అంత్యక్రియలకు కలెక్టర్‌ ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు కలెక్టర్‌ ఆర్థిక సాయం

Published Thu, Jan 30 2025 12:57 AM | Last Updated on Thu, Jan 30 2025 12:57 AM

అంత్యక్రియలకు కలెక్టర్‌ ఆర్థిక సాయం

అంత్యక్రియలకు కలెక్టర్‌ ఆర్థిక సాయం

సాక్షి, పాడేరు: వృషణాలు మెలితిరగడంతో కేజీహెచ్‌లో సర్జరీ జరుగుతుండగా బాలుడు మృతి చెందిన సంఘటన బాధాకరమని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీకి చెందిన బూర్జ జేమ్స్‌ అనే రెండేళ్ల బాలుడు మంగళవారం కేజీహెచ్‌లో మృతి చెందడంతో తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం రాత్రి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను కలిశారు. వారిని కలెక్టర్‌ పరామర్శించారు. బిడ్డ మరణంతో దుఃఖం అనుభవిస్తూ రెండు రోజులుగా ఆకలితో ఉన్న తల్లిదండ్రులు ఝాన్సీరాణి, గణపతిలకు కలెక్టర్‌ ధైర్యం చెప్పారు. పండ్లు, బిస్కట్లను వారికి అందజేశారు. బాలుడు మరణంపై కలెక్టర్‌ మాట్లాడుతూ కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌తో సర్జరీ చేసిన వైద్యులను విచారించారని, వైద్య బృందాల తప్పేమి లేదని తేలిందన్నారు. బాలుని వృషణాలు మెలితిరగడంతో రక్తసరఫరా అందక కుళ్లిపోయి నొప్పితో బాధపడుతున్నాడని, తప్పనిసరి పరిస్థితిలో సీనియర్‌ వైద్యుడు సర్జరీ చేశారని ఆయన తెలిపారు. వైద్యులతో పాటు డయగ్నోస్టిక్‌లోను ఎలాంటి తప్పిదాలు లేవన్నారు. బాలుడు మృతి విచారకరమన్నారు. బాలుడు అంత్యక్రియలకు సంబంధించి కొంత ఆర్థిక సాయాన్ని బాఽధిత తల్లిదండ్రులకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement