గిరిజన చట్టాలను హరిస్తే సహించం
నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలకు ఏజెన్సీలోని కూటమి నేతలే బినామీలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు, వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ జిల్లా అద్యక్షుడు తిమోతి, పార్టీ మహిళా విభాగం నియోజకవర్గ అద్యక్షురాలు ఊర్వశిరాణి, మాజీ సర్పచ్ శరభ సూర్యనారాయణ పాల్గొన్నారు.
చట్టాలు నిర్వీర్యానికి కుట్ర: గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర
పాడేరు రూరల్: గిరిజన చట్టలు, హక్కులను నిర్వీర్యం చేసేంఉదకు కూటమి ప్రభుత్వం కుట్రకు తెరలేపిందని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్రం ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టం సవరణ చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చులకన భావంతో వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. గిరిజన హక్కులు, చట్టాలను పరిరక్షించాల్సిన పాలకులే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. గిరిజన ప్రాంతాల్లోని బాకై ్సట్ ఖనిజ సంపదను దోచుకునేందుకే గిరిజన చట్టాలు సవరణ పేరిట నిర్వీర్యం చేసేందుకు కొత్త డ్రామాకు కూటమి ప్రభుత్వం తెరలేపిందన్నారు. స్వీకర్ చేసిన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కులమతాలకు అతీతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నాగేశ్వరరావు, రాధాకృష్ణ, జీవన్, కార్తీక్, కృష్ణ, లక్ష్మణ్, బొజ్జన్న పాల్గొన్నారు.
1/70 ఆదివాసీలకు జీవనాడి
చింతూరు: ఆదివాసీల అభివృద్ధికి 1/70 వంటి చట్టాలు జీవనాడి లాంటివని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం చింతూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలకు రక్షణకవచం లాంటి ఈ చట్టాన్ని సవరణ చేయాలంటూ శాసనసభ స్పీకర్ మాట్లాడడం సరికాదన్నారు. పవిత్రమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదివాసీలకు రక్షణ కల్పించే చట్టాలపై గౌరవం లేకుండా మాట్లాడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లోని చట్టాలు, జీవోలను పటిష్టంగా అమలు జరిగేలా రాష్ట్రస్థాయిలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, ఆదివాసీ చట్టాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన స్పీకర్‌పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం చినవీరభద్రం, సోడె రాఘవయ్య, ప్రసాద్, వెంకటేశ్వర్లు, కృష్ణ, లక్ష్మణ్, కోటి, రాజు, శ్రీరాములు పాల్గొన్నారు.
7వ పేజీ తరువాయి
Comments
Please login to add a commentAdd a comment