కుష్ఠును నివారించాలి
ఆదిలాబాద్టౌన్: కుష్ఠు రహిత సమాజానికి కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో సా ధన సూచించారు. జాతీయ కుష్ఠు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఖుర్షీద్నగర్ అర్బన్ పీహెచ్సీలో అవగాహన కల్పించారు. ముందుగా గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్ముడు, కుష్ఠు కారక క్రి మిని గుర్తించిన శాస్త్రవేత్త డాక్టర్ హాన్సన్
చిత్రపటాలకు పులమాలలు వేసి నివాళుల
ర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు కుష్ఠుపై అవగాహన కల్పించి అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. వచ్చే నెల 13వ తేదీ వరకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీబీ అధికారి సుమలత, ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రామ్ అధికారి గజానంద్, డీఐవో వైసీ శ్రీనివాస్, వైద్యాధికారి అన్సారీ, డీపీఎంవోలు వామన్రావు, రమేశ్, ఎల్డీ నిజామొద్దీన్, సీవో ప్రశాంత్ దేశ్పాండే, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment