మెటర్నిటీ వార్డులో నిఘా పెంచాలి
● జూమ్ మీటింగ్‌లో డీఎంఈ వాణి
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లోని మెటర్నిటీ వార్డులో నిఘా ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (డీఎంఈ) వాణి అన్నారు. హైదరా బాద్ నుంచి రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల సూపరింటెండెంట్లతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించగా, ఆదిలాబాద్ రిమ్స్‌లో డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎంఈ మా ట్లాడుతూ.. ఇటీవల పలు ఆస్పత్రుల్లో చిన్నారుల ను ఎత్తుకెళ్తున్నారన్నారు. ఈక్రమంలో వైద్యాధికా రులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల ని, ప్రసవం అనంతరం చిన్నారులను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదని సూచించారు. ఈ మేరకు సిబ్బందికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment