unemloyee
-
ప్రపంచంలో అక్కడే నిరుద్యోగులు ఎక్కువ..!
పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న సమర్థులకు ఉపాధి లభించకపోవడమే నిరుద్యోగమని ప్రపంచ కార్మిక సంస్థ నిర్వచించింది. ప్రపంచం ఏళ్లుగా నిరుద్యోగ సంక్షోభం ఎదుర్కొంటోంది. కొవిడ్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ వేగంగా పుంజుకోలేకపోతున్నాయి. చాలా దేశాల్లో సరిపడా ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం లభించక, స్వయం ఉపాధి పొందేంత స్థోమతలేక దొరికిన పనులు చేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. పారిశ్రామికీకరణకు ముందు సంప్రదాయ పనుల వల్ల ఉపాధి సమస్య ఉండేది కాదు. యంత్రాల రాకతో వస్తూత్పత్తి పెరిగినా చాలామందికి పని దొరకడం కష్టం అవుతోంది. పారిశ్రామిక దేశాలు దశాబ్దాల తరబడి దీన్నొక సమస్యగానే గుర్తించలేదు. క్రమంగా నిరుద్యోగం తీవ్రరూపం దాలుస్తోందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇదీ చదవండి: విమానాశ్రయానికి బెదిరింపు... రూ.8.3 కోట్లకు డిమాండ్! నూటికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారన్నది లెక్కతేల్చే ‘నిరుద్యోగిత రేటు’ నిత్యం మారుతోంది. భారత్‌లో ఈ ఏడాది నిరుద్యోగిత రేటు 7.1 శాతంగా ఉన్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే స్విట్జర్ల్యాండ్లో తక్కువగా 2 శాతం నిరుద్యోగితరేటు ఉంటే గరిష్ఠంగా దక్షిణాఫ్రికాలో 31.9 శాతం ఉంది. Unemployment rate: 🇿🇦 South Africa: 31.9% 🇪🇸 Spain: 11.84% 🇹🇷 Turkey: 9.1% 🇧🇷 Brazil: 7.7% 🇮🇹 Italy: 7.4% 🇫🇷 France: 7.4% 🇮🇳 India: 7.1% 🇦🇷 Argentina: 6.2% 🇩🇪 Germany: 5.8% 🇨🇦 Canada: 5.7% 🇮🇩 Indonesia: 5.32% 🇨🇳 China: 5% 🇸🇦 Saudi: 4.9% 🇬🇧 UK: 4.2% 🇺🇸 US: 3.9% 🇦🇺 Australia:… — World of Statistics (@stats_feed) November 23, 2023 -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చింది. 833 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇంజినీరింగ్ విభాగంలోని అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టిండ్రు..
సాక్షి, వీణవంక(కరీంనగర్): వీణవంక మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ పార్టీ ధూంధాం కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. నరసింహులపల్లి గ్రామానికి చెందిన నిరుద్యోగి లకోట నిరోష ఉద్యోగ ప్రకటనపై ప్రశ్నించగా.. నాయకులు, పోలీసులు ఆమెను సభ నుంచి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై సోమవారం సదరు యువతి తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారని అడిగినందుకు అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వాళ్లు రూ.10 లక్షలు ఇచ్చి పంపించారా అంటూ బెదిరించినట్లు ఆరోపించింది. అక్కడి నుంచి వస్తుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొటట్టారని.. మెడలో ఉన్న గోల్డ్ చైన్ కూడా పోయిందని చెప్పింది. చేతులు, కాళ్లు పట్టుకొని కదలనివ్వకుండా చేశారని.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తర్వాత కూడా మాట్లాడదామనుకుంటే పోలీసులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. వారు కేసీఆర్‌కు తొత్తులుగా మారారంటూ వీడియోలో కంటతడి పెట్టింది. చదవండి: పచ్చని సంసారంలో కేసీఆర్ నిప్పు పెట్టారు -
పేదలకు మరో సహాయం చేసిన సోనూసూద్
చండీఘర్: కరోనా వైరస్ ప్రభావంతో కష్టాలు పడుతున్న వారికి అండగా నిలుస్తున్న ఒకేఒక్క వ్యక్తి నటుడు సోనూసూద్. తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల సినిమా ప్రేక్షకులకు తెలిసిన సోనూ కరోనా అనంతరం పేదలకు సహాయం చేస్తూ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. రియల్ హీరోగా పేరుపొందిన సోనూ ఇప్పుడు మరోసారి గొప్ప సహాయం చేశారు. తాజాగా తన సొంత గ్రామం పంజాబ్‌లోని మోగా పట్టణంలో 8 మంది నిరుద్యోగులకు సహాయం చేశారు. వారి ఉపాధి కోసం ఆ 8 మందికి ఈ-రిక్షాలు అందించారు. తన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్‌తో కలిసి నిరుద్యోగులకు రిక్షాలను ఇచ్చారు. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నట్లు సోనూసూద్ మీడియాతో చెప్పారు. ఈ విధంగా చేయడంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి తోచినంత సాయం చేయండి అని పిలుపునిచ్చారు. తాను తన తల్లిదండ్రుల నుంచి ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నట్లు పేర్కొన్నారు. తాను దేవుణ్ని కాదని అందరిలాగే అవసరమైన వారికి సాయం చేస్తూ తన బాధ్యత నిర్వర్తిస్తున్నట్లు సోనూసూద్ తెలిపారు. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో సోనూసూద్ నటించి నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. -
గల్ఫ్‌పేరుతో ఘరానా మోసం
సాక్షి, జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిరుద్యోగ యువతను ఉపాధినిమిత్తం విదేశాలకు పంపిస్తామంటూ నమ్మించి అందినకాడికి దండుకుంటున్నారు. పొంతనలేని పనులు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. మరికొంతమంది గల్ఫ్‌పేరుతో ఉద్యోగమిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్‌ఏజెంట్ మోసం చేశాడని రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ఏజెంట్ ఇంటిముందే బాధితులు ధర్నా నిర్వహించారు. కుమ్మరిపల్లిలో ఏజెంట్ మోసం చేశాడని ఓ బాధితుడు సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఇలా చాలామంది బాధితులు ఏజెంట్ల చేతుల్లో మోసపోయి పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో సుమారు 320మంది ఎలాంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంట్లుగా నిర్వహిస్తున్నారు. ట్రావెల్స్ పెట్టుకుని గల్ఫ్‌దేశాలకు పంపిస్తామంటూ విస్తృత ప్రచారం చేయించుకుంటున్నారు. వీరిని నమ్మిన కొంతమంది ఇంటర్వ్యూలకు హాజరై పాస్పోర్టుతో పాటు కొంత మేరకు డబ్బు చేతుల్లో పెట్టి మోసాలకు గురవుతున్నారు. నిఘా పెట్టిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు ట్రావెల్స్‌లపై మూకుమ్మడి దాడులు చేసి పాస్‌పోర్టులు, విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేసి కేసులు కూడా నమోదు చేశారు. పోలీసులు నిఘా పెట్టినా ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు స్పీడ్ పెంచారు. గ్రహించిన గల్ఫ్ ఏజెంట్లు గత నెల రోజులుగా రహస్య ప్రాంతాల్లో పోలీసుల కళ్లుగప్పి గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిబంధనల సడలింపుతో 8 మందికే లైసెన్స్‌లు ట్రావెల్స్‌ల కోసం కేంద్ర విదేశీ వ్యవహారల శాఖ సడలింపు ఇవ్వడంతో జగిత్యాల జిల్లాలో గల్ఫ్ దేశాలకు పంపించేందుకు 8 ట్రావెల్స్‌లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. రూ.50 లక్షలు డిపాజిట్ చేసిన ట్రావెల్స్ వారికి ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్ ఉండగా రూ.8 లక్షలు చెల్లించిన వారికి సంవత్సరానికోసారి రెన్యువల్ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు. మిగతా వారికి ఎవరికీ అనుమతులు లేకుండా ముంబాయ్, చెన్నై, ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి గల్ఫ్ ఏజెంట్లను తెప్పించి ఇక్కడ పనిచేస్తున్న ఏజెంట్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారి నుంచి ఒరిజినల్ పాస్పోర్టుతో పాటు కొంత మేరకు వీసా అడ్వాన్స్ తీసుకుంటున్నారు. పోలీసుల నజర్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లపై నజర్ పెట్టారు. దాదాపు ఆరునెలల కాలంలో సుమారు 72కి పైగా గల్ఫ్ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. అయినా ఏజెంట్లలో మాత్రం మార్పు రావడం లేదు. నిరుద్యోగుల నుంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. పాస్‌పోర్టులు స్వాధీనం.. వివిధ దేశాల్లో ఉద్యోగాలున్నాయని, సబ్ ఏజెంట్ల వాట్సప్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్న ట్రావెల్స్ ఏజెంట్లు ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగుల నుండి మీరు ఎంపికయ్యారని, పాస్‌పోర్టులు తీసుకుని నకిలీ వీసాలు అప్పగించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుకున్న సమయానికి వీసా రాకపోవడంతో తమకు పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచితే వారి వద్ద నుండి సుమారు రూ.10వేల నుండి రూ.20వేలవరకు ట్రావెల్స్ యజమానులు వసూలు చేస్తున్నారు. మోసపోవద్దు జగిత్యాల ప్రాంతంలో చాలా మంది యువకులు గల్ఫ్‌కు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లేవారు ప్రభుత్వం గుర్తించిన సంస్తల ద్వారానే విదేశాలకు వెళ్లాలి. ఇతర ప్రయివేటు వ్యక్తులను, గల్ఫ్ ఏజెంట్లను నమ్మి యువకులు మోసపోవద్దు. చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు. అనుమతి లేని గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం . – ప్రకాశ్, జగిత్యాల పట్టణ సీఐ -
ముంచిన డీఎస్సీ రోస్టర్
-
చంద్రబాబు పాలనలో నిరుద్యోగులకు మొండిచెయ్యి
ఎంవీపీకాలనీ: హామీలు, అంకెల గారడీలు తప్పితే ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగుల సం క్షేమం కోసం చేసిందేమిలేదని ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్ ఆరోపించారు. నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపిస్తున్న టీడీపీ తీరును బుధవారం ఎంవీపీలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఖండించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎన్నో వరాలు కురిపించాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించగా, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఎన్నికల్లో లబ్ధి పొందాయన్నారు. అయితే నేటికి ఆ హామీలు నిరుద్యోగులకు అందని దాక్షగానే మిగిలిపోయాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. టీడీపీ తన పబ్బం గడుపుకోవడానికి నిరుద్యోగభృతి అంశాన్ని తెరపైకి తెచ్చిందని.. నాలుగున్నరేళ్లు అవుతున్నా ఈ హామీని అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీతోపాటు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. పీహెచ్డీ ప్రవేశాల కోసం ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష దరఖాస్తు రుసుం పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. సమితి శ్రీకాకుళం, విజయనగరం జిల్లా అధ్యక్షులు టి.సూర్యం, గౌరీశంకర్, గుంటూరు జిల్లా నాయకులు దాసు, కోటి పాల్గొన్నారు. -
ఇదేం ‘శిక్ష’ణ..?
భద్రాచలం : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు సవ్యంగా కొనసాగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్లను(వైటీసీ) ప్రైవేటు సంస్థలకు అప్పగించటంతో సరైన ఫలితాలు రావటం లేదు. శిక్షణ పేరుతో నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా యువతకు ఉపాధి లభించటం లేదు. ఈ కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో నామమాత్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వివిధ శిక్షణ కేంద్రాలను ‘సాక్షి’ పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గ్రామ్ తరంగ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కేంద్రంలో ఒక్క జేడీఏ(జనరల్ డ్యూటీ అసిస్టెంట్) కోర్సులో మాత్రమే విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఆదివారం ఈ కేంద్రాన్ని పరిశీలించగా 10 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 360 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం కో– ఆర్డినేటర్ రవితేజ తెలిపారు. కానీ ఇందులో సేంద్రియ వ్యవసాయ సాగు, కోళ్ల పెంపకం వంటి అంశాల్లోనే సుమారు 240 మందికి శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్(ఉద్యోగం) చూపించాలనే నిబంధన ఉండటంతో ఇటువంటి వాటికే ఎక్కువ శ్రద్ధ చూపుతన్నారనే విమర్శ ఉంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో కేంద్రం నడిచిన సమయంలో దీనికి ఫర్నిచర్, ఇతర సామగ్రి పెద్ద ఎత్తున సరఫరా చేయగా, అవన్నీ గదుల్లో వృథా గా కనిపిస్తున్నాయి. జిల్లాలో 50 వేల మందికిగా పైగా నిరుద్యోగ అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకున్నప్పటికీ, ఇక్కడికి మాత్రం అభ్యర్థులు రాకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే గతంలో వచ్చిన అభ్యర్థులే మళ్లీ మరో కోర్సుకు వస్తుండటం గమనార్హం. అంటే శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ సవ్యంగా జరగడం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. కేంద్రం నిర్వహణపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు దృష్టి సారించాలని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం అస్తవ్యస్తం... మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్న సమయంలో మంజూరైన నిధులతో భద్రాచలం, కొత్తగూడెం, వాజేడులో టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల్లో గల ఐటీఐ ప్రిన్సిపాల్స్‌కు అప్పగించారు. ఒక్కో కేంద్రానికి రూ.50 లక్షలు మంజూరు కాగా, ఇందులో రూ.35 లక్షలతో భవనాలు నిర్మించారు. మిగతా నిధులతో టైలరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ భవనాన్ని వృథాగానే వదిలేసి భద్రాచలం డిగ్రీ కాలేజీ సమీపంలోని గిరిజన బాలికల సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ ప్రాంగణంలో ఓ మూలకు ఉన్న రేకుల షెడ్లలో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిలోనూ ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబసభ్యులు, గృహిణులు, వివిధ కోర్సుల్లో ప్రస్తుతం చదువుతున్న వారే ఉన్నారు. కొత్తగూడేనికి భవిత సెల్... గిరిజన యువతకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ఐటీడీఏలో ‘భవిత సెల్’ ఏర్పాటు చేశా రు. నిరుద్యోగ గిరిజన యువత ఇక్కడ పేరు నమోదు చేసుకుంటే చాలు, వారి చెంతకే ఉపా ధి, ఉద్యోగ అవకాశాల సమాచారం చేరేలా ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఐటీడీఏ ప్రాంగణంలోనే ఉన్న యూత్ ట్రైనింగ్ సెంట ర్లో వివిధ పోటీ పరీక్షల కోసం గిరిజన అభ్యర్థులకు వరుసగా ఉచిత శిక్షణలు ఇప్పించారు. కానీ నేడు సీన్ మారిపోయింది. యూత్ ట్రైనింగ్ సెంటర్లు ప్రైవేటు సంస్థలకు అప్పగించటంతో ‘భవిత సెల్’ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జాబ్ రిసోర్స్ పర్సన్(జేఆర్పీ)లకు పనిలేకుండా పోయింది. దీంతో ఈ కేంద్రాన్ని నేడో, రేపో భద్రాచలం నుంచి కొత్తగూడెం తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీని బాధ్యతలను పర్యవేక్షించే ఏపీఎం స్థాయి అధికారి ఇప్పటికే కొత్తగూడెం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో దీనిని ఇక్కడి నుంచి మార్చేందుకు అంతా సిద్ధమైంది. ఇదే జరిగితే శిక్షణలపై ఇక పూర్తిగా ప్రైవేటు పెత్తనం సాగనుంది. గిరిజన నిరుద్యోగులు 50 వేలకు పైనే.. భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో తాజా లెక్కల ప్రకారం 50 వేల మందికి పైగానే పేర్లు నమోదు చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులు తమ విద్యార్హతలను భద్రాచలంలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలోనే నమోదు చేసుకోవాలి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాలు ఏజెన్సీ పరిధిలోనే ఉండటంతో ఇక్కడ నమోదయ్యే గణాంకాలనే అధికారులు పరిగణలోకి తీసుకుని, నిరుద్యోగుల లెక్క చూపుతారు. ఇలా నమోదు చేసుకున్న వారిలో పదో తరగతి విద్యార్హతతో సుమారు 21 వేల మంది, ఇంటర్‌తో 13,500 మంది, డిగ్రీ పట్టభద్రులు 7,800 మంది ఉన్నారు. పదో తరగతి లోపు చదువుకున్న వారు 3 వేల మంది ఉండగా, వీరితో పాటు నర్సింగ్, వివిధ రకాల టెక్నికల్ కోర్సులు చేసిన వారు కూడా వేలల్లోనే ఉన్నారు. కానీ ఇక్కడ పేరు నమోదు చేసుకోవటమే తప్ప అర్హులైన వారికి, కనీసం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సమాచారం కూడా రావటం లేదు. ఉపాధి చూపని కోర్సులు... యువతకు సత్వర ఉపాధి దొరికేలా ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లోనే గతంలో శిక్షణ ఇచ్చేవారు. ప్లంబింగ్ అండ్ రాడ్ బైండింగ్, వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ అండ్ హౌస్వైరింగ్, బోర్ వెల్ రిపేర్, ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్, కంప్యూటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెబైల్ సర్వీసు, రిపేరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చే వారు. మూడు నెలల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలను కల్పించి, శిక్షణ ఇవ్వటంతో పాటు, కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత స్వయంగా ఉపాధి పొందేలా ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా కల్పించేవారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్కో కేంద్రం నుంచి ఏడాదికి 400 మందికి పైగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చే వారు. కానీ ప్రస్తుతం ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహిస్తున్న కేంద్రాల్లో నిర్వాహకులకు అనువుగా ఉన్న కోర్సుల్లోనే శిక్షణ ఇస్తున్నారు. ఈ కారణంగా నిరుద్యోగ యువత వీటిపై ఆసక్తి చూపటం లేదు. -
‘రింగ్’ తిప్పాడు.. రూ.4 కోట్లు కొల్లగొట్టాడు
సాక్షి, అమరావతి బ్యూరో: రూ.5 లక్షలు ఇస్తే సిస్టమ్ మేనేజర్.. రూ.3 లక్షలు ఇస్తే సిస్టమ్ అసిస్టెంట్.. ఆ తర్వాత రెగ్యులర్ అయ్యే అవకాశం.. ఇదీ ఉద్యోగాలిప్పిస్తామంటూ అమరావతిలోని తాత్కాలిక సచివాలయం కేంద్రంగా సాగుతున్న రాకెట్. పురపాలక శాఖలో కీలక నేతకు సన్నిహితుడైన ఓ ప్రైవేటు వ్యక్తి దీనికి రింగ్ మాస్టర్ కాగా ఓ ఉన్నతాధికారి సూత్రధారి. ఇంకేముంది నిరుద్యోగులు నమ్మి దాదాపు రూ.4 కోట్లు ముట్టజెప్పారు. పురపాలక శాఖలో తిష్ట వేసి.. రాజధాని వ్యవహారాలు చూసే ప్రభుత్వ నేతకు సన్నిహితుడైన ఆ ప్రైవేటు వ్యక్తి పురపాలక శాఖలో చక్రం తిప్పుతున్నాడు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, హనుమాన్జంక్షన్కు చెందిన ఆయన కొన్నేళ్లుగా విజయవాడలోని ఏలూరు రోడ్డులో ఉంటున్నాడు. పురపాలక శాఖలో అనధికారికంగా తిష్టవేసి ఆ శాఖలో ఓ ఉన్నతాధికారితో సాన్నిహిత్యం పెంచుకుని దందాలకు తెరతీశాడు. కాగా, సెక్రటేరియట్, సీఆర్డీఏ, పురపాలక సంఘాల్లో 110 సిస్టమ్ మేనేజర్లు, 128 సిస్టమ్ అసిస్టెంట్ల పోస్టులను కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించింది. ఇదే అదనుగా ఆ వ్యక్తి చక్రం తిప్పాడు. రూ.4 కోట్లు వసూలు: పురపాలక శాఖలో కీలక నేతకు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆ వ్యక్తి అభ్యర్థులకు చెప్పుకొచ్చాడు. సిస్టమ్ మేనేజర్ పోస్టుకు రూ.5 లక్షలు, సిస్టమ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.3 లక్షలు చొప్పున బేరం పెట్టాడు. ఆ పోస్టులను తర్వాత రెగ్యులర్ కూడా చేస్తారని ఆశ చూపించాడు. ఆయన మాటలను ఆ ఉన్నతాధికారి కూడా సమర్థించినట్లు సమాచారం. దీంతో దాదాపు 100 మంది అభ్యర్థులు ఆయన అడిగినంత ముట్టజెప్పారు. ఇలా గతేడాది నవంబర్, డిసెంబర్లలో దాదాపు రూ.4 కోట్లకుపైగా వసూలు చేశాడు. నిరుద్యోగులు దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పురపాలక శాఖకు పంపించారు. దరఖాస్తులు స్వీకరించినట్టు ఆ శాఖ కూడా నిర్ధారించింది. అప్పటి నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వస్తుందంటూ జాప్యం చేస్తూ వచ్చాడు. కానీ ఇంటర్వ్యూకు పిలుపు రాలేదు. అభ్యర్థులు ఆరేడు నెలల నుంచి ఆయన చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. రింగ్ మాస్టర్‌కు అధికారుల వత్తాసు రూ.4 కోట్లు సమర్పించిన నిరుద్యోగులు తాము మోసపోయామని గ్రహించారు. ఈ విషయంపై పురపాలక శాఖ మంత్రిత్వ శాఖకు కూడా వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అందరూ ఓ వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి న్యాయం కోసం ఒత్తిడి పెంచారు. అయినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. కీలక నేతకు సన్నిహితుడైన రింగ్ మాస్టర్‌ను వెనకేసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఓ నిరుద్యోగి మూడు రోజుల క్రితం హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కీలక నేతకు సన్నిహితుడు కావడంతో చర్యలు తీసుకునేందుకు పోలీసుల సందేహిస్తున్నారు. మరోవైపు ఆ రింగ్ మాస్టర్ కుటుంబసభ్యులు నిరుద్యోగులపై ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తుండటం గమనార్హం. -
ఒకటి నుంచి నిరుద్యోగ యువతకు శిక్షణ
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ మచిలీపట్నం( చిలకలపూడి ) : నిరుద్యోగ ఎస్సీ యువతకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి వివిధ అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. శిక్షణలో ఎక్కువమంది నిరుద్యోగులు ఉపయోగించుకొనేలా వారికి అవగాహన కల్పించాలని ఆయన చర్చి ఫాదర్లను కోరారు. బుధవారం ఆయన తన చాంబర్లో చర్చి ఫాదర్లతో సమావేశం నిర్వహించారు. ఈడీ మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువతీ, యువకులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఐదు నుంచి పదో తరగతి చదివిన ఎస్సీ యువకులకు వెల్డింగ్, ప్లంబింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్ తదితర అంశాలల్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్మీడియట్ చదివిన యువకులకు రెస్టారెంట్లలో హోటల్ మేనేజ్మెంట్ రంగంలో శిక్షణ అందిస్తామన్నారు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసినవారికి కాంట్రాక్టర్ ఎంటర్పెన్యుర్ డెవలప్మెంట్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ అంశంలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ మూడు అంశాలపై అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాల కోసం ఈ నెల 27న విజయవాడ లయోలా కళాశాలలో జరిగే యువసమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది నిరుద్యోగ ఎస్సీ యువతీ, యువకులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చర్చి ఫాదర్లను కోరారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ దుర్గారావు, హోలీ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఫౌండర్ వి.జాన్భాస్కరరావు, చర్చి ఫాదర్లు పాల్గొన్నారు.