నిర్వాసితులను దగా చేస్తున్న ప్రభుత్వాలు | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులను దగా చేస్తున్న ప్రభుత్వాలు

Published Thu, Jan 30 2025 12:57 AM | Last Updated on Thu, Jan 30 2025 12:57 AM

నిర్వాసితులను దగా చేస్తున్న ప్రభుత్వాలు

నిర్వాసితులను దగా చేస్తున్న ప్రభుత్వాలు

చింతూరు/కూనవరం: పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శిపెనుబల్లి మధు విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలవరం పోరాట పతాకయాత్రలో భాగంగా బుధవారం చింతూరు, కూనవరం మండలాల్లో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేయకుండాకాలం వెళ్లబుచ్చుతోందని, నిర్వాసితుల ఊసే ఎత్తడంలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసిన నిర్వాసితుల భూములకు ఎకరాకు రూ.50 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో బాధితులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల నిర్మించిన పునరావాస కాలనీలు ఏటా వరదలకు మునుగుతున్నాయని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ అవగాహన రాహిత్యమేనని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి తొత్తుగా మారుతూ గిరిజనుల మనుగడకు ప్రమాదం తెస్తున్నాయని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాలు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బు దండుకోవడం తప్ప ప్రజకు ఏమాత్రం న్యాయం జరగడం లేదన్నారు. రామారావు, సుబ్బారావు, రాజులు, నాగేశ్వరరావు, వెంకట్‌, సురేష్‌, శ్రీనివాసరావు, సంతోష్‌కుమార్‌, చిన్నబాబు, నాగేశ్వరరావు, లక్ష్మి, పెంటయ్య, బొర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement