Kamareddy
-
షెడ్డు లేక..
కలెక్టరేట్ ఆవరణలో షెడ్డు లేకపోవడంతో ఎండలో నిలిపిన వాహనాలుకామారెడ్డిలో రూ. 60 కోట్లతో ఆధునిక హంగులతో సమీకృత జిల్లా కార్యాలయాల భవనాన్ని నిర్మించారు. అధికారులు, సిబ్బంది కార్లు నిలపడం కోసం సోలార్ షెడ్ నిర్మాణానికి రూ. 95 లక్షలు మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేశారు. వాహనాలకు నీడను ఇవ్వడంతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది దీని ఉద్దేశం. దీని నిర్మాణం పూర్తయితే 100 కిలో వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. వాహనాలకూ నీడ దొరికేది. కలెక్టరేట్‌కు నెలనెలా దాదాపు రూ.50 వేల విద్యుత్ చార్జీలు మిగిలేవి. కానీ సోలార్ షెడ్ నిర్మాణ పనులు శంకుస్థాపన దశ దాటకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది. పార్కింగ్ షెడ్లు లేకపోవడంతో కలెక్టర్, అదనపు కలెక్టర్ల వాహనాలతో పాటు అధికారులు, సిబ్బంది వాహనాలను ఎండలోనే ఉంచాల్సి వస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో స్వీకరించి, పెండింగ్‌లో ఉన్న వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారుకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 71 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులను వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత వారం వరకు ప్రజావాణికి 19,501 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 18,838 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. 663 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్నవాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త దరఖాస్తులను పరిశీలించండిరేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆ త్మీయ భరోసాకు వచ్చిన కొత్త దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజావాణి అనంతరం ఆయన అన్ని శా ఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కేంద్రాల్లో నాలుగు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాల న్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఒకే కుటుంబానికి రెండు, మూడు ఇళ్లు మంజూరైనట్లు ఇతర జిల్లాలలో ఫిర్యాదులు వచ్చాయని, అలాంటివి మన జిల్లాలో ఏమైనా ఉన్నాయా అనే దానిపై పంచాయతీ కార్యదర్శులు మరోసారి పరిశీలన చేయాలని సూచించారు. సమావేశంలో అదన పు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, జెడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖ ల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణిలో 71 ఫిర్యాదులు నమోదు -
అప్పిచ్చువారు..
● పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కార్పొరేట్ సంస్థలు ● ఊళ్లను చుట్టేస్తున్న సిబ్బంది ● కొత్తగా ఇళ్లు కట్టుకునేందుకు రుణాలు ● పాత వాటిపైనా మార్ట్గేజ్ లోన్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సాధారణంగా ప్రభుత్వరంగ, కార్పొరేట్ బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెద్ద వ్యాపారులకు హౌజింగ్ లోన్స్, వెహికల్ లోన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతాయి. రికవరీ సమస్యలు రావనే ఉద్దేశంతో వారు అడగకముందే లోన్లు ఇస్తామంటూ బ్యాంకర్లు ముందుకు వస్తుంటారు. అయితే నాన్ బ్యాంకింగ్ హోం ఫైనాన్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తుండడంతో పరిస్థితి మారింది. ఆయా సంస్థలు పోటీని తట్టుకుని నిలబడడానికి సామాన్యులకూ లోన్లు ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 20కి పైగా సంస్థలు కార్యాలయాలను ప్రారంభించాయి. సిబ్బందికి టార్గెట్లు విధిస్తూ.. లక్ష్యాన్ని చేరుకున్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో ఆయా సంస్థల సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రైవేటు హౌజింగ్ సంస్థలు విరివి గా రుణాలిస్తున్నాయి. ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఊళ్లకు వెళ్లి అడిగినవారికల్లా అప్పులిస్తామన్నట్టే వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఇళ్లు కట్టుకునేవారి ఆస్తిపాస్తులను మార్ట్గేజ్ చేయించి రుణాలు ఇప్పిస్తున్నారు. బ్యాంకుల్లో హౌజింగ్ లోన్ దొరకాలంటే పలుమార్లు తిరగాల్సి ఉంటుంది. ప్రైవేటులోనూ లోన్లకు అవే పద్ధతులు ఉన్నప్పటికీ చాలా పనులు సిబ్బంది చేయిస్తుండడంతో లోన్ తీసుకునేవారికి వెసులుబాటు ఉంటోంది. దీంతో చాలా మంది ప్రైవేట్ సంస్థను ఆశ్రయిస్తున్నారు. మార్ట్గేజ్ చేసుకుని... హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు లోన్ ఇవ్వడానికి ఆస్తులను మార్ట్గేజ్ చేయించుకుంటున్నాయి. ఇల్లు కట్టుకునేందుకు కొంత మందే లోన్లు తీసుకుంటుండగా, ఇప్పటికే నిర్మించుకున్న వారు ఆ ఇళ్లను మార్ట్గేజ్ చేయించి లోన్లు తీసుకుంటున్నారు. ఊళ్లల్లో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న వారు, కుల వృత్తు లు చేసుకుంటూ జీవనం సాగించేవారు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్లను ప్రైవేటు హౌజింగ్ లోన్స్ సంస్థలు ఆకర్శిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు బయట తీసుకున్న అప్పులకు వడ్డీలు ఎక్కువై తీర్చడానికి నానా తంటాలు పడుతున్న వారంతా ప్రైవే టు హౌసింగ్ ఫైనాన్స్‌ల నుంచి లోన్లు తీసుకుని, పాత అప్పులు కట్టుకుంటున్నారు. చాలా మంది పంట చేతికి అందిన తర్వాత ఇన్స్టాల్మెంట్లు పెట్టుకుంటున్నారు. ఆరు నెలలకోసారి వాయిదా చెల్లించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. వ్యాపారులు, ఉద్యోగులు నెలనెలా వాయిదాలు చెల్లిస్తున్నారు.వడ్డీలు ఎక్కువే అయినా..ప్రభుత్వరంగ బ్యాంకుల్లో హౌజింగ్ లోన్లపై వడ్డీలు తక్కువగా ఉంటాయి. ఏడాదికి 8.40 శాతం నుంచి మొదలవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువే.. అదే ప్రైవేటు రంగంలో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువే. పైగా ప్రాసెసింగ్ చార్జీలతో పాటు వివిధ రకాల చార్జీలు వేసి దాదాపు రెట్టింపు వడ్డీ వసూలు చేస్తుంటారు. కొన్ని సంస్థలు 12 శాతం నుంచి 18 శాతం దాకా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అయినా సరే తమ అవసరం కోసం హౌజింగ్ లోన్స్ తీసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో గతంలో నిర్మించుకున్న ఇళ్లను మార్ట్గేజ్ చేయించి అప్పు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంటి నిర్మాణానికి, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం కోసం చేసిన అప్పులు తీరే మార్గం లేకపోవడంతో ఇంటి వద్దకే వస్తున్న ప్రైవేటు హౌజింగ్ లోన్స్‌ను తీసుకుని అప్పులు తీర్చుకుంటున్నారు. -
మానసిక దివ్యాంగుల హక్కులను కాపాడాలి
కామారెడ్డి టౌన్: మానసిక దివ్యాంగుల హక్కులను పరిరక్షించి, వారి అభ్యున్నతికి చేయూతనివ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి కోర్టు భవన సముదాయంలో లీగల్ సర్వీస్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ 2017 ప్రకారం మానసిక దివ్యాంగులకు అందాల్సిన పథకాలు, సేవలను నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల పరిరక్షణ, అభివృద్ధి కోసం మనోన్యాయ్ పేరుతో లీగల్ సర్వీస్ యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. మానసిక దివ్యాంగులను నిర్లక్ష్యం చేయరాదని వారికి సరైన చికిత్స అందిస్తే సాధారణ పౌరులుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే పిల్లల్లోని మానసిక రుగ్మతలను గుర్తించి సరైన చికిత్స అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మానసిక దివ్యాంగులను గుర్తించి వారికి న్యాయపరంగా అందాల్సిన సేవలను ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక విద్యా విధానాలను ప్రభుత్వాలు అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, సైకాలజిస్ట్‌లు వివేక్, శశిధర్, తెయూ సౌత్ క్యాంపస్ సోషల్ వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంజయ్య, జువైనెల్ జస్టిస్ బోర్డు మెంబర్లు రమణ, విఠల్‌రావు, లైఫ్ ఫర్ బ్లైండ్ సెక్రెటరీ సయీద్ నబీ, సీడబ్ల్యూసీ మెంబర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్ -
ప్రత్యేక సవాల్!
అప్పుల్లో బల్దియావిస్తరణకు నోచుకోని రోడ్లుమంగళవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2025– 9లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలున్నాయి. మూడింటికీ ప్రత్యేకాధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. అయితే ఆయన కూడా మార్చి ఆఖరులో ఉద్యోగ విరమణ పొందనున్నారు. కాగా జిల్లా కేంద్రంగా ఎదిగిన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. పట్టణానికి పోచంపాడ్ నుంచి నీటిని సప్లై చేసే పైప్లైన్లు మాటిమాటికీ పగిలిపోయి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రెగ్యులర్‌గా నీరు రావడం లేదు. కొత్త పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. వేసవి సీజన్ వచ్చేనాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏటా వేసవి సీజన్లో తాగునీటికి కష్టాలు ఎక్కువవుతాయి. గతేడాది తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తుంది. కామారెడ్డిలో భిన్న రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, స్థానిక ఎమ్మెల్యే బీజేపీకి చెందిన వారు.. అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఉంది. పాలనపై తన ముద్ర ఉండాలని ఇద్దరూ కోరుకుంటున్నారు. ఇది అధికారులకు ఇబ్బందికర పరిస్థితిని కల్పిస్తోంది. ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితుల్లో అధికారులు సతమతమవుతున్నారు.న్యూస్రీల్మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. పాలన ప్రత్యేకాధికారి చేతిలోకి వెళ్లింది. అయితే నిధులు లేకపోవడం, సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో బల్దియాలలో సమస్యలు తిష్ట వేశాయి. వచ్చేది వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. బల్దియాల ప్రత్యేకాధికారికి ఈ సమస్యలు సవాల్‌గా మారనున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో బల్దియాలు పట్టణాల్లో వేధిస్తున్న సమస్యలు అస్తవ్యస్తంగా పారిశుధ్యం నిధులు లేక వీధి దీపాల నిర్వహణా భారమే ముందుంది వేసవి కాలం.. పెరగనున్న తాగునీటి ఇబ్బందులుకామారెడ్డి మున్సిపాలిటీ అప్పు ల్లో ఉంది. పన్నుల వసూళ్లు ఎంత జరిగి నా చెల్లింపులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఆర్థిక సంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులు రాకపో వడం ఇబ్బందికరంగా మారింది. పట్టణంలో చేసిన ప నులకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఇబ్బందు లు పడుతున్నారు. చెల్లింపులు జరగాలంటే నిధులు రావలసిందే. కార్మికుల జీతాలు సర్దుబాటు చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో కూడా అనేక సమస్యలున్నాయి. జిల్లా కేంద్రంలో డివైడర్లు నిర్మించినా రోడ్లను విస్తరించలేదు. దీంతో రోడ్లు ఇరుకుగా మారడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. ప్రధాన రహదారులపై డ్రెయినేజీల నిర్మాణం జరగలేదు. దీంతో వర్షం కురిస్తే నీరంతా రోడ్లపైనే నిలిచిపోతోంది. డివైడర్లపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌కు సంబంధించి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సెంట్రల్ లైటింగ్ వెలుగులు విరజిమ్మడం లేదు. నిధులు లేకపోవడంతో విద్యుత్ దీపాల నిర్వహణ కూడా భారంగా మారింది. కామారెడ్డి పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. బల్దియాను పారిశుధ్య సిబ్బంది కొరత వేధిస్తోంది. -
కోర్టు భవనాలకు రూ. 45.65 కోట్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో కోర్టు భవనాల నిర్మాణానికి రూ.45.65 కోట్లు మంజూరయ్యాయి. భవనాల నిర్మాణానికి వచ్చే నెల 1న పోర్ట్‌పోలియో జడ్జి చేతులమీదుగా శంకుస్థాపన చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిలలో దశాబ్దాల కాలం నాటి భవనాల్లో కోర్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక వసతులతో భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. బాన్సువాడ కోర్టుల సముదాయానికి రూ. 23.65 కోట్లు, అలాగే ఎల్లారెడ్డిలో కోర్టు భవనంతో పాటు అధికారుల నివాస గృహాల కోసం రూ. 22 కోట్లు మంజూరయ్యాయి. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. జిల్లా కోర్టు సముదాయ నిర్మాణమెప్పుడో? జిల్లా కోర్టులు రెండు, పోక్సో కోర్టు, సీనియర్ సివి ల్ జడ్జి కోర్టు ఒకటి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, స్పెషల్ మొబైల్ కోర్టులు ఉన్నాయి. కోర్టులతో పా టే కేసుల సంఖ్య కూడా పెరిగి నిత్యం కోర్టులకు వచ్చేవారితో కోర్టు ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఇరుకై న భవనంలోనే ఆయా కోర్టులు కొనసాగుతుండడంతో ఇబ్బందికరంగా ఉంటోంది. జిల్లా కేంద్రంలో కోర్టులన్నింటికీ కలిపి ఒకే చోట భవనం నిర్మించేందుకు గతంలో జాతీయ రహదారిపై ప్ర భుత్వం స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలాన్ని న్యా యశాఖ గతంలోనే అధీనంలోకి తీసుకుంది. అ యితే నిధులు మంజూరు కాకపోవడంతో భవన నిర్మాణ పనులు చేపట్టలేదు. దీంతో ఇరుకు గదుల్లో నే కోర్టులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ప్ర భుత్వం నిధులు మంజూరు చేస్తే కోర్టు సముదా యం నిర్మించనున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిలలో కొత్త భవనాల నిర్మాణం కోసం.. శంకుస్థాపనకు ఏర్పాట్లు -
ఖాతాల్లోకి రైతు భరోసా
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రైతుభరోసా నిధుల జమ ప్రారంభమైంది. సోమవారం తొలివిడతగా జిల్లాలో ఎంపిక చేసిన 22 గ్రామాలలోని 9,026 మంది రైతుల ఖాతాల్లో రూ.8.35 కోట్లు జమ చేశారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 22 మండలాల్లోని 22 గ్రామాల్లో ప్రదర్శించిన జాబితాల్లో పేర్కొన్న రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. గత ప్రభుత్వం ఎకరాకు పంటకు రూ. 5 వేలు పెట్టుబడి సాయంగా అందించగా.. ప్రస్తుత ప్రభుత్వం దానిని రూ. 6 వేలకు పెంచింది. విడతల వారీగా మిగతా గ్రామాల రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు తెలిపారు. 22 గ్రామాల్లోని 9,026 మందికి లబ్ధి రూ. 8.35 కోట్లు జమ -
‘ఎన్నికల సామగ్రిని సిద్ధంగా ఉంచాలి’
కామారెడ్డి క్రైం: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సామగ్రిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని గోదాంలో ఉన్న ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులను సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సరఫరా అయిన పంచాయతీ ఎన్నికలకు వినియోగించే కవర్లు, వివిధ రకాల ఫారాలు, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని భద్రంగా ఉంచాలన్నారు. మండలాల వారీగా సరఫరా చేయడానికి సిద్ధం చేయాలన్నారు. బ్యాలెట్ బాక్స్‌లకు పెయింటింగ్, అవసరం ఉన్న వాటికి మరమ్మతులు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘ప్రచారకర్తలుగా వ్యవహరించాలి’
కామారెడ్డి క్రైం: విద్యాసంస్థల డ్రైవర్లు వారి అనుభవంతో రహదారి భద్రత ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ సమాజానికి ఉపయోగపడాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రహదారి భద్రత మాసో త్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాలలో జిల్లాలోని స్కూల్ బస్సుల డ్రైవర్లు, లారీ డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళాబృందం ఆధ్వర్యంలో ప్రమాదా లు జరగడానికి కారణాలను వివరించారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ అతి విశ్వాసంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మ ద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ రహ దారి నిబంధనలు పాటించాలని సూచించా రు. కార్యక్రమంలో ఆర్టీఏ కమిటీ సభ్యుడు అజాజ్ ఖాన్, ఎస్పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ మారుతిరావు, ఎంవీఐ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. త్వరలో కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కామారెడ్డి క్రైం: జిల్లాలో 8 కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, తాడ్వాయి, గాంధారి, బో ర్లం, పద్మాజీవాడిలలో ఈ కేంద్రాలను ఏ ర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రేపు జాబ్ మేళా.. కామారెడ్డి క్రైం: కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి క ల్పనాధికారి మధుసూదన్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటా ర్స్, పేటీఎంలలో పలు ఉద్యోగాల భర్తీ కో సం ఈ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నా రు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మె కానికల్ ఇంజినీరింగ్ చదివిన 18 నుంచి 30 ఏళ్లలోపు వారు బయోడేటా, సర్టిఫికెట్లతో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటలలోపు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 98854 53222, 70933 39893, 76719 74009 నంబర్లలో సంప్రదించాలన్నారు. రేపు విద్యుత్ ప్రణాళికపై సమీక్ష కామారెడ్డి అర్బన్: వేసవిలో ఆటంకం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం కో సం బుధవారం విద్యుత్ వేసవి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎస్ఈ శ్రావణ్‌కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ పనుల పురోగతి, చేపట్టాల్సిన పనులపై చర్చించి, అవ సరమైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ‘నియోజకవర్గానికి రూ. 4.32 కోట్లు మంజూరు’ కామారెడ్డి టౌన్: కామారెడ్డి నియోజకవర్గ అ భివృద్ధికి రూ.4.32 కోట్లు మంజూరయ్యా యని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 76 లక్షలతో క్యా సంపల్లి నుంచి క్యాసంపల్లి తండా వరకు రో డ్డు వేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి పీడబ్ల్యూడీ రోడ్ నుంచి అడ్లూర్ హరిజనవాడ వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 1.33 కోట్లు, రాజంపేట నుంచి పెద్దాయిపల్లి వరకు రోడ్డు కు రూ. 1. 25 కోట్లు, నేషనల్ హైవే–7 నుంచి టేక్రియాల్ వరకు రోడ్డుకు రూ. 30 లక్ష లు, భిక్కనూరు జెడ్పీ రోడ్డు నుంచి సిద్దరామేశ్వరపల్లి వరకు రోడ్డుకు రూ. 70 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి సదాశివనగర్(ఎల్లారెడ్డి): తిర్మన్‌పల్లి ఫీల్డ్ అ సిస్టెంట్ మార బాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమ వారం ఎంపీడీవో సంతోష్‌కుమార్‌కు ఫిర్యా దు చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఫి ర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలో తన సొంత భూమి వద్ద ఉపాధి కూలీలతో పను లు చేయించుకుంటున్నారని, అలాగే పని చేయని వారి పేర్లను కూడా రాసి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. -
పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించడంపై అవగాహన
రాజంపేట: మండల మహిళా సమాఖ్య భవనంలో సోమవారం ఎన్ఐడీపీఆర్, యూనిసెఫ్, సెర్ప్ సంస్థల ఆధ్వర్యంలో పిల్లల్లో పోషణ లోపం తగ్గించడం, నివారణలపై వీవోఏలకు మహిళా సంఘ సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఎం రమేశ్ బాబు మాట్లాడుతూ.. పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం, వారికి వ్యాధులు రాకుండా సరైన సమయంలో టీకాలు, పోషక పదార్ధాలు అందించాలని సంఘ సభ్యులకు వివరించారు. మాస్టర్ ట్రైనర్ శ్రీనివాస్, సాయిలు సీసీలు శ్రీనివాస్, రమేష్, భాగయ్య, స్వామి పాల్గొన్నారు. పెద్దకొడప్గల్లో.. పెద్దకొడప్గల్(జుక్కల్): ఐదేళ్లలోపు పిల్లల్లో పోషక లోపం తగ్గించాలని ఐకేపీ ఏపీఎం దూప్‌సింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో పోషక లోపంపై అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్ రాంనారాయణ గౌడ్, బాలాజీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్‌లో.. నస్రుల్లాబాద్(బాన్సువాడ): పిల్లల్లో పోషక లోపం తగ్గించడంపై ఎన్ఐడీపీఆర్, యూనిసెఫ్, సెర్ప్ సంస్థల ఆధ్వర్యంలో నస్రుల్లాబాద్‌లో అవగాహన కల్పించారు. ఏపీఎం జగదీష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వాణి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
సిల్వర్ జూబ్లీ వేడుకలపై సమీక్ష
బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలపై సోమవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి సమీక్ష నిర్వహించారు. వేడుకలకు కళాశాలలో విద్యనభ్యసించిన ప్రతి విద్యార్థి హాజరు అయ్యేలా చూడాలని ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామికి సూచించారు. నేతలు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఖాలేక్, ఎజాస్, నార్ల సురేష్, వినయ్‌కుమార్ తదితరులున్నారు. 181 మందికి చెక్కుల పంపిణీ బాన్సువాడ: బాన్సువాడ పట్టణం, గ్రామీణం, నస్రుల్లాబాద్, మోస్రా మండలాలకు చెందిన సుమారు 181 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన వివిధ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి పంపిణీ చేశారు. తహసీల్దార్ వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్లు శ్యామల శ్రీనివాస్, సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు. -
పేర్లు తొలగిస్తున్నారంటూ ప్రచారం
బిచ్కుంద(జుక్కల్): నాలుగు పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించింది. పథకాలకు సంబంధించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చి గ్రామ సభలలో అధికారులు ప్రజలకు వివరించారు. తమ పేర్లు ఎందుకు రాలేదని కొందరు ప్రజలు గ్రామ సభల్లో అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. బిచ్కుంద, ఫల్లాపూర్, గోపన్పల్లితో పాటు పలు గ్రామాలో నిలదీసిన వారిని అధికారులు గుర్తించి అనర్హులుగా ప్రకటించి రేషన్ కార్డులు తొలగిస్తున్నారని మండలంలో పుకార్లు వ్యాపించారు. ఈ విషయమై వాట్సప్‌లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గ్రామ సభల ఫొటోలు పరిశీలిస్తున్నారు.. కొత్త, పాత కార్డులు తొలగించడం ఖాయమని గ్రామాలతో పాటు బిచ్కుంద మండల కేంద్రంలో టీ పాయింట్లు, టిఫిన్ సెంటర్ల వద్ద నలుగురు వ్యక్తులు కలిసిన చోట వినపడుతోంది. వీటిపై మండలంలో జోరుగా పుకార్లు వస్తుండటంతో దరఖాస్తుదారులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు దరఖాస్తుదారులు పరుగులు తీస్తున్నారు. గ్రామ పంచాయతీ వద్ద అతికించిన జాబితాలో పేర్లను పరిశీలిస్తున్నారు. రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లి తొలగిస్తున్న విషయం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో మూడు రోజుల నుంచి ఇలాంటి పుకార్లు వస్తుండటంతో కొందరు లబ్ధిదారులు ప్రజా ప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. గ్రామసభల్లో నిలదీసిన వారిని అనర్హులుగా అధికారులు ప్రకటిస్తారని వాట్సాప్‌లో చక్కర్లు ఆందోళన చెందుతున్న దరఖాస్తుదారులు కార్యాలయాలకు పరుగులు పెడుతున్న వైనంఎవరి పేర్లూ తొలగించడం లేదు నిలదీసిన వారి పేర్లను తొలగిస్తున్నట్లు వస్తున్న పుకార్లలో నిజం లేదు. వాటిని ప్రజలు నమ్మొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వస్తాయి. కొత్త కార్డులలో పిల్లల పేర్లు చేర్చిన వారు.. కొందరు తెలియక రెండో సారి దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తులను మాత్రమే క్రాస్ చెకింగ్ చేస్తున్నాం. కార్డులు లేనివారు, జాబితాలో పేర్లు లేనివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. – గోపాల్, ఎంపీడీవో, బిచ్కుంద -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
గాంధారి(ఎల్లారెడ్డి): వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని స్థానిక ఎస్సై ఆంజనేయులు, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలో ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లతో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాల గురించి వివరించారు. నియమాలు అతిక్రమిస్తే జరిగే ప్రమాదాలు, నష్టాల గురించి వివరించారు. రోడ్లపై ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేర్పించాలని, 108 అంబులెన్స్‌లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రహదారిపై జాగ్రత్తగా ఉండాలి మద్నూర్(జుక్కల్): వాహనదారులు రహదారిపై జాగ్రత్తగా ఉండాలని నేషనల్ హైవే, ఆర్టీవో అధికారులు సూచించారు. మండల కేంద్రంలోని బాలుర గురుకుల కళాశాల, బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైవే అధికారి బాల్‌రాజ్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు మాత్రమే వాహనం నడపాలని చెప్పారు. ప్రమాదాల నివారణ విభాగం మేనేజర్ సౌరవ్ ప్రతాప్ సింగ్, ఆర్టీవో అధికారులు రజినీబాయి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రత్యేక సవాల్!
అప్పుల్లో బల్దియావిస్తరణకు నోచుకోని రోడ్లుమంగళవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2025– 9లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలున్నాయి. మూడింటికీ ప్రత్యేకాధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. అయితే ఆయన కూడా మార్చి ఆఖరులో ఉద్యోగ విరమణ పొందనున్నారు. కాగా జిల్లా కేంద్రంగా ఎదిగిన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. పట్టణానికి పోచంపాడ్ నుంచి నీటిని సప్లై చేసే పైప్లైన్లు మాటిమాటికీ పగిలిపోయి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రెగ్యులర్‌గా నీరు రావడం లేదు. కొత్త పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. వేసవి సీజన్ వచ్చేనాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏటా వేసవి సీజన్లో తాగునీటికి కష్టాలు ఎక్కువవుతాయి. గతేడాది తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తుంది. కామారెడ్డిలో భిన్న రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, స్థానిక ఎమ్మెల్యే బీజేపీకి చెందిన వారు.. అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఉంది. పాలనపై తన ముద్ర ఉండాలని ఇద్దరూ కోరుకుంటున్నారు. ఇది అధికారులకు ఇబ్బందికర పరిస్థితిని కల్పిస్తోంది. ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితుల్లో అధికారులు సతమతమవుతున్నారు.న్యూస్రీల్మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. పాలన ప్రత్యేకాధికారి చేతిలోకి వెళ్లింది. అయితే నిధులు లేకపోవడం, సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో బల్దియాలలో సమస్యలు తిష్ట వేశాయి. వచ్చేది వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. బల్దియాల ప్రత్యేకాధికారికి ఈ సమస్యలు సవాల్‌గా మారనున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో బల్దియాలు పట్టణాల్లో వేధిస్తున్న సమస్యలు అస్తవ్యస్తంగా పారిశుధ్యం నిధులు లేక వీధి దీపాల నిర్వహణా భారమే ముందుంది వేసవి కాలం.. పెరగనున్న తాగునీటి ఇబ్బందులుకామారెడ్డి మున్సిపాలిటీ అప్పు ల్లో ఉంది. పన్నుల వసూళ్లు ఎంత జరిగి నా చెల్లింపులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఆర్థిక సంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులు రాకపో వడం ఇబ్బందికరంగా మారింది. పట్టణంలో చేసిన ప నులకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఇబ్బందు లు పడుతున్నారు. చెల్లింపులు జరగాలంటే నిధులు రావలసిందే. కార్మికుల జీతాలు సర్దుబాటు చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో కూడా అనేక సమస్యలున్నాయి. జిల్లా కేంద్రంలో డివైడర్లు నిర్మించినా రోడ్లను విస్తరించలేదు. దీంతో రోడ్లు ఇరుకుగా మారడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. ప్రధాన రహదారులపై డ్రెయినేజీల నిర్మాణం జరగలేదు. దీంతో వర్షం కురిస్తే నీరంతా రోడ్లపైనే నిలిచిపోతోంది. డివైడర్లపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌కు సంబంధించి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సెంట్రల్ లైటింగ్ వెలుగులు విరజిమ్మడం లేదు. నిధులు లేకపోవడంతో విద్యుత్ దీపాల నిర్వహణ కూడా భారంగా మారింది. కామారెడ్డి పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. బల్దియాను పారిశుధ్య సిబ్బంది కొరత వేధిస్తోంది. -
క్యాలెండర్ల ఆవిష్కరణ
అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్లు.. కామారెడ్డి క్రైం: తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్, డైరీలను కలెక్టర్ సోమవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్, అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి సంతోష్, కోశాధికారి అనిల్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘం.. దోమకొండ: మండల కేంద్రంలో బీసీ సంఘం క్యాలెండర్‌ను సంఘం జిల్లా అధ్యక్షుడు శివరాములు, గౌరవ అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. తహసీల్, ఎంపీడీవో, పోలీస్‌స్టేషన్, గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షుడు అబ్రబోయిన రాజేందర్, మాజీ జెడ్పీటీసీ తిర్మల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 711.. పిట్లం(జుక్కల్): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద సోమవారం తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 711 నూతన సంవత్సర క్యాలెండర్లను లెక్చరర్లు ఆవిష్కరించారు. 711 జిల్లా అధ్యక్షుడు అక్కం విష్ణు, కార్యవర్గ సభ్యులు జయరాములు, వెంకటేశ్వర్లు, రంజిత్ కుమార్, జాహెద్ అలీ, స్వరూప, విజయలక్ష్మి, రమేష్, మురళి, నరేష్, షాహిన్ పాల్గొన్నారు. మున్నూరుకాపు సంఘం.. మాచారెడ్డి: మున్నూరు కాపు సంఘం మండల శాఖ ప్రతినిధులు సోమవారం గజ్యా నాయక్ తండా చౌరస్తాలోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో సంఘం నూతన సంవత్సర క్యాలండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు దేవరాజు, ప్రతినిధులు రావుల ప్రభాకర్, పంతం స్వామి, మ్యాడం ప్రభాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
సంగారెడ్డి జిల్లాలో మల్లుపల్లివాసి హత్య
భిక్కనూరు: భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామ బీజేపీ అధ్యక్షుడు మాలే నారాయణ(42) సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. నారాయణ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామంలో ఉన్న ఎఫ్‌పీవో జైకిసాన్ సంస్థలో సీఈవోగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈనెల 25న తన భర్త కనిపించడం లేదని నారాయణ భార్య లక్ష్మీనర్సవ్వ హత్నుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం నారాయణ మృతదేహం పల్పనూరు సమీపంలో కనిపించింది. ఈ విషయమై పోలీసులు భార్య లక్ష్మీనర్సవ్వతో పాటు రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను, భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోని తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.బ్యాంకులో షార్ట్ సర్క్యూట్బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్ కూడలీ వద్ద గల ఎస్బీఐలో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. బ్యాంకులోని మెయిన్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్క్యుట్ కావడంతో మీటరులో మంటలు చెలరేగాయి. వెంటనే స్వీపర్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఒకరి అదృశ్యం కామారెడ్డి క్రైం : కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన చిందాల తిరుపతిరెడ్డి అదృశ్యమైనట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. తిరుపతిరెడ్డి కుటుంబంతో కలిసి కొద్దిరోజులుగా కామారెడ్డిలో ఉంటూ గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ఈ నెల 26న ఇంటి నుంచి వెళ్లిన ఆయన భార్య మాధవికి ఫోన్ చేసి ఆర్థికంగా నమ్మిన వాళ్లందరూ మోసం చేస్తున్నారని బాధపడ్డాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. చాలా చోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో అతని భార్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముప్కాల్‌కు చెందిన ఒకరు.. బాల్కొండ: ముప్కాల్‌కు చెందిన కొమ్ముల రవి ఈ నెల 23 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల విషయమై భార్యతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిన రవి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రజనీకాంత్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు బాల్కొండ: మండలంలోని కిసాన్‌నగర్‌లో సోమవారం రాత్రి స్కూటీని కారు ఢీకొంది. కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర్ పాత జాతీయ రహదారి మీదుగా ముప్కాల్ నుంచి స్వగ్రామం వెళ్తుండగా ఆర్మూర్ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో గంగాధర్‌కు స్వల్ప గాయాలు కాగా, స్కూటీ నుజ్జు నుజ్జు అయింది. పెర్కిట్ శివారులో.. ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో చేపూర్ గ్రామానికి చెందిన చిన్న గంగారాం గాయపడ్డారు. చిన్నగంగారాం ఆర్మూర్‌లో పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా నిర్మల్ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ గంగారాంను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. బోధన్‌టౌన్: బోధన్ శివారులోని రమాకాంత్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోధన్ డిపోకు చెందిన బస్సు బీర్కూర్ నుంచి వస్తూ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొంది. ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలు కాగా నిజామాబాద్ తరలించారు. -
అల్లుడిని హతమార్చిన మామ అరెస్ట్
మాచారెడ్డి: అల్లుడిని హత్య చేసిన ఘటనలో మామతో పాటు మరో నలుగురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామారెడ్డి రూరల్ సీఐ రామన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన కుంచం ఎల్లయ్య కూతురు నందిని అలియాస్ మమతకు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బోదాసు స్వామితో వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు అవుతుండటంతో మమత కొద్ది రోజులుగా తల్లిగారింటి వద్దే ఉంటోంది. అయితే మాట్లాడేది ఉందని ఈ నెల 21న స్వామిని మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో స్వామి, అతని తండ్రి నర్సయ్య బైక్‌పై వెళ్తుండగా ఎల్లయ్య, అతని పెద్దల్లుడు పెనుగొండ సాయిలు, కుంచం తిరుపతి, మృతుడి భార్య నందిని, నితిన్ అడ్డుకున్నారు. స్వామిని కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ స్వామిని తండ్రి నర్సయ్య చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామి మృతి చెందాడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు.దాడి చేసిన వ్యక్తిపై కేసుఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేటకు చెందిన బోరంచి శోభ, బాబు దంపతులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ సోమవారం తెలిపారు. పొలం అమ్మకం విషయంలో తమ్ముడు బాబు, మరదలు శోభ అడ్డు వస్తున్నారని సాయిలు దాడి చేశాడని ఎస్సై పేర్కొన్నారు. శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇసుక డంపు స్వాధీనంనస్రుల్లాబాద్(బాన్సువాడ): నస్రుల్లాబాద్ మండల కేంద్రం సమీపంలోని క్రషర్లో అనుమతులు లేని ఇసుక డంపు ఉండటంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక తమదే అంటూ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు డిసెంబరు 13న ఇతరుల పేరున ఉన్న వేబిల్లులు అధికారులకు చూపడంతో అనుమానం వచ్చి సీజ్ చేశామని గిర్దావార్ సాయిలు తెలిపారు. డంపు చేసిన ఇసుకపై పూర్తి విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. -
పొలంలో పడి యువకుడి మృతి
రెంజల్(బోధన్): వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు పొలంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పద్మశాలి కిషన్ అనే రైతు పొలంలో ఎరువులు చల్లడానికి ఏస ప్రశాంత్(28) ఆదివారం కూలీ పనులకు వెళ్లాడు. సాయంత్రం ఎరువుల బస్తాను తీసుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఒడ్డుపై జారి పొలంలో పడిపోయాడు. దీంతో నోట్లోకి బురద వెళ్లింది. వెంటనే గుర్తించిన పొలం యజమాని అతడిని బోధన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించారు. ఊపిరితిత్తుల్లోకి బురద చేరడంతో మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మృతుడి బావ రవి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ ఒకరు.. బాన్సువాడ: పిట్లం మండలం హస్నాపూర్‌కు చెందిన లక్ష్మణ్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు సీఐ అశోక్ తెలిపారు. రెండు రోజుల కిత్రం బాన్సువాడ శివారులోని శివాజీ విగ్రహం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం నిజామబాద్‌కు తరలించగా అక్కడ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. చిన్నాపూర్కు చెందిన వ్యక్తి.. మోపాల్: మండలంలోని చిన్నాపూర్ గ్రామానికి చెందిన శివోల్ల భూమయ్య (42) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. భూమయ్య ఆటోడ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పదేళ్లుగా మద్యానికి బానిసై సరిగ్గా పని చేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో భూమయ్య ఈనెల 21న పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న భూమయ్య సోమవారం మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బీహార్ కూలీ ఆత్మహత్య
బాన్సువాడ: బాన్సువాడలోని గౌలీగూడలో బీహార్‌కు చెందిన కూలీ సోనుకుమార్ పాశ్వాన్(24) ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్‌లోని రాగద్దపూర్కు చెందిన సోనుకుమార్ కొన్ని రోజుల క్రితం సోని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఆదివారం సోని ఆస్పత్రికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోనుకుమార్ ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. నాళేశ్వర్‌లో యువకుడు.. నవీపేట: మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన చిన్నదొడ్డి రాజేందర్(32) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే రాజేందర్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. నిజామాబాద్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోగా రెండేళ్ల కింద విడాకులయ్యాయి. ఆర్థిక ఇబ్బందులతో పాటు తాగుడుకు బానిసైన రాజేందర్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. అయితే ఓ మాజీ ప్రజాప్రతినిధి మందలించడంతో అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, నవీపేట ఏఎస్సై మోహన్‌రెడ్డి గ్రామానికి విచారణకు వెళ్లగా అంతలోపే అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరించారు. -
చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడి అరెస్ట్
ఖలీల్‌వాడి: దుకాణాల షట్టర్లను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్బనికి చెందిన కరణ్ సింగ్, లాథూర్‌కు చెందిన కరణ్ సింగ్ బావూరి, అజయ్‌సింగ్, జల్నాకు చెందిన మనోహర్ సింగ్ ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. అర్ధరాత్రి దుకాణాల షట్టర్లు ధ్వంసం చేసి వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా జిల్లాలో 11 చోట్ల చోరీలు చేసింది. దీంతో పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తన బృందంతో ప్రధాన సూత్రధారి కరణ్ సింగ్‌ను పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడు నేరాలను అంగీకరించాడని చెప్పారు. కరణ్‌సింగ్ వద్ద బైక్, ఇనుప రాడ్లు, బట్టలు స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఎస్‌హెచ్‌వో రఘుపతి, ఎస్సై మొగులయ్య, ఏఎస్సై షకీల్, కానిస్టేబుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలు ఖలీల్‌వాడి: జల్సాలకు అలవాటు పడి హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మూగ యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన తాడెం అనిల్‌కుమార్‌కు మాటలు రావు. జల్సాలకు అలవాటు పడిన అనిల్ నాలుగు హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లను చోరీ చేశాడు. కంఠేశ్వర్‌లో వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించాడు. అదుపులోకి తీసుకుని విచారించగా తన సైగల ద్వారా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును చేధించిన ఎస్సై హరిబాబు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. టౌన్ సీఐ శ్రీనివాసరాజు, ఎస్సై హరిబాబు పాల్గొన్నారు. పల్సర్ బైక్ చోరీ చేసిన ఇద్దరు.. పల్సర్ బైక్ దొంగతనం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. మాక్లూర్ మండలం వేణుకిషన్నగర్కు చెందిన ఒల్లెపు గోపి(20), ద్యారంగుల సంతోష్(23) కంఠేశ్వర్‌లో బైక్ చోరీ చేశారు. నగరంలోని గుర్బాబాది రోడ్డులో కృష్ణమందిర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ఇద్దరు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా జల్సాలు, మద్యానికి బానిసలై చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. నిందితుల నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకన్నట్లు చెప్పారు. సమావేశంలో టౌన్ సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐదుగురికి జైలు శిక్ష
బోధన్‌టౌన్: బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురికి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేషసాయి తల్ప సోమవారం ఒక రోజు జైలు శిక్ష విధించారని సీఐ వెంకట నారాయణ తెలిపారు. బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన గంగదీపక్, రెంజల్ బేస్‌కు చెందిన సాయిలు మద్యం తాగి వాహనాలు నడిపారు. వారిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఒక రోజు జైలు శిక్ష విధించారు. రాకాసీపేట్‌లో మద్యం తాగుతున్న ఇద్దరికి, అంబేడ్కర్ చౌరస్తాలో పండ్ల బండితో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వ్యక్తికి సైతం ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు సీఐ పేర్కొన్నారు. గంజాయి పట్టివేతఖలీల్వాడి: నగరంలోని బోర్గాం(పి) కమాన్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశ్ సోమవారం రాత్రి తెలిపారు. గౌతంనగర్‌కు చెందిన శ్రావణ్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని, 530 గ్రాముల ఎండు గంజాయి, ఒక సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు. దాడిలో ఎస్సై నర్సింహాచారి, సిబ్బంది భూమన్న, విష్ణు, అవినాష్, శ్యామ్, సాయికుమార్ పాల్గొన్నారు. గంజాయి అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మాచారెడ్డి : ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. రాజఖాన్పేటలో నాలుగు పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామంలో 56 మందికి ఇందిరమ్మ ఇళ్లు, 27 మందికి రేషన్ కార్డులు, 85 మందికి రైతు భరోసా, 29 మందికి ఆత్మీయ భరోసా మంజూరు ఉత్తర్వులను అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్‌రావు, మండల ప్ర త్యేకాధికారి, డీపీవో శ్రీనివాస్‌రావు, పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున్‌బాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ విజయపాల్‌రెడ్డి, ఎంపీడీవో నాగరాజు, తహసీల్దార్ శ్వేత, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
నాలుగు పథకాలకు శ్రీకారం
● మండలానికి ఒక గ్రామంలో ప్రారంభం ● పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించారు. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి శరత్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
వైఎస్సార్ హయాం తర్వాత ఇప్పుడే..
నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి రూరల్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పేదలకు ఇళ్లు మంజూరయ్యాయని, మళ్లీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం నాగిరెడ్డిపేట మండలంలోని అ చ్చాయపల్లి, ఎల్లారెడ్డి మండలంలోని మల్లయ్యప ల్లిలలో నాలుగు పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జాబితాల్లో పేర్లులేనివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు వాటిని పునఃపరిశీలించి అర్హులకు ఇళ్లు, రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేలా చూస్తారన్నారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గేట్ నుంచి అచ్చాయపల్లి మీదుగా ఎర్రారం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మాల్తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగిన భవనంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. కార్యక్రమాలలో ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ రజితరెడ్డి, ఆర్డీవో ప్రభాకర్, నాగిరెడ్డిపేట మండల ప్రత్యేకాధికారి రత్నం, తహసీల్దార్లు శ్రీనివాస్‌రావు, మహేందర్‌కుమార్, ఎంపీడీవోలు ప్రభాకరచారి, ప్రకాష్, నాయకులు ఊషాగౌడ్, సత్యనారాయణ, ప్రశాంత్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్, రాంచందర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఇమా మ్, నర్సింహారెడ్డి, విక్రాంత్‌రెడ్డి, జీవరత్నం, సాయిబాబా, వినోద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నిలబెట్టుకుంటున్నాం
నిజాంసాగర్/బిచ్కుంద/మద్నూర్/పెద్దకొడప్గల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఆదివారం నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్, బిచ్కుంద మండలంలోని గుండెకల్లూర్, పెద్దకొడప్గల్ మండలంలోని చిన్నతక్కడ్పల్లి, మద్నూర్ మండలం రాచూర్లలో నాలుగు పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఆయా కార్యక్రమాలలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్‌కుమార్, ఏఎంసీ వైస్‌చైర్మన్ శంకర్ పటేల్, మండలాల ప్రత్యేకాధికారులు శ్రీపతి, నగేష్, కిషన్, ఎంపీడీవోలు గంగాధర్, గోపాల్, లక్ష్మీకాంత్‌రెడ్డి, తహసీల్దార్లు భిక్షపతి, సురేశ్, దశరథ్, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్, రాంరెడ్డి, మురళీధర్‌గౌడ్, రాజు పటేల్, హఫీజ్ గౌస్, ఖలీల్, రవి పటేల్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.