నేటినుంచి వాలీబాల్ టోర్నీ
ముకుందాపురంలో పోటీలు
–ఐదు yì విజన్ల నుంచి 20 టీంలు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. 2011లో ఇదే మైదానంలో జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లాలోని ఐదు డివిజన్లకు చెందిన 20టీంలు ఈ పోటీల్లో పాల్గొంటాయి.
ప్రారంభించనున్న జానా
అండర్–14,అండర్–17 బాలబాలికల వాలీబాల్ పోటీలను శనివారం టీ æసీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రారంభించనున్నట్లు ఎంఈఓ బాలునాయక్, వ్యాయామ ఉపాద్యాయుడు సత్యనారాయణలు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 5డివిజన్లకు చెందిన 300మంది బాలబాలికలు పోటీలలో పాల్గొంటారని తెలిపారు.