గాయత్రీదేవిగా ఏడుపాయల దుర్గమ్మ
పాపన్నపేట: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడుపాయల వన దుర్గామాత మంగళవారం శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గోకుల్షెడ్డులో ఏర్పాటు చేసిన అమ్మవారిని ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాలతో విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ సొంగ పవిత్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. కాగా ఘనపురం ఆనకట్ట పై నుంచి పొంగుతున్న వరదనీటితో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ఇంకా జలదిగ్భంధంలోనే కొనసాగుతోంది.