వైఎస్సార్‌సీపీ ప్రభంజనం తధ్యం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభంజనం తధ్యం

Published Mon, May 6 2024 8:55 AM

వైఎస్సార్‌సీపీ ప్రభంజనం తధ్యం

పాడేరు: ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ సునాయసంగా విజయం సాధిస్తుందని, వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం పాడేరు పట్టణంలోని తలారసింగి వద్ద వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గుమ్మా తనుజారాణి, పాడేరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్య్సరాస విశ్వేశ్వరరాజు, పార్టీ పాడేరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, పీలా వెంకటలక్ష్మిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోని ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో న్యాయం చేసిందన్నారు. గడప వద్దకే పాలన, పథకాలు అందిస్తూ ప్రజల వ్యయప్రయాసాలు తగ్గించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేసి ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, ఓటు హక్కు అడిగే నైతిక హక్కు ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉందని భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోనేందుకు వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ అంతా ఎంతో పటీష్టంగా పకడ్బందిగా పని చేస్తున్నారని చెప్పారు. ఏ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన స్థానిక గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గిరిజనమంతా వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ వైద్య విభాగ జోనల్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ తమర్భ నర్సింగరావు, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్‌, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ్లన్నదొర, ఏఎంసీ చైర్మన్‌ సూరిబాబు, పంచాయతీరాజ్‌ విభాగ జిల్లా అద్యక్షుడు గబ్బాడ చిట్టిబాబు, చింతపల్లి ఎంపీపీ అనుషాదేవి, వైస్‌ ఎంపీపీ కనకాలమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్‌పర్సన్‌ సరస్వతి, మాజీ ఎంపీపీ వెంకట గంగరాజు, సీనియర్‌ నాయకురాలు కురుసా పార్వతమ్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement