vizayanagaram district
-
సీఎం వైఎస్ జగన్ వైద్యరంగానికి పెద్దపీట వేశారు: ఎమ్మెల్యే కడుబండి
-
రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం
మక్కువ : పంట కాలంలో 14 వారాల పాటు శిక్షణ ఇచ్చి రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యమని మండల వ్యవసాయాధికారి కె. తిరుపతిరావు అన్నారు. సరయ్యవలస రైతుభరోసా కేంద్రం పరిధిలోని బంగారువలసలో సోమవారం నిర్వహించిన పొలంబడి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, ఎంపిక చేసిన పంటలో 14 వారాల పాటు 25 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నిరంతర పంటల పరిశీలన ద్వారా మిత్ర పురుగులు, వాతావరణాన్ని పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. గ్రామ రైతులందరూ రాబోయే ఖరీఫ్ సీజన్లో నిర్వహించే పొలంబడికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సర్పంచ్ శంబంగి హరికృష్ణ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు తొందరగా అందించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ టి. శ్రీరాములు, వీఏఏ త్రివేణి, రైతులు పాల్గొన్నారు. (చదవండి: పంట భద్రుడు...ఆదర్శ రైతుగా మారిన ఉపాధ్యాయుడు) -
‘పరిధి’ని చెరిపి.. ప్రాణాలు నిలిపారు
వీరఘట్టం: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగితే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు సరైన సమయానికి స్పందించి బాధితులను ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడిన వైనమిది... గరుగుబిల్లి మండలం చిలకాం జంక్షన్ వద్ద గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఓ కారు బోల్తా పడింది. ఛత్తీస్‌గఢ్ నుంచి శ్రీకాకుళానికి ఏడుగురు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చల్లపల్లి రవివర్మ, తవుడు, ఈశ్వరమ్మతో పాటు.. చిన్నారులు నిషాంతవర్మ, గౌరీవర్మలు గాయపడ్డారు. మిగిలిన వారికి కూడా దెబ్బలు తగిలాయి. క్షతగాత్రుల్లో ఒకరు 100కు కాల్ చేసి ప్రమాదంపై వివరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం విజయనగరం జిల్లా సరిహద్దులో ఉంది. ఆ స్థలం నుంచి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం పోలీస్‌స్టేషన్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాల్ ద్వారా సమాచారం అందుకున్న వీరఘట్టం పోలీసులు తమ పరిధి కాకున్నా చొరవ తీసుకుని హుటాహుటిన ప్రమాద స్థలానికి బయల్దేరారు. వీరఘట్టం ఎస్ఐ జి.భాస్కరరావు, హెచ్‌సీ టి.పోలయ్య తదితరులు 108 సాయంతో బాధితులను సకాలంలో పార్వతీపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి పార్వతీపురంలోనే వైద్య సేవలు అందించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైజాగ్ తరలించారు. సమయానికి వైద్యం అందడంతో వారందరూ కోలుకుంటున్నారు. మా డ్యూటీ మేం చేశాం..: ప్రమాదం జరిగిన స్థలం మాకు 11 కి.మీ. దూరంలో ఉంది. ఇదే స్థలం విజయనగరం జిల్లా గరుగుబిల్లి పోలీస్‌స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే వారు వచ్చేసరికి ఆలస్యమవుతుందని గ్రహించి వెంటనే మా డ్యూటీ మేం చేశాం. క్షతగాత్రులను పార్వతీపురం తరలించి వైద్యం అందించాం. – జి.భాస్కరరావు, ఎస్ఐ, వీరఘట్టం -
కొలువుల కోలాహలం
జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. కొత్త ప్రభుత్వం ఆవిర్భావం నుంచి వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల్లో నియామకాలకు చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ, వార్డు స్థాయిలో వలంటీర్ల నియామకం... మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కల్పన... ఇంకోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న బిల్లు ఆమోదానికి సిద్ధమవడం... ఇలా నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పాలన సాగుతోంది. తాజాగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీల పరిష్కారానికీ చర్యలు తీసుకుంటుండగా... 2018 డీఎస్సీలో ఎంపికైనవారి నియామకాలకు చర్యలు ఊపందుకున్నాయి. సాక్షి, విజయనగరం అర్బన్: జిల్లాలో భర్తీ కానున్న కొత్త గురువుల నియామక కసరత్తు కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లోనే ఉపాధ్యాయ నియామకాల షెడ్యూల్‌కు పచ్చ జెండా ఊపింది. అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మోడల్ స్కూళ్లకు చెందిన నియామకాల ప్రక్రియ సాగింది. ఆ తరువాత నిర్వహించాల్సిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ల షెడ్యూల్ తేదీల్లో స్వల్ప మార్పుతో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రాథమిక జాబితాను జిల్లాలకు పంపి రోస్టర్ పాయింట్లతోపాటు ఇతర సాంకేతిక పరమైన అంశాలను సరిచేయించుకొని తుది పరిశీలన చేసుకుంది. అనంతరం తిరిగి తుది జాబితాను ‘ఏపీడీఎస్సీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’ వెబ్ సైట్లో మంగళవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తరువాత ప్రక్రియ కొనసాగించే షెడ్యూల్‌ను ప్రకటించింది. నేడు, రేపు ధ్రువపత్రాల అప్లోడింగ్ డీఎస్సీ జిల్లా కమిటీ పరిశీలన తరువాత ఎంపికైన తుది జాబితా అభ్యర్థుల వివరాలు పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ కార్యాలయం మంగళవారం సంబంధిత వెబ్సైట్లో విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఈ నెల 24, 25వ తేదీల్లో అభ్యర్థులు పూర్తి చేయాలి. తొలుత దరఖాస్తు చేసుకున్న సమయంలో నమోదు చేసిన విద్యార్హతలు, ఇతర ధ్రువపత్రాల ఒరిజినల్ కాపీలను స్కాన్ చేసి సంబంధింత వెబ్సైట్లో క్రోడీకరించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల 24, 25వ తేదీల్లో అవకాశం కల్పించారు. వాటిని పాఠశాల విద్యా కమిషనరేట్ పరిశీలించాక చివరి రోజున తిరిగి మరో జాబితాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అర్హత ధ్రువపత్రాలు తప్పనిసరి డీఎస్సీ–2018 నోటిఫికేషన్ విడుదల తరువాత తొలుత దరఖాస్తు చేసుకున్న సమయంలో అభ్యర్థి నమోదు చేసుకున్న విద్యార్హత, ఇతర అర్హతల ధ్రువపత్రాలను విధిగా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థికి చెందిన సంబంధిత ధ్రువపత్రాల్లో ఏ ఒక్కటి లేకపోయినా తరువాత ప్రకటించిన తుది జాబితా నుంచి తీసేస్తారు. ధ్రువపత్రాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో గడువు కావాలంటే పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయానికి నేరుగా కలిసి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి అనుమతులను ఇచ్చే అధికారం జిల్లా స్థాయి డీఎస్సీ కమిటీకి ఉండేది. గత డీఎస్సీల్లో ఇలాంటి వ్యవహారంలో పలు అక్రమాలు చోటు చేసుకోవడంతో దానిని దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాల్లో జిల్లా స్థాయి డీఎస్సీ కమిటీకి ఆ అధికారం ఇవ్వలేదని తెలుస్తోంది. 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ధ్రువపత్రాల అప్లోడింగ్ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసుకున్న తరువాత చివరి రోజు రాత్రి మరోసారి ఎంపిక జాబితాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26, 27 తేదీల్లో ధ్రువపత్రాలను జిల్లా విద్యాశాఖ నేరుగా పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియను స్థానిక సెయింట్ ఆన్స్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆయా తేదీల్లో నిర్వహిస్తామని డీఈఓ జి.నాగమణి తెలిపారు. పరిశీలన కోసం సంబంధిత ధ్రువపత్రాల ఒరిజినల్స్‌తోపాటు గెజిటెడ్ అటెస్టెడ్ జెరాక్స్ సెట్లు మూడు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు రెండింటిని తీసుకొని అభ్యర్థులు హాజరుకావాలని ఆదేశించారు.ఎవరు ఎప్పుడు హాజరుకావాల్సి ఉంటుందన్నది వారి మొబైల్స్‌కు సమాచారం అందజేస్తామని వివరించారు. జిల్లాలో 377 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డీఎస్సీ నియామకాల్లో భర్తీ అయ్యే కేటగిరీల్లో అన్నీ కలిపి 377 ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాలలో 170, మున్సిపాలిటీల్లో 64, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 143 ఉన్నాయి. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ టీచర్ కేటగిరీ పోస్టులను భర్తీ చేసేందుకు షెడ్యూలును విడుదల చేశారు. ఇది పూర్తయిన తరువాత తదుపరి ఎస్జీటీల నియామక ప్రక్రియ ఆరంభం కానుంది. కోర్టు కేసుల్లో ఉన్నవి మినహాయించి... ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల్లో గణితం, ఆంగ్లం, భౌతిక, జీవశాస్త్రాలు, సాంఘిక శాస్త్ర సబ్జెక్టులకు సంబంధించి భర్తీ చేస్తారు. కోర్టు కేసుల్లో ఉన్న భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయరు. వీటి విషయంలో స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే చర్యలు చేపడతారు. -
మన ఆరోగ్యం.. మన చేతుల్లో
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పూర్వకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక విధానాలను పాటించే వారు. ప్రతి ఆచారం వెనుక ఆరోగ్యదాయక క్రియ దాగి ఉండేది. కానీ తాత, ముత్తాతల నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గతంలో నిత్య జీవితంలో కచ్చితంగా ఆచరించి ఆరోగ్యంగా ఉండేవారు. నేడు ఆధునిక పోకడలతో వాటిని విస్మరించి రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు. చిరుతిళ్లకు అలవాటు పడి రోడ్డు పక్క తిండి తిని చేజేతులారా ఆరోగ్యాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. అవగాహన లేని విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడంతో అనేక రుగ్మతలతో బాధపడుతున్నట్టు ఏటా అనేక సర్వేలు చెబుతున్నాయి. కుటుంబ పెద్దలు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఆచారం ఆరోగ్యానికి సోపానమని, అంతా అటువైపు అడుగులేస్తే పిల్లలకు సంప్రదాయ పద్ధతులపై అవగాహనతో పాటు చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయ వ్యాయామంతో మేలు నేటి పోటీ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో దినచర్య ప్రారంభమవుతోంది. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల దృష్ట్యా రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుతున్న వాళ్లే అధికం. కొందరు మిత్రులతో పార్టీలంటూ అర్థరాత్రి వరకు నిద్రపోవడం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వేకువ జామున నిద్ర లేచి కొంత సమయం నడవడం శ్రేయస్కరం. చిన్నతనం నుంచి పిల్లలను ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం, «ధ్యానం చేయించడం అలవాటు చేయాలి. క్రమం తప్పకుండా చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. న్యూరో సైన్సు ప్రకారం ఉదయం నడకతో పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కింద కూర్చొని భోజనం చేస్తే.. ఇటీవల కాలంలో డైనింగ్ టేబుల్, మంచం కుర్చీలు, సోఫాలపై కూర్చొని భోజనం చేయడం పరిపాటైంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరూ నేలపై కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. ఇది ఆరోగ్య రీత్యా మంచి మంచిది కాదన్న వాస్తవం తెలుసుకోవడం లేదు. నేలపై కూర్చుని తినాలి నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల మోకాళ్లు, పొట్టకు తగిన వ్యాయామం లభిస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. భోజనం చేసే సమయంలో నడుం చుట్టూ ఉన్న కండరాలపై ఒత్తిడి పడి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. భోజన సమయంలో నీళ్లు తాగొద్దు భోజనం పూర్తయ్యేవరకు మధ్యలో నీళ్లు తాగకూడదని పూర్వీకులు పదే పదే చెప్పేవాళ్లు. పెద్దల మాటను పెడచెవిన పెడుతూ చాలామంది భోజనం చేస్తున్న సమయంలో ఎక్కువ నీళ్లు తాగుతున్నారు. దీనివల్ల తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. అసిడిటీ వంటి ఇబ్బందులు వస్తాయి. ఇలా చేస్తే మంచిది.. భోజనానికి ముందు, తర్వాత అర్ధగంట వ్యవధిలో నీళ్లు తాగాలి. తినే సమయంలో ఇబ్బందిగా ఉంటే కొద్దిగా తీసుకోవచ్చు. ఇలాగైతే పొట్ట పెరగదు. ఊబకాయం బారిన పడకుండా ఉండవచ్చు. భోజనం తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు బ్రష్ చేయడం మేలు. చన్నీటి స్నానంతో ఆహ్లాదం పూర్వకాలంలో సంధ్య వేళల్లో చన్నీటి స్నానానికి పెద్దలు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు ఊడిపోవడం, మృదుత్వం కోల్పోవడం, బలహీనంగా మారేందుకు అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానంతో శరీరం సమ ఉష్ణోగ్రతలో ఉంటుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. కాళ్లూ, చేతులు కడుక్కోవాలి బయటికెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక కాళ్లు, చేతులు కడుక్కొని లోపలికి వెళ్లడం మంచి సంప్రదాయం. దేన్ని తాకాలో.. దేన్ని తాకరాదో పిల్లలకు అవగాహన ఉండదు. ఆకర్షించే ప్రతి దాన్ని తాకుతారు. బుగ్గిలో ఆడటం వల్ల చేతులు, కాళ్ళకు బాక్టీరియా అంటుతుంది. ఇంటికి చేరగానే చేతులు, కాళ్లను శుభ్రం చేసుకుంటే సూక్ష్మక్రిములు పోతాయి. చక్కని ఆరోగ్యానికి అవకాశం ఉంటుంది. భోజనానికి ముందు చేతుల శుభ్రత అన్ని విధాల మేలు. ఏకాగ్రతకు భక్తి దోహదం చిన్నతనం నుంచే భక్తితో దేవున్ని ప్రార్థించేలా నేర్పించాలి. పెద్దలు ఆచరిస్తే పిల్లలకు అలవాటవుతుంది. దీపారాధన, ధ్యానం, మంత్రాల ఉచ్ఛారణ వంటివి ఏకాగ్రతకు దోహదపడతాయి. ఒత్తిడిని జయించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
విజయనగరం: జిల్లాలో భారీ చోరీ
సాక్షి, విజయనగరం: జిల్లాలో చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగ చూసింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి శివారు గాంధీ నగరం వద్ద నివాసం ఉంటున్న రిటైర్డ్ కస్టమ్స్అధికారి మూనూరు సీతారాం ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు ఇరవై మూడు తులాల బంగారం ఆభరణాలు, 25 తులాల వెండి వస్తువులు, లక్షా యాభైవేలు రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. -
విజయనగరంలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
సాక్షి, విజయనగరం: మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్ధాలు పుణ్యక్షేత్రంలో నేటి నుంచి రెండు రోజుల పాటు శివరాత్రి మహాజాతర ఉండటంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రానికి ఇరుత జిల్లాల నుంచి వేలాదిగా తరలిస్తున్న భక్తులు. ఎస్. కోట: మహాశివరాత్రి సందర్భంగా ఎస్. కోట మండలం పుణ్యగిరి ఉమాకోటిలింగేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. జిల్లా కేంద్రంలో శివాలయం వీధిలో భక్తులుతో నిండిన శివాలయాలు. ఎస్ కోట నుంచి పుణ్యగిరి కొండవరకు ఇరవై నాలుగు గంటలు పాటు నిరంతరాయంగా పది బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నాలుగు వందల మంది పోలీసులుతో బందోబస్తు నిర్వహించారు. -
విజయ శంఖారావం
-
కురుపాం విజయనగరం జిల్లా వైఎస్ జగన్ పాదయాత్ర
-
బాబు పాలనలో అవినీతి విలయతాండం చేస్తోంది
-
45 ఏళ్ళు పైబడిన అక్కచెల్లెమ్మలకు వైఎస్అర్ చేయూత
-
వైఎస్ జగన్‌ను కలిసిన మున్సిపల్ కార్మికులు
-
ముగిసిన 292వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
పబ్లిసిటీ చేయడంలో చంద్రబాబు దిట్ట
-
ముగిసిన 291వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
276వ రోజు ప్రజాసంకల్పయాత్ర నెల్లిమర్ల విజనగరం జిల్లా
-
ఆ ఘటనలో నివ్వెరపోయే నిజాలు
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారనే సంఘటన కలకలం రేపింది. జిల్లాలోని నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సారిపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులుకు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి అసలు గ్యాంగ్ రేప్ జరుగలేదని తేలింది. అత్యాచారం జరిగిందని యువతి చెబుతున్న వివరాలకు, పోలీసులు విచారణలో తెలిసిన విషయాలకు పొంతన కుదరలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి అత్యాచార సంఘటన అబద్ధమని తేల్చేశారు. అంతేకాక ఘటన వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్చపోయారు. సదరు యువతి ఆదివారం రాత్రి ఇంటికి ఆలస్యంగా వెళ్లింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యలు తిడతారని తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు నాటకమాడింది. ఈ విషయాన్ని యువతి ఒప్పుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఆదివారం ఏం జరిగింది..? ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ యువతి ఆటో ఎక్కింది. అదే వాహనంలో మరో ఇద్దరు వ్యక్తులున్నారు. పూల్‌బాగ్‌కాలనీ వద్ద ఆమె దిగాల్సి ఉన్నా డ్రైవర్ ఆటోను ఆపలేదు. ఎందుకు ఆపలేదని ఆడిగిన ఆమెను బలవంతంగా నోరు నొక్కి సారిపల్లి రోడ్డులో నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఆటో డ్రైవర్‌తో పాటు, మరో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతలోనే సమీపంలో వినికిడి రావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత సదరు యువతి స్థానికలు సహాయంతో ఇంటికి చేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిన యువతిని తల్లిదండ్రులు ప్రశ్నించగా... తనపై సాముహిక అత్యాచారం జరిగినట్టు తెలిపింది. దీంతో వారు పూసపాటిరేగ ఆస్పత్రికి తరలించడంతో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి జిల్లా ఎస్పీ దీంతో విషయం తెలుసుకున్న ఎస్పీ పాలరాజు ఘటన జరిగిన స్థలానికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. విజయనగరం కోట కూడలి నుంచి అత్యాచారం జరిగిందని చెప్పిన ప్రదేశం వరకు రోడ్లకు ఇరువైపులా 15 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న గ్యాస్ గోదాము నిర్వాహకుల నుంచి సైతం వివరాలు సేకరించారు. పలు విషయాలపై ఆరా తీసిన పోలీసులు, మరింత సమాచారం కోసం యువతిని ప్రశ్నించారు. అయితే ఆమె చెప్పిన విషయాలు నమ్మశక్యం కాకపోవడంతో మరింత లోతుగా విచారణ చేసిన పోలీసులు నిజాలు నిగ్గు తేల్చారు. -
విజయనగరంలో ఘనంగా వైఎస్సార్ జయంతి
-
గజరాజుల బీభత్సం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం వల్ల గిరిపుత్రులు భయాందోళనకు గురవుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో కొన్ని రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు అంతులేని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం సాలూరు మండలంలోని శికపరువు గ్రామంలో నాలుగు ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. స్థానికులు వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే బాధల్లో ఉన్నారు. ఎలాగైనా అటవీ అధికారులు కల్పించుకుని వారిని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.