నమో నాగోబా
ఆదివాసీల ఇలవేల్పు కేస్లాపూర్ నాగోబా జాతరకు మూడోరోజూ భక్తజనం పోటెత్తారు. గురువారం మెస్రం వంశీయులు పెర్సపేన్, భాన్ దేవతలకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచీ భక్తులు భారీగా తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు. రాత్రి ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు గుస్సాడీ బృందం నృత్య ప్రదర్శన, భద్రాచలం కళాకారుల కొమ్ము నృత్యం, కొలాం గిరిజనులు, ఆంద్ ఆదివాసీ సమాజ్, తోటి సమాజ్, ‘ఆశ్రమ’ విద్యార్థినుల నాట్య విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం తదితరులు హాజరయ్యారు. జాతర ఆవరణలో వెలిసిన దుకాణాల వద్ద భక్తుల సందడి కనిపించింది. – ఇంద్రవెల్లి
– మరిన్ని వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment