ఇంటి దగ్గర విద్యార్థులకు సూచనలిస్తున్న ఉపాధ్యాయుడు నాగమల్లేశ్వరరావు
చినగంజాం: మండలంలోని మున్నంవారిపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సిద్ధం నాగమల్లేశ్వరరావు తన పాఠశాల పరిధిలోని విద్యార్థుల ఇంటింటికి తిరిగి పాఠాలు బోధిస్తూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులలో పఠనాసక్తిని, సృజనాత్మకతను పెంపొందించే ఉద్దేశంతో చేపట్టిన ‘చదవడం మాకిష్టం’ సెలవుల్లో సరదాగా సమ్మర్ క్యాంపు కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరిగి బోధనా కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలు ఇచ్చి, వారికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాడు. వాటి ద్వారా వారిలో సామర్థ్యాలను ఎంతవరకు పెంచాలో తెలుసుకుంటూ ఇళ్లకు వెళ్లి నోట్ పుస్తకాలలో తప్పొప్పులను సరిచేసి నైపుణ్యాలను వెలికి తీస్తున్నాడు. ఈసందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు నాగమల్లేశ్వరరావును అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment