, బైక్రైడింగ్లకు దూరంగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి దొర్లిన పొరపాటును రహస్యంగా చక్కబెడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల విమర్శలు ఎదుర్కొంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో భాగస్వామ్య వ్యాపారాలలో జరుగుతున్న మోసాలను గ్రహించి నమ్మకద్రోహులను సాగనంపుతారు. విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలు చట్టపరంగా విడిపోవడం జరుగుతుంది. స్త్రీలతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. సమాజంలో ఉన్నత స్థాయి కలిగి, మహోన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులతో కొంతకాలం పనిచేస్తారు. వాళ్ళకు మీరు సన్నిహితులు అవుతారు. మీకు మేలు జరిగే పత్రాలు అధికారుల సుముఖానికి ఆలస్యంగా చేరుతాయి. మీ రహస్య సమాచారం ఇతరులకు చేరుతుంది. ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటు అయి అవసరాలు గడుస్తాయి. ముఖ్యమైన సభలకు ఆహ్వానాలు అందుతాయి. మీ ఉపన్యాసాలు, అనుభవం అందరితో శ్లాఘించబడతాయి. సంవత్సర ద్వితీయార్ధంలో ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి. వాహనాన్ని మారుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగుున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యాసంబంధమైన విషయాలలో తిరుగులేని ఫలితాలను సాధిస్తారు. పోటీపరీక్షలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది. అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. వైద్యవిద్యకు సంబంధించిన కృషి ఫలిస్తుంది. ఎంతో కష్టతరమైన కార్యక్రమాలను ఒంటరిగా పోరాడి సాధిస్తారు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మొండిగా ఉన్న సంతానాన్ని మెల్లగా మంచి మాటలతో దారిలో పెట్టగలుగుతారు. జీవితభాగస్వామితో విభేదాలు వస్తాయి. కొందరి విషయంలో జీవితభాగస్వామితో విసిగిపోయి విడిపోవడం సంభవిస్తుంది. మీ నిజాయితీ వెలుగు చూస్తుంది. గోరంతలు కొండంతలుగా చేసి మీమీద అపవాదులు ప్రచారం చేసిన వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. బ్యూటీపార్లర్లు, అలంకార సంబంధమైన వ్యాపారాలు, పరిశోధనలు లాభిస్తాయి. వ్యాపార విషయాలలో రొటేషన్ బాగుంటుంది. లాభాలు బాగుంటాయి. స్వల్పంగా వ్యాపార విస్తరణ చేస్తారు. ఉన్నతాధికారుల, రాజకీయనాయకుల అండదండలు లభిస్తాయి. మీ పేరుమీద ఉన్న ఓ స్థిరాస్తి విలువ పెరుగుుతుంది. అనవసరమైన ఆలోచనలతో, అపోహలతో మోసగాళ్ళకు జీవితంలో తావు ఇవ్వకండి. పెద్దల నిర్ణయమే మీకు మేలు చేస్తుంది. ఇతరులకు డబ్బు ఇవ్వవలసి వస్తే అప్పుగా ఇవ్వొద్దు, దానంగా ఇవ్వండి. రాజకీయ వాతావరణంలో ప్రవేశించవలసి వస్తుంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృద్ధులపట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. డాక్టర్లకు, చార్టర్డ్ అకౌంటెంట్లకు, ఇంజనీర్లకు, విద్యాసంస్థలు నడిపేవారికి, హోటల్ వ్యాపారం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. గతంలో దొర్లిన పొరపాట్లు మరల జరగకుండా జాగ్రత్త వహించండి. విద్యార్థినీవిద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. సంగీత సాహిత్య రంగాలలో అవార్డులు, కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. యోగా, మెడిటేషన్ వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దికాలం గైనిక్ సమస్యలతో బాధపడతారు. అవివాహితుౖలకు వివాహకాలం. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. సహోదర సహోదరీ వర్గాన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. తోటివాళ్ళ ముందు ప్రతిష్ఠను నిలబెట్టుకోవడానికి నిద్రాహారాలను లెక్క చేయకుండా శ్రమించి ఫలితాలను సాధిస్తారు. -
వికారినామ సంవత్సర (కన్యా రాశి) రాశిఫలాలు
కన్యారాశివారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంది. చతుర్థంలో శని కేతువుల సంచారం, చతుర్థ పంచమంలో గురుగ్రహ సంచారం, దశమంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవిత ప్రారంభంలో ఎదురైన ఘట్టాలకు కృంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. ఇతరుల కుయుక్తులు వీరిపై ప్రభావం చూపవు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీలేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన సంబంధమైన వ్యాపారాలలో రాణిస్తారు. జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధకలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను ప్రక్కనపెట్టి మీ విషయం వచ్చేటప్పటికి అందరూ ఏకం అవుతారు. స్వంతవర్గం బెదిరిపోకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయరు. అత్యున్నతస్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాలలో తప్పకపోవచ్చు. మేధస్సు, స్వీయవిద్య, సాంకేతికపరిజ్ఞానం అక్కరకు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. స్థిరాస్తులు సంపాదించుకుంటారు. ప్రజాసంబంధమైన విషయాలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సంతాన పురోగతి ఆశించినంత సంతృప్తి కలిగించదు. అనేక రకాల ఆలోచనలను, మీ అంతర్గత భావాలను, కోపాన్ని అదుపు చేసుకుని మనసులో ఒకవిధంగా, పైకి ఒకవిధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో మీకు అనుభవం అవుతుంది. ఐకమత్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఇందుకుగాను మీరు చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది. మీ ఎదుగుదలను మీ ఆత్మీయవర్గం కూడా సహించలేరు. మీరు దూరంగా ఉండాలనుకున్న వ్యక్తులతో, మీ కుటుంబ సభ్యులు సన్నిహితంగా మెలగడం మీ మనోవేదనకు కారణం అవుతుంది. దీర్ఘకాలిక కాంట్రాక్టుల పట్ల విముఖత ఏర్పడుతుంది. వివాదస్పద వ్యవహారాలు విసుగు పుట్టిస్తాయి. రాజకీయపరమైన అవకాశాల కోసం వ్యూహం సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్ళతో అభిప్రాయ భేదాలు వచ్చి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తిచేయలేరు. చాలా సందర్భాలలో ఆంతరంగికమైన భేదాభిప్రాయాలు వస్తాయి. కీళ్ళు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు సంభవం. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోని వారికి సాధారణ ఫలితాలు వస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇష్టం లేకపోయినా కొందరు భాగస్వాములతో కలసి వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఒత్తిడుల నుండి బయటపడతారు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. మీ సహాయ సహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మెడిసిన్ సీటు వస్తుంది. సంవత్సరం ప్రథమార్ధంలో ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్నవారు సహాయం చేస్తారు. ఇంకొకరికి సహాయం చేసే విధంగా మీ స్థాయి పెరుగుుతుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యావంతులు, మేధావులు అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారు కాకతాళీయంగా మీకు సన్నిహితులవుతారు. జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూస్తారు. జనులను ఒప్పించి, మెప్పించి మీరు అనుకున్న స్కీములలో చేర్చగలుగుతారు. లైసెన్సులు, లీజులు పునరుద్ధిరింపబడతాయి. మీ శ్రేయస్సు కోరేవారు ఎందరో ఉన్నారని గ్రహించి సంతృప్తి చెందుతారు. రాజకీయ పదవి లభిస్తుంది. చాలా విషయాలలో మీ అనుమానాలు కేవలం అనుమానాలు మాత్రమే వాస్తవంలో మీకు జరిగే కీడు ఏమీ ఉండదు. విదేశాలలో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సీడీలు, అధికార ధ్రువీకరణ పత్రాలు, ఋణాలు మీకు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానం లేనివారికి సంతానప్రాప్తి, వివాహం కాని వారికి వివాహప్రాప్తి, పునర్వివాహా ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన కాలం. నూనె, లోహ వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తి అని ముద్రవేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు అందరి మనిషిలా ఆమోదింపబడతారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టుతీర్పులు మీకు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల బాధ్యతలు మీ సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణా లోపం ఉండదు. ఆస్తి వ్యవహారాలపై మీకు తెలియకుండా రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మకద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తనఖాలో ఉంచిన డాక్యుమెంట్స్‌ను, విలువైన వస్తువులను విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి వైద్యుల సలహాను అమలుపరచడం మంచిది. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా మీకు రావలసిన బిల్స్, జీతాలు, ఏరియర్స్ సమయానికి చేతికి అందుతాయి. మీరు చేస్తున్న వ్యక్తిగత కార్యక్రమాలకు ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి.క్రీడారంగంలోని వారికి ప్రఖ్యాతి లభిస్తుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను బయటకి వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్త వహించండి. ఋణాలు ఇవ్వడం, తీసుకోవడం తగ్గించండి. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. రెండువర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు మీకు లాభిస్తాయి. మీకు సంబంధంలేని విషయాలలో ఇతరులకు సహాయం చేయడం కోసం కోర్టులను, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించవలసి వస్తుంది. ఇరుగు పొరుగులతో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వచ్చిన కొత్త అవకాశాన్ని ఉపయోగించుకోవాలా లేదా అన్న సందేహంలో పడతారు. జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. శక్తిసామర్థ్యాలు ఉన్నా సరైన గుర్తింపు రాలేదన్న భావన మనోవేదనకి గురిచేస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు ఉపయోగపడతాయి. విశ్రాంతిని, సౌకర్యాలను పక్కనపెట్టి విశేషంగా కృషి చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక స్థావరాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ముద్రణ, ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి. విడిపోయిన రెండు కుటుంబాలను కలుపుతారు. బంధువులతో, దాయాదులతో వివాదాలు సంభవిస్తాయి. మీరు చెప్పిన వాస్తవాలను ఎవరూ నమ్మరు. ఇతరులు మీపై మోపిన ఆరోపణలు, నిందలు బహుళ ప్రచారంలో ఉంటాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టి సారించి లాభాలు గడిస్తారు. మొండి బాకీలు రాబట్టుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. భూమి కొనుగోలు, అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు. ఆదాయపన్నుల అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వైద్య, న్యాయవాద వృత్తులలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. నిర్మాణ సంబంధమైన పనులలో లోపాలు ఏర్పడతాయి. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. విదేశాలలో ఉన్నవారు గృహాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాలలో చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీ బంధువర్గంలోని ఒకరితో బంధుత్వం కలుపుకోవడానికి మీరుచేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఓర్పు, సహనం లేని వ్యక్తుల వల్ల, దురుసుగా ప్రవర్తించే మీ అంతరంగిక వర్గం వల్ల చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించరు. గతంలో వలె మెతకవైఖరి అవలంబించరు. విభేదాలను మనసులో దాచుకుని మీ ఇబ్బందులకు కారణమైన వ్యక్తులకు సరైన గుణపాఠం నేర్పుతారు. చట్టబద్ధంగా అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందుతారు. స్త్రీల సహాయ సహకారాలు లాభిస్తాయి. ఉద్యోగం కోసం రాసే పరీక్షలలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సాఫ్ట్వేర్ రంగుంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. కార్యాలయంలో మీపై నిష్కారణంగా దుష్ప్రచారం చేసేవారికి బదిలీ ఏర్పడుతుంది. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరాధారమైన మాటలు విని వాటి ఆధారంగా మిమ్మల్ని అభిమానించే సన్నిహితులను ఎట్టి పరిస్థితులలోనూ దూరం చేసుకోకండి. విద్య, సాంస్కృతిక విషయాలు బాగుంటాయి. కళారంగంలో గుర్తింపు లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తిని కొన్ని కారణాల వల్ల ఆహ్వానించ లేరు. ప్రేమవివాహాలు విఫలం అవుతాయి. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులకు వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లమ్స్‌ను అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం ఆందోళనకు కారణం అవుతుంది. మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు అధికం అవుతారు. కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. సహోదర సహోదరీ వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలు ప్రారంభంలో విసుగు కలిగించినా మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయం అవుతాయి. వివాహ సంబంధమైన విషయాలలో సర్దుకుపోయే ధోరణి అవలంబిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి, సాహిత్య, కళా రంగాలలో, విద్యారంగంలో ప్రఖ్యాతి సంభవం. బ్యూటీపార్లర్స్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది. చీటీల వల్ల, ఫైనాన్స్ బిజినెస్ వల్ల నష్టపోతారు. మీకు ఇబ్బంది కలిగించేవారి కార్యకలాపాలు ఎక్కువ కాలం కొనసాగవు. చాలా విషయాలలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. మీరు నమ్మిన వాళ్ళు మీ మాట వినరు. మీ పట్టుదల వల్ల అయినవాళ్ళతో బంధుత్వం ఏర్పడుతుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు అధికం కావడం చికాకు తెప్పిస్తుంది. బంధువులలో డాంబికంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మీ అంతరంగిక విషయాలను బంధువులతో పంచుకోరు. చిన్నదానికీ, పెద్దదానికీ అబద్ధాలు చెప్పడం అనివార్యం అవుతుంది. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీకు మాత్రం లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. రాజకీయంలో తలదూర్చవలసిన పరిస్థితులు వస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఋణ బాధల నుండి విముక్తి పొందుతారు. ఎంత చెప్పినా మారని వ్యక్తులను మార్చడానికి పట్టువీడని విక్రమార్కుడిలా శ్రమిస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు, చేతివృత్తి పనులు లాభిస్తాయి. ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది. -
వికారినామ సంవత్సర (సింహ రాశి) రాశిఫలాలు
సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంచమంలో శని కేతువుల సంచారం, పంచమ, షష్ఠమంలో గురుగ్రహ సంచారం, ఏకాదశంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్నవారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. మీ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నాలు జరిగినా అవి తాత్కాలికమే. మళ్ళీ అనుకున్న స్థానంలోకి రాగలుగుతారు. స్త్రీలతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మంచితనాన్ని అసమర్థతగా భావించిన వాళ్ళు కీలక సమయంలో మీ చేతిలో భంగపడతారు. ప్రభుత్వపరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. కొన్ని ప్రతిష్ఠాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థిక పరిస్థితి దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలు పొందగలుగుతారు. ఎంత సంపాదించినా చేతిలో ధనం మిగులదు. సహోదర సహోదరీవర్గంలోని వారికి మీ పరపతి ఉపయోగించి ఉద్యోగం ఇప్పించగలుగుతారు. మీ కుటుంబ బాధ్యతలను విస్మరించరు. అదే మీకు శ్రీరామరక్ష. మీ బంధువర్గంలో పదేపదే మీ నుండి ఆర్థికసాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగించడం మొదలుపెడతారు. ఆధ్యాత్మికవేత్తలతో, సాహితీవేత్తలతో, కళారంగాలతో సాన్నిహిత్యం పెరుగుుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో మానసిక ఆనందం పొందగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు చేపట్టి పలువురి ప్రశంసలు అందుకుంటారు. ఒక గౌరవనీయమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. పరిశోధన రంగుంలోని వారికి అనుకూలంగా ఉంది. మేధావులతో, సామర్థ్యం కలిగిన వారితో విభేదాలు ఏర్పరచుకోకండి. పలుకుబడి కలిగిన కీలకమైన వ్యక్తులను మీవైపు మలచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ కీర్తిప్రతిష్ఠలకు మచ్చ రాకుండా జాగ్రత్త వహించండి. వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. మీ వైరివర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది. శుభకార్యాల విషయమై కార్యానుకూలత కోసం గట్టిగా ప్రయత్నిస్తారు, మంచి ఫలితాలు వస్తాయి. వృద్ధులైన తల్లిదండ్రులను ప్రేమగా చూడడం ధర్మమే అవుతుంది. కానీ మీ విషయంలో ఇది పెద్ద అపరాధంలా పరిగణింపబడుతుంది. కుటుంబ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతాన పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళలో క్రమశిక్షణ లోపిస్తుంది. అతి గారాబం చెడు తెచ్చిందని భావిస్తారు. ఈ విషయంలో జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు ఏర్పడతాయి. నూతన భాగస్వాములతో నూతన వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు. ఫైనాన్స్ స్కీములు, లక్కీ డ్రాలు, షేర్లు, కోడిపందాలు, గుర్రపుపందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్స్, రాజకీయ ఫలితాల బెట్టింగుులకు దూరంగా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. ఋణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం. పెద్దమొత్త్తంలో ఋణాలు తీసుకుంటారు, తీరుస్తారు. కానీ మీకు రావలసిన ధనం మాత్రం నిలిచిపోతుంది. వెన్నుపోటుదారులు స్నేహితులలోనే ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంటారు. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. కుటుంబంలోనివారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. సిగరెట్స్ కాల్చడం, కాఫీలు, టీలు ఎక్కువసార్లు త్రాగడం, క్రమశిక్షణలేని భోజన సంభవం. దురాలవాట్లకు దూరంగా ఉండండి, మేలు జరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు దక్కుతాయి. ఏమాత్రం శ్రమించని సోమరిపోతులకు కూడా మీతో సరిసమానమైన ప్రతిఫలాలు లభిస్తాయి. ఇది మీకు నిరాశ కలిగించే అంశం. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సంవత్సర ప్రథమార్ధంలో కొన్ని సాంకేతిక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసినవారి నిజస్వరూపం బయటపడుతుంది. మీరు చాలామందికి అర్థంకాని మనిషి అవుతారు. అబద్ధాలు, నమ్మకద్రోహం విసుగు కలిగిస్తాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోతారు. ఎన్నో బాధలను అంతరంగంలో దాచుకుని పైకి నిండుగా నిదానంగా కనిపిస్తారు. విడాకులు, భార్యాభర్తలు విడిపోవటం వంటి సమస్యలు మనోవేదనకు కారణం అవుతాయి. అంతరంగిక చర్చలు, రహస్య విషయాలు బయటకి పొక్కడం వల్ల ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సహచరవర్గం వల్ల, ముఖ్యమైన అధికారుల వల్ల ఈ రకమైన ఇబ్బందులను అధిగమించగలుగుతారు. పోలీసు కేసులు, చిల్లర అభియోగాలతో చట్టపరమైన సమస్యలలో చిక్కుకున్న మీ వారిని రక్షించవలసిన బాధ్యత మీపైన పడుతుంది. మీ పరపతి దుర్వినియోగం అవుతుంది. వేళకు తిండి, నిద్ర కరువవుతాయి. ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. ఫాస్ట్ఫుడ్స్, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ళ నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్‌సేల్ వ్యాపారాలు, సుగంధద్రవ్య వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగపరంగా సంస్థ నుండి ఒకరిని తొలగించవలసిన పరిస్థితి వస్తుంది. దానికి మీరే బాధ్యులని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనవసరమైన బాధ్యతలు నెత్తినపడతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగున్నా భాగస్వాముల ప్రవర్తన వల్ల సంస్థకు ఆశించిన లాభాలు రావు. ప్రభుత్వ అధికారులు మీ వైరివర్గం చేతిలో కీలుబొమ్మలుగా మారి మీకు ఇబ్బందులు సృష్టిస్తారు. సహోదర సహోదరీవర్గానికి చెందిన బాధ్యతలు మీ నెత్తినపడతాయి. విద్యార్థినీ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ విజయాన్ని, మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలలో ఉన్న మిత్రులకు, రక్తసంబంధీకులకు మేలు చేస్తారు. వారి డబ్బులతో వారి పేరుమీద ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీపరీక్షలలో విజయం సాధించి, మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూపు సర్వీసులకు ఎంపిక అవుతారు. రాజకీయరంగంలో ఉన్నవారికి రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. కొంతమంది ముఖ్యమైన రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా మీదే పైచేయి అవుతుంది. మీరు సంపాదించిన ఒక పెద్దమొత్తాన్ని అంతరంగిక మిత్రుల వద్ద దాచిపెడతారు. కొంతమందితో తిరగవద్దని కుటుంబసభ్యుల నుండి ఒత్తిడి వచ్చినా స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు. రాత్రిపూట చేసే దీర్ఘాలోచనలు కలిసివస్తాయి. సహోదర సహోదరీవర్గానికి సహాయ సహకారాలు అందిస్తారు, అండగా నిలుస్తారు. స్త్రీలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో గౌరవస్థానాలలో ఉన్నవారికి మీ గురించి చెడుగా చెప్పటం జరుగుతుంది. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. మొండిధైర్యంతో సమస్యలను దాటుకొని అనుకూల ఫలితాలను సాధిస్తారు. సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను ఇంట్లో ఉంచే సంప్రదాయానికి స్వస్తి చెప్పండి. వైరివర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు. తుదికంటా పోరాటంలో మీ శక్తియుక్తుల వల్ల మీరు బలపరిచిన వర్గం విజయం సాధిస్తుంది. మీ వల్ల ఉపయోగం పొందిన వారికంటే నష్టపోయిన వారే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్నచిన్న అరోగ్యు సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని అవమానాలు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వాస్తవాలకు అతీతంగా, ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్రమమైన ఫలితాలను ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసిరావు. ఉత్సాహంగా కొన్ని సామాజిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు లేక వాటి బాధ్యత తీసుకుంటారు. మీరు అభిమానించే వ్యక్తులు అభివృద్ధి చెందుతారు. కొంతకాలం వారు మీకు దూరంగా ఉంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాçసంస్థలు ప్రఖ్యాతి వహిస్తాయి. సాంస్కృతిక, క్రీడారంగాలలో ప్రతిభాపాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వయంకృషితో మంచి విజయాలను నమోదు చేసుకుంటారు. ఇతరుల మీద ఆధారపడి జీవించకుండా స్వతంత్రంగా ఉండాలని మీ భావన. ఇందుకు సంబంధించి మీరు చేసే కృషి ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో గట్టి పోటీ ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. లాభాలు, ప్రయోజనాలు సాధారణంగా ఉంటాయి. సహోదర సహోదరీవర్గానికి ఆర్థికంగా సహాయపడతారు. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉంటాయి. ఋణాలు చేయడం, తీర్చడం వంటివి జరుగుతూ ఉంటాయి. కార్యాలయంలో చిల్లర మల్లర రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. ఎంతకష్టపడ్డా గుర్తింపు లభించదు. విలువైన వస్తువుల భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. చాలామందికి మీరు సంపాదిస్తున్న సంపాదన మీద చూపు తప్ప మీ మీద కాదని గ్రహించండి. కళా, సాంస్కృతిక రంగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అలంకార సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుుంటాయి.విద్యాసంబంధమైన విషయాలలో గట్టి పట్టుదలతో శ్రమించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. మీ వంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వహిస్తారు. ఉద్యోగం సాధించాలన్న పట్టుదల సఫలం అవుతుంది. అయితే కాలేజీలో మీరు అనుకున్న మార్కుల కన్నా తక్కువ వస్తాయి. స్నేహితులలోనూ, బంధువులలోనూ మీ స్థాయిని నిలబెట్టుకుంటారు. మీ చెడు కోరుకునే వారు ఎవరో మీకు బాగా తెలుసు. వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెబుతారు. విద్యార్థినులకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కలిసి వస్తుంది. వృద్ధులు, పెద్దలు, తల్లిదండ్రులను గౌరవిస్తారు. వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పరుస్తారు. కొన్ని విషయాలలో అలుపెరగని ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా కృషిలో మాత్రం లోపం ఉండకూడదని నిర్ణయించుకుంటారు. నామినేటేడ్ పదవి లేదా రాజకీయ పదవి లభిస్తుంది. అన్య భాషలు నేర్చుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. మార్షల్ ఆర్ట్స్, డ్రైవింగ్ నేర్చుకుంటారు. సంతాన పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. సంతానానికి మీరు చేసే హితబోధలకు విరుద్ధంగా ఇతరులు సంతానానికి లేనిపోనివి నూరిపోయటం మీ ఆవేదనకు కారణం అవుతుంది. ముఖ్యమైన విషయాలలో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. ప్రేమ వివాహల పట్ల మీకున్న భ్రాంతి తొలగిపోతుంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు లాభిస్తాయి. డాక్టర్లకు, చార్టర్డ్ అకౌంటెంట్లు, మ్యారేజ్ బ్యూరోలు నడిపేవారికి అనుకూల కాలం. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల కాలం. గైనిక్ సమస్యలు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. చీటీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారం వల్ల నష్టపోతారు. స్వగృహం అనే కల నెరవేరుతుంది. వాహన సౌఖ్య ఏర్పడుతుంది. బ్యూటీపార్లర్లు నడిపేవారికి, వస్త్రవ్యాపారులకు, ప్రభుత్వ సహకారంతో చిన్నచిన్న చేతివృత్తులు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. -
వికారినామ సంవత్సర (కర్కాటక రాశి ) రాశిఫలాలు
కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆరింట శని కేతువుల సంచారం, షష్ఠమ, సప్తమ స్థానాలలో గురుగ్రహ సంచారం, వ్యయంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. క్రమశిక్షణ, విద్యారంగం పట్ల ఆసక్తి, ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ, రాణింపు ఉంటాయి. సంఘంలో మంచి పేరుప్రతిష్ఠలు కలిగి ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. అంతరాత్మసాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయలేరు. అవకాశం ఉండి కూడా సొంత వాళ్ళకు సహాయం చేయలేదనే నిందలు మోయాల్సి వస్తుంది. ఆత్మీయులు ప్రతిభాపాటవాలు సాధించాలని కోరుకుంటారు. ఉన్నతస్థానంలో ఉండి కూడా అయినవాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుుతుంది. సమాజానికి, ధర్మానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. సొంత వర్గానికి చెందిన వ్యక్తులతోనే బద్ధవైరం ఏర్పడుతుంది. మీతో మంచిగా ఉండి కావాల్సినవి సాధించుకున్నవారు మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. దిక్కుమాలిన స్నేహాలు కొంపదీస్తాయి. దానధర్మాలు అధికంగా చేస్తారు. మీకు అందే సహాయ సహకారాలు కూడా గొప్పగానే ఉంటాయి. పేరుప్రతిష్ఠలకు వృత్తిలో ప్రాధాన్యం ఇస్తారు. డబ్బుకోసం తాపత్రయపడరు. ధనమే మీ చుట్టూ తిరగాలని కోరుకుంటారు. స్త్రీ, పురుష విచక్షణ లేకుండా సంతానం ఆనందించేలా చూస్తారు. ఉద్యోగంలో బదిలీ మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరుగదు. ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రత్యామ్నాయం లేదు కనుక మీరే‡ దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం నేర్పరితనం మిమ్ములను నిలబెడతాయి. మీ ప్రతిభ విదేశాలలో రాణిస్తుంది. మీ వాళ్ళకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్స్, ప్రభుత్వపరమైన స్కీమ్స్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుల మత వర్గ వివక్ష లేకుండా పని చేసుకుపోయే మీమీద ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రపడుతుంది. అనుకున్న కార్యక్రమాలు సంతృప్తికరంగానే ఉంటాయి. కొనుగోలు చేసిన ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జరుగుతాయి. స్థిరంగా ఉండండి, నష్టపోకుండా లాభాలతో బయటపడతారు. చిన్నచిన్న విషయాలకు కలహాలు పెట్టుకొని సమాజంలో పరువు పోగొట్టుకునే మీ వర్గం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తివ్యాపారాలలో, ఉద్యోగంలో మీ ప్రత్యేకశైలి నిలబెట్టుకుంటారు. కొన్ని విషయాలలో పట్టుదలగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ సంబంధమైన, ప్రైవేట్ సంబంధమైన కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు, రెన్యువల్స్ అనుకూలిస్తాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు, విజయం సాధిస్తారు. ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది. మీ వృత్తిలో ఒడిదుడుకులు ఏర్పడినా మీ స్థానం పదిలంగానే ఉంటుంది. సహోదర సహోదరీవర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశం, ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంబంధమైన విషయాలలో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చేతివృత్తి పనులవారికి మంచి ఫలితాలు ఉంటాయి. భూముల కొనుగోలు, అమ్మకాల విషయాలలో మాట చాతుర్యం వల్ల లాభపడతారు. రాజకీయంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు, అభిమానిస్తారు. స్థానికనాయకులతో మాత్రం విభేదాలు పరాకాష్టకు చేరుతాయి. జీవితంలో అశాంతి సృష్టిస్తున్న ఓ స్త్రీని వదిలించుకోవడానికి న్యాయపోరాటం చేసి విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయపదవి ప్రాప్తి. ఉద్యోగానికి సరైన కారణం లేకుండా సెలవుపెడతారు. స్త్రీ, పురుషుల అనుబంధానికి, స్నేహానికి ఎవరైతే వక్రభాష్యాలు చెబుతున్నారో వారు మీ వల్ల ఇబ్బందులు పడతారు. ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెబుతారు. ఆ సలహాలు పాటించమని ఒత్తిడి చేయరు. వాళ్ళ విచక్షణకే వదిలేస్తారు. మీ మాటను ధిక్కరించిన వారిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు. మీరు అభిమానించిన స్త్రీ కనుమరుగు అవుతుంది (కొద్దిమంది విషయంలో). కొంతమంది విషయంలో వన్‌సైడ్ లవ్ ఫలించదు. ఇతరుల విధానాలకు మీరు అతిగా ప్రభావితులు అవుతారు. వాస్తవాలను స్పష్టంగా గ్రుహిస్తారు. ఊహాలోకాలలో విహరించే పరిస్థితికి స్వస్తి చెబుతారు. దొంగస్వామీజీల వల్ల నష్టపోతారు. మంచీచెడూ మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినప్పటికీ మీ వైరివర్గంవారు మీ శ్రమని గుర్తించక విమర్శిస్తారు. మీరు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడడం వలన వైరివర్గం దానిని మీ అహంభావంగా భావించి, మీ మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకుంటారు. మీ సన్నిహిత, సహచరవర్గంలో ఉండేవారి వల్లనే మానసిక వేదన కలుగుతుంది. పుత్రసంతానం కన్నా ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. జ్యేష్ఠ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఆడపిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి గట్టిగా ప్రయత్నాలు పారంభిస్తారు, అవి సఫలం అవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే వ్యాపారులకు, కమీషన్ ఏజంట్లకు మంచికాలం. వచ్చిన డబ్బులను వచ్చినట్లుగానే ఖర్చుపెట్టే పద్ధతిని మార్చుకోవాలని అనుకుంటారు. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. వాళ్ళు మీ వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థల పురోగతి బాగుంటుంది. విద్యా, ఉద్యోగ, విదేశీయాన విషయాలు బాగుంటాయి. సాంకేతిక విద్యలోనూ, వైద్యవిద్యలోనూ రాణిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఐఏఎస్, ఐఐటీ వంటి వాటికి ఎంపిక అవుతారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్లు, లాభాలు బాగుంటాయి. శక్తిహీనులైనవారికి బాధ్యతలు అప్పగించి నష్టపోతారు. వ్యక్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో పొరపాటు పడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో చేసిన ఋణాలను తీర్చివేస్తారు. కొత్త వర్క్ ఆర్డర్స్ చేతికి అందుతాయి. ఇతరులకి సంబంధించిన ధనం, డాక్యుమెంట్స్, రహస్య పత్రాలు కొద్దిరోజులు మీ దగ్గర దాచి ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛను ఇచ్చారని మీపై ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. పని చేయడంలోగానీ, చేయించడంలోగానీ ఎక్కడా రాజీపడరు. ఈ లక్షణమే మీ విజయానికి కారణం అవుతుంది. ఏ పనినైనా మీకు అప్పగిస్తే నిశ్చింతగా ఉండవచ్చు అనే భావన అందరికీ కలుగుతుంది. కుటుంబపరమైన వ్యవహారాల మీద దృష్టిపెట్టడం లేదని వృతి ఉద్యోగాలకు తాళికట్టాడని మీపై విమర్శలు వస్తాయి. కుటుంబం కోసమే కష్టపడుతున్నారన్న విషయం మీ మనస్సాక్షికి తప్ప మరొకరికి తెలియదు. కుటుంబ సంబంధ వ్యవహారాలు మీరు గమనిస్తున్నారన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. దూరప్రాంతంలో ఉన్న మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. నిద్రాహారాలను లెక్కచేయకుండా శ్రమిస్తారు. శ్రమకి తగిన ఫలితాలను పొందగులుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవితభాగస్వామితో అన్నివిషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు. జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవాన్ని, సముచిత స్థానాన్ని ఇస్తారు. కీళ్లనొప్పులు, ఎలర్జీ సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు ప్రోత్సాహంగా ఉంటాయి. గృహనిర్మాణ సామాగ్రి, ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతి మందులు, నూనె సంబంధమైన వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులు చదివిన చదువుకు సంబంధంలేని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. బ్యాంకులాకర్లు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, వీసా, పాస్‌పోర్ట్ వంటివాటి విషయంలో జాగ్రత్త వహించండి. తరచు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అందులో కొన్ని రహస్య ప్రయాణాలు కూడా ఉంటాయి. రాజకీయ సంబంధమైన స్నేహాలు, పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వనరులు చేకూర్చే ఒప్పందాలు కుదురుతాయి. బంధువులలో వచ్చిన ఓ సంబంధాన్ని తిరస్కరిస్తారు. మీ హితవు కోరే బంధువులు ఎవరో తెలుస్తుంది. మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్ములను శత్రువులుగానే చూస్తారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. రాజకీయ పదవి లభించే అవకాశం ఉంది. సంఘాల ద్వారా మంచి ఖ్యాతి, సంఘాలకు మంచి నాయకత్వం వహించడం తద్వారా లాభాలు గడిస్తారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. బ్యాంకు ఋణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారం బాగుంటుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపుతారు. సంతానం మీ మాటను ధిక్కరించడం సమస్యగా మారుతుంది. ఇంట్లో మీ మాటే నెగ్గాలి అన్న మొండితనంతో ఉండవద్దు. సర్దుకుపోవడం వల్ల లాభం చేకూరుతుంది. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి. మోకాళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది. శారీరకంగా, మానసికంగా శ్రమించి డబ్బులు ఖర్చుపెట్టి సంతానాన్ని ఒకదారికి తీసుకు వస్తారు. మీరు ఊహించిన విధంగా వారు జీవితంలో స్థిరపడతారు. కుటుంబానికి కుటుంబ బాధ్యతలలో మీ వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేరుస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు, పెట్టుబడులు లాభిస్తాయి. సంపాదించిన ధనాన్ని మంచికి ఉపయోగిస్తారు. కళా, సాహిత్య, సాంకేతికరంగాలలో మీ ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది. ఇష్టంలేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసివస్తాయి. వీలైనంత వరకు విభేదాలకు దూరంగా ఉండండి. మీకు మీరుగా సమస్యలను పెద్దవిగా చేయవద్దు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. అవివాహితులకు వివాహకాలం. ఆత్మీయులతో, సన్నిహితులతో వాగ్వివాదాలు సంభవిస్తాయి. బ్యూటీపార్లర్లు నడిపేవారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకుని అయినవాళ్ళు దూరం అవుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారపరంగా వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఓర్పు పాటించడం అవసరం. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మొత్తంమీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. -
వికారినామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు
మిథునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సప్తమంలో శని కేతువుల సంచారం, లగ్నంలో రాహుగ్రహ సంచారం, సప్తమ, అష్టమ స్థానాలలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితాశయం నెరవేరుతుంది. ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. వృత్తి ఉద్యోగాలలో సంయమనం, ఓర్పు చాలా అవసరం. ఆర్థిక స్థాయి పెరుగుతుంది, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త మార్గాలలో ఆర్థిక పురోగతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. అధికారం వస్తుంది. ప్రత్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సహోదర సహోదరీవర్గానికి అన్నివిధాలుగా అండగా ఉన్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంటారు. సంతానం మీ అభీష్టం మేరకు నడుచుకోక కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అనుకున్న వాటిని ఏదోరకంగా సాధిస్తారు. మీరు చేసే ఏ పనికీ ఇతరులు ప్రత్యామ్నాయం చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే మీ మేధస్సు, ఆలోచనలు, శ్రమ ఎక్కువకాలం దోచుకోబడతాయి లేక వెలుగులోకి రాకపోవడం జరుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కుల, మత వర్గాలకు అతీతంగా మీ ప్రవర్తన ఉంటుంది. స్త్రీల వలన అదృష్టం కలసి వస్తుంది. దాంపత్య జీవితంలో టీకప్పులో తుఫాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. చాలామందికి తండ్రివల్ల మేలు జరుగదు. మనస్సులో స్థానం కలిగిన రక్తసంబం«ధీకులొకరు శాశ్వతంగా దూరం కావడం తీవ్ర మనోవేదనకి కారణం అవుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా పిటిషన్లు, ఆకాశరామన్న ఫోన్లు చికాకు కలిగిస్తాయి. ప్రతిసారి మీ నిజాయితీ, సామర్థ్యాలను సాక్ష్యాలతో నిరూపించుకోవాల్సి వస్తుంది. చివరికి మొండి ధైర్యంతో, కోపంతో ఎదురు తిరుగుతారు. స్త్రీల సహాయ సహకారాలు అందుకుంటారు. సహోదర సహోదరీవర్గంతో సత్సంబంధాలు బలపడతాయి. ఆంతరంగిక కుటుంబ రాజకీయాలు, ఒకరంటే మరొకరికి గిట్టని స్థితి ఇబ్బంది కలిగిస్తుంది. సొంతవాళ్ల వలన మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. జల సంబంధిత, నూనె సంబంధిత, గ్రానైట్స్‌కు సంబంధించిన విషయాలు, లీజులు పొడగింపు వంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వపరంగా స్థాయిని ధ్రువీకరించే విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పన్నుల వసూలు చేసే అధికారులతో వాగ్వివాదాలు, న్యాయస్థానాలను ఆశ్రయించే స్థితి సంభవం. ప్రేమ వివాహాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలలో, ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు, విదేశీ వ్యవహారాలు, సబ్‌కాంట్రాక్టులు, రాజకీయ వ్యూహాలు లాభిస్తాయి. మీరు ఊహించని చోట ఆస్తుల విలువ పెరుగుతుంది. అమ్మకాల ఒప్పందాలు ఖరారు కానందుకు సంతోషిస్తారు. ఆర్థిక వ్యవహారాలపై పట్టుసాధిస్తారు. ఋణాలు తీరుస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన అంశాలు మీ జోక్యం వల్ల పరుగులు పెడతాయి. ధనం నీళ్ళ మాదిరి ఖర్చు అవుతుంది. అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా, వ్యక్తిగత కారణాల వల్ల వాటిని చేజార్చుకుంటారు. వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారం చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలపరంగా కృత్రిమ పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. మీ వల్ల ప్రయోజనం పొందినవారు మీపై కృతజ్ఞతా భావం కలిగి ఉండరు. సొంత మనుషుల ద్వారా ఆశించిన పనులు నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా మరొకరిని ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని సమస్యలు మానసిక ఆందోళనకు గురిచేస్తాయి. మీ సమస్యలను ఇంట్లోవాళ్ళతో చెప్పరు. బయట స్నేహితులకు చెప్పుకొని ఊరట చెందుతారు. రాజకీయ పదవి లభిస్తుంది. సంతానం వల్ల సమస్యలు అధికం అవుతాయి. చదువు, ఆరోగ్యం సమస్యలుగా మారుతాయి. ప్రేమ, పెళ్ళి వంటి వ్యవహారాలు చికాకుపరుస్తాయి. అవివాహితులకు వివాహకాలం. సంతానంలేని వారికి సంతానప్రాప్తి. రావలసిన పెండింగ్ బిల్స్ దారికి వస్తాయి. రాజకీయ మార్పులను అనుకూలంగా మలచుకోగులుగుతారు. మీ ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా కొన్ని బలహీనతలు మీకు దొరుకుతాయి. వాటిని ఉపయోగించుకోగులుగుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి, ప్రింటింగ్, స్టేషనరీ, అలంకార వస్తు సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వాములతో విభేదాలు ఏర్పడతాయి. కీలక సమయంలో ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి. జీవిత భాగస్వామితోను, ఆత్మీయులతోను కొద్దికాలం చికాకులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఈఎన్టీ సమస్యల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న స్త్రీల వల్ల మేలు కలుగుతుంది. దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. స్వల్పకాల పరిచితులే అపరిమిత సహాయం చేస్తారు. బాల్యమిత్రులు, చిరకాల పరిచితుల నిర్ణయాలు, సలహాలు అమలు చేసేముందు నిపుణుల సలహాలను తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్, స్విమ్మింగ్‌లలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు డాక్యుమెంట్స్‌పై చేసిన సంతకాలు వివాదస్పదం అవుతాయి. నూతన విద్యాకోర్సులను అభ్యసించాలనే కోరిక బలపడుతుంది. మీ శక్తిసామర్థ్యాలకు, నిపుణతకు అవార్డులు లభిస్తాయి. నీతినిజాయతీలతో విధి నిర్వహణ చేస్తున్న మీకు కొంతమంది అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రిటైర్ అయినవారికి వేరే చోట మంచి ఉద్యోగం లభిస్తుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది. రొటేషన్లు, లాభాలు బాగుుంటాయి. అధికారులకు శక్తికి మించిన లంచాలు ఇవ్వవలసిన పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. సినీ, బుల్లితెర, కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు మధ్యస్తంగా ఉన్నాయి. ఆత్మీయవర్గం అవసరాలకు మాత్రం ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ధనం సర్దుబాటు చేస్తారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. విశేషించి సాంకేతికవిద్యలో రాణిస్తారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. సంతాన పురోగతి ఆనందానికి కారణం అవుతుంది. పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవడానికి శ్రమించవలసి వస్తుంది. పిల్లల విషయమై జీవితభాగస్వామితో విభేదాలు వస్తాయి. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి, డిజైనింగ్ చేసేవారికి, ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవారికి అనుకూలంగా ఉంది. సీజనల్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసివస్తుంది. మీకు రావలసిన స్థిరచరాస్తులు కోర్టుద్వారా వస్తాయి. బంధువులతో వైరం ఏర్పడుతుంది. బానిసత్వపు సంప్రదాయాలను ప్రక్కనపెట్టి స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. వివాహం కానివారికి వివాహప్రాప్తి, సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. సాంకేతిక, కళారంగాలలో రాణిస్తారు. విదేశాలలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక, మనోహరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారి ఋణం తగినవిధంగా తీర్చుకుంటారు. విడిపోవాలనుకునే వ్యక్తులతో శాశ్వతంగా విడిపోతారు. చేయవలసిన మేలు చేసినా, నోటి దురుసుతనం వల్ల స్నేహితుల అభిమానాన్ని, రావలసిన ప్రయోజనాలని పోగొట్టుకుంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. బ్యూటీపార్లర్స్ నిర్వహణలో లాభాలు బాగుంటాయి. ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగం లభిస్తుంది. యాంకరింగ్ రంగంలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. సమాజంలో పరపతి కలిగినవారితో స్నేహం బలపడుతుంది. కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులు మీ శ్రమను, సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఎలర్జీ ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు సంబంధమైన సమస్యలు, మోకాళ్ళ నొప్పులు బాధించవచ్చు. కోరుకున్న రాజకీయపదవి లభిస్తుంది. స్వయంకృతాపరాధాల వలన నష్టపోయే అవకాశం ఉంది. పెద్దలతో విభేదాలు ఏర్పడతాయి. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి నిపుణులను సంప్రదిస్తారు. ప్రేమవివాహాలు ప్రధాన ప్రస్తావనాంశాలు అవుతాయి. రెండు నెలలు మానసిక అశాంతి ఏర్పడుతుంది. మీ మీద నిందారోపణలు నిజం కాదని నిరూపించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. దూరప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు, పిల్లలు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాలలో పెట్టుబడిగా పెడతారు. అన్నీ ఉన్నా అనుభవించలేక పోతున్నామనే భావన మిమ్మల్ని కలవరపరుస్తుంది. -
వికారినామ సంవత్సర (వృషభ రాశి) రాశిఫలాలు
వృషభరాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమంలో శని, కేతువుల సంచారం, అష్టమ, భాగ్యస్థానాలలో గురు సంచారం, రెండింట రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, వ్యవహారాలపరంగా బాగుంది. రాజకీయంగా అగ్నిపరీక్షాకాలం. విద్యాసంబంధ విషయాలు, సాంకేతిక, గణిత విద్యలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమా వ్యాపారం కలసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. ఆక్వా, పౌల్ట్రీరంగాల్లో కలసిరాదు. రాజకీయ పదవీ ప్రాప్తి సంభవం. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిదానం అవసరం. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతనంగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వాహనాలు నడపడంలో, ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సహోదర సహోదరీవర్గానికి రహస్యంగా సహాయపడతారు. ప్రేమ వివాహాలు వివాదస్పదం అవుతాయి. స్త్రీలతో విభేదాలు కొంతకాలం ఇబ్బందిపెడతాయి. మీ ఆంతర్యం, వైరాగ్యం, నిర్వేదం ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. పైకి నిండుకుండలా కనిపిస్తారు, గంభీరంగా ప్రవర్తిస్తారు. పదిమందికి సహాయం చేయగులిగిన శక్తిసామర్థ్యాలు, ధన బలం భగవంతుడు మీకు ఇస్తాడు. జ్యేష్ఠ సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణం అవుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా అండగా ఉంటారు. నిర్మాణ çపనులలో నాణ్యత కోసం ప్రయత్నిస్తారు. చాలామంది చాదస్తం అని అవహేళన చేసినా మీ పద్ధతి మార్చుకోరు. అదే మీకు మంచి కీర్తిప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. నష్టపోయిన విషయాన్ని చెప్పుకుంటే సిగ్గు పోతుందని మిన్నకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ వ్యాపారంలో ఒక స్త్రీ భాగస్వామ్యం కలసివస్తుంది. మీ వ్యాపారానికి ఉన్నతస్థాయి వ్యక్తుల పరపతి తోడ్పడుతుంది. వ్యాపార, ఆర్థిక విషయాలకు సంబంధించి స్నేహితులను, ఆత్మీయులను దూరంగా పెడతారు. అంత్యనిష్టూరం కన్నా ఆది నిష్టూరమే మేలు అని భావిస్తారు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోనంత వరకు మీకు తిరుగులేదు. జీవిత భాగస్వామితో విభేదాలు చికాకు కలిగిస్తాయి. పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తారు. వ్యసనపరులైన చిన్ననాటి స్నేహితులను ఆదుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కళా సాంస్కృతిక రంగాల వారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. మిమ్మల్ని పొగిడే వాళ్ళపట్ల జాగ్రత్తగా ఉండండి. మంచిగా ఉంటూ నమ్మకద్రోహం చేస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ఫర్నిచర్, గృహ పరికరాలు, హోమియోపతి, ఆయుర్వేదం, హోటళ్లు, బేకరీ వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. మీ మాట జవదాటని రక్తసంబంధీకులు, కుటుంబసభ్యులు మీ మాట వినని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం వక్రమార్గంలోకి వెళ్తారు. మంచిమాటలు చెప్పి వేరే చోట ఉంచి వాళ్లని ఓ దారికి తీసుకువస్తారు. విందులు, వినోదాలు ఎక్కువవుతాయి. వాటికి దూరంగా ఉండాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఫైనాన్స్ వ్యాపారానికి, షేర్స్‌కి దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వివాదాలకు, దూరంగా ఉండండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో ఐకమత్యం లేని కారణం చేత సంతానాన్ని సక్రమమైన మార్గంలో నడిపించలేరు. అయితే ఈ సమస్య ఒక్క నెల మాత్రమే బాధిస్తుంది. తదుపరి సంతాన పురోగతి బాగుంటుంది. యూనియన్స్, క్లబ్బులు ప్రతిష్ఠాత్మకమైన సేవాసంస్థలలో మీకు మంచి గౌరవం, స్థానం లభిస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారులు మీ స్నేహితులు కావడం వల్ల మీ పొరపాట్లకు జరిమానా పడదు. మీరంటే ఎంతమాత్రం ఇష్టంలేని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ఆకస్మికంగా మిమ్మల్ని పిలిపించి అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు పొడగించబడతాయి. మీకు తెలియకుండా మీ భాగస్వాములు తీసుకున్న నిర్ణయాలు సంస్థకు చెడ్డపేరు తీసుకువస్తాయి. స్థిరాస్తుల పంపకంలో పెద్దలు, బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇతరుల హక్కుల కోసం పోరాటం చేస్తారు. బతిమాలినా కాని పనులను భయపెట్టి సాధిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పాత శత్రువులు మళ్లీ తెరమీదకు వస్తారు. నిష్కారణమైన నిందలు మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. శుభకార్యాల విషయంలో పంతం నెగ్గించుకుంటారు. ఉద్యోగంలో ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. మీ స్వయంకృతాపరాధాలే ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తివ్యాపార వ్యవహారాలలో విమర్శలు, ఇబ్బందులు ఏర్పడతాయి. కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు. కాలుష్యం వల్ల స్వల్ప అనారోగ్య పరిస్థితులు నెలకొంటాయి. వైవాహిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోతారు. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అగ్రిమెంట్స్ వాయిదా పడతాయి. ప్రత్యర్థివర్గంలోని గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీలు ఆశించినట్లుగానే ఆగుతాయి. రాని బాకీలు రాకపోగా వివాదాస్పదాలు అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల నష్టపోకుండా నిలబడతారు. ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు పొడిగించబడతాయి. పరభాషా ప్రావీణ్యం, సాంకేతికవిద్య, కళానైపుణ్యం, వైద్యవిద్య, క్రీడా నైపుణ్యం మొదలైనవి గుర్తింపుకు నోచుకొని ఉన్నతస్థితికి బాటలు వేస్తాయి. మీ ముందు పొగడడము, మీ చాటున తిట్టడం కొంతమందికి నిత్యకృత్యం అవుతుంది. సాక్ష్యాధారాలు చూపించి మరీ కొన్ని వివాదాలను పరిష్కరించగలుగుతారు. క్రీడారంగంలోని వారికి కుళ్ళు రాజకీయాలు ఇబ్బంది పెడతాయి. టీవీ సినిమా రంగంలోని వారికి ఆశాజనకం. చిత్ర కళాకారులకు మంచి ఫలితాలున్నాయి. డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు పరిశీలించుకుని సంతకం చేయండి. గణితవిద్యకు సంబంధించి విశేషంగా కృషి చేసి అనుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం బాగుుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్ళీ నిలదొక్కుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక విషయాలు బాగున్నాయి. పోటీ పరీక్షలలో నెగ్గి వైద్యకళాశాలలో సీటు సంపాదిస్తారు. విద్యాసంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారానికి దూరంగా ఉండండి. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వివాహాది శుభకార్యాలను సంతృప్తికరంగా నిర్వహించగలుగుతారు. విదేశీ విషయాలు కలసివస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ కోరుకునే వారికి బదిలీ అవుతుంది. ప్రేమ వివాహాలు ఫలించవు. జీవితంలో దగ్గరైన ఓ వ్యక్తిని నమ్మడం జరుగుతుంది. కానీ అతని వల్ల మీకు నమ్మకద్రోహం ఎదురవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలలో సీటు లభిస్తుంది. వస్త్ర వ్యాపారం, స్టేషనరీ వ్యాపారం, ఆహారపదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు. ఫలితాలు నామమాత్రంగా ఉంటాయి. క్రీడారంగంలో మీకున్న నైపుణ్యానికి తగిన గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలపరంగా మీ విధులను సక్రమంగా, నిజాయితీగా నిర్వహిస్తారు. ఇది చాలామందికి నచ్చని అంశంగా మారుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్ఠల వలన కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది. దొంగ స్వామీజీల వల్ల, దొంగ గుురువుల వల్ల నష్టపోతారు. అనువంశికంగా రావలసిన ఆస్తుల విషయంలో సమన్యాయం జరుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ అవసరం. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు జాగ్రత్తగా ఉండాలి. కంప్యూటర్ విద్య, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఎప్పటినుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఉద్యోగం వస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలక్ట్ అవుతారు. మీరు చేసే ఇతరాత్ర వ్యాపారాలు, వ్యవసాయరంగ ఉత్పత్తులు, బ్యూటీ పార్లర్స్, చీరలు అమ్మడం, హోటళ్లు మొదలైన వ్యాపారాలు కలిసివస్తాయి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు, లాభపడతారు. విమర్శలకు తావు లేకుండా రాజకీయపదవి లభిస్తుంది. -
వికారినామ సంవత్సర (మేషం) రాశిఫలాలు
మేషరాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. భాగ్యంలో గురు, శని, కేతువుల సంచారం, మూడింట రాహుగ్రహ సంచారం, గురువు భాగ్యదశమ రాశి సంచారం, మూఢమి, గ్రహణాలు ప్రధానౖ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. రాజకీయ నిర్ణయాలు అగ్నిపరీక్షలా నిలుస్తాయి. వర్గాన్ని కూడగట్టలేరు. ప్రజాకర్షణ తగ్గుతుంది. గ్రూపురాజకీయాలు ఫలించవు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్, ఎగుమతి, దిగుమతి వ్యవహారాలలో మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బెట్టింగ్‌లలో నష్టపోతారు. ఇతరుల బరువుబాధ్యతలు మీపై వేసుకోవద్దు. బంధువులకు సహాయం చేయడం వల్ల ఇంట్లో చికాకులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ సంస్థలోని భాగస్వాములు, కార్యాలయంలోని సహోద్యోగులు, ఓర్వలేని వారై ఉంటారు. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి బాధించే అవకాశం ఉంది. ఈఎన్టీ సమస్యలు రావచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో ఆర్థికప్రణాళికలు కొత్త రూపురేఖలు దిద్దుకుంటాయి. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇంటి ఖర్చు తగ్గించడానికి చేసే ప్రయత్నాలు బెడిసికొడతాయి. స్థలాలు, కట్టడాలు, జలసంబంధిత వ్యాపారాలు కలిసివస్తాయి. స్వయం పర్యవేక్షణ లేక ఇతరుల మీద పూర్తిగా బాధ్యతలు వదిలి వేయడం వల్ల కొన్ని అనుభవాలు నేర్చుకుంటారు. మంచితనం, కుటుంబ, వంశ గౌరవం చాలా సందర్భాలలో ఆదుకుంటుంది. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. ఎవరిని ఏ పనికి ఉపయోగించుకోవాలో అంచనా వేయడంలో పొరబడతారు. స్వజనులు, బంధువర్గం లేక కులవర్గానికి చెందిన ఓ వ్యక్తి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నిష్కారణ శత్రుత్వం ఏర్పడుతుంది. మనుషుల మనోభావాలను స్పష్టంగా చదవగలరు. సంతానం విషయంలో కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ప్రేమవివాహాలు విఫలం అవుతాయి. విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. కుల మత వర్గాలకు అతీతంగా శక్తి సామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. మధ్యవర్తిత్వం చేయడం వల్ల కొన్ని చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు ఖర్చులు ఎక్కువవుతాయి. కుల రాజకీయాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల సలహాలు నచ్చేవి అమలు చేయండి. ఇతరులు సలహాలు చెప్పడానికి భయపడే వాతావరణం కలిగించవద్దు. పట్టుదలతో పాటు, పట్టువిడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా రావలసిన బిల్లులు ఆలస్యం అవుతాయి. ఆర్థికసంస్థల నుండి, బ్యాంకుల నుండి లోనులు తీసుకుంటారు. అతికష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రాధాన్యతలేని సీటుకు తాత్కాలికంగా బదిలీ అవుతారు. ఒక పదవికి సంబంధించి మీ పేరు పరిశీలనలో ఉంటుంది. వైరివర్గం గురించిన రహస్య సమాచారం మీ చేతికి అందుతుంది. తొందరపడకుండా సమయ సందర్భాల కోసం ఎదురు చూస్తారు. ప్రేమపెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. పునర్వివాహం చేసుకోవాలనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాలలో లాభపడతారు. ఋణాలు తీరుస్తారు. తనఖాలు విడిపిస్తారు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కవు. వ్యవహారాలకు ఏమాత్రం సంబంధించని వ్యక్తులకు వాటాలు పంచవలసి వస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఉపయోగంలేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది. మేలు చేస్తారని భావించిన వ్యక్తులు ముఖం చాటేస్తారు. కీడు చేస్తారనుకున్న వ్యక్తులు మేలు చేస్తారు. మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్త్రీ సంతానం పురోగతి బాగుంటుంది. మీ విలువ అందరికీ తెలిసివస్తుంది. స్త్రీలతో ఏర్పడిన సమస్యలు సమసిపోతాయి. అసత్య ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులు మీకన్నా బలవంతులైనా లెక్కచేయరు. పరిస్థితులను అంచనావేసి తగిన వ్యూహాలను అమలుచేస్తారు. సాంకేతిక పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. భూ వ్యవహారాలు, మరికొన్ని ముఖ్య వ్యవహారాలు మీకు అనుకూలంగా మారడం వల్ల సాటివారికి అసూయ పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలలో రాణిస్తారు. నమ్మకద్రోహులు అడుగడుగునా ఎదురవుతారు. జలక్రీడలు, ఈతలకు దూరంగా ఉండటం మంచిది. పార్ట్‌టైమ్, టెంపరరీ ఉద్యోగాలు చేస్తున్నవారికి పర్మినెంట్ ఉద్యోగం లభిస్తుంది. ప్రాంతీయ విభేదాలు మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా పని చేసేటప్పుడు సన్నిహితులను, నిపుణులను సంప్రదించండి. ప్రతి విషయంలోనూ జీవితభాగస్వామికి సంజాయిషీ ఇవ్వవలసి రావటం మీ మనోవేదనకు కారణం అవుతుంది. లాభాలు పంచుకునే విషయంలో పనిచేయని వ్యక్తులకు, సోమరిపోతులకు భాగాలు ఇవ్వవలసిన పరిస్థితిని జీర్ణించుకోలేకపోతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కుటుంబపరంగా సమష్టి నిర్ణయం తీసుకుంటారు. పార్టీ మారడం వల్ల మంచి రాజకీయ ఫలితాలు పొందగలుగుతారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అరిష్ట ఉద్వాసనకు నల్లవత్తులతో దీపారాధన చేయండి. సర్పదోష నివారణ కంకణం ధరించండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణాభరణాల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. సొంతవారితో మాట్లాడడానికి తీరికలేని పని ఒత్తిడి చికాకు కలిగిస్తుంది. సంవత్సర ద్వితీయార్ధంలో వ్యక్తిగత శ్రమ, జీవితభాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తి, ధనం సంపాదిస్తారు. సంతానం వల్ల కుటుంబానికి కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. మీ వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుుతారు. సమాజంలో ఒక స్థాయి కలిగినవారు మీపై నిష్కారణ ద్వేషం పెంచుకుంటారు. స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించినవారికి ఈ సంవత్సరం బాగుంది. విద్యార్థినులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్స్ వస్తాయి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. సివిల్స్ స్థాయి పోటీ పరీక్షల కోసం పట్టుదలతో శ్రమించి, విజయం సాధిస్తారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మధ్యవర్తుల వల్ల మేలు జరుగుుతుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానంలేని వారికి సంతానప్రాప్తి కలుగుుతుంది. కొందరికి జీవితభాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు ప్రజాదరణకు నోచుకుంటాయి. సన్నిహితులు, స్నేహితులు, బంధువుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పొదుపు పథకాల ద్వారా లబ్ధి పొందుతారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపండి. బ్యూటీ పార్లర్స్, అలంకార సామాగ్రి వ్యాపారాలు లాభిస్తాయి. కళా, సాంస్కృతికరంగాలలో రాణిస్తారు. పరిమళగంధంతో, సుగుంధ సిద్ధగంధాక్షతలతో పూజ చేయండి. చలనచిత్ర, టీవీ రంగాలలో అవకాశాలు లభిస్తాయి. పిల్లలను అతి గారాబం చేయడం వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. సంతాన విద్యా విషయమైన ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ మీద ఇతరుల ప్రభావం పడకుండా జాగ్రత్తపడండి. సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని నియంత్రించి గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి భంగపాటు తప్పదు. గతించిపోయిన ఆత్మీయుల జ్ఞాపకాలు మనసుని బాధిస్తాయి. సౌందర్య చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. మీ సిద్ధాంతాలను పక్కన పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంతకాలం అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఇష్టంలేని వ్యక్తులతో కలసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కూడా మీ శక్తిసామర్థ్యాలు గుర్తింపబడతాయి. మీ పట్ల హేళన భావన కలిగిన వారికి మీ ఉన్నతస్థితితో తగిన సమాధానం చెప్పగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి, సర్పదోష నివారణ రూపు మెడలో ధరించాలి. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. కాంట్రాక్టులు, వర్క్ఆర్డర్లు, సబ్‌కాంట్రాక్టులు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయరంగంలో రాణిస్తారు, పదవి లభిస్తుంది. సొంతవాళ్ళుగా భావించిన వ్యక్తులు మీ దగ్గరే రహస్యాలు దాచిపెట్టడం మీ కోపానికి కారణం అవుతుంది. ప్రతి శుక్రవారం అరావళి కుంకుమతో, లకీ‡్ష్మచందనంతో శ్రీ మహాలకీ‡్ష్మదేవిని పూజించండి. కొత్త కొత్త ఆహార నియమాలు పాటించడం వలన ప్రయోజనం కలగకపోగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ రంగాలలోనివారు రాణిస్తారు. ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ కనబరుస్తారు.