ఎంపీటీసీ స్థానాల పెంపు | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ స్థానాల పెంపు

Published Fri, Jan 31 2025 2:27 AM | Last Updated on Fri, Jan 31 2025 2:27 AM

ఎంపీటీసీ స్థానాల పెంపు

ఎంపీటీసీ స్థానాల పెంపు

● గతంలో 158.. ప్రస్తుతం 169 ● కొత్త మండలాల ఏర్పాటుతోనే .. ● ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ● 2వరకు అభ్యంతరాల స్వీకరణ ● 11 మండలాల్లో యథాతథం

కై లాస్‌నగర్‌: జిల్లాలో కొత్తగా 11 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాలు పెరిగాయి. కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధమ య్యే దిశగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు ఆదేశించింది. కసరత్తు చేసిన జిల్లా పరిషత్‌ అధికారులు మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. పూర్వ మండలాల నుంచి కొత్తగా ఏర్పడిన మండలాలకు జనాభా అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను కేటాయించారు. మరో రెండు మండలాల్లోనూ ఎంపీటీసీ స్థానాల సంఖ్య పెంచారు. 2019లో జరిగిన ఎన్ని కల్లో 158 స్థానాలుండగా పెరిగిన వాటితో ప్రస్తుతం ఈ సంఖ్య 169కి చేరింది. ఈ ముసాయిదా జాబితాకు కలెక్టర్‌ రా జర్షి షా ఆమోదముద్ర వేశారు. కాగా, ఈ ఎంపీటీసీ స్థానా లపై ఫిబ్రవరి 2వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పరిశీలన అనంతరం 3న తుది జాబితా ప్రకటించనున్నారు. వాటి ఆధారంగానే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.

ఎంపీటీసీ స్థానాల పెంపు ఇలా..

2019లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జైనథ్‌ మండలంలో 14 స్థానాలుండేవి. ఆ మండలాన్ని విభజించి కొత్తగా భోరజ్‌, సాత్నాల మండలాలను ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లోని గ్రామపంచాయతీల సంఖ్యకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. అలాగే, ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో గతంలో 11 స్థానాలుండేవి. ప్రస్తుతం ఈ మండలంలోని పలు గ్రామాలు కొత్తగా ఏర్పడిన సాత్నా ల మండలంలోకి చేరాయి. దీంతో ఈ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. బోథ్‌ మండలంలో గతంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా ఈ మండలం నుంచి కొత్తగా సొనాల మండలాన్ని ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లోని గ్రామపంచాయతీల సంఖ్యకు అనుగుణంగా ఎంపీటీసీ స్థానాలను కేటాయించారు. మావల మండలంలో గతంలో మూడు గ్రామాల పరిధిలో మూడు స్థానాలే ఉండేవి. ఇందులో ఒక రు ఎంపీపీ, మరొకరు వైస్‌ ఎంపీపీగా ఎన్నికై తే ఒక సభ్యుడే ఉండేవారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో జనాభాకు అనుగుణంగా ఈ మండలంలో అదనంగా మరో రెండు స్థానాలు పెంచారు. ఇక 2019లో మున్సిపాలిటీ ఆవిర్భావం పేరిట ఎన్నికలకు దూ రంగా ఉన్న ఉట్నూర్‌ గ్రామపంచాయతీలో గతంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా పెరిగిన జనాభాకు అనుగుణంగా అదనంగా మరో నాలుగు స్థానాలు పెంచారు. అలాగే, బేల మండలంలో గతంలో 11 ఎంపీటీసీ స్థానాలుండేవి. ఈ మండలంలోని పలు గ్రామాలను సాత్నాల మండలంలో కలపడంతో రెండు స్థానాలు తగ్గించారు. ఈ మండలాలు మినహా మి గతా 10 మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల్లో ఎలాంటి మా ర్పు చేయలేదు. ఆయా మండలాల్లోని ఎంపీటీసీ స్థానాలు యథాతథంగా ఉన్నట్లు జెడ్పీ సీఈవో జీ జితేందర్‌రెడ్డి తెలి పారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైన అభ్యంతరాలుంటే ఈ నెల 2వరకు ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో తెలుపవచ్చని ప్రజలకు సూచించారు. వాటిని పరిశీలించి పరిష్కరించిన అనంతరం కలెక్టర్‌ అనుమతితో తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

బోథ్‌ మండలంలో ఇలా..

బోథ్‌: మండలంలోని సొనాల కొత్త మండలంగా ఏర్పాటైంది. ఇదివరకు బోథ్‌ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం నాలుగు తగ్గాయి. కొత్తగా ఏర్పడ్డ సొనాల మండలంలో ఐదు స్థానాలు ఏర్పాటు చేశారు. ఈ మార్పుపై ఏవైన అభ్యంతరాలుంటే శుక్రవారం సాయంత్రంలోపు తెలుపాలని బోథ్‌ ఎంపీడీవో రమేశ్‌ సూచించారు. బోథ్‌ మండలంలో బోథ్‌–1, బోథ్‌–2, బోథ్‌–3, బాబెర, కరత్వాడ, అందూర్‌, కనుగుట్ట, కౌఠ (బీ), పొచ్చెర, ధన్నూర్‌ (బీ) ఎంపీటీసీ స్థానాలున్నాయి. అలాగే, కొత్తగా ఏర్పడ్డ సొనాల మండలంలో సొనాల, పార్డి (కే), చింతలబోరి, గుర్రాలతండా, సాకెర ఎంపీటీసీ స్థానాలున్నాయి.

ఎంపీటీసీల పునర్విభజన వివరాలు

మండలం జీపీలు ఎంపీటీసీ జనాభా

స్థానాలు

సొనాల 12 5 13,025

భోరజ్‌ 17 5 17,909

సాత్నాల 17 5 13,662

ఆదిలాబాద్‌రూరల్‌ 31 10 34,514

బేల 31 9 32,661

బోథ్‌ 21 10 35,191

జైనథ్‌ 17 7 23,788

మావల 3 5 6,310

ఉట్నూర్‌ 38 18 63,465

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement