గంజాయి కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయాలి
ఎస్పీ అమిత్ బర్దర్
పాడేరు: గంజాయి కేసుల్లో పరారైన నిందితులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వెంటనే అరెస్టు చేయాలని ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసుల విచారణను వెంటనే పూర్తి చేసి చార్జి షీట్లను కోర్టులో సమర్పించాలని, గంజాయి సాగుపై అనుమానం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లతో విస్తృతంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. గంజాయి సాగును గుర్తించి, ధ్వంసం చేయాలన్నారు. మత్తు పదార్థాలు,సైబర్ నేరాలపై గ్రామాల్లో విస్తృత్తంగా అవగాహన కల్పించాలని సూచించారు. పక్క రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నందున పోలీసు స్టేషన్ల్లో భద్రత పెంచాలని, మావోయిస్టుల కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.త్వరలో జరిగే అరకు చలి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎడిషనల్ ఎస్పీ ధీరజ్, ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా,చింతూరు డీఎస్పీ నవజ్యోతి మిశ్రా,చింతపల్లి డీఎస్పీ సాయి ప్రశాంత్,రంపచోడవరం డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సంజీవరావు,ఎస్బీ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment