విద్యార్థులను ఒత్తిడికి గురిచేయొద్దు
ఆదిలాబాద్‌టౌన్: పరీక్షల సమయంలో పదో తరగతి విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దని జిల్లా విద్యాధికారి ప్రణిత సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఉపాధ్యాయులకు రెండురోజుల జిల్లా స్థాయి కెరీర్ కౌన్సెలింగ్, గైడెన్స్‌పై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. అనంతరం డైట్ వైస్ ప్రిన్సిపల్ కిరణ్‌కుమార్ విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికి, ఆత్మస్థైర్యం నింపడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. ఆర్పీలు ఏలియా, ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈవో ప్రణిత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల–2ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా బోధించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment