the wire
-
వివేకా లేఖను పట్టించుకోరా? కీలక అంశాన్ని సీబీఐ ఎందుకు విస్మరించింది!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న వివేకా లేఖపై CBI నిశితంగా దృష్టి సారించక పోవడం విస్మయపరుస్తోందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ The Wire పేర్కొంది. CBI ఛార్జ్ షీట్లో ఏముంది? ‘డ్రైవర్ ప్రసాద్ తనపై తీవ్రంగా దాడి చేసినట్టు వివేకా పేర్కొన్నట్టుగా ఆ లేఖలో ఉంది. ఆ లేఖను వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ చూసి పీఏ కృష్ణా రెడ్డికి ఇచ్చాడు. ఆయన వెంటనే అంటే ఉదయం 6.29 గంటలకు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి ఆ లేఖలో ఉన్న సమాచారాన్ని చదివి వినిపించారు. తాము వచ్చే వరకు ఆ లేఖను గోప్యంగా ఉంచమని, ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పారు. దాంతో కాసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న సీఐ శంకరయ్యకు కూడా కృష్ణా రెడ్డి ఆ లేఖ విషయం చెప్పలేదు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరెడ్డి తదితరులు పులివెందులకు చేరుకున్నాక ఆ రోజు సాయంత్రం ఆ లేఖను వైఎస్సార్ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మకు అప్పగించారు’ అనే విషయాన్ని చార్జ్‌షీట్‌లో పేర్కొంది సిబిఐ. ఈ విషయాన్ని ప్రస్తావించడం మినహా ఇంత కీలకమైన విషయంపై సీబీఐ ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన కథనంలో ఎన్నో కీలక ప్రశ్నలను సంధించారు. తీవ్ర గాయాలతో లేఖ రాయగలిగారా? వివేకా లేఖపై ఇప్పటికీ సందిగ్ధత తొలగిపోలేదు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం ఇప్పించేంత వరకు ఆ లేఖ ఎప్పుడు రాశారన్న దానిపై స్పష్టత రాలేదు. వివేకాపై దాడి తర్వాత ఆయనతో బలవంతంగా ఆ లేఖను తాము ఎలా రాయించామని దస్తగిరి వెల్లడించాకే సందేహాలు మరింతగా పెరిగాయి. అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన వాంగ్మూలంలో వెల్లడించిన ప్రకారం.. "మొదట సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి ముఖంపై గట్టిగా కొట్టాడు. దాంతో వివేకా కింద పడిపోయారు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో వివేకా నుదుటి మీద నరికాడు. వివేకా నుదుటి మీద 3.5 ఇంచ్‌ల వెడల్పు, 6 ఇంచ్‌ల లోతుగా పక్క పక్కనే రెండు గాయాలున్నాయని పోస్టువర్టం నివేదిక వెల్లడించింది." భూమి పత్రాల కోసం గాలింపు "సునీల్‌యాదవ్ వివేకా గుండెపై 15–16 సార్లు గట్టిగా పిడిగుద్దులు గుద్దాడు. ఉవశంకర్ రెడ్డి తన చేతిలో ఉన్న గొడ్డలిని దస్తగిరికి ఇచ్చి వివేకా లేవకుండా చూడమని చెప్పారు. తాము భూమి పత్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతామని చెప్పాడు. వివేకా అతి కష్టం మీద లేవడానికి ప్రయత్నించాడు. నా ఇంట్లో ఏం వెతుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో దస్తగిరి గొడ్డలితో వివేకా కుడి చేతి మీద దాడి చేశాడు. వివేకా కుడి అరచేతిలో 2 ఇంచ్‌ల వెడల్పు, ఒక ఇంచి లోతున గాయం ఉందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కుడి చేతి మీద గొడ్డలితో గాయపరిచిన తర్వాత వివేకాతో నిందితులు లేఖ రాయించారు. కుడి చేతివాటం వ్యక్తి అయిన వివేకా ఆ లేఖ రాశారని" సీబీఐ పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ తర్వాత లేఖ రాయగలిగారా? గాయం వల్ల వివేకా మెదడు బయటకు వచ్చిందని దస్తగిరి పేర్కొనడం గమనార్హం. అంత తీవ్ర గాయమైన తర్వాత లేఖ రాసే స్థితిలో వివేకా ఉన్నారా అన్నది ప్రశ్నార్థకం. ఆ లేఖ వివేకానే రాసినట్టు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (CFSL) నిర్ధారించింది. కాగా తీవ్రమైన ఒత్తిడి, అత్యంత సంక్లిష్ట ప్రక్రియ నడుమ ఆ లేఖ రాసినట్టుగా ఉందని ఢిల్లీలోని CFSL నివేదిక వెల్లడింంది. కానీ అంతటి తీవ్ర గాయాలు అయ్యాక.. మెదడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఓ వ్యక్తి అలా లేఖ రాయడం సాధ్యమా? అని సీబీఐ వైద్య నిపుణులను సంప్రదించకపోవడం విడ్డూరం. ఆ వేలి ముద్రలు ఎవరివో? హత్య కేసు దర్యాప్తులో వేలి ముద్రలు అత్యంత కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వివేకా హత్యకు గురైన స్థలంలో గుర్తించిన మూడు గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివనే విషయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడం విస్మయపరుస్తోంది. వివేకా నివాసంలోని బాత్రూం గోడల టైల్స్ మీద రెండు వేలి ముద్రలు, తలుపు వెనుక ఒక వేలి ముద్రను క్లూస్ టీమ్ గుర్తించింది. గోడల టైల్స్ మీద ఉన్న వేలి ముద్రలు రక్తంతో ఉండటం గమనార్హం. కాగా ఆ మూడు వేలి ముద్రలు నిందితులు నలుగురితోపాటు వివేకా నివాసానికి వచ్చిన బంధువులు, ఇతరుల వేలి ముద్రలతో సరిపోలలేదు. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు రాత్రి వివేకా నివాసంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోంది. కానీ సీబీఐ ఇప్పటి వరకు ఆ వేలి ముద్రలు ఎవరివనే దిశగా దర్యాప్తు చేయనే లేదు. IPDR డేటా అహేతుకం ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్‌రెడ్డి మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ‘ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డ్స్(IPDR) నివేదిక ఆధారంగా గుర్తించినట్టు సీబీఐ పేర్కొంది. కానీ ఐపీడీఆర్ డేటా అన్నది శాస్త్రీయంగా కచ్చితమైన ఆధారం కాదు. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు ఆన్‌లో ఉన్నాయని మాత్రమే ఐపీడీఆర్ చెబుతుంది. సాధారంగా అర్ధరాత్రి దాటిన తర్వాత మొబైల్ నెట్‌వర్క్‌లు తమ డేటా బ్యాకప్ తీసుకుంటూ ఉంటాయి. దాంతో మొబైల్ డేటా ఆన్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. అంత మాత్రాన ఆ మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నట్టుగానీ, మెసేజ్‌లు పంపిస్తున్నట్టుగానీ నిర్ధారింనట్టు కాదు. ఇక ఆ ఫోన్ల నుం ఇతర ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయా.. లేదా అన్నది కూడా ఐపీడీఆర్ డేటా ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. కాబట్టి ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్ రెడ్డి మధ్య ఆ రోజు రాత్రి వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ఐపీడీఆర్ డేటా ద్వారా నిర్ధారించలేం. ఈ విషయంలో సీబీఐ వాదన పూర్తిగా అహేతుకమని స్పష్టమవుతోంది. గంగిరెడ్డి మొబైల్ ఫోన్ నుంచి వెళ్లిన మెసేజ్‌లను గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని సీబీఐ తెలిపింది. కాగా 2019 వర్చి 15నే ఎర్ర గంగిరెడ్డి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేటాను పరిశీలించినప్పటికీ అందులో అనుమానాస్పదమైన సమాచారం ఏమీ లభించలేదని పోలీసులు ప్రకటించిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. గూగుల్ టేక్ ఔట్‌పై మాట మారింది! నిందితులు 2019 మార్చి 14, 15 తేదీల్లో ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిర్ధారించామన్న సీబీఐ వాదన తప్పని తేలిపోయింది. ఎర్ర గంగిరెడ్డి, ఉవశంకర్ రెడ్డి ఫోన్లు వారి ఇళ్లలోనే ఉన్నట్టుగా సెల్ టవర్ల లోకేషన్ స్పష్టం చేస్తోంది. కాగా సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాపై సీబీఐ ఎక్కువగా దృష్టి సారించింది. 2019 మార్చి 14 అర్ధరాత్రి 2.42 గంటలకు సునీల్‌యాదవ్ వివేకా నివాసంలో ఉన్నట్టు.. 2.34 గంటలకు వివేకా నివాసానికి 15 మీటర్ల దూరంలో, 2.35 గంటలకు వివేకా నివాసానికి 10 మీటర్ల దూరంలో ఉన్నట్టు.. 2.42 గంటలకు వివేకా నివాసంలో ఉన్నట్టుగా పేర్కొంది. కాగా సునీల్ యాదవ్ నివాసం వివేకా నివాసానికి 160 మీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఎంతో ముఖ్యమైన అంశం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గూగుల్ టేక్ ఔట్ డేటాకు, వాస్తవ లొకేషన్‌కు 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల వరకు వ్యత్యాసం ఉంటుందని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కేసు విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఆ విషయాన్ని ప్రశ్నించారు. గూగుల్ టేక్ ఔట్ డేటాను బట్టి ఎలా నిర్ధారించగలుగుతారని అడిగారు. దాంతో CBI తన మూడో అనుబంధ చార్జ్‌షీట్‌లో మాట మార్చింది. యూనివర్సల్ కాలమానానికి (UTC), భారత కాలమానానికి (IST) మధ్య వ్యత్యాసాన్ని తాము గమనించక పొరపాటు చేశామని వెల్లడించడం గమనార్హం. గూగుల్ టేక్ ఔట్ డేటాను విశ్లేషిస్తే ఢిల్లీలోని CFSL పేర్కొన్న సమయం UTC కాలమానం ప్రకారం అని వెల్లడించింది. వాస్తవానికి యూటీసీ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందుంటుంది. అంటే సునీల్ యాదవ్ వివేకా నివాసంలో 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 2.42 గంటలకు ఉన్నట్టు తాము మొదటి చార్జ్‌షీట్‌లో పేర్కొంది వాస్తవం కాదని సీబీఐ అంగీకరింంది. సునీల్ యాదవ్ వివేకా నివాసంలో 2019 మార్చి 15న ఉదయం 8.12 గంటలకు ఉన్నారని తెలిపింది. అంటే వివేకా హత్యకు గురయ్యారని అందరికీ తెలిసిన తర్వాత కొన్ని వందల మంది అక్కడ గుమిగూడిన తర్వాత సునీల్ యాదవ్ చేరుకున్నారని చెప్పింది. ఆస్తి వివాదాన్ని ఎందుకు పట్టించుకోలేదు? రాజకీయ కారణాలతోనే వివేకాను హత్య చేశారని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కానీ దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలను పరిశీలిస్తే ఆస్తి కోసం ఈ హత్య చేసి ఉండొచ్చన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే వివేకాను హత్య చేసిన తర్వాత నిందితులు ఆస్తి పత్రాల కోసం ఆయన నివాసంలో వెతికారన్నది స్పష్టమవుతోంది. ఆ నివాసంలో అల్మారా (బీరువా) తలుపు బద్దలు గొట్టడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు కూడా. అంటే హత్యకు ఆస్తి వివాదం ప్రధాన కారణం కావచ్చు. నిందితులు ఏ పత్రాల కోసం వెతికారన్నది సీబీఐ ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. దొంగతనం, ఆస్తి వివాదం అనే కోణంలో సీబీఐ ఈ కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే సమయంలో రెండు చోట్ల ఉండటం సాధ్యమా? సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నారనే దానిపై సీబీఐ వాదనలు మరింత అసంబద్ధంగా ఉన్నాయి. దస్తగిరిని అప్రూవర్‌గా వర్చి ఇప్పింన వాంగ్మూలం, రంగన్న వాంగ్మూలం ప్రకారం ఆ రోజు రాత్రి 1.30 గంటల నుంచి 3 గంటల వరకు సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి నివాసం లోపల ఉన్నాడు. కానీ ఆ రోజు రాత్రి 1.58 గంటలకు సునీల్ యాదవ్.. వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా గూగుల్ టేక్ అవుట్ డేటా చూపిస్తోందని కూడా సీబీఐ పేర్కొంది. ఒకే సమయంలో ఒక వ్యక్తి వేర్వేరు చోట్ల ఎలా ఉండగలరు? సునీల్ యాదవ్ ఆ సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉంటే.. అదే సమయంలో అక్కడికి కిలోమీటర్ దరంలో ఉన్న వివేకా నివాసంలో కూడా ఉండి ఆయన్ను ఎలా హత్య చేయగలడు? మరి సీబీఐ ఇంత చిన్న అంశాన్ని విస్మరిస్తూ కేసు దర్యాప్తు చేస్తుండటం ఏమిటి? రూ.40 కోట్ల డీల్ కథ తేల్చలేదెందుకు? అసలు వివేకానందరెడ్డిని నిందితులు ఎందుకు హత్య చేశారనే అంశంపై సీబీఐ వాదన అసంబద్ధంగా ఉంది. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం.. వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నాడు. అందుకు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి అడ్వాన్స్‌గా కోటి రూపాయలు పంపించారు. అందులో 25 లక్షలు సునీల్ యాదవ్ అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులతో పులివెందులలో విల్లా కొనుగోలు చేయాలని భావించినట్టు దస్తగిరి చెప్పాడన్నది సిబిఐ పేర్కొన్న విషయం. కాగా ఇక్కడ ప్రశ్నార్థకం ఏమిటంటే.. వివేకా హత్య కోసం కుదిరినట్టు చెబుతున్న డీల్ డబ్బును సీబీఐ ఇప్పటికీ రికవరీ చేయలేకపోయింది. కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూడా సీబీఐని ఇదే విషయంపై ప్రశ్నించారు. నిందితుల మధ్య చేతులు మారినట్టు చెబుతున్న డబ్బును ఎందుకు రికవరీ చేయలేకపోయారంటే సీబీఐ సరైన సవధానం చెప్పలేకపోయింది. పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న మున్నా బ్యాంక్ లాకర్ నుంచి రికవరీ చేసిన 46.70 లక్షల రూపాయలకు సంబంధించి సీబీఐ చెబుతున్న వాదన నమ్మదగ్గదిగా లేదని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. 2020 సెప్టెంబర్ 9న మున్నా బ్యాంకు లాకర్లో ఉన్న 46.70 లక్షల రూపాయలను సీబీఐ జప్తు చేసింది. ఈ జప్తు వ్యవహారం భారత సాక్ష్యాధారాల చట్టం సెక్షన్ 27 ప్రకారం లేదని న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం. -
Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ కథనం -2
వివేకాను చివరిగా ఎవరు చూశారు? వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 2019 మార్చి 14 రాత్రి 12 గంటల సమయంలో వివేకా తన నివాసం నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగడం రంగన్న చూశాడు. నిందితులు కాకుండా వివేకా జీవించి ఉండగా చివరిసారిగా చూసిన వ్యక్తి రంగన్న. పోలీసు దర్యాప్తు నియమావళి ప్రకారం జీరో అవర్‌గా పిలిచే అప్పటి నుంచే దర్యాప్తు మొదలు కావాలి. అయితే 2021లో దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం గానీ అనంతరం రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలోగానీ 11.30 గంటలకు ఎర్ర గంగిరెడ్డి వివేకా నివాసానికి వచ్చారని చెప్పడం గమనార్హం. సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు ఆద్యంతం అశాస్త్రీయం, అహేతుకం, అసంబద్ధం, సందేహాస్పదంగా ఉందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ కుండబద్దలు కొట్టింది. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని చెబుతున్న సీబీఐ.. కీలకమైన ఆస్తి వివాదం కోణాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. వివేకా హత్య అనంతరం ఆయన నివాసంలో నిందితులు ఆస్తి పత్రాల కోసం వెతికారన్నది స్పష్టమవుతున్నా, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించింది. రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో కూడా ఏమీ చెప్పని వాచ్మెన్ రంగన్నకు రెండున్నరేళ్ల తర్వాత అంతా గుర్తుకు వచ్చినట్టు సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇక కీలక ఆధారంగా గొప్పగా ప్రకటించిన గూగుల్ టేక్ అవుట్ డాటా పూర్తిగా తప్పని స్వయంగా సీబీఐనే ప్రకటించడాన్ని ‘ద వైర్’ ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి రాసిన రెండు విశ్లేషణాత్మక కథనాలను ‘ద వైర్’ వెబ్సైట్ ప్రముఖంగా ప్రచురించింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట కట్టు కథలా? మొదటి కథనంలో సీబీఐ దర్యాప్తులో డొల్లతనాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రచురించిన రెండో కథనంలో మరింత లోతుగా విశ్లేషించి సీబీఐ దర్యాప్తు తీరును ఎండగట్టింది. సీబీఐ ప్రస్తావించిన ఐపీడీఆర్ డాటా కూడా హేతుబద్ధ ఆధారం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తునకు ఆధారంగా చెబుతూ సాక్షుల వాంగ్మూలాల పేరిట సీబీఐ చెబుతోంది కట్టు కథలేనని స్పష్టం చేసింది. ఏకంగా 14 మంది సాక్షులు సీబీఐ తీరును తప్పుబట్టడం.. ఏకంగా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సీబీఐపైనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఏ కోణంలో చూసినా సరే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దారి తప్పిందనే విషయాన్ని స్పష్టం చేసింది. వాచ్మెన్ రంగన్న అప్పుడలా.. ఇప్పుడిలా వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన మొదటి దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం.. వాచ్మెన్ రంగన్న 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసం వరండాలో నిద్రపోయాడు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11.30 గంటల సమయంలో వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. కారు శబ్దం వినిపించి రంగన్న నిద్ర లేచి గేటు తెరిచాడు. వివేకా ఇంటి వద్ద దిగిపోయాక.. కారు డ్రైవర్ ప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. ‘నేను నిద్రపోతాను.. నువ్వు నిద్రపో’ అని వివేకా రంగన్నతో చెప్పి తన నివాసంలోకి వెళ్లిపోయారు. నార్కో ఎనాలిసిస్ ఎందుకు బయటకు రాలేదు? ఆ తర్వాత వివేకాను ఆయన నివాసంలో ఆ రోజు రాత్రి హత్య చేస్తుంటే బయటే ఉన్న రంగన్న ఏం చేశాడనే దానిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోని పోలీసు అధికారులు విచారించనే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని వారాల తర్వాత రంగన్న పేరు కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరికొందరు అనుమానితులతోపాటు రంగన్నను కూడా అహ్మదాబాద్ తీసుకువెళ్లి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఎలాంటి విషయాన్ని రాబట్ట లేదు. మరి రంగన్నకు ఏదైనా విషయం తెలిసి ఉంటే నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో బయటపడేది కదా! రెండున్నరేళ్ల తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయా? వివేకా హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సీబీఐ రంగన్నను ప్రత్యక్ష సాక్షిగా న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ సారి రంగన్న కొన్ని కొత్త విషయాలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 2019 మార్చి 14న రాత్రి వివేకాను ఇంటి వద్ద దించేసి డ్రైవర్ ప్రసాద్ వెళ్లిపోయిన తర్వాత.. 15 నిమిషాలకు అంటే 11.45 గంటలకు వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరుకున్నాడని చెప్పాడు. దర్యాప్తులో ఇదే కీలకమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలు రెండు చోట్ల సరిపోలుతున్నాయి. వివేకా నివాసానికి ఎర్ర గంగిరెడ్డి రావడం.. వెళ్లడం అనే అంశాలు. మృతదేహాన్ని అర్ధరాత్రే చూసిన రంగన్న 2021 జూలైలో జమ్మలమడుగు న్యాయస్థానంలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా నివాసం నుంచి శబ్దాలు రావడంతో కిటికీ వద్దకు వెళ్లి లోపలికి చూశాడు. లోపల నలుగురు వ్యక్తులు హాల్, బెడ్ రూమ్‌లలో తిరుగుతూ దేని కోసమో వెతుకుతున్నారు. రంగన్న ఓ చెట్టు వెనుక దాక్కున్నాడు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి బయటకు వచ్చి గోడదూకి వెళ్లిపోవడం చూశాడు. అనంతరం ఎర్ర గంగిరెడ్డి బయటకు వచ్చి విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లాడు. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో రంగన్న వివేకా నివాసం లోపలికి వెళ్లాడు. బెడ్రూమ్లో మంచం పక్కన రక్తం పడి ఉంది. బాత్రూమ్లో వివేకా కింద పడిపోయి ఉన్నారు. ఆయన చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్లు.. సాక్షుల వాంగ్మూలాల పేరిటా సీబీఐ అడ్డదారులు తొక్కింది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్టుగా గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్ నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. కనీసం 14 మంది సాక్షులు తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఖండించారు. నలుగురు సాక్షులు రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు కూడా. వివేకా చనిపోయారనే విషయాన్ని 2019 మార్చి 15న ఉదయం 6.15 గంటలకు ఆయన పీఏ కృష్ణా రెడ్డి గుర్తించారు. చెప్పని విషయాలు ఎలా ఆపాదిస్తారు? అంతకు ముందే వివేకా మరణం గురించి ఎవరికైనా తెలుసా అనే కోణంలో సీబీఐ దృష్టి సారించింది. వివేకా హత్య గురించి గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి 2019 మార్చి 15 తెల్లవారు జామున 4 గంటలకే తెలుసని ఆయన తల్లి తమ పొరుగున ఉండే ప్రభావతి దేవికి చెప్పినట్టుగా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ మేరకు ప్రభావతి దేవి 161 వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా వెల్లడించింది. కానీ సీబీఐ వాదనను ప్రభావతి దేవి ఖండించారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తన పేరిట వాంగ్మూలం నమోదు చేసుకుందని ఆవిడ స్పష్టం చేశారు. (చదవండి : Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు') అజేయ కల్లం పేరిట తప్పుడు వాంగ్మూలం సాధారణ వ్యక్తులే కాదు.. ఏకంగా రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వక్రీకరించడం వివాదాస్పదమైంది. అజేయ కల్లం చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి చార్జ్ïÙట్లో పేర్కొంది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సీబీఐ తీరును ఎండగడుతోంది. అజేయ కల్లం చెప్పింది ఇది 2019 మార్చి 15 ఉదయం 5 గంటలకు పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం మొదలైంది. గంటన్నర తర్వాత అంటే 6.30 గంటల సమయంలో సహాయకుడు వచ్చి ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డిని పిలిచారు. ఆయన బయటకు వెళ్లారు. తర్వాత కాసేపటికి కృష్ణమోహన్‌రెడ్డి వచ్చి వైఎస్ జగన్ చెవిలో ఏదో చెప్పారు. దాంతో నిశ్చేష్టులైన వైఎస్ జగన్ వెంటనే లేచారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోయారు అని మాతో చెప్పారు. వెంటనే సమావేశాన్ని ఆపేసి బయటకు వచ్చాం’ అజేయ కల్లం చెప్పారంటూ CBI మార్చిన వాంగ్మూలం ఇది ‘2019 మార్చి 15 ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుండగా.. ఇంట్లో సహాయకుడు వచ్చి వైఎస్ భారతి పిలుస్తున్నారని వైఎస్ జగన్‌కు చెప్పారు. దాంతో లోపలికి వెళ్లిన జగన్ కాసేపటి బయటకు వచ్చి తన చిన్నాన్న వివేకానందరెడ్డి మరణించినట్టు అక్కడ ఉన్న మాకు చెప్పారు’ అని అజేయ కల్లం వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. అసలు వైఎస్ భారతి పేరును తాను ప్రస్తావించలేదని, అలాగే తాను 6.30 గంటలని చెప్పగా 5.30 గంటలుగా సీబీఐ పేర్కొందని ఆయన తప్పుబట్టారు. అయినా బయట నిద్రించిన రంగన్న! రక్తం మడుగులో తన యజమాని వివేకానందరెడ్డి చనిపోయి ఉండడాన్ని చూసిన తర్వాత రంగన్న ఏం చేశారంటే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తలుపు దగ్గరకు మూసివేసి బయటకు వచ్చి అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అక్కడే బీడీ తాగాడు. కాసేపు మెట్ల మీద కూర్చున్నాడు. కాసేపట్లో సమీపంలోని మసీదు నుంచి ఉదయం ప్రార్థనలు వినిపించాయి. దాంతో అక్కడే వరండాలో నిద్రపోయాడు. సీబీఐ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న రెండు మసీదుల్లోని మత పెద్దలతో మాట్లాడారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రోజూ ఉదయం 5 గంటలకు మసీదులో ప్రార్థనలు మొదలవుతాయి. అప్పటికి 15 నిమిషాల ముందే మసీదు మైకుల ద్వారా ఆజాన్ వినిపించడం మొదలు పెడతారు. అంటే తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.45 గంటల మధ్యలో రంగన్న తన యజమాని వివేకా మృతదేహాన్ని చూశాడు. కానీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న వివేకా వద్ద పని చేసే సిబ్బందికి గానీ.. అక్కడికి పది నిమిషాల్లోనే వెళ్లగలిగేంత సమీపంలో ఉన్న డ్రైవర్ ప్రసాద్ నివాసానికి గానీ.. మరెవరికైనా చెప్పాలనిగానీ అనుకోలేదు. ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య వివేకా పీఏ కృష్ణా రెడ్డి, వంటమనిషి లక్షి, ఆమె కుమారుడు ప్రకాశ్ వచ్చే వరకు నిద్రపోతున్నట్టు నటిస్తూ గడిపాడు. పైగా ఉదయం వివేకా నివాసం ఉత్తరం వైపు తలుపు తెరచి ఉండటాన్ని చూసిన పీఏ కృష్ణా రెడ్డి.. తనను ఇంటి లోపలికి వెళ్లి చూడమంటే రంగన్న లోపలికి వెళ్లాడు. అప్పుడు వివేకా మృతదేహాన్ని మొదటి సారి చూసినట్టుగా అందర్నీ నమ్మించాడు. ఆ విషయాన్ని 861 రోజుల తర్వాత సీబీఐ ద్వారా న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం, రంగన్న ఇచ్చిన వాంగ్మూలం తప్ప మరే ఆధారం లేదు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ది వైర్ సంచలన కథనం
-
Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. రాజకీయంగా అత్యంత సంచలనమైన కేసు.. దర్యాప్తు చేస్తోంది దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. దర్యాప్తు చేపట్టిన 1,226 రోజుల తర్వాత కూడా సీబీఐ సాధించింది ఇదీ అని చెప్పడానికి ఏమీ లేదన్నది నిర్వివా దాంశం. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందనే మాట చెప్పడం తప్ప.. అందుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఆధారాలు చూపించలేకపోయింది’ అని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ పేర్కొంది. నిష్పాక్షికమైన థర్డ్ పార్టీగా ‘ద వైర్’ వెబ్సైట్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లోని అంశాలను విశ్లేషించింది. రాజకీయ, నేర, న్యాయ సంబంధమైన వార్తా విశ్లేషకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సరిత రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన విశ్లేషాత్మక వ్యాసం ఇలా.. సాధించింది శూన్యం 2020 మార్చి 11న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే 120 రోజుల సమయం తీసుకుంది. మరో 474 రోజుల తర్వాత 2021 అక్టోబర్‌లో మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వివేకా హత్యలో పాలుపంచుకున్నారని చెబుతూ ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్(ఏ–2), గజ్జల ఉమాశంకర్ రెడ్డి(ఏ–3), దస్తగిరి(ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. ఈ హత్య వెనుక విస్తృత కుట్రను వెలికి తీయాల్సి ఉందని చెప్పింది. సీబీఐ తుది చార్జ్‌షీట్ 2023 జూలై 20న బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వారి సన్నిహితుడు డి.శివశంకర్‌రెడ్డిలను కూడా నిందితులుగా పేర్కొంది. కానీ సీబీఐ మొదటి నుంచీ పేర్కొంటూ వచ్చిన విస్తృత కుట్ర గురించి మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. హత్య వెనుక ఉద్దేశం అంటూ 14 పేరాల సుదీర్ఘ వ్యాసాన్ని చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. అందులో ఏముంది అంటే అందరికీ తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ నేపథ్యం, వంశ చరిత్ర మాత్రమే. ఇది తప్ప వాస్తవానికి హత్య వెనుక విస్తృత కుట్ర గురించి సీబీఐ స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయింది. ఇంతకీ ఇంతటి హైప్రొఫైల్ కేసుకు సంబంధించిన తుది చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు, వాటిలోని వాస్తవాలను పరిశీలిస్తే సీబీఐ దర్యాప్తులో డొల్లతనం బట్టబయలు అవుతోంది. సీబీఐ తాను పేర్కొన్న అభియోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క దానికి కూడా ఆధారం చూపించలేకపోయింది. అంతకు మించి వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబంలో విభేదాలు, బయట శక్తుల ప్రమేయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడం విస్మయ పరుస్తోంది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ఏం చెప్పింది.. అందులోని వాస్తవం ఏమిటన్నది అంశాల వారీగా పరిశీలిస్తే ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు సాధించింది శూన్యమన్నది స్పష్టమవుతోంది. సీబీఐ చెప్పిందేమిటి? వాస్తవం ఏమిటి? అన్నది చూద్దాం. 1.వివేకా క్రియాశీలకమైన నేతా? సీబీఐ : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. వాస్తవం : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత కాదు. హత్యకు గురయ్యే 15 ఏళ్ల ముందు 2004లో చివరిసారిగా ఎన్నికల్లో గెలిచారు. దశాబ్ద కాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. వివేకా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారని ఆయన కుమార్తె సునీతనే సీబీఐకి రెండుసార్లు చెప్పారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన రాజకీయాల నుంచి రిటైరై పోయినట్టేనని ఆమె చెప్పారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి పదవిలో లేరు. పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మ చేతిలో భారీ తేడాతో ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్ చేయలేదు. ఆయన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం కూడా ఇందుకు కారణం అయిఉండొచ్చు. 2.అవినాశ్ బలమైన అభ్యర్థి కాదా? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్ అవినాశ్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకానందరెడ్డి భావించారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వాస్తవం : అవినాశ్‌రెడ్డి బలహీనమైన అభ్యర్థి అన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో 1,90,323 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఆయన ఎంత బలమైన అభ్యర్థో ఆ మెజార్టీనే చెబుతుంది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో పార్టీ నిర్ణయం మేరకు తన ఎంపీ పదవికి 2018లో రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవినాశ్‌రెడ్డి మరింత భారీ మెజార్టీతో అంటే 3,80,976 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అంత మెజార్టీ సాధించడం విశేషం. ఏ రకంగా చూసినా అవినాశ్‌రెడ్డి బలమైన అభ్యర్థి అన్నదాంట్లో సందేహం లేదు. వివేకానందరెడ్డి తాను హత్యకు గురికావడానికి ముందు వరకు కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్యకు గురైన ముందు రోజు రాత్రి కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు వెల్లడించారు. అవినాశ్‌రెడ్డే ఎంపీ అభ్యర్థి అన్న విషయంలో మరో మాటే లేదని వివేకానందరెడ్డి సోదరి వైఎస్ విమల కూడా స్పష్టం చేశారు. ఎంపీగా అవినాశ్ గెలుపు కోసం వివేకా చివరి వరకు ప్రచారం చేశారని కూడా ఆమె చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ దురుద్దేశంతో అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 3. షర్మిల వాంగ్మూలంలో చెప్పినదానికి ఆధారం ఎక్కడ? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకా భావించారనే విషయాన్ని షర్మిల వెల్లడించారు. వాస్తవం : కడప ఎంపీ అభ్యర్థిత్వం విషయంపై వివేకానందరెడ్డి తనతో చెప్పినట్టుగా షర్మిల వెల్లడించిన సమాచారానికి ఎలాంటి ఆధారం లేదు. ఎంపీగా తానుగానీ తన తల్లి విజయమ్మగానీ పోటీ చేయాలని వివేకా చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చిన షర్మిల.. అందుకు ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. ఎంపీ టికెట్ అంశంపై వారిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా గతంలో ఎప్పుడూ మీడియాలోగానీ పార్టీ వర్గాలుగానీ చెప్పలేదు. సీబీఐ ఎలాంటి ఆధారం గురించి పేర్కొన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల తర్వాత షర్మిల తన సోదరుడితో రాజకీయంగా విడిపోయి తెలంగాణాలో సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ విషయం కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నదే. ఒక వేళ కడప ఎంపీ అభ్యర్థి విషయంపై వివేకానందరెడ్డికి వేరే అభిప్రాయం ఉన్నా సరే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసినప్పటి నుంచి వైఎస్సార్ కుటుంబ వ్యవహారాల్లో ఆయన పాత్ర పెద్దగా లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర పెద్దగా ఏమీ లేదన్నది ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డిపై సానుకూల దృక్పథంతో వైఎస్ జగన్ ఆయన్ను వైఎస్సార్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ చేశారు. కానీ వివేకా ఏనాడూ కూడా పార్టీ ముఖ్య నేతగా ఉండలేదు. 4. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీబీఐ చెప్పింది కట్టుకథే సీబీఐ : 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కారణం. అవినాశ్‌రెడ్డి అనుచరుడు డి.శివశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావించినప్పటికీ వైఎస్ జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి పని చేశారు. దాంతో వివేకా ఆగ్రహంతో డి.శివశంకర్‌రెడ్డిని దూషించారు. వాస్తవం : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డి కారణమనడానికి సీబీఐ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 800 మందికిపైగా ఓటర్లలో ఎవర్ని ప్రలోభాలకు గురిచేశారో కూడా చెప్పలేకపోయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో సీబీఐ కనీసం మాట్లాడనే లేదు. ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి, ఆయన హత్యకు సంబంధం ఉన్నట్టుగా కూడా సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించనే లేదు. రెండేళ్ల క్రితం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషయంపై తలెత్తిన వివాదం వల్ల తమను దూషించారనే ఉద్దేశంతో 2019 ఎన్నికల ముందు హత్యకు ఎవరైనా ప్రయత్నిస్తారా? అందులోనూ 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి కుటుంబం 2019 ఎన్నికల ముందు హత్య వంటి దుందుడుకు పనులకు ఎందుకు ఒడిగడుతుంది? పైగా 2019 ఎన్నికల్లో 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన అవినాశ్ రెడ్డికి వివేకాతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏమాత్రం ఉండదు. సీబీఐ తమ ఆరోపణకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వివేకా గుండెకు ఆపరేషన్ చేసుకున్నప్పటికీ ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులలో ఉండటం లేదు. హైదరాబాద్‌లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. నెలకు ఒకట్రెండుసార్లు పులివెందుల వచ్చి వెళుతున్నారు. కుమార్తె సునీత ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే వస్తున్నారు. ‘షమీమ్‌తో మా నాన్న సహజీవనం చేస్తున్నారని 2011లో బయటపటినప్పటి నుంచి ఆయనతో నేను సఖ్యతగా లేను. పులివెందులకు ఎప్పుడోగాని వెళ్లడం లేదు. 2018లో క్రిస్మస్ తర్వాత మళ్లీ నేను పులివెందుల వెళ్లనే లేదు. నా భర్త ఎన్.రాజశేఖర్‌రెడ్డి మాత్రం అప్పుడప్పుడు వెళుతుండేవారు’ అని సునీత చెప్పారు. వివేకానందరెడ్డి తన పేరును అక్బర్ఖాన్గా మార్చుకుని షమీమ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారు. షమీమ్ కుటుంబం నిర్వహణ బాధ్యత చూస్తుండటంతోపాటు ఆమె చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశారు. బలపనూరులో ఆమె ఇంటి పై అంతస్తును నిర్మించడంతోపాటు 8 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఇక వివేకానందరెడ్డి మొదటి భార్య సోదరులు తనను బెదిరించేవారని షమీమ్ సీబీఐకి చెప్పారు. పెద్ద భార్య పెద్ద సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని తెలిపారు. తన కుమారుడికి హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పించడంతోపాటు అక్కడే ఓ ఇల్లు కొని ఇచ్చి.. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వివేకా షమీమ్‌కు మాట ఇచ్చారు. కానీ అంతలోనే వివేకా హత్యకు గురయ్యారు. అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వివేకా వివేకానందరెడ్డి షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడంతోపాటు ఆస్తి ఇస్తానని చెప్పడంతో మొదటి భార్య కుటుంబం ఆగ్రహించింది. కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకు చెక్ పవర్ రద్దు చేసింది.చెక్‌పవర్ రద్దు కావడంతో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మద్యం, ఇతర అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేక అల్లాడిపోయారని వివేకా ఇంట్లో పనివానిగా ఉన్న పెందింటి రాజశేఖర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సునీల్ యాదవ్, దస్తగిరిలతో సన్నిహితమయ్యారు. వారు చెప్పినట్టు చేస్తే వారిద్దరు డబ్బులు తెస్తారని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో చెప్పేవారు. ఎనిమిది మంది నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఓసారి పెందింటి రాజశేఖర్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తమ ఇంట్లో డబ్బు కోసం ఏదో గొడవ జరుగుతోంది.. వివేకానందరెడ్డి బాగా తాగేసి గొడవ చేస్తున్నారని చెప్పారు. ‘మా నాన్న వివేకా ఇష్టానుసారంగా అప్పులు చేసి, తీర్చకపోవడంతో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ట్రాక్ రికార్డ్ సరిగా లేకపోవడంతో కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. కంపెనీల నిర్వహణకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు అడ్డంకిగా ఉండకూడదనే మా నాన్న చెక్ పవర్‌ను రద్దు చేశాం’ అని సునీత చెప్పారు. వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన స్థానంలో సునీత ఆ కంపెనీల్లో డైరెక్టర్ అయ్యారు. జీవించి ఉండగా రోజువారి ఖర్చుల కోసం వివేకా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలకే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆ కంపెనీ అప్పులన్నీ చాలా వరకు తీర్చేశారు. కంపెనీలన్నీ గాడిలో పడ్డాయి. ఈ ఏడాది జనవరిలో 93 ఎకరాల భూమిని సౌభ్యాగమ్మ, సునీత పేరిట బదిలీ చేశారు. బయటి శక్తుల పాత్ర పట్టించుకోని సీబీఐ వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వనే లేదు. కుటుంబ విభేదాలు, రాజకీయంగా అడ్డుకునేందుకు యత్నించారంటూ సీబీఐ చెబుతున్న కారణాలేవీ కూడా నమ్మదగ్గవిగా లేవు. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. అదే సమయంలో వివేకా కుటుంబంలో విభేదాలు, ఇతర అంశాలను కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. మొత్తం ఉమ్మడి కుటుంబంలో విభేదాలు అనే అంశాన్నే సీబీఐ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం కేవలం కేసును తప్పుదారి పట్టించేందుకేనని స్పష్టమవుతోంది. వివేకా హత్య వెనుక బయటి శక్తుల ప్రమేయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించనే లేదు. ఇప్పటి వరకు కేవలం సీబీఐ అప్రూవర్‌గా మార్చిన నిందితుడు దస్తగిరి, వాచ్‌మేన్ రంగయ్య వాంగ్మూలాలనే ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తోంది. కానీ వారు నిజాలే చెబుతున్నారడానికి ఆధారం ఏమిటి? -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం ప్రచురించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది చార్జీషీటు తప్పల తడక అంటూ విశ్లేషించింది. కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలంతో సీబీఐ వివేకా హత్యకు సంబంధించి విచారణ ముగించిందని సీబీఐ చార్జిషీటులో అసంబద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవని ది వైర్ కథనం స్పష్టం చేసింది. వివేకా మర్డర్ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. ఇక ఈ నెల 20న వచ్చిన తుదిచార్జీ షీట్లో సీబీఐ కేవలం అసంబద్ధమైన కథనాలను వండివార్చిందని ది వైర్ ఏకిపారేసింది. వివేకా హత్యకు ప్రధాన కారణం కడప ఎంపీ సీటుపై వచ్చిన విభేదాలే అని సీబీఐ చార్జీషీటులో పేర్కొంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ వివేకా రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ చెప్పింది. ఇక కడప ఎంపీ టిక్కెట్ తనకు కానీ, వైఎస్ షర్మిలకు కానీ, వైఎస్ విజయమ్మకు ఇవ్వాలని వైఎస్ వివేకా కోరుకున్నారనేది సీబీఐ థియరీ. చదవండి: వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్! ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి బలహీనమైన అభ్యర్థి అని వివేకా వాదించనట్లు.. అందుకే అవినాష్‌రెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వకూడదని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాలని వివేకా చెప్పేవారని తన చార్జిషీటులో సీబీఐ కథనం అల్లింది. అయితే ఈ కథనానికి ఎక్కడా ఆధారం చూపలేకపోయింది. పైగా సీబీఐ చార్జిషీటులోనే ఈవాదనను వ్యతిరేకిస్తూం ఎన్నో అంశాలున్నాయి. కడప సీటుకు సంబంధించి హత్య జరిగిందని సీబీఐ చెప్తున్న మాటలకు చాలా వైరుధ్యాలున్నాయి.ఇందులో వివేకా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని సీబీఐ చెప్పిన మాటలు పూర్తి వాస్తవ విరుద్ధం. నిజానికి 2004 తర్వాత వివేకా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. అసలు తన తండ్రి రాజకీయాల్లోకి రిటైర్ అయ్యారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది. 2011 లో వైఎస్ విజయమ్మ చేతిలో ఓటమి తర్వాత మా నాన్న రాజకీయాలకు దూరంగా ఉన్నారని సునీత సీబీఐకి చెప్పింది. దీనిని పూర్తిగా పక్కన పెట్టిన సీబీఐ వివేకా యాక్టివ్‌గా ఉన్నారని చార్జిషీట్లో రాసుకొచ్చింది. ఇక కడప ఎంపీ అభ్యర్ధి విషయంలో వచ్చిన విభేదాలే హత్యకు కారణమని సీబీఐ చెప్పిన మాటలకు ఆధారాలు లేవు. పైగా ఇది పూర్తి అబద్ధం అని నిరూపించే ఆధారాలు చార్జిషీట్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా 2019 మార్చి 10న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక మార్చి 17, 2019 న ఒకేసారి అన్ని స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు రోజులు ముందుగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉన్నా.. వివేకా మరణంతో రెండు రోజులు ఆలస్యమయింది. ఇక నోటిఫికేషన్‌కంటే ముందు అంటే అధికారికంగా అభ్యర్ధుల పేర్లు ప్రకటించడం కన్నా ముందే కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాష్‌రెడ్డి పేరు ఖరారైంది. ఇక కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బలహీన అభ్యర్థి అనేది వాస్తవ విరుద్ధం. 2014 లోనే కడప నుండి లక్షా 93 వేల 323 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి. 2019 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి 3,80,976 ఓట్లతో ఆదినారాయణ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత బలమైన అభ్యర్థి అనేది కడప వారినే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ఇక కడప ఎంపీ అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్వతహాగా వివేకా కూతురు, అల్లుడు స్వయంగా సీబీఐకి చెప్పారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ఎప్పుడో నిర్ణయించారని వైఎస్ వివేకానందరెడ్డి కూడా అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేశారని స్వయంగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో వెల్లడించారు. వివేకా చనిపోవడానికి ఒకరోజు ముందు వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి వివేకా జమ్మలమడుగులో ప్రచారం చేసినట్టు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటికి రెండుసార్లు చెప్పారు. అంతే కాదు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి మినహా మరెవరి పేరు చర్చకు లేదని, అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎవ్వరూ ఎన్నడూ వ్యతిరేకించలేదని వైఎస్ వివేకా సోదరి విమలమ్మ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ విషయాలేవి మాత్రం సీబీఐకి కనపడలేదు. పైగా కడప ఎంపీ విషయంలో జోక్యం చేసుకుని పెద్దగా ప్రభావం చూపగల శక్తిగాని అంత అధికారంగాని వివేకాకు లేదని కడప రాజకీయాలను గమనించేవారందరికి తెలుసు. వైఎస్ వివేకా కడప ఎంపీ అభ్యర్థి నిర్ధారించే విషయంలో వైఎస్ వివేకా ప్రభావం చాలా తక్కువ. 2011 లో వైఎస్ జయమ్మకు వ్యతిరేకంగా పోటీ చేసిన వివేకా అనంతరం వైఎస్సార్ కుటుంబానికి దూరమయ్యారు. వైఎస్ మరణం తర్వాత ఆయన తన కుటుంబంతో వెళ్లి సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా అధికారం కోసం వైఎస్ వివేకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ బయటకు వస్తే మంత్రి పదవి కోసం ఏకంగా తల్లిలాంటి వదిన విజయమ్మపై పోటీ చేశారు. 2008లో అమెరికా నుండి వచ్చినవైఎస్ వివేకా అల్లుడికి రాజకీయ కాంక్ష ఎక్కువ. ఒకటి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రయత్నించారు. 2011లో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా నర్రెడ్డి కుటుంబం ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎన్నికల్లో విజయమ్మ చేతిలో వివేకా ఘోరంగా పరాజయం పొందారు. ఇంత జరిగినా చిన్నాన్న వివేకాపై వైఎస్ జగన్ సానుభూతిగానే వ్యవహరించారు. ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, కడప జిల్లా ఇన్ ఛార్జ్‌ని చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నంత ప్రభావవంతంగా వివేకా లేరనేది చాలామంది కడప నాయకులకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే అంత ప్రభావం చూపిస్తారా ఒకవైపు తన తండ్రి రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యారని స్వయంగా వివేకా కూతురు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు అధికారిక ప్రకటన కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అన్న విషయం అందరికీ తెలుసని.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చారు. అయినా సీబీఐ మాత్రం కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందనిఛార్జ్ షీట్ లో కథ అల్లడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక కడప ఎంపీ సీటే వివేకా హత్యకు కారణం అని కథ అల్లిన సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ఇక ఈ కథనానికి బలం చేకూర్చేందుకు సీబీఐ మరో కథను సిద్ధం చేసింది. అదే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి. వివేకాను అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ద్రోహం చేశారని అందుకే ఆయన ఓడిపోయారనేది సీబీఐ కథనం. ఇక ఓటమికి కారణం అయిన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఇంటికి వెళ్లి వైఎస్ వివేక తీవ్రంగా అవమానించారనేది సీబీఐ చార్జిషీటులో చెప్పిన మాట. దీంతో వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబం వివేకాను హత్య చేసిందనిం సీబీఐ కథనం అల్లింది. అయితే అసలు వాస్తవం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. వివేకాను ఎమ్మెల్సీ చేసేందుకు వైఎస్ జగన్ ఆయనకు బీఫాం ఇచ్చారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైన గెలవడానికి స్థానిక సంస్థల సభ్యులను బెదిరించి.. ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. అయితే సీబీఐ మాత్రం ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు వివేకాకు వ్యతిరేకంగా పనిచేసినట్లు చెబుతోంది. అయితే దీనికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన 800 మంది ఓటర్లలో ఒక్కర్ని కూడా సీబీఐ విచారించలేకపోయింది. ఈ 800 మందిలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తమకు డబ్బు ఇచ్చారని ఎక్కడా చెప్పలేదు. వీరెవరి దగ్గరు సీబీఐ స్టేట్మెంట్లు రికార్డు చేయేలేదు. అంతే కాదు కనీసం వివేకాను ఓడించిన మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని కూడా సీబీఐ విచారించ లేదు. అయినా రాజకీయ కక్షతోనే హత్య జరిగిందని ఛార్జ్‌షీట్ లో కథనం అల్లేసింది. రెండేళ్ల కిందట జరిగిన గొడవకు, ఇప్పుడు జరిగిన హత్యకు సంబంధం ఎలా ఉంటుందో సీబీఐ చెప్పలేదు. ఇక సీబీఐ చార్జిషీటులో రాజకీయ కోణమే హత్యకు కారణమని తేల్చేసింది. ఎక్కడా ఆధారం లేకపోయిన కథనం అల్లేసి వండివార్చేసింది. ఇక మిగిలిన ఆధారాలను మాత్రం పక్కన పడేసింది. అందులో ముఖ్య కారణం..ఆస్తి తగాదాలు. హత్య జరిగిన సమయానికి వివేకా వయస్సు 67 సంవత్సరాలు.పులివెందులలోని తన నివాసంలో వివేకా ఒంటరిగా నివసిస్తున్నారు. వివేకాకు ఆరు నెలలకిందటే గుండె ఆపరేషన్ జరిగినా వివేకా భార్య మాత్రంం వివేకాను వదిలి తన కుమార్తె సునీత దగ్గర ఉంటున్నారు. నెలకు ఒక్కసారి మాత్రమే వివేకా దగ్గరకి ఆయన సతీమణి వచ్చి వెళ్లేవారు. వివేకా కూతురు సునీతా ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే తండ్రిని కలిసేవారు. వ్యాపార సంబంధాల కారణంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం పలు మార్లు వివేకాను కలిసేవారనేది సీబీఐ సేకరించిన వాంగ్మూలాల ద్వారా స్పష్టం అవుతోంది. వివేకా గురించి ఆయన కుమార్తె సునీత సీబీఐతో చెప్పిన విషయాలతో వారి కుటుంబం మధ్య ఉన్న గొడవలు స్పష్టంగా అర్ధం అవుతాయి. తన తండ్రి వివేకాకు షమీమ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసాక తాను తండ్రి దగ్గరకు వెళ్లే దాన్ని కాదని ఏడాదిలో ఒకటి రెండు సార్లు వెళ్లినా కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే అక్కడ ఉండే దాన్నని సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. వివేకా హత్య కంటే ముందు 2018 క్రిస్మస్ రోజున తాను చివరిసారిగా వివేకా ఇంచికి వెళ్లినట్లు సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. షమీమ్అనే మహిళతో వివాహేతర సంబంధం కారణంగా వివేకాకు మొదటి భార్య కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయనిం సీబీఐకి షమీమ్ ఇచ్చిన వాంగ్మూలం స్పష్టం చేస్తోంది. 2006లో వివేకాకు షమీమ్ అనే మహిళతో పరిచయమైంది. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం కోసం వివేకా సహాయం కావాలని షమీమ్ కోరింది. ఇక వివేకా షమీమ్ల మధ్య పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. దీంతో తన పేరును అక్బర్‌గా మార్చుకుని వివేకా షమీమ్‌ను వివాహం చేసుకున్నారు.మరణించే సమయానికి వివేకా, షమీమ్ లకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం గురించి తెలిసిన తర్వాత వివేక మొదటి భార్య కుటుంబ సభ్యులు తనను బెదిరించారని షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ పలుమార్లు మనుషులను పంపి నన్ను బెదిరించారని.. తన కోసం వివేకా పలుమార్లు బావ మరుదులతో ఘర్షణకు దిగారని సీబీఐకి తెలిపిన షమీమ్. నెలసరి ఖర్చులతో పాటు వివేకా తనను అన్ని రకాలుగా చూసుకున్నారని షమీమ్ సీబీఐకి తెలిపారు. 2018లో గుండె ఆపరేషన్ తర్వాత తన ఆరేళ్ల కుమారుడి భవిష్యత్ కోసం వివేకా ఆందోళన చెందేవారని షమీమ్ సీబీఐ అధికారులకు తెలిపింది. తన కుమారుడిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించడంతో పాటు తనకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిస్తానని కొంత డబ్బు ఫిక్డ్స్ డిపాజిట్ చేయించడంతో పాటు వ్యవసాయ భూమిని కొనిస్తానని వివేకా వాగ్ధానం చేశారని సీబీఐ వాంగ్మూలంలో చెప్పిన షమీమ్. అయితే చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అన్ని కంపెనీల నుండి వివేకా చెక్ పవర్ తొలగించడంతో ఆయన తీవ్రమైన ఆందోళనకు గురైనట్లు స్టేట్మెంట్లో స్పష్టం చేసిన వివేకా రెండో భార్య షమీమ్. ఇక మరణించడానికి కొద్ది రోజుల ముందు నుంచి వివేకా తీవ్రమైన వేదనలో ఉన్నట్లు కేర్‌టేకర్ పండింటి రాజశేఖర్ సీబీఐకి తెలిపారు. డబ్బులు లేకపోవడంతో వివేకా ఆందోళనకు గురయ్యారని.. ఫలితంగా విపరీతంగా మద్యం సేవించేవారని రాజశేఖర్ చెప్పాడు. ఒకరోజు డబ్బు విషయం మాట్లాడటం విన్నట్లు త్వరలోనే డబ్బు వస్తుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో అన్నట్లు పండింటి రాజ స్టేట్ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఎర్ర గంగిరెడ్డిని బూతులు తిడుతూ వివేకానందరెడ్డి గట్టిగా అరిచేవారని అయినా ఎర్ర గంగిరెడ్డి మౌనంగా ఉంటూ తరచూ వస్తు ఉండేవాడనేది రాజా సీబీఐకి చెప్పాడు. ఇక హత్యకు కొద్ది రోజుల ముందు నుంచి వివేకా ప్రవర్తన అసాధారణంగా మారిపోయిందని.. మెట్ల మీద కూర్చుని విపరీతంగా మద్యం సేవించడం, సిగరెట్లు విపరీతంగా కాల్చేవారని రాజా సీబీఐకి పూసగుచ్చినట్లు చెప్పాడు. మెల్లమెల్లగా వివేకా ఆరోగ్యం పూర్తిగాక్షీణించడం ప్రారంభించిందని ఇది చూసి తాను ఒకరోజు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానట్లు రాజా స్టేట్మెంట్లో స్పష్టం చేశాడు. ఇంకా ఏదో ఒకపంచాయతీ విషయంలో పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని వివేకా ఎదురుచూస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డికి చెప్పానని సీబీఐ ముందు రాజా ఒప్పుకున్నాడు. ఇక వివేకా డబ్బు వ్యవహారాల గురించి పండింటి రాజశేఖర్‌తో పాటు చాలా మందికి తెలుసు.సీబీఐ వాంగ్మూలాలను పరిశీలించినా వివేకాకు దాదాపు 5 కోట్ల అప్పు ఉందని స్పష్టమౌతోంది. ఇక ఓవైపు వివేకా అప్పులతో తీవ్రమైన వేదనలో ఉంటేం సునీత రెడ్డి మాత్రం సీబీఐ వాంగ్మూలంలో మరో చెప్పింది. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రి చనిపోయే సమయానికి ఆయన పేరు మీద 50 కోట్ల ఆస్తి ఉందని సునీతరెడ్డి చెప్పింది. అయితే వివేకా చెక్ పవర్ ఎందుకు తొలగించారని అడిగిన ప్రశ్నకు సునీత రెడ్డి విచిత్రమైన సమాధానం చెప్పింది. తాము వ్యాపారం కోసం అప్పు తీసుకొడానికి ప్రయత్నించినట్టు, అయితే వివేక అప్పటికే చాలా అప్పులు చేసినందున తమ కంపెనీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించినట్లు సునీత వాంగ్మూలంలో చెప్పుకొచ్చింది. అందుకే బ్యాంకు అకౌంట్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసి వివేకా చెక్ పవర్‌ను తొలగించినట్లు సునీతారెడ్డి చెప్పింది. కేవలం కంపెనీలో అప్పుతెచ్చుకోవడానికే ఈ మార్పులు చేశామని తన తండ్రి కంపెనీలలో తాను కూడా డైరెక్టర్‌గా ఉన్నానని సునీత ఒప్పుకుంది. ఇక వివేకా మరణం తరువాత ఆయన స్థానంలో తాను డైరెక్టర్‌గా చేరిన సునీత.. తండ్రి మరణం తరువాత అప్పులన్నీ కట్టేసి కంపెనీలను లాభాలలోకి తెచ్చామని చెప్పిన సునీత. అయితే వివేకా బతికి ఉన్నప్పుడు మాత్రం కనీస ఖర్చులకు డబ్బులు లేకుండా ఆయన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ వివేకా మరణం తరువాత 2023 జనవరిలో 93 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకున్న కూతురు సునీత రెడ్డి, భార్య సౌభాగ్యమ్మ. వివేకా కుటుంబంలో ఈ స్థాయిలో ఆస్తి కోసం కుట్రలు జరిగినా సీబీఐ మాత్రం వీటిని పట్టించుకోలేదు. తన విచారణలో ఎక్కడా హత్యకు సంబంధించిన కారణాలలో ఆస్తి తగాదాలకు సంబంధించిన కోణంలో విచారణ జరప లేదు. కేవలం రాజకీయ కోణాన్నే హత్యకు కారణంగా చూపేందుకు సీబీఐ కావాలని ఆస్తి తగాదాలను చిన్నదిగా చెప్పే ప్రయత్నం చేసింది. వివేకా హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం పైన సీబీఐ పూర్తిగా విచారణ జరపలేదు.సీబీఐ విచారణ మొత్తం కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ తన విచారణను ముగించింది. వివేకా హత్యకేసులో నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న చెప్పిన మాటలే సీబీఐ విచారణకు ఆధారం. కానీవీళ్లిద్దరు నిజం చెప్తున్నారా...? అనే దానికి ఎక్కడా ఆధారం లేదు అంటూ ది వైర్ కథనంలో పేర్కొంది. -
కులాలవారీ జనగణన.. బీజేపీకి పరీక్షే..!
ఒక జాతీయ పత్రిక నిర్వహించిన తాజా సర్వే... నరేంద్ర మోదీ ప్రజాదరణ 66 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ప్రజాదరణ కూడా ప్రత్యేకించి నిరుపేద ఓటర్లలో తీవ్రంగా దెబ్బతింది. నితిశ్ కుమార్ ఈ పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు. యూపీలో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ సవాలు ఎదుర్కొంటున్న తరుణంలో నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని నితీశ్‌కు తెలుసు. ఈ నేపథ్యంలోనే లాలూ, ములాయం, నితీశ్ శిబిరాలు రెండో మండల్ యుగం గురించి చర్చిస్తున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలను మండల్ 2 యుద్ధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొనడాన్ని మనం గుర్తుంచుకోవాలి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, హెచ్ఏఎమ్ అధ్యక్షుడు జితిన్ రామ్ మాంఝీ తదితర నేతలు కులాలవారిగా జనాభా గణన సమస్యపై ఆగస్టు 23న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత బిహార్ సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కులాలవారీ జనగణన అంశంపై నిర్ణయం ప్రధాని మోదీపైనే ఉందనేశారు. ఈ అంశంపై బిహార్ ప్రజలతోపాటు దేశం మొత్తంగా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని, ప్రధాని మా మాటలు ఆలకించినందుకు కృతజ్ఞులమనీ, ఆయనే ఇక దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉందని నితీశ్ స్పష్టం చేశారు. దేశంలో కులాలవారీ జనాభా గణన చేపట్టాలని ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడమే నితీశ్ లక్ష్యం. ప్రధానితో భేటీ అనంతరం తేజస్వి యాదవ్ కూడా మాట్లాడుతూ, ’జాతి ప్రయోజనాల రీత్యా ఇది ఒక చారిత్రక ముందడుగు, పేదలంతా దీనివల్ల లబ్ధి పొందుతారు. దేశంలోని జంతువులను, చెట్ల సంఖ్యను లెక్కించగలుగుతున్నప్పుడు, కులాల వారీగా సమగ్ర డేటా లేకుండా ప్రభుత్వం సంక్షేమ విధానాలను ఎలా చేపట్టగలద’ని ప్రశ్నించారు. ఇది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. కులాలవారీ జనగణనపై నిర్ణయం తీసుకోవడం ప్రధానికి సులభమైన పనేనా? కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి దీనివల్ల ఎదురయ్యే రాజకీయపరమైన అడ్డంకులేమిటి? బిహార్‌లో ఆర్జేడీ, ఐక్య జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలకు, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి, తదితర పార్టీలకు ఈ కులాలవారీ జనగణన తీసుకొచ్చే అవకాశాలేమిటి? ఈ సమస్యపై ఈ పార్టీలన్నీ ఎందుకు ఒక్కటయ్యాయి? 1991లో మండల్ కమిషన్ నివేదిక అమలు నాటి నుంచి సంఖ్యాపరంగా ఆధిక్యత కలిగి, రాజకీయంగా శక్తిమంతంగా ఉన్న ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీలు) ఆధారంగా ప్రత్యేకించి బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చాయి. 1998లో బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పటికీ, రెండు దశాబ్దాలపాటు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ తమతమ రాష్ట్రాల్లో అధికార స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. 1990లలోనే యూపీలో, బిహార్‌లో బీజేపీ చొచ్చుకెళ్లి బలం పుంజుకున్నది వాస్తవం. అలాగే 21వ శతాబ్ది తొలి దశాబ్ది సమయంలో కాంగ్రెస్‌ను బీజేపీ మట్టికరిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల ఆధిక్యతను ఈ రెండు రాష్ట్రాల్లో కమలం సవాలు చేయలేకపోయింది. బీజేపీ ప్రధానంగా అగ్రకులాలూ, వైశ్యుల పార్టీగా కొనసాగుతూ రావడమే దీనికి కారణం. అయితే ములాయం, లాలూ పార్టీల్లోని చీలకలను, ఘర్షణలను బీజేపీ ఉపయోగించుకున్నది వాస్తవం. ఈ రెండు పార్టీలు మండల్ కమిషన్ ద్వారా గణనీయంగా లబ్ధిపొందిన ఓబీసీల విశ్వాసాన్ని పొందాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లోని కుల నాయకుల ఆకాంక్షలను సంతృప్తిపర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకు, బిహార్ లోని పట్నా, నలందా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న కుర్మి కుల నాయకుడు నితీశ్ కుమార్‌ని బీజేపీ కొన్ని సార్లు పక్కనపెట్టింది. అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్ లోని అప్నాదళ్ అధినేత అనుప్రియ పటేల్‌ని కూడా బీజేపీ దూరం పెట్టింది. కానీ, లాలూ, ములాయంల రాజకీయ బలానికి నష్టం కలిగించడంలో బీజేపీ విఫలమైందనే చెప్పాలి. పైగా బిహార్‌లో 17 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం జనాభాగా ఉన్న ముస్లింల మద్దతును ఇప్పటికీ ఈ ఇద్దరు నేతలే పొందుతున్నారని మర్చిపోరాదు. 2014 నుంచి ఓబీసీ ఓటు తీరు 1998 నుంచి 2009 వరకు లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకించి లాలూ, ములాయం పార్టీలు ఓబీసీకు చెందిన ఓట్లను వరుసగా 35 శాతం, 42 శాతం వరకు చేజిక్కించుకున్నాయి. 2004లో కాంగెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమాక్రాటిక్ అలయెన్స్ ప్రభుత్వాన్ని తోసిరాజని అధికారంలోకి వచ్చింది. 2009లో కూడా కేంద్రంలో అధికారాన్ని యూపీఏ నిలుపుకుంది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ రాజకీయ వ్యాఖ్యాత ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఈ విషయంపై తాజాగా మరింత స్పష్టతనిచ్చారు. ‘2009 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు 42 శాతం ఓబీసీ ఓట్లను పొందగా బీజేపీ 22శాతం ఓట్లను పొందింది. కానీ తదుపరి దశాబ్దానికల్లా ఓబీసీల మద్దతును బీజేపీ గణనీయంగా పొంది ఆశ్చర్యపర్చింది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ 42 శాతం ఓబీసీ ఓట్లను చేజిక్కించుకోగా, ప్రాంతీయ పార్టీలకు 27 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ మధ్యకాలంలో ఓబీసీలలో బీజేపీ మద్దతు బలం గణనీయంగా పెరిగిందనడానికి ఇదే స్పష్టమైన సాక్ష్యం.’’ 2014 నుంచి 2019 మధ్య ఓబీసీల ఓట్లు స్థానం మారడానికి పలు కారణాలున్నాయి. ఓబీసీలలో, దళితులలో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో చేసిన విస్తృతమైన కృషి వీటిలో ఒకటి. అలాగే బిహార్‌కి చెందిన కోయిరి నాయకుడు ఉపేంద్ర కుష్వా, అనుప్రియ పటేల్ వంటి ఓబీసీ నేతలు ములాయం, లాలూ పార్టీలకు దూరం కావడం కూడా దీనికి జతకలిసింది. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో యాదవులు, కుర్మీలు వంటి ఎగువతరగతి ఓబీసీలు శక్తిమంతంగా ఉంటున్నప్పటికీ, ఇటీవలికాలంలో ప్రధాని నరేంద్రమోదీ తన ఓబీసీ అస్తిత్వాన్ని వివిధ ప్రచార సభల్లో చాటుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో నోనియా, తెలి, మలకర్, తుర్హా, లోహర్, గోండ్ వంటి దిగువతరగతి ఓబీసీలను తనకు అనుకూలంగా తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించిందని చాలామంది చెబుతున్నారు కానీ, ఇప్పటికీ బీజేపీకి అగ్రకులాల దన్నే అధికంగా ఉంటోందన్నది వాస్తవం. ఓబీసీ నేతల్లో మోదీ వ్యతిరేక చైతన్యం మొత్తానికి, లాలూ, ములాయం, తేజస్వి, అఖిలేష్ యాదవ్, నితీశ్ కుమార్‌తో సహా ఓబీసీ నేతలు, వారి వారసులు తమకు ఇన్నాళ్లుగా సాంప్రదాయికంగా కొనసాగుతూ వచ్చిన ఓటు పునాది తగ్గుతూ వస్తోందని స్పష్టంగానే గమనించారు. అదేసమయంలో కార్పొరేట్, అగ్రకులాల ప్రయోజనాలే పరమావధిగా కలిగిన బీజేపీ, పేదల అనుకూల ఎజెండాను రూపొందించడంలో పరిమితులను ఎదుర్కొంటూండటం కూడా వాస్తవమే. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్ల విధానంపై పదే పదే వ్యతిరేకత వ్యక్తం చేయడం, మారుమూల ప్రాంతాల్లో అగ్రకులాలు పేదలపై చేస్తున్న అత్యాచారాలను బీజేపీ నిర్లక్ష్యం చేస్తూండటం కూడా తెలిసిందే. మండల్ 2 సాధ్యపడేనా? ఒక జాతీయ వారపత్రిక తాజా సర్వే ప్రకారం నరేంద్ర మోదీ ప్రజాదరణ 66 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని దిగ్బ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో సీఎం ఆదిత్యనాథ్ యోగి ప్రజాదరణ కూడా నిరుపేద ఓటర్లలో తీవ్రంగా దెబ్బతింది. యూపీలో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ సవాలు ఎదుర్కొంటున్న తరుణంలో నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని నితీశ్‌కు తెలుసు. అందుకే కులాలవారీ జనగణన డిమాండును మోదీ కనుక విస్మరిస్తే దిగువతరగతి ఓబీసీల్లో అది కచ్చితంగా సందేహాలను మరింతగా పెంచుతుందని జేడీయూ అత్యున్నత నాయకుడొకరు వివరించారు. ఇప్పటికే దిగువ తరగతి ఓబీసీలు నిత్యావసర వస్తువుల ధరల మోతబరువుతో, కోల్పోయిన జీవన అవకాశాలతో నలిగిపోతున్నారన్నది ఆయన భావం. సోషలిస్టు ఉద్యమం పునాదులు కలిగిన బీజేపీయేతర పార్టీలు వెనుకబడిన కులాల, తరగతుల మధ్య ఐక్యతా సాధనకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. దీంతో లాలూ, ములాయం, నితీశ్ శిబిరాలు రెండో మండల్ యుగం గురించి చర్చిస్తున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలను మండల్ 2 యుద్ధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొనడాన్ని మనం గుర్తుంచుకోవాలి. వ్యాసకర్త: నళిన్ వర్మ సీనియర్ జర్నలిస్టు (ది వైర్ సౌజన్యంతో) -
సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లపైనా ‘నిఘా’
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిన వారి జాబితాలో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు కూడా ఉన్నారని ‘ది వైర్’ న్యూస్ పోర్టల్ బుధవారం వెల్లడించింది. సుప్రీంకోర్టు జడ్జి వాడిన పాత ఫోన్ నంబరు కూడా దీంట్లో ఉందని తెలిపింది. రిజిస్ట్రార్లు ఎన్కే గాంధీ, టీఐ రాజ్‌పుత్‌లు సుప్రీంకోర్టులోని ‘రిట్’ విభాగంలో పనిచేసినపుడు.. 2019లో వీరి ఫోన్లపై నిఘా పెట్టారు. ప్రతి ఏడాది దాదాపు వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవుతాయని, వీటిలో ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవి, రాజకీయంగా సున్నితమైన అంశాలకు సంబంధించినవి కూడా ఉంటాయని వైర్ పేర్కొంది. అందువల్లే రిజిస్ట్రార్లపై కన్నేసి ఉంచారని వివరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా వాడిన పాత ఫోన్ నంబరు కూడా నిఘా జాబితాలో ఉంది. సదరు ఫోన్ నంబరు 2014లోనే వాడటం ఆపేశానని అరుణ్ మిశ్రా తెలిపారు. అయితే 2018 దాకా ఇది ఆయన పేరుపైనే ఉందని వైర్ తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా పాత ఫోన్ నంబరును 2019లో నిఘా జాబితాలో చేర్చారు. ఆయన 2020లో రిటైరయ్యారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సన్నిహితుడు, ఆయన దగ్గర పనిచేసే జూనియర్ ఎం.తంగదురై ఫోన్‌పైనా నిఘా పెట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారుచేసిన పెగసస్ స్పైవేర్‌తో విపక్ష నాయకులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులపై (మొత్తం 300 మందిపై) కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని తమ పరిశోధనలో తేలిందని అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం వెల్లడించినప్పటి నుంచి భారత్‌లో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్రమంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, 40 మంది పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే తాము పెగసస్ స్పైవేర్‌ను అమ్ముతామని ఎన్ఎస్ఓ ప్రకటించింది. చట్ట విరుద్ధంగా ఎవరిపైనా నిఘా పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా... అంటే దానర్థం ఈ నిఘా సాఫ్ట్వేర్ భారత ప్రభుత్వం వద్ద ఉన్నట్లు, దాన్ని వాడుతున్నట్లు అంగీకరించడమేనని విపక్షాలు అంటున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జూలై 19 నుంచి పెగసస్ అంశంపై పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. -
నిఘా జాబితాలో అనిల్ అంబానీ
ముంబై: నిఘా పెట్టిన ఫోన్ల జాబితాలో రిలయన్స్ అడాగ్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ చెందిన నెంబర్లు ఉన్నట్లు ‘ది వైర్’ బయటపెట్టింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేసే సంస్థ డసాల్ట్‌కు భారత భాగస్వామిగా అనిల్ సంస్థను ఎంపిక చేయడం వెనుక ఆయను ఆయాచిత లబ్ది చేకూర్చే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. డసాల్ట్ ఏవియేషన్‌కు భారత ప్రతినిధి వెంకటరావు పోసిన, బోయింగ్ ఇండియా బాస్ ప్రత్యూష్ కుమార్ల నెంబర్లు నిఘా జాబితాలో ఉన్నాయని వైర్ తెలిపింది. దలైలామా సన్నిహిత సలహాదారులపై నిఘా కొనసాగిందని వైర్ వెల్లడించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మను 2018లో పదవిలోనుంచి తొలగించగానే ఆయన ఫోన్లపైనా నిఘా పెట్టారు. -
మావోయిస్టులు పునరాలోచించరా?
హింసను ప్రేరేపించడంలో మావోయిస్టులు కూడా రాజ్య యంత్రాంగానికి ప్రతిబింబంలా మారిపోయారు. రాజ్యవ్యవస్థ తనకు తానుగా ఒక హింసాత్మక సాధనం. దాన్ని హింసతోనే ఎదుర్కోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టదు. తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, రైతులు, కార్యకర్తలు అందరూ.. వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేకపోవడమే విషాదకరం. ఈ వ్యాసం నేను రాస్తున్న సమయంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ తమ అధీనంలోనే ఉన్నాడని, అతనికి ఏ హానీ తలపెట్టబోమని మావోయిస్టులు భారత భద్రతా బలగానికి హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ నివాసి అయిన రాకేశ్వర్ సింగ్ ఏప్రిల్ 3న భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ తర్వాత తప్పిపోయారు. ఈ ఘటనలో కనీసం 23 మంది భద్రతా బలగాలు చనిపోయారు. రాకేశ్వర్ తమ అధీనంలోనే ఉన్నట్లు మావోయిస్టు నాయకత్వం నుంచి వార్త అందుకున్నామని, అతడిని క్షేమంగా విడిపించడానికి ప్రయత్నిస్తున్నామని, అతడికి ఏ హానీ తలపెట్టబోమని మావోయిస్టులు హామీ ఇచ్చారని హోంశాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు. (గురువారం రాకేశ్వర్‌ని విడిచిపెట్టారు కూడా). అంటే, భద్రతా బలగాల అధికారులు మావోయిస్టులతో మాట్లాడుతున్నారనీ, ఇరువురి మధ్య చర్చ సాధ్యమేనని స్పష్టం. అంటే ఇరువర్గాలూ పరస్పరం నష్టపోయినప్పటికీ, ఒకరు మరొకరిని హంతకులు అని ఆరోపిస్తున్నప్పటికీ, అదే సమయంలో తాము చేస్తున్న హత్యలను సమర్థించుకుంటున్నప్పటికీ ఇరువురి మధ్య చర్చ అనేది సాధ్యమే. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వ్యూహాత్మక ఎదురుదాడి కేంపెయిన్‌ను నిర్వహిస్తున్నారని, అడవుల్లోపల తమ కేడర్లకు ఆయుధాలిచ్చి మరీ శిక్షణ ఇస్తున్నారనీ, భద్రతా బలగాలకు గరిష్టంగా నష్టం కలిగించే ఉద్దేశంతో ఉన్నారని, అందుకే ముందస్తుగా భద్రతా బలగాలు లక్ష్య ఛేదనకోసం మావోయిస్టులపై దాడికి దిగగా తమపై ఎదురుదాడి చేసి దెబ్బతీశారని సీఆర్పీఎఫ్ అధికారి చెప్పారు. అయితే ఆ దాడి ఘటన తర్వాత మావోయిస్టు ప్రతినిధి కూడా ఎలా మాట్లాడి ఉండేవాడో కాస్త ఊహించుకుందాం. బహుశా అతడు కూడా సరిగ్గా ఇలాగే మాట్లాడి ఉండేవాడు. ఇంతజరిగాక కూడా అనివార్యంగా ఇరుపక్షాలూ సంప్రదింపులు జరుపుతున్నాయి. దీన్ని అందరూ ఆహ్వానించాలి. శత్రువు బలంగా ఉన్నప్పుడు, ఆధిక్యతా స్థానంలో ఉన్నప్పుడు మీరు మీ శత్రువుతో అయినా సరే మాట్లాడాల్సి ఉంది. ఈ తరుణంలో మావోయిస్టులు పైచేయి సాధించారు. వారు కూడా ఈ దాడిలో దెబ్బతిని ఉంటారు. కానీ ఎంతమందనేది మనకు తెలీదు. మావోయిస్టులూ, రాజ్యవ్యవస్థా.. అయితే ఎప్పటికైనా రాజ్యవ్యవస్థదే పైచేయి అని మావోయిస్టులు తెలుసుకోవాలి. ఇంతమంది బలగాలు మరణించిన తర్వాత కూడా భద్రతా బలగాల సంఖ్య తగ్గదు. గతంలో భద్రతా బలగాలు ఇదేవిధంగా ఎదురు దెబ్బతిని వెనుకంజ వేసినప్పటికీ వారి సంఖ్యాబలం కానీ ఆయుధ శక్తి కానీ క్షీణించలేదు. భారత భద్రతా బలగాల సాధన సంపత్తి ఎప్పటిలాగే ఉంటుంది. అది ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. పైగా దానికి ఇతర అనుకూలతలూ ఉన్నాయి. అది బహిరంగంగానే ముందుకు నడుస్తుంది. దానికి సహాయంగా నిర్విరామంగా సరఫరాలు అందుతుంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టకుండానే భారత భద్రతా బలగాలు చాలాకాలం మనగలుగుతాయి. కానీ మావోయిస్టుల విషయంలో అలా చెప్పలేం. కొత్తవారిని చేర్చుకోవడం వారికి చాలా కష్టమైన పని. వారు గణనీయంగా బలహీనపడతారు, వారి ఉనికి కూడా ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది. వారి అధీనంలో ఉన్న ప్రాంతం వేగంగా కుదించుకుపోతోంది. వారు పోరాడుతున్న ప్రజలు కూడా పలు కారణాలతో దూరం జరుగుతున్నారు. మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణలో లేరు. మహారాష్ట్రలోనూ లేరు. ఇక బిహార్, జార్ఖండ్‌లలో వారు అదృశ్యమైపోయారు. మావోయిస్టు చర్యల లక్ష్యం ఏమిటి? వారు చేసే ఒక దాడికి, మరో దాడికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ చర్యల వెనక ఉన్న హేతుబద్ధత విషయమై వారి మద్దతుదారులకు కూడా స్పష్టత లేదు. తమ తరపున పోరాడమని ఆదివాసీలేమైనా వారికి చెప్పారా? లేదా ఆదివాసీ ప్రయోజనాల పరిరక్షణకు మావోయిస్టులు స్వయం ప్రకటిత సంరక్షకులుగా ఉంటున్నారా? ఈ ప్రజలను విముక్తి చేయడానికే తాము వచ్చామని మావోయిస్టులు చెబుతుంటారు. కానీ ప్రజలపై తనదే యాజమాన్యమని రాజ్యం ప్రకటిస్తుంది. దీనికి మించి ఇది ఒక భూభాగం, ఒక భూమి, వనరులకు సంబంధించినది. రాజ్య వ్యవస్థ నుంచి తమను కాపాడాల్సిందిగా ఆదివాసీలు వారిని ఆహ్వానించలేదు. ప్రజలు, అడవులు వారికి రక్షణ ఛత్రంగా మాత్రమే ఉంటున్నాయి. పైగా, ఆదివాసుల పట్ల సానుభూతి కూడా వీరికి ఉండదు. అందుకనే తమకు విధేయంగా లేరనిపించినప్పుడు ఆదివాసీలను పట్టపగలే చంపడానికి కూడా మావోయిస్టులు వెనుకాడటం లేదు. పీయూసీఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ రైట్స్) ఇటీవలి ప్రకటన కూడా సరిగ్గా దీన్నే చక్కగా వివరించింది. ‘నిత్యం తీవ్రవాదం, తీవ్రవాద నిరోధక కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. బస్తర్‌లో మళ్లీ హింస పెరుగుతున్న సమయంలో ఈ ఎన్ కౌంటర్ సంభవించింది. ఒకవైపు పారామిలటరీ బలగాల ద్వారా సామాన్యులు నిత్యం వేధింపులకు గురవుతున్న క్రమంలో ఈ ప్రాంతం మొత్తం సైనికీకరణకు గురవుతోంది. అడవుల్లో కూడా తక్కువ దూరాల్లో సైనిక క్యాంపులు నెలకొనడంతో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య స్థానిక ఆదివాసీలు పరాయీకరణకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇన్ఫార్మర్ల పేరిట చాలామంది పౌరులను మావోయిస్టులు చంపేశారు. రాజ్యవ్యవస్థ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తనను ప్రశ్నించిన, నిలదీసిన వ్యక్తులపై, బృందాలపై హింసకు పాల్పడుతుండటాన్ని మేం ఎంత తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నామో.. మావోయిస్టులతో సహా ప్రభుత్వేతర శక్తులు, కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని మేం కోరుతూ వస్తున్నాం. మావోయిస్టులూ రాజ్యవ్యవస్థకు ప్రతిబింబంగానే ఉంటున్నారు కానీ ఒకే ఒక తేడా ఉంది. రాజ్యవ్యవస్థ అవసరమైతే తన పనితీరును సవరించుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. కానీ మావోయిస్టులు మాత్రం ఆరెస్సెస్–బీజేపీలాగే ఒకే స్వరంతో మాట్లాడుతుంటారు. ప్రజలపై యాజమాన్యం ఎవరిది అనే అంశంపై జరుగుతున్న ఈ పోరాటంలో రాజ్యానిదే ఎప్పటికీ పైచేయిగా ఉంటుంది. మావోయిస్టులు ఎప్పటికీ ప్రభుత్వేతర శక్తులుగా, చట్టవిరుద్ధ శక్తులుగా ఉంటారు. ముఖ్యంగా మావోయిస్టులు అర్థం చేసుకోవలసింది ఇదే. హింస పట్ల ఈ మతిలేని ఆకర్షణ వల్ల కొన్ని తరాలు ఇప్పటికే నాశనమైపోయాయి. రాజ్యవ్యవస్థ తనకు తానుగా ఒక హింసాత్మక సాధనం. దాన్ని మీ సొంత తార్కికతతో హింసతోనే ఎదుర్కోవడం అనేది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టదు. తీవ్రవాదం అనే పదం ఒక సుందరమైన నగను ధరిస్తుంటుంది కానీ అది రాజ్యానికే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మావోయిస్టులు, రాజ్యవ్యవస్థ తమను విభేదించేవారిని పరస్పరం వధిస్తున్నాయన్నదే వాస్తవం. తాజా ఎన్కౌంటర్ రాజ్యవ్యవస్థ పాశవిక హింసను మరింత చట్టబద్ధం చేస్తుందనడంలో సందేహమే లేదు. మానవ హక్కుల కోసం నిలబడే ఎవరినైనా, మానవ హక్కులు అనే భావనపై విశ్వాసం లేని మావోయిస్టుల హక్కుల కోసం నిలబడే వారిపై కూడా రాజ్య అణిచివేత పెరుగుతుంది. వీరిని మావోయిస్టుల తుపాకులు, రాకెట్ లాంచర్స్ కాపాడలేవు. మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. తమ పార్టీలోపల ప్రజాస్వామిక హక్కులు ఉన్నాయా అని వారు ప్రశ్నించుకోవాలి. నాయకత్వంతో విభేదిస్తూ కూడా గౌరవప్రదంగా మావోయిస్టులు మనగలుగుతున్నారా? తుపాకులు లేకుండానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మరింత కష్టతరమైన పోరాటాలను చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, రైతులు, కార్యకర్తలు అందరూ... వేగంగా నియంతృత్వం వైపు సాగుతున్న ఈ రాజ్యవ్యవస్థతో ప్రతి నిత్యం పోరాడుతున్నారు. కానీ మావోయిస్టులకు ఈ తరహా పోరాటాల పట్ల ఆసక్తి లేదు. హింసాత్మక శక్తి పీడితులైన వీరు మానవ జీవితాలను, మానవ ప్రాణాలను వృథా చేస్తున్నారు. వ్యాసకర్త:అపూర్వానంద్ హిందీ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ (ది వైర్ సౌజన్యంతో) -
విత్తనంపై రైతు పెత్తనానికి గండి!
విత్తనాల సాగు, అమ్మకాల్లో రైతుల హక్కులను కాపాడే నిబంధనలు పలు ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో తీసుకొస్తున్నప్పటికీ విత్తన రైతు మూలాలను దెబ్బతిసే చర్యలకు మాత్రం సాహసించలేదు. కానీ 2019లో ప్రధాని మోదీ తీసుకొచ్చిన సీడ్ బిల్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన కీలక ప్రతిపాదనలను పక్కన బెట్టింది. ప్రధానంగా రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్ముకునే హక్కును కాపాడే విషయంలో ముసాయిదా లోపాయకారీగా ప్రైవేట్ రంగ కంపెనీలకు లబ్ధి కలిగిస్తూ నామమాత్ర ప్రతిపాదనలు చేసి చేతులు దులుపుకుంది. అందుకే తాము రైతు ఉద్యమాన్ని ప్రారంభించకపోయి ఉంటే 2019 విత్తన బిల్లుకు కేంద్రం ఇప్పటికే చట్ట రూపం కల్పించేదని రైతు నేత రాకేష్ టికాయత్ చేసిన ప్రకటన సత్యమే అని చెప్పాలి. కేంద్రప్రభుత్వం రైతుల డిమాండ్లను గనుక పరిష్కరించకపోతే 16 రాష్ట్రాల్లో విద్యుత్ లైన్లను తెంచిపారేస్తామని ఇటీవలే రైతు నేత రాకేష్ తికాయత్ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన 2019 విత్తన బిల్లు మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. రైతు ఉద్యమం కనుక జరగక పోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాటికే ప్రైవేట్ సీడ్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విత్తన బిల్లుకు చట్టరూపం కల్పించేదని టికాయత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఈ సీడ్ బిల్లులో ఉంటున్న అత్యంత సమస్యాత్మకమైన అంశం ఏమిటి అనేది చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో విత్తన క్రమబద్ధీకరణ నియంత్రణ విషయంలో సీడ్ బిల్లు తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఏమిటో చూద్దాం. 1966 సీడ్స్ యాక్ట్‌కు చట్టరూపం ఇవ్వడం ద్వారా వ్యవస్థీకృత సీడ్ ప్రోగ్రాంని దేశంలో అమలులోకి తీసుకురావడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడమే ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టాన్ని తీసుకురావడానికి గాను 1968 సీడ్స్ నిబంధనలను రూపొందించారు. ఇప్పటివరకు ఈ చట్టం పరిమిత స్థాయిలోనే అమలవుతోంది. పైగా కొన్ని రకాల విత్తన రకాలను మాత్రమే ఈ చట్టం నియంత్రిస్తోంది. 1983లో నిత్యావసర సరుకుల చట్టం 1955 అధికారాల కింద విత్తన నియంత్రణ చట్టాన్ని నాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. విత్తన పంపిణీ, సరఫరాను నియంత్రణ కోసం దీన్ని తీసుకొచ్చారు. రెండు దశాబ్దాల తర్వాత, 1966 సీడ్స్ యాక్ట్‌ను రద్దు చేసి దాని స్థానంలో సీడ్స్ బిల్ 2004ను తీసుకొచ్చారు. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈ బిల్లును సమర్ఫించినప్పుడు, ఈ బిల్లుకు వ్యతిరేకంగా కమిటీ బలమైన ప్రతిపాదనలు చేసింది. ప్రైవేట్ కంపెనీల లాభార్జనకు వ్యతిరేకంగా, రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసి అమ్ముకునే హక్కును కాపాడే విషయంలో ఈ ముసాయిదా బిల్లు ఏం చెబుతోంది అనే అంశాన్ని కమిటీ నిశితంగా పరిశీలించింది. అంతకు కొన్ని సంవత్సరాలకు ముందు, 2001లో అంటే బిల్లుని ఇంకా ప్రవేశపెట్టక ముందు, పంటల రకాలు, రైతుల హక్కుల చట్టం (పీపీవీఎఫ్ఆర్ఏ) తీసుకొచ్చారు. విత్తన వ్యాపారంలో రైతుల హక్కులను కాపాడే నిబంధనలు ఈ చట్టంలో పొందుపర్చారు. విత్తన వ్యాపారంలో బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి దారి కల్పించడాన్ని గౌరవిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రమాణాలను భారత్ పాటించాల్సినందువల్ల ఇలాంటి చట్టం ఒకటి తీసుకురావలసిన అవసరం అప్పట్లో ఏర్పడింది. శాసనపరమైన సంక్లిష్టతల మధ్యనే నరేంద్రమోదీ ప్రభుత్వం 2019లో సీడ్ బిల్లు ముసాయిదాను తీసుకొచ్చింది. అయితే ఈ ముసాయిదాలో నాటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన ప్రతిపాదనలను పాక్షికంగా మాత్రమే మనం చూడవచ్చు. రైతులు తమ విత్తనాలను నమోదు చేసుకోవాలని, అవి తక్కువ అంకురోత్పత్తిని, భౌతిక స్వచ్ఛతను, జన్యు స్వచ్ఛతను కలిగి ఉండేలా జాగ్రత్తలు పాటించాలని బిల్లు ప్రతిపాదించిందన్న వాస్తవానికి వ్యతిరేకంగా స్టాండింగ్ కమిటీ ప్రధానంగా మాట్లాడింది. అలాంటి నిబంధనలు విత్తనాలను తయారు చేసి అమ్మే రైతుల హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయని కమిటీ గుర్తించింది. పైగా ఈ చట్టం మార్కెట్‌ను పూర్తిగా ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచేస్తోందని కమిటీ భావించింది. అందుకే విత్తనాల ధరల నియంత్రణపై, వాటి స్వీయ ధ్రువీకరణ తొలగింపుపై కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ ప్రయివేట్ విత్తన సంస్థలను అదుపుచేసే అంశాలను స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అలాగే తొమ్మిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో విత్తన పంటల బీమా స్కీమ్‌ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరాన్ని కమిటీ లేవనెత్తింది. అలాగే గుర్తించదగిన మరికొన్ని సూచనలను కూడా చేసింది. స్టాండింగ్ కమిటీ చేసిన అనేక ప్రతిపాదనలను 2019 ముసాయిదా బిల్లులో పొందుపర్చారు. కానీ అనేక కీలకమైన అంశాలపట్ల ముసాయిదా ఇప్పటికీ మౌనం పాటిస్తోంది. రైతు మాత్రమే కాకుండా ప్రతి విత్తన ఉత్పత్తిదారుకూ చట్టం వర్తిస్తుందని పేర్కొంటున్న క్లాజ్ 1(3)(బి)ని సవరించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని ప్రస్తుత ముసాయిదా పొందుపర్చింది కూడా. అయితే సాంప్రదాయిక విత్తన రకాలను నిల్వ చేసుకునేవారిని, లేదా విత్తనాలకు మరికాస్త విలువ కల్పించేవారిని కూడా చేరుస్తూ రైతు అనే నిర్వచనాన్ని మరింతగా విస్తరించాలనే స్టాండింగ్ కమిటీ సిఫారసుకు ఈ బిల్లులో చోటు లభించలేదు. తమ వద్ద ఉన్న విత్తనాలను తప్పకుండా నమోదు చేయాలని రైతులను ఈ ముసాయిదా ఇప్పుడు బలవంత పెట్టడం లేదు కానీ, రైతులు లేక కంపెనీలు కానివారు, (బహుశా దేశీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు) విత్తనాలను ఉత్పత్తి చేసి, అమ్ముకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. అలాగే మార్కెట్లో నాసిరకం విత్తనాలను, అవాంఛనీయమైన విత్తనాలను అమ్మడానికి వీల్లేకుండా, తప్పుముద్రతో వస్తున్న విత్తనాలను నిత్యం తనిఖీ చేయడానికి ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది కానీ, ఈ ముసాయిదా బిల్లులో అలాంటి యంత్రాంగం ప్రస్తావన లేదు. పైగా విత్తనం అనే నిర్వచనం పరిధిలో సింథటిక్ విత్తనాలను పొందుపర్చరాదని కమిటీ సూచించింది కానీ ఈ ముసాయిదా బిల్లు అదే సింథటిక్ విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలు అనే నిర్వచనంతో చేర్చింది. అలాగే రైతుల భాగస్వామ్యం గురించి కమిటీ నొక్కి చెప్పింది. వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి వచ్చిన రైతు ప్రతినిధులను కేంద్ర విత్తన కమిటీలో తప్పకుండా పొందుపర్చాలని స్టాండింగ్ కమిటీ ప్రత్యేకించి కోరింది. ముసాయిదా బిల్లు రైతు ప్రతినిధుల భాగస్వామ్యాన్ని పొందుపర్చింది కానీ దానికి ఒక అర్హతను జోడిస్తూ ఆ డిమాండ్‌ను పలుచబార్చింది. విత్తన నియంత్రణ అమలులో రైతులను ఒక పార్టీగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని సూచిస్తూ, రైతుల ప్రాతినిధ్యం రొటేషన్ ప్రకారం ఉంటుందని ముసాయిదా బిల్లు పేర్కొంది. అలాగే కేంద్ర విత్తన కమిటీ ద్వారా లేక రాష్ట్ర స్థాయి విత్తన కమిటీల ద్వారా విత్తనాల ధరలను నియంత్రించవలసిన అవసరం గురించి స్టాండింగ్ కమిటీ ప్రత్యేకించి నొక్కి చెప్పింది. పర్యావరణానికి హాని కలిగించే లేదా ఇతర అనివార్య కారణాలతో కొత్త విత్తన రకాల నమోదును ప్రజలు వ్యతిరేకించేలా ఒక నిబంధనకూడా బిల్లులో పొందుపర్చాలని కమిటీ కోరుకుంది. దీనికి అనుగుణంగా విత్తన శాతం మూలాన్ని ప్రకటించాలని కూడా కమిటీ సూచించింది. అయితే ఈ సిఫార్సులు వేటినీ ముసాయిదా బిల్లులో చేర్చలేదు. రైతుల ప్రయోజనాల మాట ఏమిటి? దేశవ్యాప్తంగా విత్తనాల వ్యాపారంలోకి ప్రైవేట్ రంగం విస్తరించిన నేపథ్యంలో విత్తనాల ధరలు చుక్కలంటుతున్నాయి దీంతో విత్తన సాగు వ్యయం కూడా పెరిగిపోతోంది. ఉదాహరణకు ఆవాల విత్తనాలను అమ్మడంలో భాగం పంచుకుంటున్న పయనీర్ అనే ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఒక కిలో ఆవాల విత్తనాలను 750 రూపాయలకు అమ్ముతోంది. ఇతర ప్రైవేట్ కంపెనీలు అమ్ముతున్న ధరలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. పలురకాల ప్రకృతిపరమైన ఉపద్రవాల కారణంగా తమ పంట కచ్చితంగా చేతికొస్తుందన్న నమ్మకం రైతులకు లేకపోగా, విత్తన సాగుకు పెట్టిన ఖర్చు కూడా వారు పొందలేకపోతున్నారు. సాగుకోసం చేసిన అప్పుల్ని చెల్లించడానికి డబ్బు అందుబాటులో లేకపోవడంతో వీరు తరచుగా రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. శ్రుతి జైన్ వ్యాసకర్త జర్నలిస్ట్ (ది వైర్ సౌజన్యంతో) -
‘సాగు’పై మరింత స్పష్టత అవసరం
వ్యవసాయ మార్కెటింగ్‌ను సమూలంగా మార్చివేస్తూ కేంద్రప్రభుత్వం గత సంవత్సరం చివరలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటూ ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా హింసాకాండను ప్రేరేపించిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళన అందరి దృష్టిని ఆకర్షించటం సరేసరి.. కానీ ప్రభుత్వం వైపున జరుగుతున్న కొన్న పాలనాపరమైన విధానాలు సంస్కరణలను దాచిపెడుతూ బడ్జెట్లో చూపకపోవడం చాలా సమస్యలకు దారితీస్తోంది. గత రెండేళ్లుగా కేంద్రప్రభుత్వం తీసుకున్న అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను బడ్జెట్లలో ప్రకటించలేదని గుర్తుంచుకోవాలి. వాస్తవానికి ఎరువులు, విద్యుత్ సబ్సిడీ, నీటి వనరుల నిర్వహణలో కేంద్రం గతంలో ఎన్నడూ లేనంత మంచి మార్పులను తీసుకొచ్చింది. మండీల్లో మౌలిక వసతులు కల్పించడానికి పెద్ద మొత్తాన్నే కేంద్రం కేటాయించినప్పటికీ మండీలను కార్పొరేట్లకు అప్పగిస్తారనే భయాలే రైతులను ఆందోళనవైపు నెట్టాయి. ప్రభుత్వం కాస్త పారదర్శకత ప్రదర్శించి ఉంటే సాగు సంస్కరణ చట్టాలపై భయాలు తొలిగేవి. నేడు పార్లమెంటులో సమర్పించనున్న తాజా బడ్జెట్ సాగుకు సంబంధించిన కీలక అంశాలపై మరింత స్పష్టత ఇస్తుందని ఆశిద్దాం. ప్రస్తుత రైతు సంఘాల ఆందోళన దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెను కష్టాలపై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కానీ వచ్చే దశాబ్దం పొడవునా భారత్ అనుసరించే సంస్కరణలు నడిచే మార్గాన్ని ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ బహుశా వెల్లడించకపోవచ్చు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను బడ్జెట్లు ప్రకటించలేదని గుర్తుంచుకోవాలి. అందుకనే కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతం దాకా తగ్గించిన వైనాన్ని 2019 సెప్టెంబర్ 20న మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తప్పితే అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొనలేదు. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపుతున్న దశలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అయిదు ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించి అయిదు ప్యాకేజీలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించారు. వీటిని ప్రధాన్ మంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా నరేంద్రమోదీ అంతకుముందే ప్రకటించి ఉన్నారు. ఈ 5 ప్యాకేజీలలో 20 లక్షల కోట్ల రూపాయల నగదును కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది. వ్యవసాయ ప్యాకేజీలో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు గుప్పించారు. వీటిలో అత్యవసర సరుకుల చట్టం (ఈసీఏ) 1955కు సవరణతోపాటు వ్యవసాయ మార్కెటింగ్‌ను క్రమబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న చట్టాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనకు తెలిసిందే. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో జరగాల్సిన మూడు ప్రధాన మార్పుల గురించి సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అవేమిటంటే ఎరువుల సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, నీటివనరుల నిర్వహణ. ఎరువుల సబ్సిడీ 2020 నవంబర్ 12న కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి ఒక ప్రకటన చేస్తూ ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ. 65 వేల కోట్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఇది 2020–21 సంవత్సరానికి గాను బడ్జెట్లో కేటాయిం చిన రూ. 71,309 కోట్ల మొత్తానికి అదనం అన్నమాట. 2020 ఏప్రిల్ 1న ఎరువుల కంపెనీలు రూ. 48 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ బకాయిలను పొందాయి. అనేక సంవత్సరాలుగా ఫెర్టిలైజర్ కంపెనీలకు తాము అందించిన ఎరువులకు సబ్సిడీ రూపంలో రావలసిన మొత్తాలను ప్రభుత్వం చెల్లించడం లేదు. ఎరువుల సబ్సిడీ బకాయిలను చెల్లించడానికి అదనపు గ్రాంట్‌ని మంజూరు చేస్తూ ప్రొవిజన్ రూపొందించటం బహశా అసాధారణమైంది. ఇది బడ్జెట్ పరంగా మంచి ప్రతిపాదన అని చెప్పాలి. జీడీపీ 7 శాతానికి పడిపోయిన సంవత్సరంలో పరిశ్రమ వర్గాలు అలాంటి ప్రయోజనం తమకు లభిస్తుందని కనీసం ఊహించలేకపోయాయి. 2020–21కిగాను కేంద్ర బడ్జెట్ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ. 26.33 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినందున వాస్తవ సేకరణ రూ. 19.33 లక్షల కోట్లకే పరిమితం కావచ్చు. అంటే బడ్జెట్ అంచనాల కంటే ఇది 26.6 శాతం తక్కువ అన్నమాట. ఇలాంటి తరుణంలో ఎరువుల పరిశ్రమకు అదృష్టం తలుపు తట్టినట్లే అని స్పష్టమవుతుంది. ఎరువుల కంపెనీలకు సబ్సిడీ కింద బకాయిలను చెల్లించడం అనేది ఎరువుల సబ్సిడీ నిర్వహణలో అతిపెద్ద సంక్షేమ చర్యగానే చెప్పాలి. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా ఎరువుల సబ్సిడీని బదిలీ చేసే విషయంలో ముందుకెళుతుందని చెప్పలేము. కౌలు రికార్డులు కనిపించని సందర్భంగా వాస్తవంగా వ్యవసాయం చేసేవారికి కాకుండా భూ యజమానికి మాత్రమే ప్రత్యక్ష నగదు బదిలీ అందుతుంది. రెండు... ఎరువుల ప్రస్తుత వినియోగం, అందుతున్న వివిధ సబ్సిడీలు రాష్ట్రాలకు సంబంధించి వేరువేరుగా ఉంటున్నాయి. పంజాబ్, హరియాణాలో 2018–19 సంవత్సరంలో హెక్టారుకు 224.5 కేజీల మేరకు ఎరువులను వాడుతుండగా ఒడిశాలో హెక్టారుకు 70.6 కేజీల ఎరువును వినియోగిస్తున్నారు. అదే జమ్మూ కశ్మీరులో 61.9 కేజీల ఎరువును మాత్రమే ఉపయోగిస్తున్నారు. అలాగే పండిస్తున్న పంటలు, సాగు చేస్తున్న భూమిపై ఆధారపడి ఎరువుల వినియోగం ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని రైతులకు ఎరువుల సబ్సిడీ కింద ఏకరూప మొత్తాన్ని స్థిరపర్చడం ఏమంత సులభం కాదు. నూతన వ్యవసాయ చట్టాల అమలుపై తీవ్ర వ్యతిరేకత కారణంగా వ్యవసాయంతో సంబంధం ఉన్న అందరినీ సంప్రదించడానికి కేంద్ర ప్రభుత్వం మరింత గట్టిగా ప్రయత్నాలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎఫ్‌సీఐ బకాయిలు 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కీలకమైన రెండో అంశం ఆహార సబ్సిడీ. దీని ఫలితంగా సబ్సిడీ బకాయిలు అమాంతంగా పెరిగిపోయాయి. భారత ఆహార సంస్థకు చెల్లిం చాల్సిన బకాయిలు 2018 మార్చి 31 నాటికి రూ 1,35,514.52 కోట్లు కాగా అది 2020 మార్చి 31 నాటికి రూ. 2,42,905 కోట్లకు పెరిగిపోయింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద గోధు మలు, బియ్యం అదనపు కేటాయింపుల కారణంగా ఈ సంవత్సరం 315.2 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా సరఫరా చేయాల్సి వచ్చింది. దీని ఫలితంగా 2021 మార్చి 31 నాటికి ఎఫ్‌సీఐకి చెల్లించాల్సిన బకాయిలు రూ. 3,48,808 కోట్లకు పెరిగాయి. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో వికేంద్రీకరణ అమలైన రాష్ట్రాల్లో ఆహార సబ్సిడీపై బకాయిలు ఎంత అనేది ఇప్పటికీ తెలియడం లేదు. పీఎం కిసాన్, ఎపీఎంసీలు వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్లో అత్యధిక కేటాయింపు (2020–21లో రూ. 75,000 కోట్లు) పీఎం కిసాన్ కోసం జరుగుతోంది. ప్రభుత్వం ఈ కేటాయింపును తగ్గిస్తుందని భావించడం కల్లోమాటే. తాజా బడ్జెట్లో ఆశ్చర్యకరమైన అంశం ఏదంటే ఎపీఎంసీ మండీల మౌలిక వసతుల కల్పనను మెరుగుపర్చడానికి తీసుకొస్తున్న కొత్త పథకమే. డ్రైయింగ్, సార్టింగ్, గ్రేడింగ్, స్టోరేజ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా దీంట్లో భాగమై ఉంటాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఆందోళన అంతా ఈ మండీలనుంచి వ్యాపారం మొత్తంగా వాణిజ్య విభాగాలకు వెళుతుందనే. ఏపీఎంసీలకు తగుమాత్రం బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఎపీఎంసీ మండీలను బలహీన పర్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తుంది. పైగా మండీలు కొనసాగడానికి ఇది తోడ్పడటమే కాకుండా వాణిజ్య ప్రాంతాలకు మంచి పోటీని కూడా ఈ చర్య తోడ్పడుతుంది. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఏఎమ్పీసీలలో చార్జీలు ఇతర రుసుములను బాగా తగ్గిం చారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాథమిక మార్కెటింగ్‌లో ప్రథమ అవకాశంగా ఈ మండీలే ముందుపీఠిలో ఉంటాయి. పోతే పౌల్ట్రీ, మత్య పరిశ్రమ సంవత్సరానికి 8 శాతం వృద్ది రేటును నమోదు చేస్తున్నాయి. అది కూడా ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహకాలు లేకుండానే ఈ రెండు రంగాలు ఇంత వృద్ధిరేటును సాధిస్తున్నాయి. భారతదేశంలోని అన్ని మెట్రో పాలిటన్ నగరాల్లో వీటికి అత్యాధునిక మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడం ఎంతైనా అవసరం. చివరగా, భారత్‌లోని నీటి వనరుల ఎద్దడి ఎదుర్కొంటున్న జిల్లాల్లో వరి, చెరకు పంటలు పండిస్తున్న ప్రాంతాలను తగ్గించడంలో స్పష్టమైన విధానాలను అమలుచేయడం తప్పనిసరి చేయాలి. అలాంటి వైవిధ్యీకరణకు తగిన రోడ్ మ్యాప్ అమలుకు కేంద్రం, ఆయా రాష్ట్రాలు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించాల్సి ఉంది. సిరాజ్ హుస్సేన్ – కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి జుగల్ మహాపాత్ర – కేంద్ర ఎరువుల శాఖ మాజీ కార్యదర్శి (ది వైర్ సౌజన్యంతో) -
నానాటికీ పుంజుకుంటున్న తేజస్వి
బిహార్‌లో 2020 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సంరంభం సాదాసీదాగా ప్రారంభమైంది. ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుం దని, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘటబంధన్ (మహాకూటమి) ఈ ఎన్నికల్లో విఫలం కానుం దని, లేదా ప్రత్యర్థిని దృఢంగా ఎదుర్కోలేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, తర్వాత్తరువాత పరిణామాలు మారసాగాయి. నితీశ్–బీజేపీ కూటమి ఇప్పటికే గెలిచేసిందని, కానీ లాలూ జైలు నుంచి విడుదలై ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ వ్యథలు, వరదల కారణంగా ప్రతిష్ట కోల్పోయిన నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని అందరూ అంగీకరిస్తున్నా తేజస్వి ప్రభావంపై మాత్రం పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నితీశ్ తన తొలి రెండు దఫాల పాలనలో రహదారులు, విద్యుత్, శాంతిభద్రతలను గణనీయంగా మెరుగుపర్చారు కానీ తన మూడో దఫా పాలన మాత్రం ప్రజల ఆశల్ని వమ్ముచేసింది. అయితే ప్రజలు ఇంకా తేజస్విని తమ నాయకుడిగా గుర్తించడానికి సిద్ధం కానందున నితీశ్‌కి ఈ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, పరిణామాలు అలాగే ఉంటున్నాయి. కానీ మహాకూటమి ఒక స్థిరమైన రూపం తీసుకోగా, ఎల్జేపీ మాత్రం ఎన్డీఏ నుంచి విడివడి ఒంటరిపోరుకు సిద్ధమై నితీశ్‌పై తీవ్ర దాడికి దిగుతుండటంతో అధికార కూటమి షాక్ తింది. జేడీయూ నుంచి ఎగువ కులాల ఓట్లను కొల్లగొట్టడానికి లోక్ జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. నితీశ్ పార్టీ పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఎగువ కులాల అభ్యర్థులనే పోటీకి దింపడం ద్వారా చిరాగ్ బీజేపీకి కూడా చికాకు పుట్టించారు. ఏదేమైనా, మహాకూటమి ఈ మొత్తం వ్యవహారంలో అతిపెద్ద లబ్ధిదారు అయింది. ఎన్డీఏలో అనైక్యతను ప్రాతిపదికగా చేసుకుని తన్ను తాను సంఘటితం చేసుకుంది. పైగా తనను గెలిపిస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటూ చేసిన ఎన్నికల హామీ వల్ల యువ ఓటర్లు ఒక్కసారిగా తేజస్వి పార్టీపట్ల ఆకర్షితులయ్యారు. ఎందుకంటే బిహార్‌లో నిరుద్యోగిత ఎప్పుడూ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటమే కాదు.. ఉద్యోగాలు, ఉపాధికోసం తరాలుగా బిహారీ యువత వలస బాట పడుతోంది. అయితే తేజస్వి యాదవ్ ఉపాధి హామీ ఆచరణ సాధ్యం కాదని బీజేపీ, జేడీయూ మొదట్లో కొట్టిపారేసినప్పటికీ తేజస్వి హామీ పట్ల ప్రజలు అసాధారణంగా స్పంది స్తుండటంతో తమ వైఖరి మార్చుకుని తమను గెలిపిస్తే 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కొత్త పాట మొదలెట్టాయి. మొత్తంమీద ఈ అంశంలో మహా కూటమి ఎన్డీఏని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. మహాకూటమి ఇంకా ఏర్పడక ముందు సీఎస్డీఎస్–లోక్‌నీతి సంస్థ నిర్వహించిన పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తేజస్వి యాదవ్ కంటే నితీశ్ కేవలం నాలుగు పాయింట్ల ఆధిక్యతలో ఉండేవారు. కానీ ఆ సర్వే తర్వాత ఎన్డీఏ వోటు షేర్ తగ్గిపోతూ వచ్చింది. అదే సమయంలో మహాకూటమి పుంజుకుంటూ వచ్చింది. పైగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరి ప్రజాదరణ ఈ ఎన్నికల్లో తగ్గుముఖం పడుతూ వస్తోందని, ముఖ్యంగా నితీశ్‌కి మరో దఫా అధికారం కట్టబెట్టకూడదని సర్వేలకు స్పందిస్తున్న వారిలో మెజారిటీ భావిస్తున్నారు. అయితే మహా కూట మిపై ఎన్డీఏ ఇప్పటికే ఆరు పాయింట్ల ఆధిక్యతతో ఉన్నందున ఎన్డీఏ సులువుగా గెలుస్తుందని సర్వేలు ఇప్పటికీ అంచనా వేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. ఎందుకంటే నలుగురు ఓటర్లలో ఒకరు నేటికీ తామెవరికి ఓటెయ్యాలో తేల్చుకోవడం లేదని ప్రచారం ముగిసిన తర్వాత తమ అభిప్రాయం మారవచ్చని చెబుతున్నారు. దీంతో విశ్లేషకులు సైతం తమ స్వరం మార్చారు. తాజాగా బిహార్‌లో ఎవరు సీఎం అనే దాంతో పనిలేకుండా సీట్లవారీగా పోటీ తీవ్రరూపం దాల్చిందని వీరు చెబుతున్నారు. కాగా 2010లో ఎల్జేపీతో పొత్తుకుదుర్చుకున్న ఆర్జేడీ.. లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 22 స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ ఈ దఫా ఎన్నికల్లో ఆర్జేడీ కనీసం 60 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నప్పటికీ, మహా కూటమి వంద స్థానాలు చేజిక్కించుకుంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కోవన తన తండ్రి లాలూతో పోలిస్తే తేజస్వి యాదవ్ తన పార్టీ విజయావకాశాలను గణనీయంగా మెరుగుపర్చినట్లేనని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం తండ్రీ కుమారుల నాయకత్వ శైలిలో వ్యత్యాసాలే. లాలూ ప్రసాద్ ఎల్లప్పుడూ అహంభావంతో, దృఢవైఖరితో ఉండగా, పరిస్థితులకు తగ్గట్టుగా మారటం, ముందుచూపుతో వ్యవహరించడం వల్ల సౌమ్యుడైన, నమ్రత కలిగిన నేతగా తేజస్వి యాదవ్ ముందుకొచ్చారు. లాలూతో పోలిస్తే మహాకూటమికి వెలుపల ఉన్న ఓటర్లలో తేజస్వి పట్ల వ్యతిరేక భావం లేకపోవడం. బలహీన వర్గాల పట్ల పూర్తి సానుకూలత, ఎగువకులాల పట్ల బహిరంగ వ్యతిరేకతకు లాలూ చాంపియన్ కాగా, తేజస్వి ఈ ఉచ్చులో ఇరుక్కోకుండా ఓబీసీల నేత మాత్రమే అనే బ్రాండ్‌కు దూరం జరిగారు. సామాజిక న్యాయం అనే ఒక్క అంశంపై లాలూ తన దృష్టి కేంద్రీకరించేవారు. కానీ తేజస్వి మాత్రం ఆర్థిక న్యాయం భావనకు కూడా ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు కూడా ప్రాధాన్యమిస్తూ ఇటీవల ప్రకటనలు చేశారు. పైగా మహాదళితులు, గ్రామీణ పేదలు, ప్రత్యేకించి సీపీఐ(ఎమ్ఎల్) వంటి ప్రజాపునాది కలిగిన వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి తేజస్వి ప్రయత్నించి నెగ్గారు కూడా. తండ్రి లాలూ మాత్రం సివాన్ ప్రాంతంలో ఎమ్ఎల్ నాయకత్వాన్ని నిర్మూలించడానికి సహాబుద్దీన్ వంటి బలమైన ఆర్జేడీనేతలను పురికొల్పారు. సామాజిక, ఆర్థిక కోణంలో ఎమ్ఎల్ పార్టీకున్న ప్రజా పునాదిని గుర్తించిన తేజస్వి తన తండ్రి పంథాను తిరుగుముఖం పట్టించి మహాకూటమిలో ఎమ్ఎల్ పార్టీని చేర్చుకోవడం ద్వారా అదనపు లబ్ధి పొందారు. దీనికోసం ఆర్జేడీకి బలంగా ఉన్న కొన్ని సీట్లను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. పైగా, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తేజస్వి చేసిన సాహస ప్రకటన ఎన్డీఏ ఓటర్లలోని యువతను కూడా ఆకర్షించింది. ఉద్యోగాల కల్పన పైనే ఆర్జేడీ ఈ ఎన్నికల్లో పోరాడుతోందని సీఎస్డీఎస్ సర్వేలో పాల్గొన్నవారిలో మెజారిటీ అబిప్రాయపడ్డారు. అందుకే లాలూ పాలనలో తీవ్రస్థాయిలో జరిగిన అవినీతి, దుష్పరిపాలన గురించి య«థా ప్రకారం ఎన్డీఏ ప్రచారం చేపట్టినా ఈ ఎన్నికల్లో అది పనిచేయడం లేదు. ఎందుకంటే తండ్రి చేసిన తప్పులు తనయుడికి అంటవని ప్రజల మనోగతం. ఈ క్రమంలోనే తేజస్వి మచ్చలేని నేతగా ముందుకొచ్చి ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. పైగా ఎగువకులాల్లోని విద్యావంత యువతలో గణనీయమైన భాగం ఈసారి ఉద్యోగాల కల్పన ప్రాతిపదికన మహాకూటమికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో లాలూ యాదవ్ ఆర్జేడీ పట్ల వీరికున్న తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ పట్ల కనిపించడం లేదు. అయితే కొంతకాలం క్రితం వరకు ఎన్డీఏకు ఏకపక్ష గెలుపు తథ్యమని, తేజస్వి నాయకత్వంలోని మహాకూటమి విజయవంతం కాదని కొనసాగుతూ వచ్చిన అభిప్రాయాలు మారుతున్నాయని భావించవచ్చు. అస్తిత్వ, కుల ప్రాతిపదిక సమీకరణాలతో ప్రధానంగా నడిచే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏనే ముందంజలో ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈబీసీలు, మహాదళితులు, మహిళా ఓటర్లలో మెజారిటీ నితీశ్‌కు మద్దతిస్తుండగా, ఎగువకులాలు, బనియాలు బీజేపీని బలపరుస్తున్నారు. ఇది మహాకూటమికంటే బలమైన దన్ను కలిగి ఉంది. అదే సమయంలో మహాకూటమికి ముస్లింలు, యాదవుల మద్దతు మాత్రమే అధికంగా ఉంటోంది. ఇక వామపక్షాల మద్దతు కారణంగా మహాదళితులు, ఈబీసీలలో కొంతమంది బలం కూడా ఈసారి తేజస్వికే దక్కవచ్చు. మరి ఓటర్ల నిర్ణయం మారుతోందంటున్న వార్తలు మీడియా కల్పన మాత్రమేనా.. క్షేత్రవాస్తవానికి ఇది పూర్తి భిన్నంగా ఉందా అంటే సమాధానం కాదు అనే చెప్పాలి. నితీశ్ ఓటుబ్యాంక్ ఈసారి జాగరూకతతో ఉంటూండటం ఎన్డీయేకు అయోమయం కలిగిస్తోంది. పైగా ఎల్జేపీ ద్వారా నితీశ్‌కు బీజేపీ మొండి చేయి చూపనుందన్న అంచనా కూడా ఉంటోంది. దీంతో ఎగువ కులాల ఆధిక్యత మళ్లీ బిహార్‌లో పెరిగే అవకాశం ఉందని ఓటర్లు భయపడుతున్నారు. బిహార్ సామాజిక, రాజకీయ చరిత్రలో ఎగువ కులాల ఆధిక్యతకు వ్యతిరేకంగా ఓబీసీలు, ఈబీసీలు, మహాదళితులు, మైనారిటీలను సంఘటితపర్చాలంటే బలహీన వర్గాల ప్రాధాన్యతావాదమే ఎప్పుడూ ముందుపీటికి వచ్చి నిలబడేది. పైగా ఈసారి జాగరూకతతో ఉంటున్న వర్గాలు సైతం యాదవుల ఆధిపత్యం పట్ల పెద్దగా భయపడటం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2015లో ఆర్జేడీతో పొత్తు కలపటం ద్వారా నితీశ్ స్వయంగా ఈ మార్పునకు నాంది పలకడమే. లాలూతో పోలిస్తే తేజస్వియాదవ్ పట్ల జనంలో ఏర్పడిన సానుకూలత దీనికి బోనస్‌గా పనిచేస్తోంది. మారుతున్న ఈ సామాజిక గతిశీలతే బిహార్ ఎన్నికల సమీకరణాలను మార్చివేస్తోంది. బలహీనస్థానంలో ఉన్న నితీశ్‌కు సహాయం అందించకపోవడం ద్వారా అంతిమంగా మహాకూటమికే బీజేపీ పరోక్షంగా అనుకూలతను సృష్టించిపెట్టింది. ఎన్డీయే తన ఇంటిని చక్కదిద్దుకోవడంలో విజయవంతమైతే, నితీశ్ ద్వారా ఈబీసీ, మహాదళిత ఓటర్లలోని మెజారిటీనీ తనవైపు తిప్పుకుని బీజేపీ విజయం సాధించగలదు. కానీ బిహార్‌లో ఏదీ నిశ్చితంగా ఉండదు. ఎన్డీయేలో అంతర్గత పోరువల్ల తేజస్వి నేతృత్వంలోని మహాకూటమి ఈ ఎన్నికల్లో జేడీయూ ఓటుబ్యాంకును దెబ్బ తీస్తున్నందున ఏక పక్ష ఎన్నికలుగా నిన్నమొన్నటిదాకా భావిస్తూ వచ్చినవి ఇప్పుడు ఒక్కో సీటుకు తీవ్రమైన పోటీ తప్పని ఎన్నికలుగా మారిపోయాయి. ఈ ఒక్క అంశమే బిహార్ గడ్డపై తేజస్వి బలమైన నేతగా ఆవిర్భవిస్తున్నట్లు సంకేతాలు పలుకుతోంది. (ది వైర్ సౌజన్యంతో) రాజన్ పాండే వ్యాసకర్త రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు, రాయల్ గ్లోబల్ యూనివర్సిటీ, గౌహతి -
జర్నలిస్టు వరదరాజన్‌కు షొరెన్‌స్టెయిన్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ న్యూస్ వెబ్సైట్ ‘ద వైర్’ వ్యవస్థాపక ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్‌ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇచ్చే ప్రతిష్టాత్మక ‘షొరెన్‌స్టెయిన్’ జర్నలిజం అవార్డు వరించింది. ఆసియా ప్రాంతంపై చేసిన రిపోర్టింగ్‌కు గాను 2017వ సంవత్సరానికి ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఢిల్లీకి చెందిన వరదరాజన్ గతంలో హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర జాతీయ పత్రికల్లో పనిచేశారు. -
ఇంటి గుట్టు గూగుల్!
⇔ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం బహిర్గతం ⇔ వివిధ పథకాల దరఖాస్తుదారుల వివరాలన్నీ ఆన్లైన్లో.. ⇔ పేరు, చిరునామాతోపాటు ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాల సమాచారమూ ఓపెన్! ⇔ భద్రంగా ఉంచాల్సిన వివరాలన్నీ ఇంటర్నెట్లో ప్రత్యక్షం ⇔ ఓ కేంద్ర ప్రభుత్వ శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల నిర్లక్ష్యం ⇔ లక్షలాది మంది వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ⇔ ‘ది వైర్’ ఆంగ్ల వెబ్సైట్ పరిశీలనలో వెల్లడి మీరు ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకున్నారా..? ఏదైనా ప్రభుత్వ శాఖ నుంచి లబ్ధిదారుగా ఉన్నారా..? అయితే మీ పేరు, ఊరు, పుట్టిన తేదీ సహా వ్యక్తిగత అంశాలెన్నో బహిర్గతం అయిపోతున్నాయి. పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి భద్రంగా ఉండాల్సిన రహస్య సమాచారమూ ఇంటర్నెట్లో దర్శనమిచ్చేస్తోంది. ఆన్లైన్లో కేవలం మీ పేరిటో, ఫోన్ నంబర్తోనో సెర్చ్ చేస్తే చాలు.. మిగతా వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు శాఖలు, విభాగాల నిర్లక్ష్య ధోరణే దీనికి కారణం. ది వైర్ అనే ఓ ఆంగ్ల వెబ్సైట్ పరిశీలనలో ఈ విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. – తెలంగాణ డెస్క్ మన పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటివన్నీ మన వ్యక్తిగతం. ఇవి ఎవరికీ తెలియడం మనకు పెద్దగా ఇష్టం ఉండదు, తెలిస్తే మోసాలకు, దుర్వినియోగానికి ఆస్కారం ఎక్కువ. కానీ ఏదో పథకం కోసమో.. మరేదో పనికోసమో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఇచ్చిన లక్షలాది మంది వివరాలు చాలా సులువుగా బహిర్గతం అవుతున్నాయి. కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖ నుంచి, పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతున్నట్లు తేలింది. అందులోనూ వివిధ సంక్షేమ శాఖల పరిధిలో పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు, లబ్ధి పొందిన వారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు కూడా ఆయా శాఖల వెబ్సైట్లలో ఓపెన్‌గా దర్శన మిస్తున్నాయి. అందులో పేర్లు, చిరునామాల వంటి వాటితోపాటు వారి కులం, మతం, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ నంబర్, బ్యాంకు ఖాతాల వివరాలూ ఉండడం గమనార్హం. భద్రంగా, రహస్యంగా ఉంచాల్సిన ఈ వివరాలన్నింటినీ ఆయా శాఖలు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైళ్లలో నమోదు చేసి, వెబ్సైట్లలో పెడుతున్నాయి. ఎవరైనా ఆయా వెబ్సైట్లు ఓపెన్ చేసిగానీ, ఇంటర్నెట్లో సెర్చ్ చేసిగానీ ఈ వివరాలు మొత్తం పొందగలిగేలా ఉండడం ఆందోళనకరంగా మారింది. ఓ ట్వీటర్ పోస్టుతో నేపథ్యంలో పరిశీలన ఎస్టీ–హిల్ (@St_Hill) అనే ఓ ట్వీటర్ యూజర్ పోస్ట్ చేసిన ఆర్టికల్తో ఈ అంశంపై దృష్టి పడింది. ప్రభుత్వ శాఖలు, విభాగాలు ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో, వ్యక్తిగత సమాచారం చోరీ అయితే ఉండే ప్రమాదాలేమిటనే దానిపై ఆ ఆర్టికల్‌లో వివరించారు. దీంతో ‘ది వైర్’దీనిపై పరిశీలన చేపట్టింది. సంక్షేమ శాఖలు, విభాగాల నుంచి.. – ఒక ప్రతిష్టాత్మక పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వ్యక్తిగత వివరాలను ఓ కేంద్ర మంత్రిత్వ శాఖ బహిర్గతం చేసినట్లు తేలింది. అందులో పేరు, చిరునామాతోపాటు కుటుంబ వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలూ ఉన్నాయి. – ఒక రాష్ట్ర ప్రభుత్వ శాఖ కూడా ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బాలల సంక్షేమం కోసం కేంద్రం నిర్వహిస్తున్న పథకాన్ని అమలు చేసే ఆ శాఖ.. వేలాది మంది బాలల పేర్లు, వారి చిరునామాలు, కులం, మతం, బ్యాంకు ఖాతాల వివరాలను ఇంటర్నెట్లో పెట్టేసింది. – మరో రాష్ట్ర ప్రభుత్వ శాఖ.. ఓ పథకం కింద శిక్షణ పొందిన వారి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో అందుబాటులో పెట్టింది. – ఇక ఇంకో రాష్ట్ర ప్రభుత్వమైతే ఏకంగా లక్ష మంది ప్రజలకు సంబంధించిన వివరాలను నమోదు చేసిన ఎక్సెల్ ఫైల్‌ను వెబ్సైట్లో పెట్టడం గమనార్హం. ఓ సామాజికాభివృద్ధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న/లబ్ధిపొందిన వారికి సంబంధించి ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందులో ఉన్నాయి. – అయితే ఇలా బహిర్గతమైన సమాచారం ఎంతవరకు వాస్తవమనేదానిపై అధికారికంగా నిర్ధారణ కాలేదని, అందుకోసం ప్రయత్నిస్తున్నామని ‘ది వైర్’వెబ్సైట్ పేర్కొంది. సరైన రక్షణ కల్పించకపోవడంతోనే.. మరో ఘటనలో ప్రభుత్వ సేవలను నిర్వహించే ఓ థర్డ్ పార్టీ వెబ్సైట్ పొరపాటున దాదాపు 5 లక్షల మంది బాలల పేర్లు, వారి ఫొటోలతోపాటు కులం, మతం, ఆధార్ వివరాలను బహిర్గతం చేసింది. ఆ వెబ్‌సైట్‌ను కొద్ది రోజుల తర్వాత మూసేశారని... కానీ వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఇది ఎత్తి చూపుతోందని స్పష్టం చేసింది. ఇక ఇటీవలే మెక్డొనాల్డ్డ్స ఇండియా స్మార్ట్‌ఫోన్ యాప్ వినియోగదారులకు సంబంధించి.. 22 లక్షల మంది వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయని గుర్తుచేసింది. ఇది చట్ట విరుద్ధమే! ఎవరికైనా సంబంధించిన వ్యక్తిగత అంశాలను బహిర్గతం చేయడం చట్ట ప్రకారం నేరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్ చట్టం–2016 ప్రకారం ఆధార్ వివరాలను బయటపెట్టడం నేరం. ఆ చట్టంలోని సెక్షన్ 29 లో.. ‘‘ఆధార్ నంబర్‌ను గానీ, బయోమెట్రిక్ సమాచారాన్ని గానీ బహిరంగంగా ప్రదర్శించడం, ప్రచురించడం చేయకూడదు. చట్టంలో పేర్కొన్న కొన్ని పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది..’’అని స్పష్టం చేశారు కూడా.