రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
ఆదిలాబాద్‌టౌన్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ధాన్యం తెచ్చిన రైతును సత్కరించి తూకం వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ప్రభుత్వం క్వింటాల్ కందులకు రూ.7,550 ధర ఇస్తోందని తెలిపారు. మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ గజానంద్, మార్కెట్ కార్యదర్శి మధుకర్, కేంద్రం ఇన్చార్జి పండరి తదితరులు పాల్గొన్నారు.
జైనథ్ గోదాముల తనిఖీ
జైనథ్ మండల కేంద్రంలోని పౌరసరఫరాల శాఖ గోదామును అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం నిల్వలను పరిశీలించారు. గోదాం ఇన్చార్జితో మాట్లాడారు. అనంతరం మండలంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లు ప్రారంభించారు. కార్యక్రమాల్లో మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌కుమార్, డీసీవో మోహన్, జైనథ్ సొసైటీ సీఈవో గంగన్న, మార్కెట్ కార్యదర్శి మధుకర్, పూజ, అష్రఫ్, డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, సివిల్ సప్లయ్ డీటీ త్రియంబకేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 1912ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోవడం, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లోవోల్టేజీ, బ్రేక్ డౌన్స్, ప్రమాదకర స్తంభాలు తదితర సమస్యల గురించి తెలిపి పరిష్కరించుకోవాలని సూ చించారు. పేరు మార్పు, బిల్లుల్లో తేడాలు, హెచ్చుతగ్గులు, విద్యుత్ మీటర్లలో సమస్యలు, ఆగిపోయిన మీటర్లు, నూతన సర్వీస్ మంజూరు, సర్వీస్ క్యాన్సలేషన్ తదితర సేవలు పొందవచ్చని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment