దొంగనోట్ల చెలామణి
మునగపాక, న్యూస్‌లైన్: ఇన్నాళ్లూ అసలు నోట్లను తలపించేలా దొంగనోట్లు ముద్రించి చెలామణీ చేసేవారు. అయితే ఇప్పుడు అంత శ్రమ లేకుండా అతి సులువుగా జెరాక్స్ తీసేసి కథ నడిపించేస్తున్నారు. విశాఖ మన్యంలోను, ఇంకా కొన్ని కుగ్రామాల్లో ఇలాంటి జెరాక్స్ నోట్లు చెలామనీ అయిపోతున్నాయి. అనకాపల్లి ఆర్ఈసీఎస్ పరిధిలోని గణపర్తిలో బిల్లు కలెక్టర్‌గా పని చేస్తున్న ద్వారం హరిబాబు ఎప్పటిలాగానే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారు.
దీనిలో భాగంగా శనివారం జోగారావుపేటకు చెందిన వంద రూపాయల జెరాక్స్నోటును తీసుకొచ్చి బిల్లు చెల్లించాడు. ఈ సొమ్మును మునగపాక ఎస్బిఐలో చెల్లించేందుకు హరిబాబు వెళ్లి అక్కడ సొమ్ము జమ చేయగా అందులో ఒకటి జెరాక్స్ వంద నోటు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో హరిబాబు అవాక్కయ్యారు. నకిలీ నోట్లు హల్చల్ చేస్తుండడంతో ఏది అసలో...ఏది నకిలీయో తెలియని పరిస్థితి నెలకొంది.